ట్రావన్‌కోర్
తిరువాన్కూరు తిరువిత్తాంకూర్ రాజ్యం |
||||||
---|---|---|---|---|---|---|
Motto: ధర్మోస్మత్ కులదైవతం | ||||||
Anthem: వంచీష మంగళంమూస:Parabr |
||||||
భారతదేశంలో తిరువాన్కూరు (ఎరుపు రంగు)
|
||||||
Government | రాచరికం | |||||
Currency | ట్రావన్‌కోర్ రూపాయి |
ట్రావన్‌కోర్ రాజ్యం (తరువాత ట్రావన్‌కోర్ సంస్థానం), సుమారు 1729 నుండి 1949 వరకు విలసిల్లిన రాజ్యం. తొలుత పద్మనాభపురం, ఆ తరువాత తిరువనంతపురం రాజధానిగాట్రావన్‌కోర్ రాజకుటుంబం ఈ రాజ్యాన్ని పాలించింది. ట్రావన్‌కోర్ అత్యున్నత దశలో ఉన్నపుడు, ఆధునిక కేరళలోని దక్షిణ భాగం లోని ఇడుక్కి, కొట్టాయం, అలప్పుళా, పతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం జిల్లాలు, ఎర్నాకులం జిల్లాలోని ప్రధాన భాగాలు, త్రిసూర్ జిల్లాలోని పుతేన్‌చిర గ్రామం, ఆధునిక తమిళనాడు లోని దక్షిణ భాగం లోని కన్యాకుమారి జిల్లా, తెన్కాసి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, పొరుగున ఉన్న కొచ్చిన్ రాజ్యంలోని ఇరింజలకుడ కూడల్మాణిక్యం దేవాలయానికి చెందిన తాచుడయ కైమల్ ఎన్‌క్లేవ్‌లు ఈ రాజ్యంలో భాగంగా ఉండేవి.[1] అయితే కొల్లం నగరంలోని తంగస్సేరి ప్రాంతం, తిరువనంతపురంలోని అట్టింగల్ సమీపంలోని అంచుతెంగులు బ్రిటిషు భారతదేశంలో భాగం.
ఉత్తరాన మద్రాసు ప్రెసిడెన్సీ మలబార్ జిల్లా, [2] తూర్పున మద్రాసు ప్రెసిడెన్సీలో పాండ్య నాడు ప్రాంతంలోని మదురై, తిరునల్వేలి జిల్లాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఈ రాజ్యానికి సరిహద్దులుగా ఉండేవి.[3]
ట్రావన్‌కోర్ రాజ్యాన్ని పద్మనాభపురం, త్రివేండ్రం, క్విలాన్, కొట్టాయం, దేవికులం అనే ఐదు విభాగాలుగా విభజించారు. వీటిలో పద్మనాభపురం, దేవికులం ప్రధానంగా తమిళం మాట్లాడే ప్రాంతం. మలయాళం మాట్లాడే ప్రజలు కొద్దిసంఖ్యలో ఉండేవారు.[4] త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం విభాగాలు ప్రధానంగా మలయాళం మాట్లాడే ప్రాంతాలు. తమిళం మాట్లాడే వారు కొద్ది సంఖ్యలో ఉండేవారు.[4]
ట్రావన్‌కోర్ రాజ్యం భారత ఉపఖండపు దక్షిణ కొన వద్ద ఉంది. భౌగోళికంగా, ట్రావన్‌కోర్‌ను విభిన్న వాతావరణ స్థితులుండే మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు: ఎత్తైన తూర్పు ప్రాంతాలు (కఠినమైన, చల్లని పర్వత భూభాగం), మధ్య ప్రాంతాలు (రోలింగ్ కొండలు), పల్లపు పశ్చిమ ప్రాంతాలు (తీర మైదానాలు).
చరిత్ర
[మార్చు]ట్రావన్‌కోర్ ఏర్పాటు, విస్తరణ
[మార్చు]18వ శతాబ్దం ప్రారంభంలో, ట్రావన్‌కోర్ రాజకుటుంబం ప్రస్తుత మలప్పురం జిల్లాలోని కన్నూర్, పరప్పనాడ్ కేంద్రంగా ఉన్న కొలతునాడు రాజకుటుంబం నుండి కొంతమంది సభ్యులను దత్తత తీసుకుంది.[5] ట్రావన్‌కోర్ చరిత్ర మార్తాండ వర్మతో ప్రారంభమైంది, అతను వేనాడ్ (త్రిప్పప్పూరు) రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. అతని పాలనలో (1729-1758) దానిని ట్రావన్‌కోర్‌గా విస్తరించాడు. భూస్వామ్య ప్రభువుల యూనియన్‌ను ఓడించి, అంతర్గత శాంతిని నెలకొల్పిన తరువాత, అతను తన 29 ఏళ్ల పాలనలో దక్షిణాన కన్యాకుమారి నుండి ఉత్తరాన కొచ్చి సరిహద్దుల వరకు వరుస దండయాత్రల ద్వారా వేనాడ్ రాజ్యాన్ని విస్తరించాడు.[6] అతని పాలనా కాలంలో ట్రావన్‌కోర్ , డచ్ ఈస్టిండియా కంపెనీల మధ్య ట్రావన్‌కోర్ -డచ్ యుద్ధం (1739–1753) కూడా జరిగింది.
