Jump to content

భారత జాతీయ కాంగ్రెస్

వికీపీడియా నుండి
(Indian National Congress నుండి దారిమార్పు చెందింది)
భారత జాతీయ కాంగ్రెస్
పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్సోనియా గాంధీ[1]
లోక్‌సభ నాయకుడురాహుల్ గాంధీ (లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు)
రాజ్యసభ నాయకుడుమల్లికార్జున్ ఖర్గే (రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు)
స్థాపకులుఎ.ఒ. హ్యూమ్
డబ్ల్యు.సి.బెనర్జీ
సురేంద్రనాథ్ బెనర్జీ
మనోమోహన్ ఘోష్
విలియం వాడర్‌బర్న్
దాదాభాయి నౌరోజీ
బద్రుద్దీన్ త్యాబ్జీ
ఫిరోజ్‌షా మెహతా
దిన్షా ఎదుల్జీ వాచా
మహాదేవ గోవింద రనడే[2]
స్థాపన తేదీ28 డిసెంబరు 1885 (139 సంవత్సరాల క్రితం) (1885-12-28)
ప్రధాన కార్యాలయం24, అక్బర్ రోడ్, న్యూఢిల్లీ-110001[3]
పార్టీ పత్రికకాంగ్రెస్ సందేశ్
నేషనల్ హెరాల్డ్
విద్యార్థి విభాగంనేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా
యువత విభాగంఇండియన్ యూత్ కాంగ్రెస్
మహిళా విభాగంఆలిండియా మహిళా కాంగ్రెస్
కార్మిక విభాగంఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
రైతు విభాగంకిసాన్ అండ్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్[4]
రాజకీయ విధానం
రాజకీయ వర్ణపటంCentre[17]
International affiliationప్రోగ్రెసివ్ అలయన్స్[18]
సోషలిస్ట్ ఇంటర్నేషనల్[19][20][21]
రంగు(లు)      Saffron, white and green (official; Indian national colours)[a]
  Sky blue (customary)[b]
ECI Statusజాతీయ పార్టీ[22]
లోక్‌సభ స్థానాలు
101 / 543
(513 MPs & 30 Vacant)
రాజ్యసభ స్థానాలు
29 / 245
(241 MPs & 4 Vacant)[23]
శాసన సభలో స్థానాలు
689 / 4,036

(4030 MLAs & 5 Vacant)

(see complete list)
Election symbol
Party flag

భారత జాతీయ కాంగ్రెస్, (కాంగ్రెస్ పార్టీ, INC) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ.[c][25] 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.[26] భారతదేశానికి స్వాతంత్య్ర్యం సముపార్జించడమే కాకుండా,[d][28][e][30] బ్రిటిషు సామ్రాజ్యంలో వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు ఊతమిచ్చింది.[f][25]

1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ. భారత తొలి ప్రధానమంత్రి అయిన జవాహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సామ్యవాద విధానాలను అనుసరించి ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచి, పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి అమలు చేసింది. నెహ్రూ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి స్వల్పకాల పరిపాలన తరువాత, ఇందిరా గాంధీ పార్టీ నాయకత్వం చేపట్టింది.

స్వాతంత్ర్యం తరువాత కరిగిన 17 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు స్వయంగా మెజారిటీ సాధించగా, మరో మూడు సార్లు కూటమిని ఏర్పరచి అధికారానికొచ్చింది. మొత్తం 54 సంవత్సరాల పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కాంగ్రెసు పార్టీ తరఫున మొత్తం ఆరుగురు ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. జవాహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధాని (1947–1964) కాగా, మన్మోహన్ సింగ్ పార్టీ తరఫున చివరి ప్రధాన మంత్రి (2004–2014). ప్రధానమంత్రిగా పూర్తికాలం పనిచేసిన తొట్టతొలి నెహ్రూ కుటుంబేతర కాంగ్రెసు పార్టీ నాయకుడు పి.వి.నరసింహారావు (1991–1996).

2024 ఏప్రిల్ నాటికి మల్లికార్జున ఖర్గే పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సిఉంది.కానీ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 న స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.

