కేరళ

వికీపీడియా నుండి
(Kerala నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కేరళ
Map of India with the location of కేరళ highlighted.
Map of India with the location of కేరళ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
తిరువనంతపురం
 - 8°28′N 76°57′E / 8.47°N 76.95°E / 8.47; 76.95
పెద్ద నగరం తిరువనంతపురం
జనాభా (2001)
 - జనసాంద్రత
31,838,619 (12వ)
 - 819/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
38,863 చ.కి.మీ (21వ)
 - 14
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[కేరళ |గవర్నరు
 - [[కేరళ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
నవంబర్ 1, 1956
 - పి.సదాశివం
 - పినరాయి విజయన్
 - ఒకే సభ (141)
అధికార బాష (లు) మలయాళం
పొడిపదం (ISO) IN-KL
వెబ్‌సైటు: www.kerala.gov.in

కేరళ రాజముద్ర

కేరళ (మళయాళం: കേരളം [కేరళం], ఆంగ్లం: Kerala)తెలుగు రాష్టాలకు నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం. కేరళ సరిహద్దులలో తూర్పు, ఉత్తరం కర్ణాటక, తూర్పు తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన తమిళనాడు కు చెందిన కన్యాకుమారి జిల్లా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే ఐదు రాష్ట్రాలలో కేరళ ఒకటి. సా. శ. పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబరు 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే, ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు భారతదేశం లోని అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.[1]

కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. ఈ రెండిటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన. ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి అతని దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత అతని వారసులైన రాజులు కూడా ఆ విధంగానే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందుకనే కేరళను "దేవుని స్వంత దేశం" అని భావిస్తారు.

చరిత్ర

[మార్చు]

ప్రాచీనం

[మార్చు]
కేరళ మరయూర్ ప్రాంతంలో క్రొత్తరాతియుగం జనులు నిర్మించిన పెద్ద రాతి సమాధులు - వీటిని మునియారాలంటారు
అగస్త్య మహర్షి పేరుమీద ప్రసిద్ధమైన అగస్త్యమలై - ఒక యాత్రాస్థలం -తిరువనంతపురం జిల్లా పడమటి కనుమలలో ఉన్నది - అగస్త్యుడు వైదిక హిందూమతాన్ని దక్షిణభారతానికి తెచ్చాడని చెబుతారు.

పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి, కేరళను వెలికితీసాడని పురాణ గాథ.[2][3] కొత్త రాతియుగం కాలంలో ఇక్కడి వర్షాటవులు మలేరియాకు ఆలవాలమై ఉండడంతో కేరళ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండేవి కావు. అంచేత క్రీ.పూ.10వ శతాబ్దం నాటి కుండపెంకులు, సమాధులే ప్రజల నివాసానికి సంబంధించి ఇక్కడ లభించిన మొదటి దాఖలాలు.[2] ప్రాచీన తమిళం మాట్లాడే ప్రజలు వీటిని నిర్మించారు. దీన్ని బట్టి, ప్రాచీన కాలంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలు (తమిళకం లోని భాగం) ఒకే భాష, జాతి, సంస్కృతికి చెందిన వారని తెలుస్తూంది. 14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవులతో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది.

లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీ (ప్లినీ ది ఎల్డర్) [4] ల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ (Periplus of the Erythraean Sea) గ్రంథంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి.

మధ్యకాలం

[మార్చు]
కేరళలో థామస్ అపోస్తలునిచే ప్రతిష్ఠింపబడినవని చెప్పబడే సిలువ గుర్తులలో ఒకటి.

చేర రాజులు వర్తకంమీద ఆధారపడినందున పశ్చిమ ఆసియా వర్తకులు క్రమంగా వ్యాపారస్థావరాలు ఏర్పరచుకొన్నారు.[5] ఇంకా తమ దేశాలలో తమపై జరుగుతున్న అత్యాచారాలనుండి తప్పించుకోవడానికి యూదులు, క్రైస్తవులు వంటివారు ఇక్కడికి వలస వచ్చారు. అలా సిరియన్ మలబార్ క్రైస్తవ సమాజం,[6] మప్పిల ముస్లిమ్ సమాజం వంటివి రూపు దిద్దుకొన్నాయి. యూదులు క్రీ.పూ. 573లో ఇక్కడకి వచ్చి ఉండవచ్చునని అంచనా.[7][8] అపోస్తలు థామస్ సా.శ. 52లో కేరళలోని ముజిరిస్కు వచ్చి అక్కడి యూదులలో క్రైస్తవబోధనలు ఆరంభించాడని తెలుస్తున్నది. [9]

కాని సుమారు సా.శ.345 లో యూదుల వలసకు (నస్రాని-యూదులు) కచ్చితమైన ఆధారం క్నాయి తోమా (Knai Thoma) రాక. 8వ శతాబ్దంలో ముస్లిం మతస్తులు కేరళలో స్థిరపడ్డారు.1498లో వాస్కో డగామా వచ్చిన తరువాత లాభసాటి సుగంధ ద్రవ్యాల వర్తకంలో ఆధిపత్యంకోసం పోర్చుగీసువారు స్థానికులను, వారి వర్తకాన్ని అదుపుచేయడానికి ప్రయత్నించారు.