1741 లో ట్రావన్‌కోర్ , డచ్ ఈస్టిండియా కంపెనీపై కోలాచెల్ యుద్ధంలో విజయం సాధించింది. ఫలితంగా ఈ ప్రాంతంలో డచ్ అధికారానికి పూర్తి గ్రహణం ఏర్పడింది. ఈ యుద్ధంలో, డచ్ కెప్టెన్ యుస్టాచియస్ డి లానోయ్ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతను ట్రావన్‌కోర్‌కు పారిపోయాడు.[7]
మైసూరు దండయాత్ర
[మార్చు]మార్తాండ వర్మ వారసుడు, ధర్మ రాజా అని ప్రసిద్ధి చెందిన కార్తీక తిరునాళ్ రామ వర్మ 1795 లో రాజధానిని పద్మనాభపురం నుండి తిరువనంతపురానికి మార్చాడు. ధర్మ రాజా పాలనాకాలాన్ని ట్రావెన్కోర్ చరిత్రలో స్వర్ణయుగంగా పరిగణిస్తారు. అతను తన పూర్వీకుల ప్రాదేశిక లాభాలను నిలుపుకోవడమే కాకుండా, సామాజిక అభివృద్ధిని మెరుగుపరచి, ప్రోత్సహించాడు. ట్రావెన్కోర్ దివాన్ అయిన రాజా కేశవదాస్ అనే చాలా సమర్థవంతమైన పరిపాలకుడు ఆయనకు ఎంతో సహాయం చేశాడు.
సైనిక ఘర్షణ సందర్భాల్లో ట్రావన్‌కోర్ , ఈస్టిండియా కంపెనీతో పొత్తు పెట్టుకునేది.[8] ధర్మరాజా పాలనలో, మైసూర్ వాస్తవ పాలకుడు, హైదర్ అలీ కుమారుడూ అయిన టిప్పు సుల్తాన్ 1789 లో కేరళపై దండయాత్రలో భాగంగా ట్రావన్‌కోర్‌పై దాడి చేశాడు. మలబార్‌లో మైసూర్ ఆక్రమణ సందర్భంలో ట్రావన్‌కోర్‌లో ఆశ్రయం పొందిన హిందూ రాజకీయ శరణార్థులను తిరిగి అప్పగించడానికి ధర్మరాజా గతంలో నిరాకరించాడు. మైసూరు సైన్యం 1789 నవంబరులో కోయంబత్తూరు నుండి కొచ్చిన్ రాజ్యంలోకి ప్రవేశించి డిసెంబరులో త్రిచూర్ చేరుకుంది. 1789 డిసెంబరు 28 న టిప్పు సుల్తాన్ ఉత్తరం నుండి నెడుంకోటపై దాడి చేశాడు. అప్పుడూ జరిగిన నెడుంకోట యుద్ధంలో (1789) మైసూర్ సైన్యం ఓడిపోయింది.
దివాన్ వేలు తంపి తిరుగుబాటు
[మార్చు]1798లో ధర్మరాజు మరణంతో, రాజవంశంలోని బలహీనమైన పాలకుడైన బలరామ వర్మ (1798-1810) పదహారేళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించాడు. ఈస్టిండియా కంపెనీతో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం 1795 లో ట్రావన్‌కోర్ అనుబంధ కూటమి కిందకు వచ్చింది.[8]
జయంతన్ శంకరన్ నంపూతిరి (1798-1799) తొలగింపు తర్వాత దివాన్‌గా నియమితులైన వేలు తంపి (వేలాయుధన్ చెంపకరామన్ తంపి) (1799-1809)తో ప్రధానమంత్రులు (దళవాస్ లేదా దివాన్‌లు ) రాజ్యాన్ని నియంత్రించడం మొదలైంది. మొదట్లో, వేలాయుధన్ చెంపకరామన్ తంపి, ఈస్టిండియా కంపెనీలు చాలా బాగా కలిసిపోయాయి. ట్రావన్‌కోర్ సైన్యంలోని ఒక విభాగం 1805 లో వేలు తంపి దాలవపై తిరుగుబాటు చేసినప్పుడు, అతను బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ (తరువాత జనరల్) కోలిన్ మెకాలే వద్ద ఆశ్రయం పొందాడు. ఆ తరువాత తిరుగుబాటును అణిచివేసేందుకు ఈస్టిండియా కంపెనీ దళాలను ఉపయోగించాడు. ట్రావన్‌కోర్ , ఈస్టిండియా కంపెనీల మధ్య కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో వేలు తంపి కీలక పాత్ర పోషించాడు. అయితే, ట్రావన్‌కోర్ తరపున ట్రావన్‌కోర్ -మైసూర్ యుద్ధం (1791)లో పాల్గొన్నందుకు పరిహారం చెల్లించాలని ఈస్టిండియా కంపెనీ చేసిన డిమాండుతో దివాన్‌కూ, కల్నల్ మెకాలేకూ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వేలు తంపి, కొచ్చిన్ రాజ్యపు దివాన్ అయిన పాలియాత్ అచ్చన్ గోవిందన్ మీనన్‌తో కలిసి ఈస్టిండియా కంపెనీపై "యుద్ధం" ప్రకటించాడు. గోవిందన్ మీనన్, తన శత్రువు కున్హి కృష్ణ మీనన్‌కు ఆశ్రయం కల్పించినందుకు గాను, మెకాలే పట్ల అప్పటికే అసంతృప్తితో ఉన్నాడు.