సార్వత్రిక ఎన్నికలలో

[మార్చు]
INC general elections vote percentage
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ వోట్ల శాతం

1952 లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ 364 స్థానాలను గెలిచింది. తాను పోటీ చేసిన 479 స్థానాల్లో 76 శాతం గెలుచుకుంది.[31] పోలైన మొత్తం వోట్లలో 45 శాతం పొందింది.[32] 1971 ఎన్నికల వరకు పార్టీ వోటింగు శతం 40 కి తగ్గలేదు. 1977 ఎన్నికల్లో మాత్రం భారీ ఓటమి చవిచూసింది. 154స్థానాలను మాత్రమే గెలుచుకున్న ఆ ఎన్నికల్లో అనేకమంది పెద్ద నాయకులు ఓడిపోయారు.[33] 1980 సార్వత్రిక ఎన్నికల్లో 42.7 శాతం వోట్లతో 353 స్థానాల్లో గెలుపొంది మళ్ళీ అధికారానికి వచ్చింది. 1980 వరకు కాంగ్రెసు పార్టీ వోట్ల శాతం పెరుగుతూ వచ్చింది. 1984/85 నాటికి అది 48.1 శాతం రికార్డుకు చేరుకుంది. 1984 లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. 1985 జనవరిలో జరగవలసిన ఎన్నికలు 1984 డిసెంబరు లోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 533 కు గాను 415 స్థానాలు సాధించి స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించింది.[34] ఆ ఎన్నికల్లో పంజాబ్ అస్సాంలలో 32.14% వోట్లు మాత్రమే సాధించినప్పటికీ మొత్తమ్మీద 48.1 శాతం వోట్లు సాధించింది.[32]

1989 నవంబరులో 9 వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి.[35] ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో అత్యధిక స్థానాలు సాధించిన ఏఖైక పార్టీగా అవతరించినప్పటికీ, సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. 39.5 వోట్లు సాధించింది. అప్పటి నుండి వోట్ల శాతంలో క్షీణత మొదలైంది. 13 వ లోక్‌సభ ఎన్నికలు 2004 అక్టోబరులో జరగాల్సి ఉండగా, అప్పటి ఎన్‌డిఎ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. 2004 ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. అనుకోని విధంగా సోనియా గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.[36] ఎన్నికల తరువాత కాంగ్రెస్, కొన్ని చిన్నపార్టీలతో కలిసి ఐక్య ప్రగతిశీల కూటమిని (యుపిఎ) ని ఏర్పాటు చేసి అధ్జికారం చేపట్టింది. దానికి బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, కేరళ కాంగ్రెస్, వామపక్ష ఫ్రంట్ లు బయటి నుండి మద్దతు నిచ్చాయి.[36] 1996, 2009 మధ్య జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 20% వోట్లను కోల్పోయింది.[37]

