Jump to content

జాగృతి

వికీపీడియా నుండి
జాగృతి పుస్తక ముఖచిత్రం

జాగృతి తెలుగు వారపత్రిక. ఇది 1948 డిసెంబరు 18 తేదీన విజయవాడలో ప్రారంభమైనది. మహాత్మా గాంధీ హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడింది.

ఈ పత్రిక ప్రారంభంలో సంపాదకులు బుద్ధవరపు వెంకటరత్నం. ఆయన తరువాత 1953లో తూములూరి లక్ష్మీనారాయణ సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు. 1976లో పి.వేణుగోపాలరెడ్డి సంపాదకులైనారు. అతడు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు వి.రామమోహనరావు సంపాదకులుగా చేరారు.

జాగృతి సంస్థ చేసే విలక్షణమైన పనులలో పత్రికా రచయితలకు శిక్షణా తరగతులను నిర్వహించడం ముఖ్యమైనది. పెద్ద పత్రికలలో పనిచేస్తున్న సంపాదకులను ఆహ్వానించి వారిచేత ప్రసంగాలు చేయించేవారు. ఆంధ్రపత్రిక వలె జాగృతి దీపావళి సంచిక, జూన్ నెలలో పరిశ్రమలకు సంబంధించిన విశేష సంచికలను ప్రచురిస్తున్నారు. ప్రతి సంచికలోను ఒక పేజీ నిండా సినిమా వార్తలను ప్రచురించడం ఒక ఆనవాయితీ.

ఈ పత్రిక 1999లో స్వర్ణోత్సవం జరుపుకొని జాగృతి స్వర్ణ జయంతి స్మృతి మంజూషను ప్రచురించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=జాగృతి&oldid=3264848" నుండి వెలికితీశారు