Jump to content

అమ్మనుడి (పత్రిక)

వికీపీడియా నుండి


అమ్మనుడి తెనాలి నుండి ప్రచురితమైతున్న మాసపత్రిక. తెలుగు జాతి ప్రతిక ఉపపేరుతో నుడి నాడు నెనరు ఉపశీర్షికతో ఈ పత్రిక వెలువడుతుంది. 2013 అక్టోబరులో ప్రచురితమైన నడుస్తున్న చరిత్ర పత్రిక ఆర్థిక కారణాలవలన ఆగిపోయి, తిరిగి 2015 మార్చి నుండి సరికొత్త పేరుతో ప్రారంభమైంది.[1] అంతర్జాలంలో తెలుగు భాషపై చర్చలు జరుగుతుండడానికి అమ్మనుడి పత్రికలో వచ్చిన వ్యాసాలే కారణం.

సంపాదకవర్గం

[మార్చు]

చరిత్ర

[మార్చు]

1983 నుండి 2013 వరకు నడుస్తున్న చరిత్ర పత్రికను విజయవాడ కేంద్రంగా డా. సామల రమేష్ బాబు ప్రచురించారు. 2001 నుండి రాజకీయ విశ్లేషణలతోపాటుగా భాషా ఉద్యమాల గురించి వ్యాసాలు రావడం ప్రారంభమై, 2009 నాటికి పూర్తిస్థాయి భాషోద్యమ పత్రికగా రూపాంతరం చెందింది. ఆర్థిక కారణాల వల్ల 2013 నవంబరు నుండి ఈ పత్రిక వెలువడలేదు. తిరిగి 2015 మార్చి మాసంలో ఉగాదికి తొలి సంచికతో పేరు మార్చుకొని అమ్మనుడిగా వెలువడింది.

దృష్టికోణం

[మార్చు]

తెలుగు భాషను ద్రావిడ భాషగా గుర్తిస్తూ అచ్చతెలుగు మూలాలను సంస్కృతంలేని పదాలనుండి స్వీకరించాలని ఈ పత్రికలో రాసే రచయితల ప్రధాన దృష్టికోణం.

రచయితలు

[మార్చు]

డా. సామల రమేష్ బాబు, సం.వె. రమేష్, ఈమని శివనాగిరెడ్డి, రంగనాయకమ్మ, వీవెన్, వేదగిరి రాంబాబు, వెలమల సిమ్మన్న, డా.ఎన్. గోపి ఇతర రచయితలు.

మూలాలు

[మార్చు]
  1. పుస్తకం.నెట్. "'నడుస్తున్న చరిత్ర' – "అమ్మనుడి"". pustakam.net. సామల రమేశ్ బాబు. Retrieved 2 January 2018.

ఇతర లంకెలు

[మార్చు]