సంవత్సరం సాధారణ ఎన్నిక గెలిచిన సీట్లు సీట్లలో మార్పు ఓట్ల % ఓట్ల మొగ్గు
1951 భారత సార్వత్రిక ఎన్నికలు 1వ లోక్‌సభ 364 - 44.99% -
1957 భారత సార్వత్రిక ఎన్నికలు 2వ లోక్‌సభ 371 Increase7 47.78% Increase 2.79%
1962 భారత సార్వత్రిక ఎన్నికలు 3వ లోక్‌సభ 361 Decrease10 44.72% Decrease 3.06%
1967 భారత సార్వత్రిక ఎన్నికలు 4వ లోక్‌సభ 283 Decrease78 40.78% Decrease 2.94%
1971 భారత సార్వత్రిక ఎన్నికలు 5వ లోక్‌సభ 352 Increase69 43.68% Increase 2.90%
1977 భారత సార్వత్రిక ఎన్నికలు 6వ లోక్‌సభ 153 Decrease199 34.52% Decrease 9.16%
1980 భారత సార్వత్రిక ఎన్నికలు 7వ లోక్‌సభ 351 Increase 198 42.69% Increase 8.17%
1984 భారత సార్వత్రిక ఎన్నికలు 8వ లోక్‌సభ 415 Increase 64 49.01% Increase 6.32%
1989 భారత సార్వత్రిక ఎన్నికలు 9వ లోక్‌సభ 197 Decrease218 39.53% Decrease 9.48%
1991 భారత సార్వత్రిక ఎన్నికలు 10వ లోక్‌సభ 244 Increase 47 35.66% Decrease 3.87%
1996 భారత సార్వత్రిక ఎన్నికలు 11వ లోక్‌సభ 140 Decrease 104 28.80% Decrease 7.46%
1998 భారత సార్వత్రిక ఎన్నికలు 12వ లోక్‌సభ 141 Increase 1 25.82% Decrease 2.98%
1999 భారత సార్వత్రిక ఎన్నికలు 13వ లోక్‌సభ 114 Decrease 27 28.30% Increase 2.48%
2004 భారత సార్వత్రిక ఎన్నికలు 14వ లోక్‌సభ 145 Increase 32 26.7% Decrease 1.6%
2009 భారత సార్వత్రిక ఎన్నికలు 15వ లోక్‌సభ 206 Increase 61 28.55% Increase 2.02%
2014 భారత సార్వత్రిక ఎన్నికలు 16వ లోక్‌సభ 44 Decrease 162 19.52% Decrease 9.53%
2019 భారత సార్వత్రిక ఎన్నికలు 17వ లోక్‌సభ 52 Increase 8 19.01% Decrease 0.51%
2024 భారత సార్వత్రిక ఎన్నికలు 18వ లోక్‌సభ 101 Increase 49 21.07% Increase 1.07%
1వ లోక్‌సభ నుండి 18 వ లోక్‌సభ వరకూ సాధించిన స్థానాలు
  అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984
  అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014

సంస్థాగత ఆకృతి

[మార్చు]

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) వార్షిక జాతీయ సమావేశంలో రాష్ట్ర, జిల్లా పార్టీల నుండి వచ్చిన ప్రతినిధులు కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ఉంటుంది.[38] ఇది స్థానిక, రాష్ట్ర స్థాయిలలో రాజకీయ ప్రచారాలను నిర్వహించడానికి, పార్లమెంటరీ నియోజకవర్గాలలో ప్రచారం చేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది.[39] ప్రతి పీసీసీకి ఇరవై మంది సభ్యులతో కూడిన కార్యవర్గం ఉంటుంది. వీరిలో ఎక్కువ మందిని పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు ఎంపిక చేస్తారు. రాష్ట్రాల శాసనసభలలో సభ్యులుగా ఎన్నికైన వారు ఆయా సభలలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలను ఏర్పాటు చేస్తారు. వాటి ఛైర్‌పర్సనుగా ఎన్నికైన వారే సాధారణంగా ముఖ్యమంత్రి పదవికి పార్టీ అభ్యర్థిగా ఉంటారు. పార్టీలో వివిధ కమిటీలు, విభాగాలు కూడా ఉన్నాయి. ఇది నేషనల్ హెరాల్డ్ అనే దినపత్రికను ప్రచురిస్తుంది.[40] సంస్థాగత నిర్మాణంతో కూడిన పార్టీ అయినప్పటికీ, 1972 తర్వాత ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎటువంటి సంస్థాగత ఎన్నికలను నిర్వహించలేదు.[41] అయినప్పటికీ, 2004లో, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్, పార్టీ అధ్యక్షుడిగా ఉండని మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు.[42]

ఎఐసిసి అనేది పిసిసిల నుండి వచ్చిన ప్రతినిధులతో కూడి ఉంటుంది.[40] ఈ ప్రతినిధులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో సహా సీనియర్ పార్టీ నాయకులు, ఆఫీస్ బేరర్లతో కూడిన కాంగ్రెస్ కమిటీలను ఎన్నుకుంటారు. ఎఐసిసి అన్ని ముఖ్యమైన కార్యనిర్వాహక, రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందిరా గాంధీ 1978లో కాంగ్రెస్ (ఐ)ని స్థాపించినప్పటి నుండి, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలే పార్టీ జాతీయ నాయకురాలిగా, సంస్థకు అధిపతిగా, వర్కింగ్ కమిటీకి, అన్ని ప్రధాన కాంగ్రెస్ కమిటీలకూ అధిపతిగా, ప్రధాన ప్రతినిధిగా, కాంగ్రెస్ తరఫున భారత ప్రధానిగా ఉంటూ వచ్చింది. రాజ్యాంగబద్ధంగా, అధ్యక్షుడిని పిసిసిలు ఎఐసిసి సభ్యులు ఎన్నుకుంటారు; అయితే, వర్కింగ్ కమిటీ తరచూ ఈ విధానాన్ని బైపాస్ చేసి, తన అభ్యర్థిని ఎన్నుకుంటోంది.[40]

