జయంత్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌదరి జయంత్ సింగ్
జయంత్ చౌదరి

జయంత్ సింగ్


రాష్ట్రీయ లోక్‌దళ్‌ చైర్మన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 మే 25[1]
ముందు అజిత్ సిం‍గ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 జులై 5
ముందు సుఖ్ రామ్ సింగ్ యాదవ్
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1978-12-27) 1978 డిసెంబరు 27 (వయసు 45)
డల్లాస్, , అమెరికా సంయుక్త రాష్ట్రాలు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్‌
ఇతర రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (2024–ప్రస్తుతం)
జీవిత భాగస్వామి
చారుసింగ్
(m. 2003)
సంతానం 2 కూతుళ్లు
వృత్తి రాజకీయ నాయకుడు
Biographical Note on Lok Sabha
మూలం https://www.india.gov.in/my-government/indian-parliament/shri-jayant-chaudhary

చౌదరి జయంత్ సింగ్ (1978 డిసెంబరు 27), జయంత్ చౌదరి [2] గా ప్రసిద్ధి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఇతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు 2022 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో జయంత్ చౌదరి మధుర నుండి లోక్‌సభ సభ్యునిగా పనిచేశాడు. జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్‌దళ్‌పార్టీ జాతీయ చైర్మన్.

2024 మార్చి 1న, జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధికారికంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరింది. [3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

జయంత్ చౌదరి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెక్సాస్‌లోని డల్లాస్‌లో తెవాటియా హిందూ జాట్ కుటుంబంలో చౌదరి అజిత్ సింగ్ రాధికా సింగ్‌ దంపతులకు జన్మించాడు. జయంత్ చౌదరి నిజానికి భారతదేశం లోని పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని భటోనాకు చెందినవాడు. జయంత్ చౌదరి భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మనవడు. [4]

జయంత్ చౌదరి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 2002లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి అకౌంటింగ్ ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. [5] [6] [4]

రాజకీయ జీవితం

[మార్చు]

జయంత్ చౌదరి 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుండి మొదటిసారి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. పార్లమెంటుకు ఎన్నిక కావడం ద్వారా జయంత్ చౌదరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. జయంత్ చౌదరి భూసేకరణ సమస్యపై ఉద్యమించాడు.లోక్‌సభలో భూసేకరణపై ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాడు.[7] జయంత్ సింగ్ చౌదరి వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ, ఫైనాన్స్‌పై కన్సల్టేటివ్ కమిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ప్రభుత్వ హామీల కమిటీలలో సభ్యుడుగా పనిచేశాడు. 2022 జూలైలో జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్‌దళ్‌ అభ్యర్దిగా పోటీ చేసి గెలిచి రాజ్యసభ కు ఎన్నికయ్యాడు. [8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జయంత్ చౌదరి ఫ్యాషన్ డిజైనర్ చారు సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. జయంత్ చౌదరి భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మనవడు. మాజీ కేంద్ర మంత్రి చౌదరి అజిత్ సింగ్ కుమారుడు. [9]

జయంత్ చౌదరి తాత, చరణ్ సింగ్, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. చరణ్ సింగ్ 1930ల నుండి ఆర్యసమాజ్‌లో క్రియాశీల సభ్యుడు. [10]

మూలాలు

[మార్చు]
  1. "Jayant Chaudhary appointed new RLD president". The Economic Times.
  2. "Detailed Profile - Shri Jayant Singh Chaudhary - Members of Parliament (Lok Sabha) - Who's Who - Government: National Portal of India". india.gov.in. Archived from the original on 21 May 2012. Retrieved 23 August 2011.
  3. "Jayant Chaudhary's Rashtriya Lok Dal Formally Joins BJP-Led NDA Alliance". ndtv.com. 2 March 2024. Retrieved 19 March 2024.
  4. 4.0 4.1 "Who is Jayant Chaudhary". Business Standard. Retrieved 17 July 2022.
  5. "Detailed Profile - Shri Jayant Singh Chaudhary - Members of Parliament (Lok Sabha) - Who's Who - Government: National Portal of India". india.gov.in. Retrieved 23 August 2011.
  6. Ashish Tripathi (20 April 2014). "'Dhritrashtra Syndrome' dominates phase III in UP". The Times of India.
  7. "Learning lessons from the neighborhood". Tehelka. Archived from the original on 12 సెప్టెంబర్ 2012. Retrieved 26 October 2011. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  8. "Rajya Sabha elections: Jayant Chaudhary named joint candidate of SP, RLD". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-05-27. Retrieved 2023-07-13.
  9. "In Mathura, son keeps out Ajit Singh, invokes his grandfather - Indian Express". indianexpress.com. 5 May 2009. Retrieved 23 August 2011.
  10. McLeod, John (2015). The History of India (2nd ed.). Greenwood. p. 221. ISBN 978-1-61069-765-1. Singh, Chaudhuri Charan (1902–1987). Politician. Born into a former royal family of the Jat caste; practiced law; joined Mahatma Gandhi's Salt Satyagraha 1930, the Individual Satyagraha against World War II 1940, and the Quit India movement 1942; a member of the Indian National Congress 1930–1967, the Bharatiya Kranti Dal 1967–1974, the Lok Dal 1974–1977, the Janata Party 1977–1979, and the Lok Dal again 1979–1987; chief minister of Uttar Pradesh 1967–1968 and 1970; deputy prime minister of India 1977–1979; prime minister of India 1979–1980.