Jump to content

అక్కమ్మ చెరియన్

వికీపీడియా నుండి
అక్కమ్మ చెరియన్
జననంఫిబ్రవరి 14, 1909
కంజీరపల్లి, ట్రావెన్స్‌కోర్
మరణంమే 5, 1982
జాతీయతభారతీయ
రాజకీయ పార్టీట్రావెన్స్‌కోర్ రాష్ట్ర కాంగ్రెస్
జీవిత భాగస్వామివి. వి. వర్కీ
తల్లిదండ్రులుతొమ్మన్ చెరియన్, అన్నమ్మ

అక్కమ్మ చెరియన్, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[1][2] ఆమె భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావెన్స్‌కోర్ కు చెందినది. ఆమె ట్రావెన్స్‌కోర్ ఝాన్సీ రాణిగా సుప్రసిద్ధురాలు.[3]

బాల్యజీవితం, విద్య

[మార్చు]

ఆమె కేరళ రాష్ట్రంలోని ట్రావెన్స్‌కోర్ లో కంజీరాపల్లికి చెందిన నస్రానీ కుటుంబంలో 1909 ఫిబ్రవరి 14న తొమ్మన్ చెరియన్, అన్నమ్మ కరిప్పపరంబిల్ దంపతులకు రెండవ కుమార్తెగా జన్మించింది. కంజీరాపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో, చంగనచెర్రిలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించింది. ఆమె ఎర్నాకుళంలోని సెయింట్ తెరెసా కళాశాల నుండి బి.ఎ. పట్టాను పొందింది. విద్యాభ్యాసం తరువాత ఆమె 1931లో ఎడక్కర లోని సెయింట్ మేరీస్ ఆంగ్ల మాద్యమ పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరింది. తరువాతి కాలంలో ఆమె ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయినిగా తన సేవలనందించింది. ఆమె ఆ పాఠశాలలో ఆరు సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కాలంలో ఆమె తిరువనంతపురం శిక్షణా కళాశాల నుండి ఎల్.టి పట్టాను పొందింది.

స్వతంత్ర్య సమరయోధురాలిగా

[మార్చు]

1938 ఫిబ్రవరిలో ట్రావెన్స్‌కోర్ స్టేట్ కాంగ్రెస్ ప్రారంభించబడింది. ఆమె స్వేచ్ఛ కోసం పోరాటం చేరడానికి తన బోధన వృత్తిని విడిచిపెట్టింది.[4][5]

బాధ్యతగల ప్రభుత్వం కోసం ఆందోళన

[మార్చు]

శాసనోల్లంఘన ఉద్యమం

[మార్చు]

రాష్ట్ర కాంగ్రెస్ అద్వర్యంలో ట్రావెన్స్‌కోర్ ప్రజలు ఒక బాధ్యతగల ప్రభుత్వం కోసం ఆందోళన ప్రారంభించారు. ట్రావెన్స్‌కోర్ కు దీవాన్ గా ఉన్న సి. పి. రామస్వామి అయ్యర్ ఈ ఆందోళనను అణిచివేసేందుకు నిర్ణయించున్నాడు. 1938 ఆగస్టు 26న అతను రాష్ట్ర కాంగ్రెస్‌ను నిషేధించాడు. అనంతరం ఆమె శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించింది. అధ్యక్షుడు పట్టోం ఎ. ఠాను పిళ్ళైతో పాటు అనేకమంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అరెస్టు కాబడ్డారు.[6] ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ తన ఆందోళన విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. దాని వర్కింగ్ కమిటీ రద్దు చేయబడింది. దాని అధ్యక్షునికి నియంతృత్వ శక్తులు, అతని వారసుడిని ప్రతిపాదించటానికి హక్కు ఇవ్వబడింది. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పదకొండు మంది 'నియంతలు' (అధ్యక్షులు) ఒకరి తరూఅత ఒకరు అరెస్టు కాబడినారు. 11వ నియంత (అధ్యక్షుడు) అయిన కుట్టనాడ్ రామకృష్ణ పిళ్ళై తాను అరెస్టు కాబడడానికి ముందు అక్కమ్మ చెరియాన్ ను 12వ నియంతగా నియమించాడు.

