రాహుల్ గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ


12వ కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌
పదవీ కాలం
10 జూన్ 2024 – ప్రస్తుతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అఖిలేష్ యాదవ్
ముందు సుష్మాస్వరాజ్ (2014)

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు సోనియా గాంధీ
నియోజకవర్గం రాయ్‌బరేలి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 ఆగష్టు 2023[2]
నియోజకవర్గం వాయనాడ్
ముందు ఎం. ఐ. షానవాస్
తరువాత రాహుల్ గాంధీ
పదవీ కాలం
17 మే 2004 – 23 మే 2019
ముందు సోనియా గాంధీ
తరువాత స్మృతి ఇరాని
నియోజకవర్గం అమేథి

పదవీ కాలం
16 డిసెంబర్ 2017 – 10 ఆగష్టు 2019
ముందు సోనియా గాంధీ
తరువాత సోనియా గాంధీ

భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
పదవీ కాలం
19 జనవరి 2013 – 16 డిసెంబర్ 2017
అధ్యక్షుడు సోనియా గాంధీ
ముందు స్థానం ప్రారంభించబడింది
తరువాత స్థానం ప్రారంభించబడింది

భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
25 సెప్టెంబర్ 2007 – 19 జనవరి 2013
అధ్యక్షుడు సోనియా గాంధీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 సెప్టెంబర్ 2007
ముందు స్థానం ప్రారంభించబడింది

వ్యక్తిగత వివరాలు

జననం (1970-06-19) 1970 జూన్ 19 (వయసు 54)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ (తండ్రి)
సోనియా గాంధీ (తల్లి)
బంధువులు ప్రియాంక గాంధీ (చెలెల్లు)
నెహ్రూ-గాంధీ కుటుంబం
పూర్వ విద్యార్థి ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ (ఎం. ఫిల్. )
సంతకం రాహుల్ గాంధీ's signature

రాహుల్ గాంధీ (జననం 19 జూన్ 1970) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నాడు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతిఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్.

రాహుల్ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవాడు. భద్రతా కారణాల వల్ల చిన్నప్పుడు ఆయన ఎక్కువగా పాఠశాలలు మారాల్సి వచ్చేది. ఆయన విదేశాల్లో మారుపేరుతో చదువుకునేవాడు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఆయన అసలు గుర్తింపు తెలిసేది. రాహుల్ కేంబ్రిడ్జ్ లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి కోర్సులో డిగ్రీ చేశాడు. ఆ తరువాత లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత కొన్నేళ్ళకు, ఆయన పోటీ చేసే ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంలో నిలబడి ఎంపిగా గెలిచారు. 2007లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.

2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు రాహుల్. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచి పార్టీ చరిత్రలో ఎన్నడూలేని వైఫల్యాన్ని చవి చూసింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను గెలుచుకుంది. 2019 భారత ఎన్నికలలో, భారత్ జాతీయ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మరల వైఫల్యం చెందాయి.

వ్యక్తిగత జీవితం

రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించాడు.[3] ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ ల మొదటి సంతానం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవడు. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మునిమనవడు. ఆయన చెల్లెలు ప్రియాంక వాద్రా, బావ రాబర్ట్ వాద్రా.[4]

రాహుల్ మొదట ఢిల్లీ లోని సెయింట్ కొలంబా పాఠశాలలో చేరారు.[5] 1981 నుండి 1983 వరకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ది డూన్ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన నానమ్మ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ని దుండగులు చంపడంతో, తండ్రి రాజీవ్ 1984 అక్టోబరు 31న ప్రధానమంత్రి అయ్యారు. సిక్కు ఉగ్రవాదుల నుంచి వీరి కుటుంబానికి బెదిరింపులు రావడంతో రాహుల్, ఆయన చెల్లెలు ప్రియాంకాను ఇంట్లోనే చదివించడం ప్రారంభించారు రాజీవ్.[6] 1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చేరిన రాహుల్, మొదటి సంవత్సరం పరీక్షలైపోయిన తరువాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు.[7]1991లో తమిళ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత[8] భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ రోలిన్స్ కళాశాలకు మారిపోయారు. 1994లో బి.ఎ పూర్తి చేశారు ఆయన.[9] ఆ సమయంలో ఆయన రౌల్ విన్సి అనే మారుపేరుతో చదువుకునేవారు. ఆయన అసలు పేరు, వివరాలు కొందరు భద్రతా, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తెలుసు.[7][10]1995లో కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో ఎం.ఫిల్ చదివారు. ఆ తరువాత 1995లో లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేశారు.[11] 2002లో ముంబైలో బాకొప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు.[12] 2004లో ఒక ప్రెస్ మీట్ లో తనకు ఒక స్పానిష్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు చెప్పారు. ఆమె వెనిజులాలో ఉంటుందనీ, ఆమె ఒక ఆర్కిటెక్ట్ అనీ తెలిపారు. తాను ఇంగ్లండ్ లో చదువుకునేటప్పుడు ఆమె పరిచయమయ్యారని వివరించారు రాహుల్.[13][14] కానీ 2013లో తాను పెళ్ళి చేసుకోనని ప్రకటించారు ఆయన.[15]