బ్రిటష్ కాలం

[మార్చు]

డచ్చివారికి, పోర్చుగీసువారికి జరిగిన యుద్ధాలలో 1741లో డచ్చివారిది పైచేయి అయ్యింది. 1766లో మైసూరుకు చెందిన హైదర్ ఆలీ కేరళ ఉత్తరభాగమైన కోజికోడ్‌ను జయించాడు. 18వ శతాబ్దంలో హైదర్ ఆలీ కొడుకు టిప్పు సుల్తాన్‌కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల ఫలితంగా మలబార్జిల్లా, దక్షిణ కెనరాలు 1790లో ఆంగ్లేయుల పరమయ్యాయి. 1791, 1795లలో కంపెనీవారు కోచి, తిరువాన్కూరు సంస్థానాలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. మలబార్, దక్షిణకెనరా ప్రాంతాలు మద్రాసు ప్రెసిడన్సీలో భాగాలయ్యాయి.

కేరళలో బ్రిటిష్ అధికారానికి ప్రతిఘటనలు తక్కువనే చెప్పవచ్చు. 1946 పున్నపర-వయలార్ తిరుగుబాటు అలాంటివాటిలో ఒకటి.[10] కాని నారాయణ గురు, చత్తంపి స్వామిగళ్ వంటి సంస్కర్తల నాయకత్వంలో అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా గట్టి ఉద్యమాలు నడచాయి. 1924లో జరిగిన వైకోమ్ సత్యాగ్రహం వీటిలో చెప్పుకొనదగినది. 1936లో తిరువాన్కూర్ చిత్ర తిరుణాల్ బాల రామ వర్మ అన్ని కులాలకూ ఆలయప్రవేశాన్ని కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశాడు. కొచ్చిన్, మలబార్‌లలో కూడా ఇదే ప్రగతిశీల పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

కేరళ రాష్ట్రం

[మార్చు]

1947లో భారతదేశం   స్వాతంత్ర్యం రాగా1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్  ఏర్పరిచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటివాటిలో ఇది ఒకటి. [11][11] [12]

ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కౌలుదారులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. తరువాతి ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అవలంబించారు. [13][14] ప్రజల జీవన ప్రమాణాలు ఈ కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందాయి.

భౌగోళికం

[మార్చు]
ఇడుక్కి జిల్లాలో మున్నార్ చుట్టుప్రక్కల ప్రాంతం బాగా పర్వతమయం.

కేరళ భూవైశాల్యం 38,863 చ.కి.మీ. ఇది భారతదేశ వైశాల్యంలో 1.18%. ఎక్కువ భాగం పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య ఉంది. ప్రపంచంలో జీవవైవిధ్యం బాగా ఉన్న 25 ప్రదేశాలలో కేరళ ఒకటి. (biodiversity hotspots) [15] ఉత్తర అక్షాంశాలు 8°18', 12°48' మధ్య, తూర్పు రేఖాంశాలు 74°52', 72°22' మధ్య [16] ఉన్న కేరళ పూర్తిగా భూమధ్య ఉష్ణమండల ప్రదేశంలో ఉంది. కేరళ తీరరేఖ 580 కి.మీ. పొడవైనది. కేరళ వెడల్పు వివిధ ప్రాంతాలలో 35 కి.మీ - 120 కి.మీ. మధ్య ఉంటుంది.

భౌగోళికంగా కేరళను మూడు ప్రాంతాలుగా విభజింపవచ్చును - తూర్పు మెరక ప్రాంతం, మధ్య కొండ ప్రాంతం, పశ్చిమ పల్లపు (మైదాన) ప్రాంతం. భారత tectonic plate మధ్యలో ఉండడం వలన కేరళలో భూప్రకంపనల ప్రమాదం బాగా తక్కువ. [17]

వయనాడ్ గ్రామీణ ప్రాంతపు చిత్రం.
కొల్లమ్ జిల్లా కోచి నీటికాలవలలో చీనా చేపలవల (చైనాలో తయారైనది)

కేరళ తూర్పు భాగం పడమటి కనుమల వర్షచ్ఛాయప్రదేశానికి ఆనుకొని ఉంది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉన్నాయి. పడమటికి ప్రవహించే 41 నదులు, తూర్పుకు ప్రవహించే 3 నదులు ఇక్కడే ఆరంభమౌతాయి. పడమటి కనుమలు దాదాపు గోడకట్టినట్లున్నాయి. పాలఘాట్ దగ్గర మాత్రం ఖాళీస్థలం ఉన్నందున మిగిలిన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన ద్వారమయ్యింది. కనుమల సగటు ఎత్తు 1,500 మీ. 2,500 మీ. ఎత్తైన శిఖరాలున్నాయి. కనుమలకు ఆనుకొని పడమటి ప్రాంతంలో మధ్య పడమటి మైదానప్రాంతం ఉంది. ఇక్కడ ఎత్తుపల్లాల భూములు, లోయలు ఎక్కువ.[16] 250 మీ, 1000మీ. మధ్య ఎత్తులున్న ఇక్కడి కొండలకు తూర్పు అంచున నీలగిరి కొండలు, పళని కొండలు, అగస్త్యమలై, అన్నామలై వంటి పర్వతప్రాంతాలున్నాయి.

