సత్యాగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ ఉప్పు మార్చి, 1930 మార్చిలో.

సత్యాగ్రహం, అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ, ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. మహాత్మా గాంధీ సెప్టెంబరు 11, 1906దక్షిణ ఆఫ్రికాలో దీనిని ప్రారంభించాడు. అంతేకాక స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌర హక్కుల ఉద్యమ కాలంలో ఈ ఉద్యమం మార్టిన్ లూథర్ కింగ్ ను కూడా ఈ ఉద్యమం బాగా ప్రభావితం చేసింది. [యేసు క్రీస్తు] ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, అన్నట్టు, యేసు క్రీస్తు బైబిల్ లో చేపినటు వంటి మాటలు "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం.

సాంప్రదాయ పద్ధతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.

"సత్యాగ్రహం" అనే మాటలో "కోపం" అని అర్థం వచ్చే మాట వున్నా.... నిజానికి ఇందులో ఎలాంటి కోప తాపాలకు, దౌర్జన్యాలకు తావులేదు. అత్యంత శాంతి యుతంగా సాగుతుంది ఈ నిరసన. తమ నిరసనను తెలియజేయడానికి, తమ కోర్కెలను నెరవేర్చు కోడానికి, తమ డిమాండ్లను సాధించుకోడానికి ఇలా ఎన్నో వాటికి ఈ సత్యాగ్రహాన్ని వాడు కుంటున్నారు. వ్వక్తులు, సంస్థలు, ప్రజలు, విద్యార్థులు, ఉపాద్యాయులు, ఉద్యోగస్తులు, కార్మికులు ...... ఒకరని ఏమే లేదు. ప్రస్తుత కాలంలో ఇది సర్వ సాధారణ కార్యక్రమం అయింది. ఇందులో భాగమైన నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష. సత్యాగ్రహం, నిరాహార దీక్ష అనగానే అందరికి గుర్తు వచ్చేది మన మహాత్మా గాంధీ. నిజానికి నిరాహార దీక్షను మొట్ట మొదట రాజకీయాస్త్రంగా ఉపయోగించింది మహాత్మా గాంధీనే. సత్యాగ్రహం అనే ఆయుధంతో ఆతి పెద్ద ఘన కార్యాలు సాధించిన వారు చాల మందే ఉన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారు పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు పొట్టి శ్రీ రాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి సుమారు 50 రోజులుకు పైగా దీక్ష చేసి ఆ దీక్షలోనె అతను మరణించాడు. దాని ఫలితమే ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. తమ నిరసనను తెలిపే అహింసా మార్గమే సత్యాగ్రహం. ఈ పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి.... మహాత్మా గాంధి పుట్టిన రోజు అక్టోబరు రెండు "సత్యాగ్రహ దినోత్సవంగా" ప్రకటించాలనుకుంటున్నది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]