రాజకీయ జీవితం

రాహుల్ గాంధీ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి చంద్ర ప్రకాష్ మిశ్రాపై 390,179 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాహుల్ గాంధీ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ఆశిష్ శుక్లాపై  464,195 ఓట్లతో మెజారిటీతో గెలిచి రెండోసారి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో  408,651 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 1,07,903 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయగా, అమేథీలో 55,120 ఓట్లతో ఓడిపోయి, వయనాడ్‌లో 4,31,770 ఓట్లతో మెజారిటీతో గెలిచాడు. ఆయన 2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలితో పాటు కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయగా రెండు చోట్ల విజయం సాధించి,[16] జూన్ 8న కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా నియమితుడయ్యాడు.[17]

రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాల్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో జూన్ 17న వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేశాడు.[18][19]

ఎన్నికలలో పోటీ

సంవత్సరం ఎన్నికల పార్టీ నియోజకవర్గం పేరు ఫలితం ఓట్లు ఓటు %
2004 14వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్ అమేథి గెలుపు 390,179 66.18%
2009 15వ లోక్‌సభ గెలుపు 464,195 71.78%
2014 16వ లోక్‌సభ గెలుపు 408,651 46.71%
2019 17వ లోక్‌సభ ఓటమి 413,394 43.86%
వాయనాడ్ గెలుపు 706,367 64.67%
2024 18వ లోక్‌సభ గెలుపు 647,445 59.69%
రాయ్‌బరేలి గెలుపు 687,649 66.17%

పార్లమెంట్‌లో నిర్వహించిన పదవులు

సంవత్సరం వివరణ
2004 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు (2004–06)
  • మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు (2006–09)
2009 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (2వసారి)
  • మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • గ్రామీణాభివృద్ధిపై సంప్రదింపుల కమిటీ సభ్యుడు
2014 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (3వసారి)
  • విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖపై సలహా కమిటీ సభ్యుడు
2019 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (4వసారి)
  • రక్షణపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • సంప్రదింపుల కమిటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడు
2024 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (5వసారి)

పార్టీలో పదవులు

సంవత్సరం స్థానం ముందుంది తరువాత
2008 - 2013 ఐఎన్‌సీ ప్రధాన కార్యదర్శి N/A N/A
2007 - ప్రస్తుత (2020 నాటికి) ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఛైర్ పర్సన్ స్థానం ఏర్పాటు చేయబడింది ప్రస్తుతం
2007 - 2020 ఎన్‌ఎస్‌యూఐ చైర్‌పర్సన్ స్థానం ఏర్పాటు చేయబడింది మల్లికార్జున్ ఖర్గే
2013 - 2016 ఐఎన్‌సీ వైస్ ప్రెసిడెంట్ స్థానం ఏర్పాటు చేయబడింది పదవిని రద్దు చేశారు
2017 - 2019 ఐఎన్‌సీ అధ్యక్షుడు సోనియా గాంధీ సోనియా గాంధీ (మధ్యంతర)

ఇవి చూడండి

మూలాలు

  1. "Rahul Gandhi returns to parliament after Indian court suspends defamation conviction". The Guardian. 7 August 2023. Archived from the original on 10 November 2023. Retrieved 7 August 2023.
  2. [1]
  3. "Detailed Profile: Shri Rahul Gandhi". India.gov.in. Archived from the original on 27 ఏప్రిల్ 2014. Retrieved 27 April 2014.
  4. M. V. Kamath. "Does Congress want to perpetuate Nehru-Gandhi dynasty?". Samachar. Archived from the original on 28 October 2006. Retrieved 9 February 2007.
  5. "Unplugged: Rahul Gandhi – The Times of India". Timesofindia.indiatimes.com. 7 August 2009. Retrieved 12 April 2014.
  6. Sanjay Hazarika (16 July 1989). "Foes of Gandhi make targets of his children". The New York Times. Retrieved 24 February 2014.
  7. 7.0 7.1 Rahul completed education in US under a false name – India – DNA.
  8. "The accused, the charges, the verdict". Frontline. 7 February 2010. Archived from the original on 29 October 2013. Retrieved 16 August 2016.
  9. "Newsweek apologises to Rahul Gandhi". The Indian Express. 27 January 2007.
  10. A Question Of TheHeir & Now.
  11. "The Great White Hope: The Son Also Rises". Rediff. 13 April 2004.
  12. "Want to be CEO of Rahul Gandhi's firm?". Rediff. 24 June 2004. Retrieved 27 April 2014.
  13. "My girlfriend is Spanish: Rahul Gandhi". The Indian Express. 28 April 2004. Archived from the original on 26 December 2012. Retrieved 19 August 2009.
  14. "I have a girlfriend in Venezuela: Rahul". The Island. 30 July 2004. Archived from the original on 16 October 2016. Retrieved 16 August 2016.
  15. No marriage or children for India's Rahul Ghandi?
  16. Prabha News (4 June 2024). "రెండు స్థానాల్లోనూ రాహుల్ గాంధీ విజ‌యం…". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  17. Andhrajyothy (8 June 2024). "కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రాహుల్ గాంధీ.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్." Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  18. Eenadu (17 June 2024). "వయనాడ్‌ను వదులుకున్న రాహుల్‌.. అక్కడి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ". Eenadu. Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  19. Andhrajyothy (17 June 2024). "వయనాడ్‌ను వదులుకున్న రాహుల్.. ఉపఎన్నికల బరిలో ప్రియాంక". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.