కేరళ పశ్చిమతీరమైదానం సమతలమైనది. ఇక్కడ అంతటా ఉప్పుటేరులు, నదీముఖద్వారాలు, కాలువలు చిలవలు పలవలుగా విస్తరించి ఉన్నాయి. వీటిని Kerala Backwaters అంటారు. వీటిలో అలప్పుళ్ళ, కోచిల మధ్యనున్న వెంబనాడ్ సరస్సు బాగా పెద్దది. దాని వైశాల్యం 200 చ.కి.మీ. మొత్తం దేశంలోని జలమార్గాలలో 8% కేరళలోనే ఉన్నాయి. [18] కేరళలో మొత్తం 44 నదులున్నాయి. వీటిలో పెరియార్(244 కి.మీ.), భరతపుళ్ళ (209 కి.మీ.), పంబ (176 కి.మీ.), చలియార్ (169 కి.మీ.), కదలుండిపుళ్ళ (130 కి.మీ.), అచన్‌కోవిల్ (128 కి.మీ.)-ముఖ్యమైన నదులు. మిగిలిన చిన్న నదులకు ఋతుపవన వర్షాలే పూర్తి జలాధారం. [16]

ఈ భౌగోళికకారణాలవల్ల పడమటి కనుమలలో కొన్ని ప్రాంతాలు సంవత్సరంపొడవునా నీటిమయమై ఉంటాయి. కుట్టనాడ్‌లో 500 చ.కి.మీ. ప్రదేశం సముద్రమట్టానికి దిగువున ఉంది. కేరళ నదులు చిన్నవైనందున వాటికి (ముఖద్వారాలలో) డెల్టాలు లేవు. కనుక పర్యావరణ ప్రభావాలు వీటిపై ఎక్కువ.[19] వేసవిలో ఎండ్రు, ఆనకట్టలవల్ల ఇసుక మేటలు, కాలుష్యం వంటి సమస్యలకు కేరళ నదులు వేగంగా ప్రభావితమౌతాయి. [20]

కేరళ వ్యావసాయిక పర్యావరణం
కేరళ పర్యావరణ ప్రాంతాలు
కేరళ పర్యావరణ ప్రాంతాలు

కేరళలో జీవజాలం, వాతావరణం, నేల రకాలు చూపే చిత్రపటం.
Source: Jose 2002.

సంవత్సరానికి 120 నుండి 140 వరకు వర్షపు రోజులున్నందున కేరళ వాతావరణం బాగా తేమమయం. [21] తూర్పు కేరళలో కాస్త పొడి వాతావరణం ఉంటుంది. కేరళ సగటు వర్షపాతం 3,107 మి.మీ. (భారతదేశపు సగటు 1,197 మి.మీ.). ఇడుక్కి పర్వతప్రాంతాలలో 5,000 మి.మీ. వరకు వర్షపాతం నమోదు అవుతుంది. కేరళ వర్షాలకు ప్రధానకారణం ఋతుపవనాలు. more anomalous factors resulted in the red rains of 2001. Kerala . వేసవిలో ఈదురుగాలులు, తుఫానులు, అల్పపీడనం కారణంగా వచ్చే వర్షాలు సామాన్యం. పర్యావరణ ఉష్ణోగ్రతలు పెరగడం (global warming) వలన కూడా అకాల వర్షాలు, సముద్ర మట్టం పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.[16] [22][23] [24]

కేరళ సగటు ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు - 27 డిగ్రీలు సెంటీ గ్రేడ్ మధ్య ఉంటాయి. ఇవే తీరమైదానాలలో 20 డిగ్రీలు-22.5 డిగ్రీల మధ్య ఉంటాయి. దినసరి అధిక ఉడ్ణోగ్రతల సరాసరి 36.7 డిగ్రీలు సెంటీగ్రేడు. దినసరి అల్ప‌ఉష్ణోగ్రతల సరాసరి 19.8 డి.సెం.[25]

వన్య, జంతు సంపద

[మార్చు]
ఇడుక్కి జిల్లా వాయవ్యాన మరయూర్ ప్రాంతంలో ఒక నది.

కేరళ జీవవైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే సుమారు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు (endemic) స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు. [26][27] కేరళలోని 9,400 చ.కి.మీ. అడవులలో, ఎత్తును బట్టి ఎన్నో విధాల ఉష్ణమండలపు, సమోష్ణమండలపు వృక్షజాతులున్నాయి. మొత్తం కేరళలో 24% అటవీ భూమి. [28] సస్థంకొట్ట చెరువు, వెంబనాడ్ చెరువు - ఇవి రెండు ప్రపంచంలో గుర్తింపబడిన (Ramsar Convention listed) తేమ పర్యావరణ ప్రదేశాలు. నీలగిరి జీవ పరిరక్షణా నిలయం (Nilgiri Biosphere Reserve) కూడా ఇదే గుర్తింపు పొందింది. ఇటీవలికాలంలో అడవులను వ్యవసాయభూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకొని కేరళ అడవులలో చాలా భాగాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించారు. [29]

కేరళ జంతుసంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని ఈ జంతుసంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది.

ఇడుక్కి జిల్లా మరయూర్ అడవులలో ఒక Grizzled Giant Squirrel (Protoxerus stangeri).

విభాగాలు

[మార్చు]

కేరళలోని 14 జిల్లాలు చారిత్రికంగా మూడు విభాగాలుగా పరిగణింపబడుతాయి

కేరళ జిల్లాలు
కేరళ జిల్లాలు - జనసాంద్రత (చ.కి.మీ.కు జనాభా)ప్రకారం రంగులు చూపబడ్డాయి
కేరళ జిల్లాలు - జనసాంద్రత (చ.కి.మీ.కు జనాభా)ప్రకారం రంగులు చూపబడ్డాయి

కేరళ జిల్లాలు - జనసాంద్రత (చ.కి.మీ.కు జనాభా)ప్రకారం రంగులు చూపబడ్డాయ.
Source: Government of Kerala 2001.

కేరళ రాజధానితిరువనంతపురం రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరం.[30]కొచ్చి ఎక్కువ నగరపరిసర జనాభా కలిగినది (most populous urban agglomeration)[31]

కోజికోడ్, పాలక్కాడ్, కొల్లం, త్రిస్సూర్ముఖ్యమైన ఇతర వాణిజ్యనగరాలు. కేరళ హైకోర్టు ఎర్నాకుళంలో ఉంది.