కౌడియర్ ప్యాలెస్‌కు ర్యాలీ

[మార్చు]

రాష్ట్ర కాంగ్రెస్‌పై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకోవడానికి మహారాజా చిత్తీ తిరునాళ్ బలరామ వర్మకు చెందిన తంజావూరు నుండి కమడియర్ ప్యాలెస్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఆమె నాయకత్వంలో జరిగింది.[4] కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు చేసిన దీవాన్ సి.పి.రామస్వామి అయ్యర్ ను తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేసారు. 20,000 మంది ప్రజల ర్యాలీలో కాల్పులు జరిపేందుకు బ్రిటీష్ పోలీసు అధికారి తన మనుషులకు ఆదేశించాడు. అక్కమ్మ చెరియార్ "నేను నాయకురాల్లిని, ఎతరులను చంపే ముందు నన్ను కాల్చి చంపండి" అని అరిచింది. ఆమె పలికిన ధైర్యమైన మాటలు పోలీసు అధికారులను వారి ఆదేశాలను ఉపసంహరించుకొనేలా చేసాయి. ఈ వార్తను విన్న మహాత్మా గాంధీ ఆమెను 'ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్' గా ప్రశంసించాడు. 1939 లో ఆమెను నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఖైదు చేసారు.[7]

దేశ సేవికా సంఘ్ ఏర్పాటు

[మార్చు]

1938 అక్టోబరులో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అక్కమ్మ చెరియన్ ను దేశ సేవికా సంఘ్ (మహిళా వాలంటీర్ గ్రూపు) ను ఏర్పాటు చేయమని సూచిందింది. ఆమె వివిధ ప్రాంతాలలో పర్యటించిం మహిళలను దేశ సేవికా సంఘ్ సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేసింది.

నిర్బంధాలు

[మార్చు]

స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఆమె రెండుసార్లు ఖైదు చేయబడింది.

రాష్ట్ర కాంగ్రెస్ వార్షిక సమావేశం

[మార్చు]

నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ మొదటి వార్షిక సదస్సు 1938 డిసెంబరు 22, 23 న వట్టియొకవూలో జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల దాదాపు అందరూ అరెస్టయ్యారు, ఖైదు చేయబడ్డారు. అక్కమ్మ తన సోదరి రోసమ్మ పన్నూస్ (స్వాతంత్ర్యసమరయోధురాలు, ఎం.ఎల్.ఎ, 1948 నుండి సి.పి.ఐ నాయకురాలు) తో పాటు 1939 డిసెంబరు 24న అరెస్టు అయింది. వారికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. వారు జైలులో అనేక అవమానాకు, బెదిరింపులకు గురి అయ్యారు. జైలు అధికారులు ఇచ్చిన సూచనల కారణంగా, కొందరు ఖైదీలు వారిపై అవమానకర, అసభ్యకరమైన పదాలను ఉపయోగించారు. ఈ వార్త పట్టో ఎ. థాను పిళ్ళై ద్వారా మహాత్మా గాంధీ వరకు చేరింది.[8][9] సి. పి. రామస్వామి అయ్యర్ దానిని తిరస్కరించాడు. అక్కమ్మ సోదరుడు కె. సి. వార్కే కరిప్పాపరంబిల్ కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

క్విట్ ఇండియా ఉద్యమం

[మార్చు]

జైల నుండి విడుదలైన తరువాత అక్కమ్మ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసింది. 1942లో ఆమె ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా ఉంది. అధ్యక్షురాలిగా ఆమె 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన సదస్సులో భారత కాంగ్రెస్ చే ఆమోదించబడిన క్విట్ ఇండియా తీర్మానాన్ని స్వాగతించింది. ఆమెను అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. నిషేధ ఉత్తర్వులను అతిక్రమించినందుకు గాను 1946లో ఆమె అరెస్టు కాబడి ఆరు మాసాల పాటు జైలు శిక్ష అనుభవించింది. 1947లో స్వతంత్ర ట్రావెన్స్‌కోర్ కోసం సి.పి.రామస్వామి అయ్యర్ కోరికకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమె మరలా అరెస్టు గావింపబడింది.

