Jump to content

చిత్రగుప్త

వికీపీడియా నుండి
చిత్రగుప్త
చిత్రగుప్త
రకంమాసపత్రిక (1928 నుండి 1934 ఏప్రిల్ వరకూ)
పక్షపత్రిక (1934 మే నుండి)
ప్రచురణకర్తఎన్.మునుస్వామి మొదిలియార్
సంపాదకులుఎస్.జి.ఆచార్య
స్థాపించినది1928
కేంద్రంమద్రాసు

జాతీయ హాస్యరస పక్ష పత్రికగా చిత్రగుప్త తనని తాను అభివర్ణించుకుంది. 1928లో ప్రారంభమైన ఈ పత్రికను ఎస్.జి.ఆచార్య సంపాదకత్వం వహించగా ఎన్.మునుస్వామి మొదలియార్ నడిపాడు. ఈ పత్రిక 33 సంవత్సరాలకు పైగా నడిచింది. మొదట మాసపత్రికగా వెలువడిన ఈ పత్రిక 1934 మే నెల నుండి పక్షపత్రికగా మారింది.

శీర్షికలు

[మార్చు]

ఈ పత్రికలో నాటికలు, కథలు, కార్టూనులు, కవితలు, జోకులతో పాటు ఈ క్రింది శీర్షికలు ప్రకటించబడ్డాయి.

  • బహిరంగలేఖలు
  • ఫ్లీట్ స్ట్రీట్ కథలు
  • పసిడి తునకలు
  • స్వీకృతి
  • కాలచక్రము
  • కార్డు కథలు
  • రసవాహిని
  • చిత్రగుప్త డైరీ
  • గుసగుసలు
  • చిల్లర విషయాలు
  • ట్రంక్ టెలిఫోను
  • సినిమా లోకం మొదలైనవి

రచయితలు

[మార్చు]
చిత్రగుప్తలోని కార్టూను

అభిప్రాయాలు

[మార్చు]

"సభ్యత వీడని హాస్యము, వినోదమును పుట్టించుచునే విజ్ఞానమును కలిగించు విషయములు కలిగి చిత్రగుప్త ఆంధ్రదేశమున విశేషవ్యాప్తి నందుచు వయోజన విద్యావ్యాప్తికి తోడ్పడుచున్నది" అని ఆంధ్రభూమి మాసపత్రిక వ్యాఖ్యానించింది.[1]

మూలాలు

[మార్చు]

ప్రెస్ అకాడమీ అర్కైవ్స్‌లో చిత్రగుప్త పత్రిక 1958 సెప్టెంబరు 1 సంచిక

  1. ఆండ్ర శేషగిరిరావు (1 June 1934). "సంపాదకీయ సమాలోచన". ఆంధ్రభూమి మాసపత్రిక. 2 (1): 60. Retrieved 1 March 2025.