Jump to content

సూరజ్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో సూరజ్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకు కేంద్రగా సూరజ్‌పూర్ పట్టణం ఉంది. జాతీయరహదారి 43 ఈ జిల్లాగుండా పోతుంది. 2011 ఆగస్టు 15 న నాటి ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ అధ్వర్యంలోఈ జిల్లా ఆరంభం అయింది. సూరజ్‌పూర్ జిల్లా " నేషనల్ సత్యన్ మిత్రా లిటరసీ అవార్డ్ "ను అందుకుంది. జిల్లా ఆర్థికంగా శక్తివంతమైనది. అలాగే నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందిస్తుంది. జిల్లాలోని పర్యాటక ఆకర్షణలలో "టామర్ పింగ్ల వన్యప్రాణి శాంచ్యురీ" ఒకటి.[1]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

సూరజ్‌పూర్ జిల్లాలో రామ్‌గఢ్, కుందర్‌గఢ్, దేవ్‌గఢ్, భయ్యాతాన్, ప్రేమ్ నగర్ వద్ద ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, జిల్లాలోని 547 గ్రామాల్లో 7,89,043 (పురుషులు – 3,98,381, స్త్రీలు – 3,90,662) మంది ప్రజలు నివసిస్తున్నారు. జనసాంద్రత చ.కి.మీ.కు 283. జిల్లా అక్షరాస్యత 60.95%,

జిల్లాలో 6 తహసీళ్ళు ఉన్నాయి. అవి:

  • ప్రతాప్‌పూర్
  • ఒడాగి
  • భయ్యా తాన్
  • సూరజ్‌పూర్
  • రామానుజ్ నగర్
  • ప్రేమ్ నగర్

మూలాలు

[మార్చు]
  1. "Surajpur District". Surajpur.gov.in. 2012. Retrieved 2017-03-01.

వెలుపలి లింకులు

[మార్చు]