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో (సిపిపి) లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) నేత కూడా ఉంటారు. సిఎల్‌పిలో ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ్యులందరూ (ఎమ్‌ఎల్‌ఏలు) సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్ ఒక్కటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎల్పీ నేతయే ముఖ్యమంత్రిగా ఉంటారు. పార్టీలోని ప్రత్యక్ష అనుబంధ శాఖలు ఇవి:

  • నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), కాంగ్రెస్ విద్యార్థి విభాగం.
  • ఇండియన్ యూత్ కాంగ్రెస్, పార్టీ యువజన విభాగం.
  • ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, కార్మిక సంఘం.
  • ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్, దాని మహిళా విభాగం.
  • కిసాన్ మరియు ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్, దాని రైతు విభాగం.
  • కాంగ్రెస్ సేవాదళ్, దాని స్వచ్ఛంద సంస్థ.[43][44]
  • మైనారిటీ కాంగ్రెస్ అని కూడా పిలువబడే అఖిల భారత కాంగ్రెస్ మైనారిటీ విభాగం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం. ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రదేశ్ కాంగ్రెస్ మైనారిటీ శాఖలు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తాయి.[45]

ఎన్నికల చిహ్నాలు

[మార్చు]
Approved symbol of Indira Gandhi Congress
1971–1977 మధ్య కాలంలో కాంగ్రెస్ (ఆర్) గుర్తు - ఆవు దూడ

2021 నాటికి, భారత ఎన్నికల సంఘం ఆమోదించినట్లుగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం, "చెయ్యి". కుడి అరచేతి ముందువైపు దాని వేళ్లు ఒకదానితో ఒకటి ఆనుకుని ఉన్న చిత్రం అది.[46] ఇది సాధారణంగా త్రివర్ణ పతాకం మధ్యలో ఉంటుంది. 1977 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (ఆర్) వర్గం నుండి విడిపోయి కొత్త కాంగ్రెస్ (ఐ)ని స్థాపించినప్పుడు ఇందిరా గాంధీ మొదటగా చేతి గుర్తును ఉపయోగించింది.[47] చేయి బలానికి, శక్తికి, ఐక్యతకూ ప్రతీక.

నెహ్రూ నాయకత్వంలో ఉండగా, పార్టీకి 'కాడిని మోస్తున్న ఎద్దుల జత' గుర్తు ఉండేది. ఇది ప్రధానంగా రైతులకు సూచిస్తూ ఉండేది.[48] 1969లో, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా, ఇందిరాగాంధీ విడిపోయి, సొంతంగా కాంగ్రెస్ (ఆర్) అనే పార్టీని స్థాపించింది. కొత్త పార్టీలో ఆమెకు మద్దతుగా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేరారు. 1971-1977 కాలంలో ఇందిరా కాంగ్రెస్ (R) లేదా కాంగ్రెస్ (రిక్విజిషనిస్టులు) కు ఆవు దూడ గుర్తు ఉండేది.[49][50] లోక్‌సభలో పార్టీకి ఉన్న 153 మంది సభ్యులలో 76 మంది మద్దతు కోల్పోయిన తర్వాత ఇందిర, కొత్త రాజకీయ సంస్థ కాంగ్రెస్ (ఐ) లేదా కాంగ్రెస్ (ఇందిర) ను ఏర్పరచింది. అప్పుడు పార్టీకి చేతి గుర్తును ఎంచుకుంది.

