మణిపూర్‌లో 2024 భారత సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 19, 26 తేదీలలో 18వ లోక్‌సభ చెందిన ఇద్దరు సభ్యులను ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గాల నుండి ఎన్నుకోవటానికి జరిగాయి.[1] ప్రచారం, పోలింగ్ సమయంలో సాయుధ మిలీషియాల హింస, బెదిరింపుల నివేదికలు వచ్చాయి కానీ, మొత్తం మీద, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రతిపక్ష భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థులు బిమోల్ అకోయిజామ్, ఆల్ఫ్రెడ్ కంగమ్ ఆర్థర్ వరుసగా రెండు స్థానాలను గెలుచుకున్నారు.
చుట్టుపక్కల కొండ జిల్లాలను కలిగి ఉన్న రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగ (కుకి-జో, నాగ) వర్గాలకు రిజర్వ్ చేయబడిన ఔటర్ మణిపూర్ లోక్సభనియోజకవర్గంలో నాగ అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. కుకి-జో కమ్యూనిటీ ఏ అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించుకుంది.[3]బిజెపి తన జాతీయ ప్రజాస్వామ్య కూటమి మిత్రపక్షమైన నాగ పీపుల్స్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించగా, భారత జాతీయ కాంగ్రెస్ నాగ కమ్యూనిటీ నుండి అభ్యర్థిని నిలబెట్టింది.[3]
ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకుంది. ఇన్నర్ మణిపూర్ స్థానాన్ని బిమోల్ అకోయిజామ్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన తౌనౌజమ్ బసంత్ కుమార్ సింగ్ కంటే 100,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలుచుకున్నాడు. ఔటర్ మణిపూర్ స్థానాన్ని ఆల్ఫ్రెడ్ కంగమ్ ఆర్థర్ తన సమీప ప్రత్యర్థి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన కె. తిమోతి జిమిక్‌పై 85,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలుచుకున్నాడు.[6]