ఈస్టిండియా కంపెనీ సైన్యం 1809 ఫిబ్రవరి 27 న కొచ్చిన్‌లో పాలియాత్ అచ్చన్ సైన్యాన్ని ఓడించింది. పాలియత్ అచ్చన్ ఈస్టిండియా కంపెనీకి లొంగిపోయాక, అతన్ని మద్రాసుకు, ఆ తరువాత బెనారస్కు బహిష్కరించారు. నాగర్‌కోయిల్, కొల్లాం సమీపంలో జరిగిన యుద్ధాలలో కంపెనీ, వేలు తంపి దాలవ ఆధ్వర్యంలోని దళాలను ఓడించింది. తిరుగుబాటుదారులకు భారీ ప్రాణనష్టం కలిగింది. వీరిలో చాలా మంది సైన్యాన్ని విడిచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్లారు. అప్పటివరకు తిరుగుబాటులో బహిరంగంగా పాల్గొనని ట్రావన్‌కోర్ మహారాజు, ఇప్పుడు బ్రిటిషు వారితో పొత్తు పెట్టుకుని తంపి శత్రువులలో ఒకరిని తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. మిత్రపక్షమైన ఈస్టిండియా కంపెనీ సైన్యం, ట్రావన్‌కోర్ సైనికులు త్రివేండ్రం వెలుపల ఉన్న పప్పనంకోడ్‌లో విడిది చేశారు. వేలు తంపి దలావా ఇప్పుడు కంపెనీకి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని నిర్వహించాడు. ట్రావన్‌కోర్ సైన్యం అతన్ని పట్టుకునే సమయానికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. 1805 లో వేలు తంపిపై చేసిన తిరుగుబాటు తరువాత, ట్రావన్‌కోర్‌లోని నాయర్ ఆర్మీ బెటాలియన్‌లను చాలావరకు రద్దు చేసారు. ఇప్పుడు వేలు తంపి దాలవ చేసిన తిరుగుబాటు తర్వాత, దాదాపుగా మిగిలిన ట్రావన్‌కోర్ దళాలన్నిటినీ రద్దు చేసారు. రాజాకు అంతర్గతంగాను, బయటి నుండీ వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఈస్టిండియా కంపెనీ నిలబడింది.
మహాదానాల నిలిపివేత
[మార్చు]ఒక కాల క్రమణిక ప్రకారం హిరణ్య-గర్భ, హిరణ్య-కామధేనుడు, హిరణ్యస్వరత వంటి 16 మహాదానాలు చేస్తూ వచ్చిన ట్రావన్‌కోర్ రాజులు కొన్ని షరతులతో క్షత్రియత్వానికి పదోన్నతి పొందారు. ఈ దానాల్లో వేలాది మంది బ్రాహ్మణులకు ఖరీదైన దానాలు చేసేవారు. కనిష్టంగా 1 కజాంచ్ (78.65 గ్రా) బంగారం ఉండేది.[9] 1848 లో అప్పటి భారత గవర్నర్ జనరల్ అయిన మార్క్వెస్ ఆఫ్ డల్హౌసీ, పాలకుల మహాదానం వల్ల ట్రావన్‌కోర్‌లో ఆర్థిక పరిస్థితి దిగగారిపోయిందని వెల్లడించాడు.[10] లార్డ్ డల్హౌసీ, అప్పటి ట్రావన్‌కోర్ రాజు మార్తాండ వర్మ (ఉత్రం తిరునాల్ 1847-60)ని ఈ విషయమై హెచ్చరించమని మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ లార్డ్ హారిస్‌ను ఆదేశించాడు. అతను ఈ మహాదానాలను ఆపకపోతే మద్రాసు ప్రెసిడెన్సీ, అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించాడు. దీంతో మహాదాన ఆచారం ఆగిపోయింది.
