Jump to content

తిరుక్కురుంగుడి

అక్షాంశ రేఖాంశాలు: 8°27′N 77°34′E / 8.45°N 77.56°E / 8.45; 77.56
వికీపీడియా నుండి
తిరుక్కురుంగుడి
Thirukkurungudi Temple
Thirukurungudi Nambi
తిరుక్కురుంగుడి Thirukkurungudi Temple is located in Tamil Nadu
తిరుక్కురుంగుడి Thirukkurungudi Temple
తిరుక్కురుంగుడి
Thirukkurungudi Temple
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :8°27′N 77°34′E / 8.45°N 77.56°E / 8.45; 77.56
పేరు
ఇతర పేర్లు:Vamana Shetram, Dakshina Bhadri
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తిరునెల్వేలి
ప్రదేశం:తిరుక్కురుంగుడి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Sri Sundara Paripooranan
ప్రధాన దేవత:Sri Kurungudi Valli Thaayaar
ఉత్సవ దైవం:Sri Vadivazhagiya Nambi
ఉత్సవ దేవత:Sri Kurungudi Valli Thaayaar, Sri Aandaal
దిశ, స్థానం:తూర్పుముఖం
పుష్కరిణి:Karanda Maadu
విమానం:పంచకేతక విమానం
కవులు:Sri Nammazhwar,Sri Periyazhwar,Sri Thirumangai Azhwar,Sri Thirumazhisai Azhwar
ప్రత్యక్షం:Sri Nampaaduvaan
ముఖ్య_ఉత్సవాలు:Kaisika Puranam, Panguni Brahmotsavam
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ
ఇతిహాసం
వెబ్ సైట్:http://www.srivaishnavanambi.org

తిరుక్కురుంగుడి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఇచట స్వామి వడుగ నంబి రూపముతో ఉడయవరులను (శ్రీరామానుజులను) ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశమును పొంది సకల వేదాంత అంతార్థములను గ్రహించి "మేమును శ్రీభగవద్రామానుజులను ఆశ్రయించితిమి దన్యులమైతి" మని ఆనందముతో ప్రకటించుటచే ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు వచ్చింది. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము మిధునమాసములో జరుగును. వామనుడు వసించిన చోటగుటచే కురుంగుడి యనియు సిద్దాశ్రమమనియు పేరు వచ్చింది. ఉడయవర్ తడివస్త్రములను ఆరబెట్టిన "తిరువట్టప్పారై" ఇచట ఉంది. ఇచట ఉడయవర్ అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో ఉంటాడు. నిన్ఱ-కిడంద (నిలబడి ఉన్న) నంబియార్ల మధ్య శివుని ఆలయము ఉంది.

ఈ సన్నిధికి 10 కి.మీ దూరములో కొండమీద మలైమేల్ నంబి సన్నిధి ఉంది. ఈ దివ్యదేశమున తాయార్ పెరుమాళ్లతో కలసి ఉంటుంది.

ఉత్సవాలు

[మార్చు]

మీనం ఉత్తర తీర్థోత్సవము.

సూచన

[మార్చు]

ఇచట ఎంబెరుమాళ్ (రామానుజుడు) స్వామికి మంత్రోపదేశము చేయుటచే అన్ని దివ్య దేశములలో ఉన్నట్లు అంజలి ముద్రతో గాక జ్ఞానముద్రతో ఉన్నాడు. తిరుమంగై ఆళ్వార్ శ్రీరంగనాథుని యాజ్ఞానుసారము తిరునాడలంకరించిన ప్రదేశమును వారిని తిరుప్పళ్లి చేర్చిన స్థలమును ఇచట దర్శించవచ్చును.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీక్షీరాబ్ది తరజ్గిణీ తటతలే పూర్ణాహ్వయ శ్రీ పతి:|
    దివ్యే భాతి తిరుక్కురుజ్గుడి పురే పంచాకృతి ద్యోతిత:|
    సంప్రాప్త శ్శుభ పంచకేతిక పదం వైమాన మైంద్రీముఖ
    స్థాయీ సాక్షి పదం కురుజ్గుడి లతానాథ శ్శఠారి స్తుత:||

శ్లో. శ్రీ మద్విష్ణు మన శ్శ్రీమత్పర కాల వచ:ప్రియ:|
   రామానుజార్య మునిపాత్కృతో భయ విభూతిక:

పాశురాలు

[మార్చు]

పా. నిఱైన్ద వన్బழி నజ్కుడిక్కివళెన్ఱు; అన్నై కాణ కొడాళ్;
    శిఱన్ద కీర్తి త్తిరుక్కురుజ్గుడి నమ్బియై; నాన్ కణ్డ పిన్;
    నిఱైన్దశోతి వెళ్ళమ్‌ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యొడుమ్;
    నిఱైన్దెన్నుళ్లే నిన్నొழிన్దాన్; నేమియజ్గై యుళతే.
             నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-5-7

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వైష్ణవ నంబి, మలైమేల్ నంబి, నిన్ఱ నంబి, ఇరుంద నంబి, కిడంద నంబి, తిరుప్పార్‌కడల్ నంబి. కురుంగుడి వల్లి తాయార్; తిరుప్పార్ కడల్ నది తూర్పు ముఖము నిలుచున్న భంగిమ ప్రత్యక్షము, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై యాళ్వార్ పంచకేతక విమానము పరమ శివునకు
  • ఉడయవరులకు ఉభయ విభూతి నాయకత్వమును అనుగ్రహించిన స్థలము

మార్గం

[మార్చు]

నాజ్గునేరి(వానమామలై) నుండి 15 కి.మీ దూరములో గలదు. బస్‌వసతి కలదు. నాంగునేరి నుండి కళక్కాడు పోయి అటనుండి వేరు బస్‌లో తిరుక్కురుంగుడి చేరవచ్చును. ఇక్కడ రామానుజకూటము, జీయర్‌స్వాముల మఠములు ఉన్నాయి. మితమైన సౌకర్యములు ఉంటాయి.

మంచి మాట

[మార్చు]

        అనాత్మన్యాత్మ బుద్ధి ర్వా అస్వేస్వమితి యామతి:
        అవిద్యా తరు సంభూతి:బీజమేతత్‌ద్విథా స్థితమ్‌||

అవిద్య అనునది యొక వృక్షము.
ఈ వృక్షమునకు పుట్టిన బీజములు రెండు
1. ఆత్మకాని దేహేంద్రియాదులను ఆత్మ అని భావించుట.(అహంకారము)
2. తనదికాని ఆత్మను తనదియని తలంచుట (మమకారము) సంసారులగు చేతనులు ఈ అవిద్యతో కూడియుందురు. ఈఅవిద్య వలన దేవతిర్యక్ మనుష్య స్థావరములను నాల్గు విధములైన జన్మలు కలుగును. కావున ప్రాజ్ఞుడైనవాడు అవిద్యను పారద్రోలవలెను. అనగా అహంకార మమకారములను విడచిపెట్టవలెను.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]