కేరళ భారతదేశం లోనే ప్రముఖ పర్యాతక ప్రదేశం. ప్రముఖ కృష్ణ మందిరం గురువాయూర్, అయ్యప్ప స్వామి, తిరువనంత పురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలను చూడ టానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.అలాగే మున్నార్ టీ తోటలు, అలెప్పి లోని బాక్ వాటర్స్, అద్భుత మైన బీచ్ లు, జల పాతాలు చూడ టానికి దేశ విదేశాల నుండి ఎందరో వస్తుంటారు.

రాజకీయాలు

[మార్చు]

కేరళ పాలనా వ్యవస్థ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలవలెనే ఉంటుంది. కేరళలో రెండు ప్రధాన రాజకీయ సంకీర్ణాలున్నాయి. ఒకటి యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఇండియా) (UDF-United Democratic Front,India ) - ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నడుస్తంది. రెండవది లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (LDF-Left Democratic Front) - ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (CPI-M)అధ్వర్యంలో ఉంటుంది. వామపక్ష రాజకీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాజకీయ కార్యక్రమాలలో కేరళ ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటారు.

ఆర్ధిక వ్యవస్థ

[మార్చు]

పన్నుల ద్వారా కేరళ రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) 2005లో 11,124 కోట్ల రూపాయలు (2000 సంవత్సరంలో ఇది 6,360 కోట్లు). పన్నులు కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం 2005లో 1,080 కోట్లు (2000లో 684 కోట్లు). [32] అయినా కేరళ బడ్జెట్ లోటు చాలా ఎక్కువ. అందువలన ప్రభుత్వఋణభారం ఎక్కువై సామాజికసేవలకు పెట్టే ఖర్చుకు ఇబ్బంది అవుతున్నది.[33]

త్రివేండ్రంలో టెక్నోపార్కు.

మొదటినుండి కేరళ ప్రభుత్వాలు సంక్షేమకార్యక్రమాలకు పెద్దపీట వేశాయి. ప్రధానంగా సామ్యవాద ప్రజాస్వామ్యం కేరళ రాజకీయాలలో ముఖ్యమైన సిద్ధాంతం. కాని ఇటీవల మిగిలిన రాష్ట్రాలవలెనే కేరళ కూడా ఆర్థిక సంస్కరణలపట్ల, సరళీకృత వాణిజ్య విధానాలపట్ల, విదేశీ పెట్టుబడులపట్ల మొగ్గు చూపుతోంది.

2004-2005లో కేరళ స్థూల ఉత్పత్తుల విలువ 89,451 కోట్ల రూపాయలు. [34] ఈ వృద్ధి రేటు 1980 దశకంలో 2.3%, 1990 దశకంలో 5.1%-5.99% ఉంటే 2003-2005 మధ్య 7.4%, 9.2% వృద్ధి నమోదయ్యింది. [35][35][36]

భారీ వ్యాపార సంస్థలు, బాంకులు తమవ్యాపారాలకు కేరళను పెద్దగా ఎన్నుకోవడంలేదు. [37] కాని విదేశాలలో పనిచేసే కేరళీయులు తమకుటుంబాలకు పంపే ధనంవల్ల ఈ లోటు భర్తీ అవుతున్నది. కేరళ స్థూల ఉత్పత్తిలో 20% వరకు విదేశాలలో ఉండేవారు పంపే ధనమే.[38]

కేరళ తలసరి స్థూల ఆదాయం 1,819 రూపాయలు.[39]ఇది మొత్తం భారతదేశం తలసరి స్థూల ఆదాయం కంటే బాగా ఎక్కువ,[35] కాని ప్రపంచపు సగటుకంటే ఇంకా తక్కువే. ఇక కేరళ జనాభివృద్ధి సూచిక (Human Development Index), జీవన ప్రమాణాలు భారతదేశంలో చాలా ప్రాంతాలకంటే బాగా మెరుగైనవి.[40]

ఇలా ఆర్థిక ప్రగతి లేకుండానే, గణనీయమైన జీవన ప్రమాణాలు సాధించడం కేరళ వ్యవస్థకున్న ప్రత్యేకత అని నిపుణులు భావిస్తారు. (Kerala model,Kerala phenomenon). కేరళలో ఉన్న పటిష్ఠమైన సేవారంగం (service sector) వల్లనే ఇది సాధ్యమైందని నిపుణుల విశ్లేషణ. [41][42]