శ్రీ మూలం తిరునాల్‌తో సహా ట్రావన్‌కోర్ రాజులందరూ హిరణ్యగర్భం, తులాపురుషదానం వేడుకలను నిర్వహించారు. ట్రావన్‌కోర్ రాజు చితిర తిరునాల్ మహారాజా మాత్రమే ఈ ఆచారాలను నిర్వహించలేదు - అవి చాలా ఖరీదైనవని అతను భావించాడు. [11]
20 వ శతాబ్దంలో
[మార్చు]ట్రావెన్‌కోర్‌లోని చివరి రాజైన చితిర తిరునాళ్ బలరామ వర్మ 1931 నుండి 1949 వరకు పరిపాలించాడు. "అతని పాలనలో విద్య, రక్షణ, ఆర్థిక వ్యవస్థలతో సహా మొత్తం సమాజం అన్ని రంగాలలో విప్లవాత్మక పురోగతి సాధించింది."[12] అతను ప్రసిద్ధిగాంచిన ఆలయ ప్రవేశ ప్రకటన చేసాడు. 1936 నవంబరు 12 న ట్రావెన్‌కోర్‌లోని అన్ని దేవాలయాల లోకి వెనుకబడిన వర్గాలకు ప్రవేశం కల్పించారు. ఈ చర్యతో అతనికి భారతదేశం అంతటా, ముఖ్యంగా మహాత్మా గాంధీ నుండి ప్రశంసలు వచ్చాయి. ప్రజా రవాణా వ్యవస్థ (తిరువనంతపురం-మావెలిక్కర), టెలికమ్యూనికేషన్ వ్యవస్థ (తిరువనంతపురం ప్యాలెస్-మావెలిక్కర ప్యాలెస్) అతని హయాంలోనే మొదలయ్యాయి. అతను రాష్ట్ర పారిశ్రామికీకరణను కూడా ప్రారంభించి, ప్రభుత్వ రంగపు పాత్రను మెరుగుపరిచాడు. రాష్ట్రంలో భారీ పరిశ్రమను ప్రవేశపెట్టి దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించాడు. దాదాపు ఇరవై పరిశ్రమలను స్థాపించాడు. వీటిలో ఎక్కువగా రబ్బరు, సిరామిక్స్, ఖనిజాలు వంటి స్థానిక ముడి పదార్థాలను ఉపయోగించేవే. నేటికీ కేరళలోని ప్రధాన పరిశ్రమలలో ఎక్కువ భాగం చితిర తిరునాళ్ స్థాపించినవే. అతను సంగీతకారులు, కళాకారులు, నృత్యకారులు, వేద పండితులను పోషించాడు. చితిర తిరునాళ్ మొదటిసారిగా ప్రభుత్వ కళా సలహాదారుగా డా. G. H. కజిన్స్ ను నియమించాడు. అతను యూనివర్శిటీ ట్రైనింగ్ కార్ప్స్ ను కూడా స్థాపించాడు, విద్యా సంస్థల్లో ఎన్.సి.సి.ను ప్రవేశపెట్టడానికి ముందే ఇది జరిగింది. యూనివర్సిటీ ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. చితిర తిరునాళ్ కొవడియార్ ప్యాలెస్ అనే పేరుతో ఒక అందమైన రాజభవనాన్ని కూడా నిర్మించాడు. ఇది 1915 లో శ్రీ మూలం తిరునాళ్ తన తల్లి సేతు పార్వతి బాయికి ఇచ్చిన పాత నలుఎక్తు, ఈ భవన నిర్మాణం 1934 లో పూర్తయింది.[13][14][15]
అయితే, అతని ప్రధాన మంత్రి సర్ సి.పి. రామస్వామి అయ్యరుకు ట్రావెన్‌కోర్ కమ్యూనిస్టులలో వ్యతిరేకత ఉండేది. కమ్యూనిస్టులకూ అయ్యరుకూ మధ్య ఉద్రిక్తత చిన్న అల్లర్లకు దారితీసింది. 1946 లో పున్నప్రా-వాయలార్‌లో జరిగిన ఆ అల్లర్లలో కమ్యూనిస్టులు ఆ ప్రాంతంలో తమ స్వంత ప్రభుత్వాన్ని స్థాపించారు. దీనిని ట్రావెన్‌కోర్ ఆర్మీ, నేవీలు అణిచివేసాయి. ప్రధాన మంత్రి 1947 జూన్‌లో ట్రావెన్‌కోర్ ఇండియన్ యూనియన్‌లో చేరడానికి బదులుగా స్వతంత్ర దేశంగా ఉంటుంది అని ప్రకటన విడుదల చేసాడు. తదనంతరం, అతనిపై హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత అతను రాజీనామా చేసి మద్రాసు వెళ్ళిపోయాడు, తరువాత శ్రీ పి.