వంశపాలన

[మార్చు]

కాంగ్రెస్ పార్టీతో సహా భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలలో వంశపారంపర్య పాలన చాలా సాధారణం.[51] కాంగ్రెసు పార్టీలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఆరుగురు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.[52] ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ కుటుంబం తన చిన్న కొడుకు సంజయ్‌ గాంధీతో పార్టీని నియంత్రించడం ప్రారంభించింది.[53] ఇది కుటుంబం పట్ల దాస్యంగా వర్ణించబడింది, ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ వారసత్వ నాయకుడిగా రావడానికి దారితీసింది. అలాగే అతని హత్య తర్వాత సోనియా గాంధీని రాజీవ్ వారసురాలిగా పార్టీ ఎన్నుకోగా ఆమె దానిని తిరస్కరించింది.[54] 1978లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ (ఐ)ని స్థాపించినప్పటి నుండి, 1991, 1998 మధ్య కాలంలో మినహా పార్టీ అధ్యక్షులందరూ ఆమె కుటుంబం నుండే వచ్చారు. లోక్‌సభకు జరిగిన గత మూడు ఎన్నికల్లో కలిపి, 37 శాతం మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వారసత్వంగా ఆ పదవుల్లోకి వచ్చినవారే.[55] అయితే, ఇటీవలి కాలంలో సంస్థను పునర్నిర్మించాలని పార్టీలో అంతర్గతంగా పిలుపులు వచ్చాయి. కాంగ్రెస్‌ను సంస్కరిస్తూ ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని సీనియర్ నేతల బృందం పార్టీ అధ్యక్షుడికి లేఖ రాసింది. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత అసంతృప్తి కూడా కనిపించింది. ఆ తర్వాత 23 మంది సీనియర్ నేతల బృందం పార్టీని పునర్నిర్మించాలని కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాసింది.[56]

ప్రధానమంత్రులు

[మార్చు]
సంఖ్య పేరు చిత్తరువు పదవీకాలం [57] లోక్ సభ నియోజకవర్గం
ప్రారంభం ముగింపు పదవీకాలం
1 జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15 1964 మే 27 16 సంవత్సరాలు, 286 రోజులు రాజ్యాంగ సభ
1వది ఫుల్పూర్
2 వ
3వది
తాత్కాలిక గుల్జారీలాల్ నందా 1964 మే 27 1966 జనవరి 11 13 రోజులు సబర్కాంత
2 లాల్ బహదూర్ శాస్త్రి 1 సంవత్సరం, 216 రోజులు అలహాబాద్
తాత్కాలిక గుల్జారీలాల్ నందా 1966 జనవరి 11 1966 జనవరి 24 13 రోజులు సబర్కాంత
3 ఇందిరా గాంధీ 1966 జనవరి 24 1977 మార్చి 24 15 సంవత్సరాలు, 350 రోజులు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ
4వది రాయ్ బరేలీ
5వది
1980 జనవరి 14 1984 అక్టోబరు 31 7వది మెదక్
4 రాజీవ్ గాంధీ 1984 అక్టోబరు 31 1989 డిసెంబరు 2 5 సంవత్సరాలు, 32 రోజులు అమేథీ
8వ
5 పి. వి. నరసింహారావు 1991 జూన్ 21 1996 మే 16 4 సంవత్సరాలు, 330 రోజులు 10వ నంద్యాల
6 మన్మోహన్ సింగ్ 2004 మే 22 2014 మే 26 10 సంవత్సరాలు, 4 రోజులు 14వ అసోం నుంచి రాజ్యసభ ఎంపీ
15వ

ఉపప్రధానులు

[మార్చు]
నం. చిత్తరువు పేరు

జీవిత కాలం

పదవీకాలం లోక్‌సభ నియోజకవర్గం ప్రధాన మంత్రి
పదవి ప్రారంభం ముగింపు పదవీ కాలం
1 వల్లభాయ్ పటేల్

(1875–1950)

1947 ఆగస్టు 15 1950 డిసెంబరు 15 3 సంవత్సరాలు, 122 రోజులు రాజ్యాంగ సభ N/A జవహర్‌లాల్ నెహ్రూ
2 మొరార్జీ దేశాయ్

(1896–1995)

1967 మార్చి 13 1969 జూలై 19 2 సంవత్సరాలు, 128 రోజులు 4వ

( 1967 )

సూరత్

( లోక్‌సభ )