తిరువనంతపురం, వెల్లయంబలంలో అక్కమ్మ చెరియన్ విగ్రహం

స్వాతంత్ర్య భారతదేశంలో జీవితం

[మార్చు]

1947 లో భాతర స్వాంతంత్ర్యం తరువాత ఆమె కంజిరాపల్లి నుండి ట్రావెన్స్‌కోర్ శాసనసభకు ఎన్నిక అయింది. 1951లో ఆమె స్వాతంత్ర్యసమరయోధుడు, ట్రావెన్స్‌కోర్ శాసనసభ్యుడు అయిన వి.వి.వార్కేను వివాహమాడింది. వారి కుమారుడు వి. వార్కే ఇంజనీరుగా పనిచేసాడు. 1950ల ప్రారంభంలో ఆమెకు లోక్‌సభ టికెట్ ను తిరస్కరించిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసింది. 1952లో ఆమె "మువట్టుపుఝ నియోజకవర్గం" నుండి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటు ఎన్నికలలో పాల్గొన్నది. 1950ల ప్రారంభంలో పార్టీల సిద్ధాంతాలు మారినప్పుడు ఆమె రాజకీయాల నుండి తప్పుకున్నది.[4] ఆమె భర్త వి.వి.వార్కే 1952-54 కాలంలో కేరళ శాసనసభలో ఎం.ఎల్.ఎగా తన సేవలనందించాడు. 1967లో ఆమె కంజీరపల్లి స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. తరువాత ఆమె స్వాతంత్ర్య సమరయోధుల పించను అడ్వయిజరీ బోర్డు సభ్యురాలిగా తన సేవలనందించింది.

మరణం, సంస్మరణ

[మార్చు]
Accamma Cherian Park

అక్కమ్మ చెరియన్ 1982 మే 5 న మరణించింది. తిరువనంతపురంలోని వెల్లయంబలంలో ఆమె జ్ఞాపకార్థం ఆమె విగ్రహాన్ని నిర్మించారు.[10] ఆమె జీవిత చరిత్రపై ?శ్రీబాల కె. మీనన్ ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు.[11][12][13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ROLE OF WOMEN IN KERALA POLITICS REFORMS AMENDMENT ACT 1969 A STUDY IN SOCIAL CHANGE". Journal of Kerala Studies. University of Kerala. 1985. p. 21.
  2. Who is who of Freedom Fighters in Kerala. K. Karunakaran Nair. 1975. p. 89. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)
  3. "Status of Kerala Women". Archived from the original on 26 అక్టోబరు 2008. Retrieved 10 ఆగస్టు 2018.
  4. 4.0 4.1 4.2 Paul Zacharia (20 January 2007). "When friends become statues". tehelka.com. Archived from the original on 10 ఫిబ్రవరి 2007. Retrieved 6 November 2008.
  5. The Collected Works of Mahatma Gandhi. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. 1977. pp. 413, 503.
  6. "Emergence of nationalism". Archived from the original on 11 సెప్టెంబరు 2008. Retrieved 30 October 2008.
  7. Naveen Joshi (1997). Freedom Fighters Remember. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. p. 18. ISBN 978-81-230-0575-1.
  8. Mahatma Gandhi. The Indian States Problem. Navajivan press. p. 167.
  9. V. B. Kher (1967). Political and National Life and Affairs By Gandhi. Navajivan Pub. House. pp. 186, 322.
  10. "Road users at the receiving end". The Hindu. Chennai, India. 15 March 2006. Archived from the original on 13 డిసెంబరు 2006. Retrieved 30 October 2008.
  11. "'Remembering the eminent'" (PDF). Archived from the original (PDF) on 30 సెప్టెంబరు 2007. Retrieved 10 ఆగస్టు 2018.
  12. "Docufest". Retrieved 30 October 2008.[permanent dead link]
  13. "'Docufest' to begin tomorrow". The Hindu. Chennai, India. 3 October 2005. Archived from the original on 23 నవంబరు 2007. Retrieved 30 October 2008.

వెలుపలి లంకెలు

[మార్చు]