జి.ఎన్. ఉన్నితాన్ ప్రధానమంత్రి అయ్యాడు. మహారాజాకు రాజ్యాంగ సలహాదారు కె.అయ్యప్పన్ పిళ్లై, ఎ. శ్రీధర మీనన్ వంటి చరిత్రకారుల ప్రకారం, అల్లర్లు, మూకదాడులు మహారాజా నిర్ణయంపై ఎటువంటి ప్రభావం చూపలేదు.[16][17] చితిర తిరునాళ్, V.P మీనన్‌ల మధ్య అనేక రౌండ్ల చర్చల తర్వాత, రాజ్యం 1947 ఆగస్టు 12 న ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసేందుకు రాజు అంగీకరించాడు.[18] 1949 జూలై 1 న ట్రావెన్‌కోర్ రాజ్యం కొచ్చిన్ రాజ్యంలో విలీనమైంది. స్వల్పకాలం ఇనికిలో ఉన్న ట్రావెన్‌కోర్-కొచ్చి రాష్ట్రం ఏర్పడింది.[19]
కేరళ ఏర్పాటు
[మార్చు]కేరళ రాష్ట్రం 1956 నవంబరు 1 న ఉనికిలోకి వచ్చింది. రాజుకు బదులుగా గవర్నరు పదవి ఉనికి లోకి వచ్చింది.[20] 1971 జూలై 31 నాటి భారత రాజ్యాంగ చట్టంలోని ఇరవై ఆరవ సవరణ ప్రకారం రాజు తన రాజకీయ అధికారాలన్నింటినీ, వ్యక్తిగత పర్సులను పొందే హక్కునూ తొలగించారు. అతను 1991 జూలై 20 న మరణించాడు.[21]
పాలకులు
[మార్చు]ట్రావన్‌కోర్ రాజ్యం, రాజు ప్రత్యక్ష నియంత్రణ కింద, దివాన్ పరిపాలనలో ఉండేది. దివాన్ కింద నీతేజుత్తు పిళ్లే లేదా కార్యదర్శి, రాయసోమ్ పిళ్లే (సహాయకుడు లేదా అండర్-సెక్రటరీ), అనేక మంది రాయసోమ్‌లు లేదా క్లర్క్‌లతో పాటు కనక్కు పిల్లామర్లు (అకౌంటెంట్‌లు) పనిచేసేవారు. దివాన్ పర్యవేక్షణలో ఉండే సర్వాధికారులు జిల్లాలకు నేతృత్వం వహించేవారు. పొరుగు రాష్ట్రాలు, యూరోపియన్లతో సంబంధాలు వలియా సర్వాహీ పరిధిలో ఉండేవి. లావాదేవీలు ఒప్పందాలు, ఒప్పందాలపై వారే సంతకాలు చేసేవారు.[22]
ట్రావన్‌కోర్ పాలకులు
[మార్చు]- అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ 1729–1758 [23]
- కార్తీక తిరునాళ్ రామవర్మ (ధర్మరాజు) – 1758–1798
- బలరామ వర్మ I - 1798-1810
- గౌరీ లక్ష్మీ బాయి – 1810–1815 (1810 నుండి 1813 వరకు రాణి, 1813 నుండి 1815 వరకు రీజెంట్ క్వీన్)
- గౌరీ పార్వతి బాయి (రీజెంట్) – 1815–1829
- స్వాతి తిరునాళ్ రామవర్మ III – 1813–1846
- ఉత్రం తిరునాళ్ మార్తాండ వర్మ II – 1846–1860
- ఆయిల్యం తిరునాళ్ రామవర్మ III – 1860–1880
- విశాఖం తిరునాళ్ రామవర్మ IV – 1880–1885
- శ్రీ మూలం తిరునాళ్ రామవర్మ VI – 1885–1924
- సేతు లక్ష్మీ బాయి ( రీజెంట్ ) – 1924–1931
- చితిర తిరునాళ్ బలరామ వర్మ II – 1924–1949 / మరణం 1991
1991 నుండి ట్రావన్‌కోర్‌లోని నామమాత్రపు మహారాజులు
[మార్చు]- ఉత్రదోమ్ తిరునాళ్ మార్తాండ వర్మ III – 1991–2013.
- మూలం తిరునాళ్ రామవర్మ VI – 2013 నుండి.
అతని వారసుడు రేవతి తిరునాళ్ బాలగోపాల్ వర్మ - బిరుదు ఎళయరాజా ( క్రౌన్ ప్రిన్స్ ) (జననం 1953).
