యాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాని
జననం (2001-03-31) 2001 మార్చి 31 (వయసు 23)
జాతీయతఇండియన్
విద్యబీకామ్‌
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005 - ప్రస్తుతం

బేబీ యాని (ఆంగ్లం: Baby Annie; 2001 మార్చి 31) తెలుగు చిత్రాలలో నటించిన భారతీయ బాలనటి. ఆమె 2011 రాజన్నలో మల్లమ్మ పాత్రకు ప్రసిద్ది చెందింది,[1] దీనికి ఆమె నంది అవార్డును అందుకుంది.[2][3][4] ఆమె జగపతి బాబు, ఛార్మీలతో కలిసి నటించి అనుకోకుండా ఒక రోజు (2005) చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆమె స్టాలిన్ (2006), అతిది (2007), స్వాగతం (2008), ఏక్ నిరంజన్ (2009) వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది.

2020లో వచ్చిన జీ5 తెలుగు వెబ్ సిరీస్ లూజర్ లో ప్రియదర్శి, కల్పిక గణేష్ లతో కలసి యాని ప్రధాన పాత్రల్లో నటించించింది[5]

2023లో రూపొందుతున్న తెలుగు సినిమా తికమక తాండతో ఆమె యువ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది.[6]

కెరీర్

[మార్చు]

హైదరాబాద్‌లో మలయాళం మాట్లాడే దంపతులకు 2001 మార్చి 31న జన్మించిన యాని 4 సంవత్సరాల వయస్సులో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.[7] తన కెరీర్ లో చిరంజీవి, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, గోపీచంద్, రామ్ పోతినేని, రామ్ చరణ్, ఉదయ్ కిరణ్, ఆది పినిశెట్టి వంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని చాలా మంది అగ్ర నటులతో స్క్రీన్‌ను పంచుకుంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో దినేష్ లాల్ యాదవ్ దర్శకత్వం వహించిన శివ అనే భోజ్‌పురి చిత్రంలో కూడా ఆమె నటించింది.[8]

గుర్తింపు

[మార్చు]

ఆమె మూడు నంది పురస్కారాలను గెలుచుకుంది, ఒకటి ట్రాప్ (టెలిఫిల్మ్) (2007), మరొకటి గోరింటాకు సీరియల్ (2010) కాగా మూడవది రాజన్న (2011) చలనచిత్రం. రాజన్న చిత్రానికి గాను ఆమె ఉత్తమ బాలనటిగా నంది అవార్డు-2011తో[9][10] పాటు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు-2011ని[11][12] కూడా కైవసం చేసుకుంది.[13] అంతేకాకుండా ఈ చిత్రంతో ఆమె ఉత్తమ బాలనటిగా సంతోషం ఫిల్మ్ అవార్డు, TSR–TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ స్పెషల్ జ్యూరీ అవార్డు – ఉత్తమ బాలనటి మొదలైన పురస్కారాలను సొంతం చేసుకుంది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2005 అనుకోకుండా ఒక రోజు చైల్డ్ ట్యూషన్ విద్యార్థి బాలనటిగా
2006 స్టాలిన్ స్టాలిన్ స్నేహితుడి కూతురు బాలనటిగా
2007 మధుమాసం గుర్తింపు లేని పాత్ర బాలనటిగా
2007 విజయదశమి శివకాశి సోదరి చిన్ననాటి పాత్ర బాలనటిగా
2007 అతిధి యువతి అమృత బాలనటిగా
2008 స్వాగతం KK కూతురు బాలనటిగా
2008 రెడీ పూజ కుటుంబ సభ్యుడు బాలనటిగా
2008 శౌర్యం విజయ్ సోదరి చిన్ననాటి పాత్ర బాలనటిగా
2009 మిత్రుడు ఆదిత్య చిన్న కోడలు(మరదలు) బాలనటిగా
2009 ఏక్ నిరంజన్ సమీర గిటార్ విద్యార్థి బాలనటిగా
2010 కేడి రమేష్ సోదరి చిన్ననాటి పాత్ర బాలనటిగా
2010 శివుడు పింకీ భోజ్‌పురి సినిమా
2010 ఖలేజా చనిపోయిన అమ్మాయిని బ్రతికించింది బాలనటిగా
2011 రాజన్న మల్లమ్మ ఉత్తమ బాలనటిగా నంది అవార్డు

ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తెలుగు సినీమా స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ సంతోషం ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ TSR – TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ స్పెషల్ జ్యూరీ అవార్డు – ఉత్తమ బాల నటి

2012 నువ్వెక్కడుంటే నేనక్కడుంటా అనాథ పిల్ల బాలనటిగా
2012 చదవుకోవాలి సీత బాలనటిగా
2013 దూసుకెళ్తా యువ అలేఖ్య/ చిన్ని బాలనటిగా
2018 రంగస్థలం చిన్ని హీరోకు చెల్లిగా
2023 తిక మక తాండ మల్లి ప్రధాన నటిగా అరంగేట్రం
2024 యేవమ్ కీర్తి
నిందా సుధ
మా నాన్న సూపర్‌హీరో

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ గమనికలు
2001–2007 అమృతం అప్పాజీ కూతురు జెమినీ టీవీ "నాన్న" పేరుతో 3 భాగాలు; ఎపిసోడ్ 239–240
2020–2022 లూజర్ జూనియర్ రూబీ ZEE5

మూలాలు

[మార్చు]
  1. Sify.com (24 August 2011). "Rajanna child artist". Sify.com. Archived from the original on 18 ఏప్రిల్ 2012. Retrieved 24 August 2011.
  2. "Nandi Awards Winners List −2011". 13 October 2012.
  3. "Annie: I felt as if I was Mallamma".
  4. "Rajanna Movie Child Artist Annie Photos Stills | New Movie Posters". 26 December 2011.
  5. Andrajyothy (6 June 2020). "సక్సెస్‌మీట్‌లో 'లూజర్'". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  6. Andhrajyothy (6 August 2023). "సామాజిక అంశంతో..." Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  7. baby annie telugu actress | New Movie Posters
  8. "Shiva Bhojpuri Full Movie |Action Movies". 8 July 2017 – via YouTube.
  9. "2011 Nandi Awards winners list". The Times of India.
  10. "Nandi Awards winners list: Mahesh Babu, Nayantara – Best Actors". filmibeat.com. 12 April 2013.
  11. "59th Idea Filmfare Awards South (Winners list)". filmfare.com.
  12. "59th Idea Filmfare Awards 2011(South): Telugu".
  13. Rajanna Movie Fame Baby Annie Present Life Will Shock You! | Latest Celebrity Updates | Telugu Panda

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=యాని&oldid=4347718" నుండి వెలికితీశారు