Jump to content

విహంగ (పత్రిక)

వికీపీడియా నుండి

విహంగ అంతర్జాలంలో ఒక మహిళా సాహిత్య పత్రిక. ఇది తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక.[1] తొలి తెలుగు వెబ్ పత్రికగా 11-1-2011 తేదీన విడుదలైంది. ISSN గుర్తింపు పొందిన తొలి తెలుగు పత్రిక "విహంగ". ప్రస్తుతం యువ రచయిత్రి, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరి, డా అరసి శ్రీ నేతృత్వంలో పత్రిక అంతర్జాలంలో వెలువడుతుంది.

విహంగ విక్షణం

[మార్చు]

‘విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను , అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది. విశాల భావాల పట్ల ఆదరణ చూపుతుంది. వైజ్ఞానిక, మనోవికాసానికి స్వాగతం పలుకుతుంది. కళాత్మకమైన, భావనాత్మకమైన సంవేదనల్ని తమ సంఘర్షణల్ని అక్షర రూపం లో ప్రకటించే సృజనకారులని ఆహ్వానిస్తుంది.

మెర్సీ మార్గరెట్

విహంగ పత్రిక సారధులు

[మార్చు]
  • వ్యవస్థాపకులు: పుట్ల హేమలత.

సంపాదకులు :

[మార్చు]

వర్థమాన తెలుగు రచయిత్రి. ఆమెకు 2020 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆమె మిళింద కథలు రచనకుగాను యువ సాహితీ పురస్కారం దక్కింది. మరాఠీ నవల ‘ఓ’ ని 2015లో ‘ఊరికి దక్షిణాన’గా తెలుగులోకి అనువదించారు.

ఈ పత్రికలో సుదీర్ఘ కాలంగా సంపాదకులలో ఒకరుగా వ్యవహరిస్తున్నారు అరసిశ్రీ.అంతర్జాలంలో తొలి మహిళా పత్రిక. ISSN గుర్తింపు పొందిన తొలి అంతర్జాల తెలుగు పత్రిక కావడం విశేషం. పత్రికలో వీరు రాసిన పుస్తక సమీక్షలు, ముఖాముఖీలు,  సంపాదకీయాలు ఉన్నాయి. ప్రతినెల విహంగ లో వస్తున్న సంపాదకీయాలు వాస్తవ సంఘటనలతో పాటు నేటి తరం తెలుసుకోవాల్సిన మహనీయుల గురించి వీరు రాస్తున్న సంపాదకీయాలు ఆలోచించే విధంగా ఉంటాయి.

సంపాదక వర్గం:
[మార్చు]
    • కాత్యాయనీ విద్మహే
    • కుప్పిలి పద్మ
    • మెర్సీ మార్గరెట్
    • చల్లపల్లి స్వరూప రాణి
    • జాజుల గౌరి

విహంగ లోని శీర్షికలు :

[మార్చు]

సంపాదకీయం:

[మార్చు]

కథలు:

[మార్చు]

"విహంగ"  పత్రిక   ప్రారంభం నుంచి  రచయిత రచయిత్రులు  ప్రోత్సహిస్తూనే ఉంది. ఎందరో రచయితల , కథలు విహంగలో  ప్రచురణ అయ్యాయి. అనువాద కథలు కూడా ఉన్నాయి.

విజయభాను కోటే ,  శివలీల , సుజాత , లక్ష్మి రాఘవ , బండారువిజయ , హైమా వతి , డా. గీతాంజలి , డేగల  అనితా  సూరి, భవానీదేవి  చిల్లర, కనకదుర్గ, ఉమాపోచంపల్లి, పి. రాజ్యలక్ష్మి, ఎండ్లపల్లి భారతి

కవితలు :

ఇప్పటికి వరకు కొన్ని వందల కవితలు విహంగలో ప్రచురితం అయ్యాయి. పత్రికలో తొలి కవిత అనే శీర్షికతో నేటి తరాన్ని ప్రోత్సహిస్తుంది విహంగ.

వ్యాసాలు:

[మార్చు]

సాహిత్య వ్యాసాలు:

[మార్చు]

ధారావాహికలు:

[మార్చు]

విహంగ పత్రిక మొదలైన రోజు నుంచి ధారావాహికలుగా చదువరులను అలరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు విహంగలో ధారావాహికలుగా వచ్చిన నవలల వివరాలు . మొదటి సంచికలో వచ్చిన ధారావాహిక స్త్రీ యాత్రికులు – ఆదినారాయణ .