ట్రావన్‌కోర్ ప్రధానులు
[మార్చు]దళవాయిలు
[మార్చు]- ఆరుముఖం పిళ్లై 1729–1736
- థాను పిళ్లై 1736–1737
- రామయ్య దళవా 1737–1756
- మార్తాండ పిళ్లై 1756–1763
- వార్కాల సుబ్బయ్యన్ 1763–1768
- కృష్ణ గోపాలయ్యన్ 1768–1776
- వాదీశ్వరన్ సుబ్రహ్మణ్య అయ్యర్ 1776–1780
- ముల్లెన్ చెంపకరమన్ పిళ్లై 1780–1782
- నాగర్‌కోయిల్ రామయ్యన్ 1782–1788
- కృష్ణన్ చెంపకరామన్ 1788–1789
- రాజా కేశవదాస్ 1789–1798
- ఒడియరీ జయంతన్ శంకరన్ నంపూతిరి 1798–1799
- వేలు తంపి దళవా 1799–1809
- ఊమిని తంపి 1809–1811
దివాన్లు
[మార్చు]- కల్నల్ జాన్ మున్రో 1811–1814
- దేవన్ పద్మనాభన్ మీనన్ 1814–1814
- బప్పు రావు (తాత్కాలిక) 1814–1815
- శంకు అన్నావి పిళ్లై 1815–1815
- రామన్ మీనన్ 1815–1817
- రెడ్డి రావ్ 1817–1821
- T. వెంకటరావు 1821–1830
- తంజావూరు సుబ్బారావు 1830–1837
- T. రంగారావు (తాత్కాలిక) 1837–1838
- T. వెంకటరావు (మళ్ళీ) 1838–1839
- తంజావూరు సుభా రావు (మళ్ళీ) 1839–1842
- కృష్ణారావు (తాత్కాలిక) 1842–1843
- రెడ్డి రో (మళ్ళీ) 1843–1845
- శ్రీనివాసరావు (తాత్కాలిక) 1845–1846
- కృష్ణారావు 1846–1858
పేరు | చిత్తరువు | పదవి ప్రారంభం | పదవి ముగింపు | పదవీ కాలం [24] |
---|---|---|---|---|
టి. మాధవ రావు | 1857 | 1872 | 1 | |
ఎ. శేషయ్య శాస్త్రి | 1872 | 1877 | 1 | |
నానూ పిళ్ళై | 1877 | 1880 | 1 | |
వి. రామియంగార్ | 1880 | 1887 | 1 | |
టి. రామారావు | 1887 | 1892 | 1 | |
ఎస్. శుంగ్రసూబియర్ | 1892 | 1898 | 1 | |
వి. నాగం అయ్యా | 1901 | 1904 | 1 | |
కె. కృష్ణస్వామి రావు | 1898 | 1904 | 1 | |
వి. పి. మాధవ రావు | 1904 | 1906 | 1 | |
ఎస్. గోపాలచారి | 1906 | 1907 | 1 | |
పి. రాజగోపాలాచారి | 1907 | 1914 | 1 | |
ఎం. కృష్ణన్ నాయర్ | 1914 | 1920 | 1 | |
టి. రాఘవయ్య | 1920 | 1925 | 1 | |
ఎం. ఇ. వాట్స్ | 1925 | 1929 | 1 | |
వి. ఎస్. సుబ్రమణ్య అయ్యర్ | 1929 | 1932 | 1 | |
టి. ఆస్టిన్ | 1932 | 1934 | 1 | |
సర్ ముహమ్మద్ హబీబుల్లామహ్మద్ హబీబుల్లా | 1934 | 1936 | 1 | |
సర్ సి. పి. రామస్వామి అయ్యర్ | 1936 | 1947 | 1 | |
పి.జి.ఎన్.ఉన్నితన్ | 1947 | 1947 | 1 |
ట్రావన్‌కోర్ ప్రధాన మంత్రులు (1948–49)
[మార్చు]No.[a] | పేరు. | చిత్తరువు | పదవీకాలం | అసెంబ్లీ (ఎన్నిక) |
నియమించిన రాజు | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
నుండి | వరకు | రోజులు | |||||||
1 | పట్టోమ్ ఎ. థాను పిళ్ళై | 1948 మార్చి 24 | 1948 అక్టోబరు 17 | 210 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ప్రాతినిధ్య సభ
(1948–49) |
సర్ చిత్తిర తిరునాళ్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ మహారాజు | ||
2 | పరవూర్ టి. కె. నారాయణ పిళ్ళై | 1948 అక్టోబరు 22 | 1949 జూలై 1 | 253 రోజులు |
పరిపాలనా విభాగాలు
[మార్చు]1856 లో రాజ్యాన్ని మూడు విభాగాలుగా విభజించారు. ఒక్కొక్కదానికి, బ్రిటిష్ భారతదేశం లోని జిల్లా కలెక్టర్‌తో సమానమైన హోదాగల దివాన్ పీష్కర్ అధికారిగా ఉండేవారు.[25] ఇవి:
- ఉత్తర ట్రావన్‌కోర్ (కొట్టాయం) లో షేర్‌తలే, వైకోమ్, యెట్మనూర్, కొట్టాయం, చుంగినచేరి, మీనాచిల్, తోడుపోలయ్, మూవాటుపోలయ్, కున్నత్ నాడు, అలన్ గౌడ్, పరవూరు తాలూకాలు భాగం;
- క్విలాన్ (సెంట్రల్ ట్రావన్‌కోర్ ) లో క్విలాన్, అమబలాపులే, చెంగన్నూర్, పందళం, కున్నత్తూర్, కరుంగపుల్లి, కార్తీకపుల్లి, హరిప్పాడ్, మావెలికరే తాలూకాలున్నాయి.
- దక్షిణ ట్రావన్‌కోర్ (పద్మనాభపురం) లో త్రివేండ్రం, చిరాయింకిర్, తోవలే, ఔగతీశ్వరోమ్, కల్కులం, ఎరనీల్, వెలవెన్‌కోడ్‌లు ఉన్నాయి.
