ప్రజాశక్తిహైదరాబాదులోనిప్రజాశక్తి సాహితీ సంస్థచే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలములో 1942లో మద్రాసులో కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా ఆవిర్భవించింది.[1]1945 నుండి ఈ పత్రిక విజయవాడనుండి ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు మరియు చైనా వారి ఆర్ధిక సహాయంతో భారతదేశ వ్యతిరేక వార్తలు రాస్తూ 1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి 2014వ సంవత్సరము వరకు 10 సంచికలకు ఎదిగినది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత మార్కిస్టు -లెనినిస్టు భావజాల సమూహానికి పత్రికగా కొనసాగుతున్నది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ప్రజాశక్తి ఆంధ్ర ప్రాంతానికి పరిమతమైనది, తెలంగాణ లో మార్చి 25, 2015 నుండి నవతెలంగాణ పేరుతో వస్తున్నది.
తొలిదశలో మద్దుకూరి చంద్రశేఖరరావు, కంభంపాటి సత్యనారాయణ (సీనియర్) తుమ్మల వెంకటరామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య,చలసాని ప్రసాదరావులు సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు.ఆ తరువాత వి.ఆర్.బొమ్మారెడ్డి సంపాదకత్వం వహించాడు. ఆ తరువాత మోటూరు హనుమంతరావు గారు ఎడిటర్ గా పనిచేసాడు.ఆయన ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గా 15 ఎళ్ళుగా పనిచేసారు. ఆయన ఎంపీ, శాసన సభ్యులు గానూ పనిచేసారు. ఆ తరువాతి కాలంలో వీ.శ్రీనివాసరావు, ఎస్. వినయకుమర్ ఎడిటర్ గా పనిచేసారు. కొంతకాలం తెలకపల్లి రవి సంపాదకుడుగా ఉన్నాడు. 2014 జూన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వత రెండు రాష్ట్రాలకు గాను రెండు వెర్వేరు ఏడిషన్లను నిర్వహించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాశక్తి ఎడిటర్ గా పాటూరు రామయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రజాశక్తి ఎడిటర్ గా సుంకరి వీరయ్య వున్నారు.