టగ్ ఆఫ్ వార్ - స్వాతి శ్రీపాద

ఎనిమిదో అడుగు – అంగులూరి అంజనీదేవి

సుకన్య –  విజయ బక్ష్

బాయ్ ఫ్రెండ్ – డా.పెళ్లకూరు జయప్రద

నెలద – సుమన కోడూరి

సహజీవనం – టి.యస్.రామానుజరావు

జోగిని – శాంతి ప్రబోధ

జ్ఞాపకం – అంగులూరి అంజనీ దేవి

గౌతమీ గంగ  -  

ముఖాముఖీలు :

[మార్చు]

విహంగ పత్రికలో సందర్భాను సారంగా నేటి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్న  మహిళామూర్తుల అంతరంగ విశేషాలను ముఖాముఖీల రూపంలో అందిస్తూనే ఉంది.

ప్రముఖ నృత్య కళాకారిణి ఉమాభారతి తో హేమలత పుట్ల నిర్వహించిన “కళల హారతి ఉమాభారతి” ముఖాముఖీ.

ఈ క్రమంలో డా.అరసిశ్రీ “నర్తన కేళి “ శీర్షికతో  శాస్త్రీయ నాట్యంలో రాణిస్తున్న ఎందరో నాట్యాచారిణిల  విజయగాధను, వారి అంతరంగ విశేషాలను తెలియజేసారు.

కొండేపూడి నిర్మలతో మల్లీశ్వరీ ముఖాముఖీ.

కాలమ్స్ :

[మార్చు]

సాహిత్య సమావేశాలు:

[మార్చు]

ఆరోగ్య దీపిక  :

[మార్చు]

పదేళ్ళ విహంగ పయనం

[మార్చు]

పది సంవత్సరాలుగా అంతర్జాలంలో వెలువడుతున్న పత్రికగా విహంగకు మంచి గుర్తింపు ఉంది . తొలి మహిళా పత్రిక గా మొదలైన విహంగ ప్రస్తానం నేటికి నిర్విరామంగా కొనసాగుతుంది . విహంగలో పర్చురించబడిన కథలు పై విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు కూడా జరిగాయి .మానస ఎండ్లూరి , డా.అరసి ల సారధ్యం లో విహంగ ప్రతి నెల ఒకటవ తేదీన అంతర్జాలంలో వెలువడుతుంది .విహంగ పత్రిక పదేళ్ళ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వెబ్ నార్ లో అరసిశ్రీ మాట్లాడిన ప్రసంగం పదేళ్ళ కి ముందు తర్వాత అంతర్జాలంలో తెలుగు పత్రికలు , వాటి నిర్వహణ ఎంత కష్టంగా ఉండేది, ఇప్పుడు ఎంత సులభతరం అయ్యిందో  తెలియజేసారు.

విహంగ సాహితీ పురస్కారాలు

[మార్చు]

మహిళల జీవితంలోని వివిధ కోణాలను పాఠకులకు అందిస్తున్న విహంగ అంతర్జాల మాసపత్రిక, 2017 నుండి ‘విహంగ సాహితీపురస్కారాల’ను అందిస్తుంది. వివిధ రంగాల్లో కృషిచేసిన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరిస్తుంది. 2017 సంవత్సరంలోగబ్బిట దుర్గా ప్రసాద్ , కె.వరలక్ష్మి ,కె .గీత , డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.షమీఉల్లా , డా.లక్ష్మి సుహాసిని , విజయ భాను కోటే , బొడ్డు మహేందర్ ఈ పురస్కారాలను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహితీపీఠం, రాజమహేంద్రవరం క్యాంపస్ మీటింగ్ హాలులో జనవరి 11, 2017 వతేదీన ఈ పురస్కారాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అందించారు. విహంగకి సాంకేతిక సహకారం అందిస్తున్నపెరుమాళ్ళ రవికుమార్ లకు కూడా ఈ పురస్కారాలతో సత్కరించారు.

మూలాలు

[మార్చు]
  1. Tellis, Ashley (2021-04-30). "In conversation with Manasa Yendluri, winner of Sahitya Akademi Yuva Puraskar 2020 for 'Milinda'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-02-14.

బయటి లింకులు

[మార్చు]