ఛత్తీస్‌గఢ్ శాసనసభ
ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఛత్తీస్‌గఢ్ విధానసభ | |
---|---|
6వ ఛత్తీస్‌గఢ్ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 2023 -2028 |
నాయకత్వం | |
బిశ్వభూషణ్ హరిచందన్' 2023 ఫిబ్రవరి 23 నుండి | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (54)
అధికారిక ప్రతిపక్షం (35)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 నవంబరు 7, 17 |
తదుపరి ఎన్నికలు | 2028 |
సమావేశ స్థలం | |
ఛత్తీస్‌గఢ్ శాసనసభ, విధానసభ భవన్, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం |
ఛత్తీస్‌గఢ్ శాసనసభ లేదా విధానసభ, అనేది భారతదేశం లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ఇది నెలకొని ఉంది. విధానసభలో మొత్తం 90 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వారందరూ ఆయా శాసనసభ నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు.[1] త్వరగా రద్దు చేయకపోతే, దీని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.
చరిత్ర
[మార్చు]ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ద్వారా ఏర్పడింది. ఈ బిల్లు 2000 ఆగస్టు 25న భారత రాష్ట్రపతి ఆమోదించాడు. ఛత్తీస్‌గఢ్ విధానసభ 2000 నవంబరు 1న రాష్ట్ర ఏర్పాటుతో ఉనికిలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ విధానసభ మొదటి సెషన్ రాయ్‌పూర్‌లోని రాజ్‌కుమార్ కాలేజీలోని జష్‌పూర్ హాల్‌లో సభ జరిగింది. తరువాత, విధానసభను బలోడా బజార్ రోడ్డులోని విధాన్ నగర్‌లో కొత్తగా నిర్మించిన ఛత్తీస్‌గఢ్ విధానసభ భవన్‌కు మార్చారు.[1]
ఇంద్రావతి భవన్ అండ్ మహానది భవన్ వెనుక సెక్టార్ 19, అటల్ నగర్‌లో విధానసభ కోసం కొత్త భవనం నిర్మాణంలో ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. పలువురు మంత్రుల సమక్షంలో 2020 ఆగస్టు 29న రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాడు. ప్రస్తుతం 2021 నుండి నిర్మాణం నిలిపివేయబడింది ఛత్తీస్‌గఢ్‌లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అన్ని టెండర్‌లను రద్దు చేసింది.[2][3]
నిర్వాహకులు
[మార్చు]పదవి | పేరు | చిత్తరువు | అధికారం మొదలు |
---|---|---|---|
గవర్నరు | రామెన్ దేక | 2024 జులై 31 | |
స్పీకరు | రమణ్ సింగ్ | 2023 డిసెంబరు 19 | |
సభానాయకుడు (ముఖ్యమంత్రి) |
విష్ణుదేవ్ సాయ్ | 2023 డిసెంబరు 13 | |
ఉప ముఖ్యమంత్రి | అరుణ్ సావో | ||
విజయ్ శర్మ | |||
ప్రతిపక్ష నాయకుడు | చరణ్‌దాస్ మహంత్ | 2023 డిసెంబరు 16 |
శాసనసభల జాబితా
[మార్చు]శాసనసభ | ఎన్నికల సంవత్సరం | స్పీకరు[4] | ముఖ్యమంత్రి | రాజకీయ పార్టీ | ప్రతిపక్ష నేత | రాజకీయ పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|---|
1వ శాసనసభ | 1998 | రాజేంద్ర ప్రసాద్ శుక్లా | అజిత్ జోగి | భారత జాతీయ కాంగ్రెస్ | నంద్ కుమార్ సాయి | భారతీయ జనతా పార్టీ | ||
2వ శాసనసభ | 2003 | ప్రేమ్ ప్రకాష్ పాండే | రమణ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | మహేంద్ర కర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
3వ శాసనసభ | 2008 | ధర్మలాల్ కౌశిక్ | రవీంద్ర చౌబే | |||||
4వ శాసనసభ | 2013 | గౌరీశంకర్ అగర్వాల్ | టి. ఎస్. సింగ్ దేవ్ | |||||
5వ శాసనసభ | 2018 | చరణ్‌దాస్ మహంత్ | భూపేష్ బఘేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | ధర్మలాల్ కౌశిక్ | భారతీయ జనతా పార్టీ | ||
నారాయణ్ చందేల్[5] | ||||||||
6వ శాసనసభ | 2023 ఎన్నికలు | రమణ్ సింగ్ | విష్ణుదేవ్ సాయ్ | భారతీయ జనతాపార్టీ | చరణ్ దాస్ మహంత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Chhattisgarh Legislative Assembly". Legislative Bodies in India website. Retrieved 9 December 2010.
- ↑ "छत्तीसगढ़ में 270 करोड़ में बनेगा नया विधानसभा भवन भूमि पूजन आज". Nai Dunia. 2020-08-29. Retrieved 2023-02-07.
- ↑ PTI (2021-05-13). "Chhattisgarh cancels tenders for new assembly building, halts construction of major projects". ThePrint. Retrieved 2023-02-07.
- ↑ "Speaker". Chhattisgarh Vidhan Sabha website. Retrieved 10 December 2010.
- ↑ "Chhattisgarh BJP appoints new Leader of Opposition". The Hindu. 2022-08-17. ISSN 0971-751X. Retrieved 2022-11-05.
- ↑ "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners and losers constituency wise from BJP, Congress and other parties". Zee Business (in ఇంగ్లీష్). 4 December 2023.