క్రేజీ క్రేజీ ఫీలింగ్
స్వరూపం
క్రేజీ క్రేజీ ఫీలింగ్ | |
---|---|
దర్శకత్వం | సంజయ్ కార్తీక్ |
రచన | సంజయ్ కార్తీక్ |
నిర్మాత | మధు నూతలపాటి |
తారాగణం | విస్వంత్ దుడ్డుంపూడి పాలక్ లల్వాని |
ఛాయాగ్రహణం | సుభాష్ దొంతి |
కూర్పు | మెంగాన శ్రీను |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థ | విజ్ఞాంత ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1 మార్చి 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
క్రేజీ క్రేజీ ఫీలింగ్ 2019, మార్చి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజ్ఞాంత ఫిల్మ్స్ పతాకంపై మధు నూతలపాటి నిర్మాణ సారథ్యంలో సంజయ్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విస్వంత్ దుడ్డుంపూడి, పాలక్ లల్వాని జంటగా నటించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
కథా నేపథ్యం
[మార్చు]ప్రేమలో పడ్డ ఒక యువ జంట (అభి, స్పందన) జీవితంలో తలెత్తే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం.[1][2]
నటవర్గం
[మార్చు]- విశ్వంత్ దుడ్డుంపూడి (అభి)
- పాలక్ లల్వాని (స్పందన)
- వెన్నెల కిషోర్ (మహేశ్వర్ రావు)
- శరణ్య (స్వప్న)
- సుమన్ తల్వార్ (అభి తండ్రి)
- జయప్రకాష్ రెడ్డి (డ్రీమ్ తండ్రి)
- పోసాని కృష్ణమురళి (డైరెక్టర్ పికె)
- కృష్ణంరాజు (రచయిత)
- గుండు సుదర్శన్
- సుమన్ శెట్టి
- భద్రం
- చమ్మక్ చంద్ర
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: సంజయ్ కార్తీక్
- నిర్మాత: మధు నూతలపాటి
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో
- ఛాయాగ్రహణం: సుభాష్ దొంతి
- కూర్పు: మెంగాన శ్రీను
- నిర్మాణ సంస్థ: విజ్ఞాంత ఫిల్మ్స్
నిర్మాణం
[మార్చు]2015లో ఎవడే సుబ్రహ్మణ్యం విడుదలైన తర్వాత యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ సంజయ్ కార్తీక్ మొదట స్క్రిప్ట్‌ను విజయ్ దేవరకొండకు వినిపించాడు. విజయ్ బిజీ షెడ్యూల్ కారణంగా తను ఈ చిత్రం చేయలేకపోవడంతో అతని స్థానంలో విశ్వంత్ దుద్దంపూడి వచ్చాడు. పలాక్ లాల్వాని నటిగా, వెన్నెల కిషోర్ హాస్య సన్నివేశాలకు ఎంపికయ్యారు.[3]
విడుదల
[మార్చు]ఈ చిత్రం మొదట ఫిబ్రవరి 22న విడుదల కావాల్సివుంది. మార్చి 1న విడుదలయింది.[4]
పాటలు
[మార్చు]- హోలీ రంగోలీ - ఉమా నేహా, వసు భరద్వజ్, రఘురాం - 3:21
- సేమ్ టూ సేమ్ - వసు భరద్వజ్ - 3:22
- ఏదో మాయలో ఉన్నా - నయన నాయర్ - 2:35
- ఇంతేనా ఇంతేనా - ప్రణవి ఆచార్య - 3:04
మూలాలు
[మార్చు]- ↑ "Crazy Crazy Feeling - Times of India". The Times of India.
- ↑ Asha Kiran Kumar. "'Crazy Crazy Feeling': Shooting wraps up, post-production works are on". The Times of India.
- ↑ "'Crazy Crazy Feeling': Ahead of its release, a brief journey with the team - Times of India". The Times of India.
- ↑ "'Crazy Crazy Feeling': The Viswant Duddumpudi starrer gets a release date - Times of India". The Times of India.