జనాభా వివరాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1816 | 9,06,587 | — |
1836 | 12,80,668 | +41.3% |
1854 | 12,62,647 | −1.4% |
1875 | 23,11,379 | +83.1% |
1881 | 24,01,158 | +3.9% |
1891 | 25,57,736 | +6.5% |
1901 | 29,52,157 | +15.4% |
1911 | 34,28,975 | +16.2% |
1921 | 40,06,062 | +16.8% |
1931 | 50,95,973 | +27.2% |
1941 | 60,70,018 | +19.1% |
మతాలు
[మార్చు]జనాభా లెక్కల సంవత్సరం | మొత్తం జనాభా | హిందువులు | క్రైస్తవులు | ముస్లింలు | |||
---|---|---|---|---|---|---|---|
1816 – 1820 | 9,06,587[26] | 7,52,371[26] | 82.99% | 1,12,158[26] | 12.37% | 42,058[26] | 4.64% |
1881 | 24,01,158[4] | 17,55,610[4] | 73.12% | 4,98,542[4] | 20.76% | 1,46,909[4] | 6.12% |
1891 | 25,57,736[27] | 18,71,864[27] | 73.18% | 5,26,911[27] | 20.60% | 1,58,823[27] | 6.21% |
1901 | 29,52,157[26] | 20,63,798[26] | 69.91% | 6,97,387[26] | 23.62% | 1,90,566[26] | 6.46% |
1911 | 34,28,975[26] | 22,98,390[26] | 67.03% | 9,03,868[26] | 26.36% | 2,26,617[26] | 6.61% |
1921 | 40,06,062[26] | 25,62,301[26] | 63.96% | 11,72,934[26] | 29.27% | 2,70,478[26] | 6.75% |
1931 | 50,95,973[26] | 31,37,795[26] | 61.57% | 16,04,475[26] | 31.46% | 3,53,274[26] | 6.93% |
1941 | 60,70,018 | 36,71,480 | 60.49% | 19,63,808 | 32.35% | 4,34,150 | 7.15% |
భాషలు
[మార్చు]జనాభా లెక్కల సంవత్సరం | మొత్తం జనాభా | మలయాళం | తమిళం | ఇతరాలు | |||
---|---|---|---|---|---|---|---|
1875 | 23,11,379[4] | 19,02,533[4] | 82.32% | 3,87,909[4] | 16.78% | 20,937[4] | 0.91% |
1881 | 24,01,158[4] | 19,37,454[4] | 80.69% | 4,39,565[4] | 18.31% | 24,139[4] | 1.01% |
1891 | 25,57,736[27] | 20,79,271[27] | 81.29% | 4,48,322[27] | 17.53% | 30,143[27] | 1.18% |
1901 | 29,52,157[28] | 24,20,049[28] | 81.98% | 4,92,273[28] | 16.68% | 39,835[28] | 1.35% |
1911 | 34,28,975[29] | 28,36,728[29] | 82.73% | 5,54,618[29] | 16.17% | 37,629[29] | 1.10% |
1921 | 40,06,062[30] | 33,49,776[30] | 83.62% | 6,24,917[30] | 15.60% | 31,369[30] | 0.78% |
1931 | 50,95,973[26] | 42,60,860[26] | 83.61% | 7,88,455[26] | 15.47% | 46,658[26] | 0.92% |
కరెన్సీ
[మార్చు]భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, ట్రావన్‌కోర్ రూపాయిని కింది విషంగా విభజించారు.
యూనిట్ | సమానమైన ఉప యూనిట్లు |
---|---|
1 ట్రావన్‌కోర్ రూపాయి | 7 ఫానమ్‌లు |
1 ఫానమ్ | 4 చక్రాలు |
1 చక్రం | 16 నగదు |
నగదు, చక్రం నాణేలను రాగి తోనూ, ఫానం, రూపాయి నాణేలను వెండి తోనూ తయారు చేసేవారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ British Archives http://discovery.nationalarchives.gov.uk/details/rd/d3e53001-d49e-4d4d-bcb2-9f8daaffe2e0
- ↑ Census of India, 1901 (in ఇంగ్లీష్). 1903.
- ↑ Iyer, A. Subrahmanya (1912). Census of India, 1911, Volume XXIII, TRAVANCORE, Part-I, Report (PDF). Trivandrum: Government of Travancore. pp. 19–22.
- ↑ 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 Report on the Census of Travancore (1881) (PDF). Thiruvananthapuram: Government of India. 1884. pp. 135, 258. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "r1881" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Travancore State Manual
- ↑ C. J. Fuller (1976). The Nayars Today. CUP Archive. p. 17. ISBN 978-0-521-29091-3. Retrieved 17 September 2012.
- ↑ Shungoony Menon, P. (1878). A History of Travancore from the Earliest Times (in ఇంగ్లీష్). Madras: Higgin Botham & Co. pp. 136–140. Retrieved 5 May 2016.