కేరళలో తేయాకు తోటలు

సేవారంగం (టూరిజము, ప్రజాపాలన, బ్యాంకింగ్, ఫైనాన్స్, రవాణా, సమాచారం వంటివి కలిపి) కేరళ స్థూల ఆదాయంలో 63.8% సమకూరుస్తున్నాయి. వ్యవసాయం, మత్స్యపరిశ్రమల పాలు 17.2% [36][43] కేరళలో దాదాపు సగంమంది ఆదాయానికి వ్యవసాయంపై ఆధారపడుతున్నారు.[44] కేరళవాసుల ప్రధానాహారం వరి. దాదాపు 600 రకాల వరి [15] [45]) కేరళలోని 310,521 హెక్టారుల పంటభూముల్లో పండుతుంది. (1990లో వరి సేద్యం జరిగే భూమి 588,340 హెక్టారులు ఉండేది. క్రమంగా ఇది తగ్గుతున్నది.) [45]) సంవత్సరానికి 688,859 టన్నుల ధాన్యం పండుతుంది. [44] కొబ్బరి (899,198 హెక్టారులు), తేయాకు, కాఫీ (57,000 టన్నులు - భారతదేశపు ఉత్పత్తిలో 23%), [46] [47]) రబ్బరు, జీడిమామిడి, సుగంధద్రవ్యాలు (మిరియం, ఏలక, వనిల్లా, దాల్చీనీ,పోక వంటివి)కేరళలో ఇతర పంటలు. దాదాపు 10.50 లక్షల మత్స్యకారులు ఏటా 6,68,000 టన్నుల చేపలు పడతారు. (1999–2000 అంచనా); కేరళ 590 కి.మీ. తీరంలో 222 చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా ఉన్న పల్లెలున్నాయి. ఇంకా లోపలి భూభాగంలో 13 చేపలు పట్టే పల్లెలున్నాయి. పీచు పరిశ్రమ, చేనేత, హస్తకళలు వంటి వృత్తులలో 10 లక్షలమందికి జీవనాధారము. 1,80,000 చిన్న పరిశ్రమలలో 9,09,859మందికి జీవనోపాధి లభిస్తున్నది. కొద్దిగా ఖనిజాల త్రవ్వకం జరుగుతున్నది. (స్థూల ఉత్పత్తిలో 0.3%) [43] ఇలెమినైటు, సిలికా, క్వార్ట్జ్, రుటైల్, జిర్కోన్, కావొలిన్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి. [44] పెరటితోటలు, పశుపాలన కూడా లక్షలాదిమందికి ఉపాధి కలుగజేస్తున్నాయి.

ఇంకా టూరిజము, పారిశ్రామిక ఉత్పత్తులు, business process outsourcing కేరళలో ఇతర సేవారంగ ఉపాధి వనరులు. కేరళ నిరుద్యోగుల శాతం 19.2% అని ఒక అంచనా. [48] 20.77% అని మరొక అంచనా [49] [49] [50] [51] రాష్ట్రంలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారు 12.71% అని కొన్ని అధ్యయనాలు చెప్పగా [52] 36% వరకు ఉన్నదని మరికొన్ని అంచనాలు ఉన్నాయి. [53]

రవాణా సదుపాయాలు

[మార్చు]

కేరళలో 145,704 కి.మీ. రోడ్లున్నాయి (మొత్తం దేశంలో 4.2%) అంటే ప్రతి వెయ్యి జనాభాకు 4.62 కి.మీ. అన్న మాట. (భారతదేశం సగటు 2.59 km). దాదాపు అన్ని పల్లెలూ రోడ్లతో కలుపబడి ఉన్నాయి. కేరళ జనసాంద్రత ఎక్కువ కావడం వలన భారతదేశం సగటు రోడ్ల వ్వస్థకంటే కేరళ సగటు బాగా ఎక్కువ. మొత్తం దేశం హైవేలలో 2.6% (1,524 కి.మీ.) కేరళలో ఉన్నాయి. 8 జాతీయ రహదారులు (నేషనల్ హైవేలు) కేరళలో ఉన్నాయి. ట్రాఫిక్ కూడా వేగంగా పెరుగుతున్నది. NH 47, NH 17ల ద్వారా కేరళ పశ్చిమతీరం దాదాపు అంతా కలుపబడింది.

జన విస్తరణ

[మార్చు]
కేరళ జనాభా (1951-2026)

కేరళ జనాభా, వృద్ధిరేటు 1951–2026.
కేరళ జనాభా, వృద్ధిరేటు 1951–2026.

కేరళ జనాభా, వృద్ధి రేటు 1951 నుండి –2001 (అంచనా), 2006–2026 (ముందస్తు అంచనా).
Sources: Tharakan & Navaneetham 1999, p. 36, Government of Kerala 2005b.
కేరళలోని మతాలు
హిందూమతస్తులు
  
54.73%
ముస్లింలు
  
26.56%
క్రైస్తవులు
  
18.38%
ఇతరులు
  
0.33%
మతపరంగా కేరళ జనాభా

కేరళలోని 3.18 కోట్ల జనాభా[54] ప్రధానంగా మళయాళీ, ద్రావిడ జాతి చెందినవారు. జాతిపరంగా ఇండో-ఆర్యన్,యూదు,అరబ్బు జాతులకు గాని, సంస్కృతికిగాని చెందినవారు. ఇంకా జనాభాలో 3,21,00 మంది(1.1%)) ఆదివాసి తెగలకు చెందినవారు..[55] [56] మళయాళం కేరళ అధికార భాష. ; తమిళం, కొన్ని ఆదివాసి భాషలు కూడా ఆయా వర్గాలకు చెందినవారు మాట్లాడుతారు. దేశంలో 3.44% జనాభా కేరళలోనే ఉంది. చ.కి.మీ.కు 819 జనులున్నందున [57] కేరళ జనసాంద్రత భారతదేశపు జనసాంద్రతకంటే మూడురెట్లు ఎక్కువ. కాని కేరళ జనాభా వృద్ధిరెటు దేశంలోనే అతితక్కువ. [58] దశాబ్దంలో కేరళ జనాభా వృద్ధి 9.42 % (దేశం మొత్తంమీద వృద్ధిరేటు 21.34%). [59]

కేరళలో జనాభా ఎక్కువగా తీరప్రాంతంలో ఉన్నారు. [16] మొత్తం జనాభాలో ఆడువారు 51.42% [1]

మతపరంగా హిందువులు54.7%, ముస్లిములు 26.6%, క్రైస్తవులు 18.4% ఉన్నారు. [60] ఒకప్పుడు గణనీయంగా ఉన్న కొచ్చిన్ యూదులు ఇప్పుడు కొద్ది సంఖ్యలో ఉన్నారు. చాలామంది ఇస్రాయెల్‌కు వలస వెళ్ళారు(aliyah). చాలా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మతపరమైన ఘర్షణలు దాదాపు లేవు. కాని ఇటీవల మతపరంగా తీవ్రభావాలున్న సమాజాల కార్యకలాపాలు విస్తృతమౌతున్నాయి. [61][62] కేరళలో నేరాలు, మానభంగాలు, హింసాత్మక చర్యలు మిగిలిన దేశంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. [63] — ఈ విషయంలో దేశంలో కేరళది మూడవ స్థానం. [1]

పితృస్వామ్య కుటుంబ విధానం తక్కిన మూడవ ప్రపంచంకంటే కేరళలో తక్కువ బలంగా ఉంది. [64][65] చాలామంది కేరళీయులు (కొందరు హిందువులు, మలబారు ముస్లిములు) మాతృస్వామ్య కుటుంబ విధానం (మరుమక్కతాయం) అనుసరిస్తారు. క్రైస్తవులు, తక్కిన ముస్లిములు, కొదరు హిందువులు ఒకవిధమైన పితృస్వామ్యవిధానాన్ని (మక్కతాయం)అనుసరిస్తారు. [66] కేరళలో స్త్రీ-పురుష సమానత్వం మిగిలిన దేశంకంటే ముందంజలో ఉంది. [67] [68] H కాని ఇది కూడా క్రమంగా దెబ్బతింటున్నది. [69] ఆడువారిపై గృహహింస, అత్యాచారాలు పెరుగుతున్నాయి. [70]) ప్రపంచీకరణ, ఆధునికీకణ, సంస్కృతీకరణ (వెనుకబడిన పేదలు ధనికవర్గాల ఆచార వ్యవహారాలను అనుకరించడం) ఇందుకు ముఖ్యకారణాలు. [65]

కేరళ జనాభివృద్ధి సూచికలు— పేదరిక నిర్మూలన, ప్రాథమిక విద్యావకాశాలు, ఆరోగ్య సదుపాయాలు— భారతదేశంలో చాలా ఉత్తమస్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకు కేరళలో అక్షరాస్యత 91%,[71] జీవన కాలప్రమాణం 73 సంవత్సరాలు.[71] ఇవి భారతదేశంలో మిగిలిన ప్రాంతాలకంటే చాలా మెరుగైనవి. కేరళలో గ్రామీణ పేదరకం 1970–1971లో 69% ఉండగా 1993–1994 లో 19%కు తగ్గింది. అదే పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపితే 36% తగ్గింది. [72] 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు రాజులు ప్రారంభించిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలే ఈ పరిణామాలకు మూలకారణం. [73] [74] స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రప్రభుత్వాలు ఈ ఒరవడిని కొనసాగించాయి. [40] [42] [75]

కేరళ ఆరోగ్య సదుపాయ వ్యవస్థ ఐక్యరాజ్యసమితి శిశు సంక్షేమ నిధి(UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వంటి సంస్థల నుండి "పిల్లలకు అనుకూలమైన రాష్ట్రము" అని మన్ననలు అందుకొన్నది.— ఉదాహరణకు 95% కంటే ఎక్కు జననాలు ఆసుపత్రులలో జరుగుతున్నాయి. [76]

ఆయుర్వేదము, [77] సిద్ధ వైద్యము, యునాని, ఇంకా కొన్ని (ప్రస్తుతం కనుమరుగవుతున్న) సాంప్రదాయిక, నాటు వైద్యవిధానాలు — కలారి, మర్మచికిత్స, విషవైద్యం వంటివి [78] ఇంకా కేరళలో వాడబడుతున్నాయి. ఈ విజ్ఙానం గురుకుల విద్యా విధానం ద్వారా శిష్యులకు సంక్రమిస్తున్నది. [79] వీటిలో కొన్ని మూలికలు, మంత్రాల కలగలుపు విధానాలు. [80] వైద్య పర్యాటకులు కేరళ ప్రత్యేక వైద్యవిధానాల చికిత్సకోసం కేరళకు వస్తుంటారు (Health Tourism).

కేరళ జనాభాలో వృద్ధుల శాతం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 11.2% కేరళీయులుఉ 60 సంవత్సరాల వయసు పైబడినవారు. [40] ఇందుకు తోడు తరుగుతున్న జననాల రేటు — వెయ్యికి 18[64] [76] — ఈ జనాభా పరిణామం(demographic transition)పరిస్థితి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది. కేరళ, క్యూబావంటి కొద్ది తృతీయ ప్రపంచం ప్రాంతాలలో మాత్రమే ఇలాంటి పరిస్థితి సంభవిస్తున్నది. [41]

సంస్కృతి, కళలు

[మార్చు]
కూడియాట్టం నృత్య ప్రదర్శన ఇస్తున్న గురుపద్మశ్రీ మణి మాదవ చక్యార్. ప్రాచీన సంస్కృత నాటకరీతులలో ఇది ఒక్కటే ఇంకా మిగిలి ఉంది.

కేరళ సంస్కృతి ప్రధానంగా ద్రావిడమూలాలనుండి ఆవిర్భవించింది. తమిళకం అనబడే ప్రాంతీయ సాంస్కృతిక వర్గంలో ఇది ఒక భాగం. తరువాత శతాబ్దాలపాటు సాగిన పొరుగు దేశాల సంస్కృతుల సంబంధాలు కూడా ఈ ద్రావిడ సంస్కృతిని ప్రభావితం చేశాయి.

[81]

కథాకళి, కూడియాట్టం, కేరళనటనం, మోహినియాట్టం, తుల్లాల్, పాదయని, తెయ్యం – ఇవి కేరళకు ప్రత్యేకమైన కళారూపాలు. ఇంకా చవిట్టు నడకొం, ఒప్పన వంటి మరికొన్ని కళలు మతాలకు, కొండజాతులకు సంబంధించినవి. కాని ఇవి ఎక్కువగా ప్రత్యేక ఉత్సవాలకు, పర్యాటకులకు, ప్రత్యేక ఆసక్తి ఉన్నవారికి ప్రదర్శింపబడుతున్నాయి. సామాన్య ప్రజానీకం సమకాలీన కళలపట్ల ఆసక్తి చూపుతున్నారు (మిమిక్రీ, పేరడీ వంటివాటిపై కూడా). ఇక మళయాళం సినిమా కూడా బాగా జనాదరణ కలిగి ఉంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు దీటుగా మళయాళం సినిమాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.

మళయాళం సాహిత్యం బాగాపురాతనమైనది. 14వ శతాబ్దంలో మాధవ పణిక్కర్, శంకర పణిక్కర్, రామ పణిక్కర్ వంటి "నిరణం కవులు" మళయాళ భాష ఆభివృద్ధికీ, ప్రత్యేకమైన కేరళ సాహిత్యం రూపుదిద్దుకోవడానికీ ఆద్యులు. ఆధునిక మళయాళ "కవిత్రయం" అని చెప్పబడే కుమారన్ ఆశన్, వల్లతోల్ నారాయణ మీనన్, ఉల్లూర్ ఎస్.పరమేశ్వర అయ్యర్‌లు కేరళకవితాసాహిత్యాన్ని పురాతనసంప్రదాయాల పట్టునుండి ఆధునిక శైలివైపు మళ్ళించారని గుర్తింపు పొందారు. 20వ శతాబ్దం ద్వితీయార్ధంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన జి.శంకర కురుప్, ఎస్.కె.పొట్టక్కాట్, ఎమ్.టి.వాసుదేవన్ నాయర్‌లు, ఇతర సాహితీకారులు మళయాల సాహిత్యానికి మరింత వన్నెతెచ్చారు.

తరువాతి కాలంలో ఒ.వి.విజయన్, ఎమ్.ముకుందన్, అరుంధతీ రాయ్ (ఆమెకు 1996లో "బుకర్ బహుమతి" తెచ్చిపెట్టిన స్వీయచరిత్రతో ముడివడిన నవల The God of Small Things కథ కేరళ కొట్టాయం పట్టణం నేపథ్యంలో నడుస్తుంది.)— వంటి రచయితలు అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

త్రిస్సూర్‌ పూరమ్‌లో బారులు తీరిన కేరళ ఏనుగులు.
A మోహినియాట్టం నృత్యం

కేరళ సంగీతం కూడా ప్రాచీన సంప్రదాయం గలది. స్వాతి తిరునాళ్ రామవర్మ కీర్తనలు 19వ శతాబ్దంలో ప్రజాదరణ పొందిన తరువాత కర్ణాటక సంగీతం కేరళ సంగీత రంగంలో ప్రధానపాత్ర వహిస్తున్నది. [82][83]

సోపానం అనబడే రాగయుక్తమైన పాటలు కథాకళి నృత్యంతో పాడబడతాయి. మేళం సంగీతప్రదర్శనలు మందిరాలలోనూ, ఉత్సవాలలోనూ ఇస్తారు. 4 గంటలకాలం కూడా సాగే ఒకో మేళంలో 150వరకు వాద్యగాళ్ళు పాల్గొంటారు. "పంచవాద్యం" అనే మరో సంగీతప్రదర్శనలో 100వరకూ మేళగాళ్ళు 5 వాయిద్యాలను వాడుతారు. అయితే, దేశమంతటిలాగానే, ఇటీవలికాలంలో సినిమా సంగీతం అత్యంత జనాదరణ పొందిన సంగీతం.

కేరళ చిత్రకళలలో సాంప్రదాయిక కుడ్యచిత్రాలనుండి రాజా రవివర్మ చిత్రాలవరకు ఎంతో వైవిధ్యముంది. రవివర్మ అత్యంత ప్రసిద్ధి గాంచిన చిత్రకారుడు.

కేరళకు ప్రత్యేకంగా మళయాళం కేలెండర్ ఉంది. దీనితో రైతులు తమ వ్యవసాయపనులు ప్లాన్ చేసుకొంటారు. మతసంబంధమైన (తిథి వగైరా)విషయాలు, పండుగలు ఈ కేలెండరు ఆధారంగా నిర్ణయిస్తారు. కేరళలో భోజనాన్ని "సద్య" అంటారు. అరటి ఆకులలో వడ్డించడం సంప్రదాయం. ఇడ్లి, పాయసం, పులిషెర్రి, పుట్టుకడల, పుళుక్కు, రసం, సాంబారు - ఇవి సాధారణమైన భోజన పదార్ధాలు.

కేరళలో పురుషులు, స్రీలు కూడా సంప్రదాయకంగా కుట్టని, పొడవాటి దుస్తులు కట్టుకోవడం పరిపాటి. మగవారు ధరించే "ముండు" (పంచె), ఆడువారు ధరించే చీర సాధారణ దుస్తులు. ఇప్పుడు మగవారు పాశ్చాత్య విధానంలో దుస్తులు (ప్యాంటు, షర్టు) ధరించడం సర్వసాధారణం.

ఇవి కూడా చూడండి

[మార్చు]
కొట్టాయం జిల్లా తళత్తంగడిలోని ఒక సిరియా మలబార్ నస్రాని వలియపల్లి - యూదుల మందిరాలలో లాగా నగిషీల ఎర్ర పరదాతో కప్పబడిన Knanaya (tabernacle)ను గమనించవచ్చును.
పెద్ద హిందూమందిరాలలో రాత్రివేళల చుట్టూ దీపాలు వెలిగించడం పరిపాటి.
బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Venkitakrishnan & Kurien 2003, p. 26.
  2. 2.0 2.1 Government of Kerala 2005.
  3. Government of Travancore 1906, pp. 210–212.
  4. Pliny's Naturalis Historia, Book 6, Chapter 26
  5. Silapadhigaaram, Manimekalai, P.T. Srinivasa Iyengar's "History of the Tamils: from the earliest times to 600 AD", Madras, 1929
  6. The Indian Christians of St Thomas, Leslie Brown, page 171
  7. De Beth Hillel, David (1832). Travels (Madras publication).
  8. Lord, James Henry (1977). The Jews in India and the Far East; Greenwood Press Reprint; ISBN 0-8371-2615-0.
  9. Medlycott, A E. 1905 "India and the Apostle Thomas"; Gorgias Press LLC; ISBN 1-59333-180-0
  10. Government of Kerala 2002.
  11. 11.0 11.1 Plunkett, Cannon & Harding 2001, p. 24.
  12. Jose 1998.
  13. Cheriyan 2004, pp. 22–23.
  14. Cheriyan 2004, pp. 43–44.
  15. 15.0 15.1 Sreedharan 2004, p. 5.
  16. 16.0 16.1 16.2 16.3 16.4 Government of Kerala 2005b.
  17. United Nations Development Programme 2002
  18. Inland Waterways Authority of India 2005.
  19. "About the Rivers of Kerala". Retrieved 2006-11-02.
  20. "Problems Faced by Rivers in Kerala". Retrieved 2006-11-02.
  21. Chacko & Renuka 2002, p. 80.
  22. Brenkert & Malone 2003, p. 46.
  23. Brenkert & Malone 2003, p. 26.
  24. Brenkert & Malone 2003, p. 52.
  25. Brenkert & Malone 2003, p. 65.
  26. Sreedharan 2004, p. 11.
  27. Government of Kerala 2004f, p. 141.
  28. Sreedharan 2004, p. 12.
  29. Jayarajan 2004, pp. 6–7.
  30. ""World Gazetteer:India - largest cities (per geographical entity")". Archived from the original on 2007-10-01. Retrieved 2007-10-01.
  31. ""World Gazetteer: India - largest cities (per geographical entity")". Archived from the original on 2007-10-01. Retrieved 2007-10-01.
  32. Finance Commission (Ministry of Finance, Government of India)
  33. "Memoranda from States: Kerala" (PDF). Archived from the original (PDF) on 2008-06-26. Retrieved 2006-11-20.
  34. Press Trust of India 2006.
  35. 35.0 35.1 35.2 Mohindra 2003, p. 8.
  36. 36.0 36.1 Government of Kerala 2004, p. 2.
  37. Brenkert & Malone 2003, p. 49.
  38. Hari & Kannan 2002.
  39. Raman 2005.
  40. 40.0 40.1 40.2 Varma 2005.
  41. 41.0 41.1 Tharamangalam 2005, p. 1.
  42. 42.0 42.1 Brenkert & Malone 2003, p. 48.
  43. 43.0 43.1 Government of Kerala 2004c, p. 24.
  44. 44.0 44.1 44.2 Government of Kerala 2005c.
  45. 45.0 45.1 Balachandran 2004, p. 5.
  46. Joy 2004, p. 13.
  47. Joy 2004, pp. 6–7.
  48. Rajan & Zachariah 2005, p. 4.
  49. 49.0 49.1 Government of Kerala 2004, p. 4.
  50. Nair 2004, p. 5.
  51. Nair 2004, p. 13.
  52. Dhar 2006.
  53. Government of Kerala 2006, p. 1.
  54. Office of the Registrar General 2001b.
  55. Kalathil 2004, p. 10.
  56. Kalathil 2004, p. 12.
  57. Office of the Registrar General 2001.
  58. Government of Kerala 2004c, p. 26.
  59. Government of Kerala 2004c, p. 27.
  60. Office of the Registrar General 2004.
  61. Ramakrishnan 2001.
  62. Haviland 2003.
  63. Venkitakrishnan & Kurien 2003, pp. 26–27.
  64. 64.0 64.1 McKibben 2006.
  65. 65.0 65.1 Lindberg 2004, pp. 18–19.
  66. Government of Kerala 2002b.
  67. Government of Kerala 2004r, p. 366.
  68. Lindberg 2004, p. 1.
  69. Sunny 2004, p. 10.
  70. Sunny 2004, p. 14.
  71. 71.0 71.1 United Nations Development Programme 2001, p. 1.
  72. Mohindra 2003, pp. 8–9.
  73. UNESCO 2003, p. 156.
  74. Kutty 2000, p. 104.
  75. Kutty 2000, p. 103.
  76. 76.0 76.1 Kutty 2004, p. 6.
  77. Unnikrishnan 2004, p. 13.
  78. Unnikrishnan 2004, p. 17.
  79. Unnikrishnan 2004, pp. 5–6.
  80. Unnikrishnan 2004, p. 15.
  81. Bhagyalekshmy 2004, pp. 6–7.
  82. Bhagyalekshmy 2004d, p. 29.
  83. Bhagyalekshmy 2004d, p. 32.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కేరళ&oldid=4347819" నుండి వెలికితీశారు