ఇందిరా గాంధీ

విలీనమైన పార్టీలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sonia Gandhi to chair Congress parliamentary strategy group meeting to formulate strategy for Winter Session of Parliament". The Print. 29 November 2022.
  2. "Rent relief unlikely for Congress's Delhi properties". The Times of India. 4 June 2018. Retrieved 16 August 2018.
  3. "Kisan and Khet Mazdoor Congress sets 10-day deadline for Centre to concede demands". The Hindu. 16 June 2016. Retrieved 10 March 2022.
  4. 5.0 5.1 5.2 Lowell Barrington (2009). Comparative Politics: Structures and Choices. Cengage Learning. p. 379. ISBN 978-0-618-49319-7.
  5. Meyer, Karl Ernest; Brysac, Shareen Blair (2012). Pax Ethnica: Where and How Diversity Succeeds. PublicAffairs. p. 50. ISBN 978-1-61039-048-4. Retrieved 7 April 2016.
  6. [5][6]
  7. Emiliano Bosio; Yusef Waghid, eds. (31 October 2022). Global Citizenship Education in the Global South: Educators' Perceptions and Practices. Brill. p. 270. ISBN 9789004521742.
  8. DeSouza, Peter Ronald (2006). India's Political Parties Readings in Indian Government and Politics series. SAGE Publishing. p. 420. ISBN 978-9-352-80534-1.
  9. Rosow, Stephen J.; George, Jim (2014). Globalization and Democracy. Rowman & Littlefield. pp. 91–96. ISBN 978-1-442-21810-9.
  10. [8][9][10]
  11. Agrawal, S. P.; Aggarwal, J. C., eds. (1989). Nehru on Social Issues. New Delhi: Concept Publishing. ISBN 978-817022207-1.
  12. [5][12]
  13. 14.0 14.1 Soper, J. Christopher; Fetzer, Joel S. (2018). Religion and Nationalism in Global Perspective. Cambridge University Press. pp. 200–210. ISBN 978-1-107-18943-0.
  14. "Political Parties – NCERT" (PDF). National Council of Educational Research and Training. Retrieved 8 May 2021.
  15. Jean-Pierre Cabestan, Jacques deLisle, ed. (2013). Inside India Today (Routledge Revivals). Routledge. ISBN 978-1-135-04823-5. ... were either guarded in their criticism of the ruling party – the centrist Indian National Congress – or attacked it almost invariably from a rightist position. This was so for political and commercial reasons, which are explained, ...
  16. [5][15][16]
  17. "Progressive Alliance Participants". Progressive Alliance. Archived from the original on 2 March 2015. Retrieved 20 March 2016.
  18. "Full Member Parties of Socialist International". Socialist International.
  19. Gabriel Sheffer (1993). Innovative Leaders in International Politics. SUNY Press. p. 202. ISBN 978-0-7914-1520-7. Retrieved 30 January 2013.
  20. "Meeting of the SI Council at the United Nations in Geneva". Socialist International.
  21. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Retrieved 9 May 2013.
  22. "Party Position in the Rajya Sabha" (PDF). Rajya Sabha. Retrieved 14 July 2018.
  23. 24.0 24.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Marshall2001 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  24. 25.0 25.1 Marshall, P. J. (2001), The Cambridge Illustrated History of the British Empire, Cambridge University Press, p. 179, ISBN 978-0-521-00254-7
  25. "Information about the Indian National Congress". open.ac.uk. Arts & Humanities Research council. Retrieved 29 July 2015.
  26. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Chiriyankandath2016 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  27. Chiriyankandath, James (2016), Parties and Political Change in South Asia, Routledge, p. 2, ISBN 978-1-317-58620-3
  28. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; KopsteinLichbach2014 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  29. Kopstein, Jeffrey; Lichbach, Mark; Hanson, Stephen E. (2014), Comparative Politics: Interests, Identities, and Institutions in a Changing Global Order, Cambridge University Press, p. 344, ISBN 978-1-139-99138-4
  30. "Congress led by Jawaharlal Nehru won the first general election in 1952". India Today. 2 July 2007. Retrieved 20 March 2024.