- ↑ 8.0 8.1 "Travancore." Encyclopædia Britannica Online. Encyclopædia Britannica Inc., 2011. [page needed][ISBN missing] ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Travancore 2011" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ A Social History of India – Ashish Publishing House: ISBN 81-7648-170-X (2000). [page needed]
- ↑ Sadasivan, S.N., 1988, Administration and social development in Kerala: A study in administrative sociology, New Delhi, Indian Institute of Public Administration
- ↑ "ഹിരണ്യഗര്ഭച്ചടങ്ങിന് ഡച്ചുകാരോട് ചോദിച്ചത് 10,000 കഴിഞ്ച് സ്വര്ണം KERALAM Paramparyam - Mathrubhumi Special". Archived from the original on 24 February 2014. Retrieved 2014-02-20. MATHRUBHUMI Paramparyam ഹിരണ്യഗര്ഭച്ചടങ്ങിന് ഡച്ചുകാരോട് ചോദിച്ചത് 10,000 കഴിഞ്ച് സ്വര്ണം – "ശ്രീമൂലംതിരുനാള് വരെയുള്ള രാജാക്കന്മാര് ഹിരണ്യഗര്ഭം നടത്തിയിട്ടുണ്ടെന്നാണ് അറിയുന്നത്. ഭാരിച്ച ചെലവ് കണക്കിലെടുത്ത് ശ്രീചിത്തിരതിരുനാള് ബാലരാമവര്മ്മ മഹാരാജാവ് ഈ ചടങ്ങ് നടത്തിയില്ല."
- ↑ "During his rule, the revenues of the State were nearly quadrupled from a little over Rs 21/2 crore to over Rs 91/2 crore." – 'The Story of the Integration of the Indian States' by V. P. Menon
- ↑ Supreme Court, Of India. "Good Governance: Judiciary and the Rule of Law" (PDF). Sree Chithira Thirunal Memorial Lecture, 29 December 2007. Archived from the original (PDF) on 17 October 2012. Retrieved 1 February 2014.
- ↑ Gauri Lakshmi Bai, Aswathy Thirunal (1998). Sree Padmanabhaswamy Kshetram. Thiruvananthapuram: The State Institute of Languages, Kerala. pp. 242–243. ISBN 978-81-7638-028-7.
- ↑ Menon, A. Sreedhara (1967). A Survey of Kerala History. Kottayam: D C Books. p. 273. ISBN 81-264-1578-9.
- ↑ Sreedhara Menon in Triumph & Tragedy in Travancore Annals of Sir C. P.'s Sixteen Years, DC Books publication
- ↑ Aiyappan Pillai Interview to Asianet news Accessed at https://www.youtube.com/watch?v=iIMS_6Z_WRE
- ↑ "Instrument of Accession of His Highness the Maharajah of Travancore". Travancore State – Instrument of Accession and Standstill Agreement signed between Rama Verma, Ruler of Travancore State and the Dominion of India. New Delhi: Ministry of States, Government of India. 1947. p. 3. Retrieved 31 August 2022 – via National Archives of India.
- ↑ Kurian, Nimi (2016-06-30). "Joining hands". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-07-22.
- ↑ "The States Reorganisation Act, 1956" (PDF). legislative.gov.in. Government of India.
- ↑ "The Constitution (Twenty-Sixth Amendment Act), 1971". Archived from the original on 6 December 2011.
- ↑ Aiya 1906, pp. 329–330.
- ↑ de Vries, Hubert (2009-10-26). "Travancore". Hubert Herald. Archived from the original on 2012-06-27.
- ↑ The ordinal number of the term being served by the person specified in the row in the corresponding period
- ↑ Shungoony Menon, P. (1878). A History of Travancore from the Earliest Times (in ఇంగ్లీష్). Madras: Higgin Botham & Co. p. 486. Retrieved 5 May 2016.
- ↑ 26.00 26.01 26.02 26.03 26.04 26.05 26.06 26.07 26.08 26.09 26.10 26.11 26.12 26.13 26.14 26.15 26.16 26.17 26.18 26.19 26.20 26.21 26.22 26.23 Census of India, 1931, VOLUME XXVIII, Travancore, Part-I Report (PDF). Thiruvananthapuram: Government of Travancore. 1932. pp. 327, 331. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "r1931" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 27.0 27.1 27.2 27.3 27.4 27.5 27.6 27.7 Report on the Census of Travancore (1891) (PDF). Chennai: Government of India. 1894. pp. 10–11, 683. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "r1891" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 28.0 28.1 28.2 28.3 Iyer, N. Subrahmanya (1903). Census of India-1901, Volume-XXVI, Travancore (Part-I). Thiruvananthapuram: Government of Travancore. pp. 224–225.
- ↑ 29.0 29.1 29.2 29.3 Iyer, N. Subramhanya (1912). Census of India – 1911, Volume-XXIII, Travancore (Part-I) (PDF). Thiruvananthapuram: Government of Travancore. p. 176.
- ↑ 30.0 30.1 30.2 30.3 Iyer, S. Krishnamoorthi (1922). Census of India, 1921, Volume-XXV, Travancore. Thiruvananthapuram: Government of Travancore. p. 91.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు