Jump to content

హనుమాన్ బెనివాల్

వికీపీడియా నుండి
హనుమాన్ బెనివాల్
హనుమాన్ బెనివాల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 (2019-05-23)
ముందు సి.ఆర్. చౌదరి
నియోజకవర్గం నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం

రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మొదటి అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 అక్టోబరు 29

రాజస్థాన్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2008 – 2019
తరువాత నారాయణ్ బెనివాల్
నియోజకవర్గం ఖిన్వసర్ శాసనసభ నియోజకవర్గం

రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ జాతీయ కన్వీనర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018

రాజస్థాన్ విశ్వవిద్యాలయం స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు
పదవీ కాలం
1997 – 1998

వ్యక్తిగత వివరాలు

జననం (1972-03-02) 1972 మార్చి 2 (వయసు 52)
బరంగావ్, నాగౌర్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
(2013 వరకు)
జీవిత భాగస్వామి
కనికా బెనివాల్
(m. 2009)
సంతానం 2
నివాసం రాజస్థాన్ హౌస్, న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి రాజస్థాన్ విశ్వవిద్యాలయం
వృత్తి సామాజిక కార్యకర్త, వ్యవసాయవేత్త

హనుమాన్ బెనివాల్ (జననం 1972 మార్చి 2) భారతీయ రాజకీయ నాయకుడు, రైతు ఉద్యమ నాయకుడు. ఆయన రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నాడు. జైపూర్‌లో, ఆయన 2018 అక్టోబర్‌ 29న ఏర్పడిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, జాతీయ కన్వీనర్ కూడా.[1][2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆయన 1972 మార్చి 2న రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని బరంగావ్ గ్రామంలో రామ్‌దేవ్, మోహినీ దేవి దంపతులకు జన్మించాడు.[4] ఆయన 1993లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. 1998లో, ఆయన ఎల్.ఎల్.బి కూడా పూర్తి చేసాడు.[5] అతని తమ్ముడు నారాయణ్ బెనివాల్ కూడా రాజకీయ నాయకుడె.[6]

అసెంబ్లీ నిరసన

[మార్చు]

2017 ఏప్రిల్ 25న, మూడు వేర్వేరు శాఖలకు సంబంధించినవి కావడంతో ఆయన ప్రశ్నలను స్పీకర్ కైలాష్ మేఘవాల్ రద్దు చేసాడు. దీంతో ఆయన స్పీకర్ వెల్ వద్దకు వెళ్లి పేపర్లు చింపి, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి రాజేంద్ర రాథోడ్‌పై విమర్శలు గుప్పించారు.[7][8][9]

రైతు నిరసన

[మార్చు]

2020లో, ఆయన రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలో పాలుపంచుకున్నాడు, ఇవి రైతు వ్యతిరేకమని నినదించాడు. తాను లోక్‌సభలో ఉండి ఉంటే వ్యవసాయ బిల్లులను చించివేసి ఉండేవాడినని అని వాఖ్యలు చేసాడు.[10]

రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ

[మార్చు]

2018 అక్టోబరు 29న, ఆయన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీని స్థాపించాడు, ఈ ప్రక్రియలో దాని అధ్యక్షుడు జాతీయ కన్వీనర్ అయ్యాడు. భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో పాటు రాజస్థాన్‌ రాష్ట్రంలో విజయవంతమైన మరొక పార్టీగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ మారింది.[11][12]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన 2009 డిసెంబరు 9న కనికా బెనివాల్‌ను వివాహం చేసుకున్నాడు, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.[13][14]

ఆయన రాజస్థానీ జానపద దైవం వీర్ తేజ అనుచరుడు, శిష్యుడు.[15][16]

మూలాలు

[మార్చు]
  1. "Hanuman Beniwal floats a new political party in Rajasthan". The Hindu. 29 October 2018. Retrieved 29 October 2018.
  2. "Independent MLA Hanuman Beniwal floats new party, calls for third front government in Rajasthan". Hindustan Times. 30 October 2018. Retrieved 30 October 2018.
  3. "BJP ally Hanuman Beniwal resigns from 3 parliamentary committees in support of farmers' protest". India Today. 19 December 2020. Retrieved 6 September 2023.
  4. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 29 December 2019.
  5. "Hanuman Beniwal(Rashtriya Loktantrik Party):Constituency- NAGAUR(RAJASTHAN) - Affidavit Information of Candidate". www.myneta.info. Retrieved 21 June 2019.
  6. Devarshi, Nakul (23 September 2019). "... तो हनुमान बेनीवाल छोटे भाई नारायण बेनीवाल को बनाएंगे उम्मीदवार! ये माना जा रहा कारण" [Narayan Beniwal Brother of Hanuman Beniwal contest khinvsar seat]. Patrika News. Retrieved 1 October 2023.
  7. "Raj MLA protests in Assembly, draws Speaker's ire". Outlook. 25 April 2017. Retrieved 1 March 2021.
  8. PTI (25 April 2017). "Rajasthan MLA protests in Assembly, draws Speaker's ire". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 1 March 2021.
  9. PTI (25 April 2017). "Raj MLA protests in Assembly, draws Speaker's ire". India.com. Retrieved 18 January 2019.
  10. "BJP ally RLP quits NDA over farm laws, Hanuman Beniwal claims Covid report fudged to keep him out of LS". India Today. Retrieved 23 September 2023.
  11. Joseph, Joychen (6 April 2019). "'Very temperamental, never hesitates to take on the mighty'". The Times of India. ISSN 0971-8257. Retrieved 14 October 2023.
  12. "Hanuman Beniwal floats new political party in Rajasthan". The Hindu. 29 October 2018. ISSN 0971-751X. Retrieved 14 October 2023.
  13. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 29 December 2019.
  14. Choudhary, Shyam (28 February 2019). "वीडियो : कनिका बेनीवाल ने कहा - लोगों का प्यार देखकर सारी शिकायतें दूर हो गईं" [Video : Special interview with Hanuman Beniwal's wife Kanika]. Patrika News. Retrieved 23 September 2023.
  15. पुरी, करण (23 April 2023). "वीर तेजाजी की प्रतिमा हटाए जाने पर भड़के सांसद हनुमान बेनीवाल, बोले- 'आस्था के साथ खिलवाड़...'". ABP Live. Retrieved 23 September 2023.
  16. Bishnoi, Mahendra (5 September 2022). "तेजा दशमी पर सांसद बेनीवाल ने हेलीकॉप्टर से भरी सियासी उड़ान, जाट वोट बैंक साधने को एक दिन में 5 जिलों में की सभाएं". Navbharat Times. Retrieved 23 September 2023.