  31. 32.0 32.1 Ganguly, Siddharth (2 February 2022). "The Parties That Contested India's First General Election". The Wire. Retrieved 20 March 2024.
  32. Gupta, Abhinav (24 May 2019). "Lok Sabha Poll Results: A vote-share and performance analysis of BJP vs Congress from 1996 to 2019". News Nation. News Nation Network Pvt Ltd. Retrieved 8 March 2022.
  33. "Chronology of Lok Sabha elections (1952–1999)". Hindustan Times. 13 October 2003. Retrieved 20 March 2024.
  34. "Statistical Report on General Elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Retrieved 20 March 2024.
  35. 36.0 36.1 Chakravarty, Shubhodeep (18 May 2019). "INKredible India: The story of 2004 Lok Sabha election – All you need to know". Zee News. Essel Group. Retrieved 10 March 2022.
  36. Joy, Shemin (23 February 2021). "Congress has lost six governments to BJP since PM Narendra Modi assumed power in 2014". Deccan Herald. The Printers, Mysore. Retrieved 10 March 2022.
  37. "President of Pradesh Congress Committee". INC web portal. Archived from the original on 16 April 2020. Retrieved 26 May 2020.
  38. "The Past And Future of the Indian National Congress". The Caravan. March 2010. Retrieved 6 June 2018 – via Ramachandra Guha.
  39. 40.0 40.1 40.2 Kedar Nath Kumar (1 January 1990). Political Parties in India, Their Ideology and Organisation. Mittal Publications. pp. 41–43. ISBN 978-81-7099-205-9.
  40. Sanghvi, Vijay (2006). The Congress Indira to Sonia Gandhi. Delhi: Kalpaz Publications. p. 128. ISBN 978-8178353401. Retrieved 4 November 2016.
  41. Deka, Kaushik (8 July 2019). "Goodbye, Rahul Gandhi?". India Today. Living Media India Limited. Retrieved 22 May 2021.
  42. "All India 2014 Results". Political Baba. Archived from the original on 27 May 2015. Retrieved 26 May 2015.
  43. "Lok Sabha Election 2014 Analysis, Infographics, Election 2014 Map, Election 2014 Charts". Firstpost. Archived from the original on 24 September 2015.
  44. "Congress minority cell opposes quota cut". Tribuneindia News Service. 5 February 2020. Retrieved 6 February 2020.
  45. "A Short History of the Congress Hand". The Wall Street Journal. News Corp. Dow Jones & Company. 28 March 2012. Retrieved 27 June 2014.
  46. "How Indira's Congress got its hand symbol". NDTV. 22 December 2010. Retrieved 27 June 2014.
  47. "Indian political party election symbols from 1951". CNN-IBN. 4 April 2014. Archived from the original on 7 April 2014. Retrieved 27 June 2014.
  48. "A tale of changing election symbols of Congress, BJP". The Times of India. 5 April 2019. Retrieved 26 May 2020.
  49. Sanghvi, Vijay (2006). The Congress, Indira to Sonia Gandh. New Delhi: Kalpaz Publications. p. 77. ISBN 978-81-7835-340-1.
  50. Simon Denyer (24 June 2014). Rogue Elephant: Harnessing the Power of India's Unruly Democracy. Bloomsbury USA. pp. 115–116. ISBN 978-1-62040-608-3.
  51. Radhakrishnan, Sruthi (14 December 2017). "Presidents of Congress past: A look at the party's presidency since 1947". The Hindu. Retrieved 26 May 2020.
  52. Emma Tarlo (24 July 2003). Unsettling Memories: Narratives of the Emergency in Delhi. University of California Press. pp. 27–29. ISBN 978-0-520-23122-1.
  53. Sumantra Bose (16 September 2013). Transforming India. Harvard University Press. pp. 28–29. ISBN 978-0-674-72819-6.
  54. Adam Ziegfeld (28 April 2016). Kanchan Chandra (ed.). Democratic Dynasties: State, Party and Family in Contemporary Indian Politics. Cambridge University Press. p. 105. ISBN 978-1-107-12344-1.
  55. "Exclusive: Complete Text of Congress "Letter Bomb" And Its Big Points". NDTV.com. Retrieved 2022-03-22.
  56. "Former Prime Ministers". PM India. Archived from the original on 9 October 2014. Retrieved 2 January 2015.

వెలుపలి లంకెల

[మార్చు]


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు