తంజావూరు రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తంజావూరు రామారావు
తంజావూరు రామారావు ముఖచిత్రం
ట్రావెన్‌కూరు దివాను
In office
1887–1892
చక్రవర్తిమూలం తిరునాళ్
అంతకు ముందు వారువి.రామియ్యంగార్
తరువాత వారుఎస్.శృంగసుబ్బయ్యార్
వ్యక్తిగత వివరాలు
జననం1831
తిరువనంతపురం, ట్రావెన్‌కూరు
మరణం5 జూన్ 1895
తిరువనంతపురం, ట్రావెన్‌కూరు
వృత్తిపరిపాలనాధికారి
నైపుణ్యంరాజకీయవేత్త

తంజావూరు రామరావు సి.ఐ.ఈ. (1831-5 జూన్ 1895) 1887 నుండి 1892 వరకు ట్రావెన్కోర్ (ఇప్పుడు కేరళ రాష్ట్రంలో భాగం) దివానుగా పనిచేసిన భారతీయ పరిపాలానిధికారి. వి. నాగం అయ్యా తన 1906 ట్రావెన్కోర్ స్టేట్ మాన్యువల్లో ఈయనను "ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన దివాను" అని పేర్కొన్నారు. రామారావు రాజా సర్ టి.మాధవరావు, దివాన్ బహదూర్ ఆర్.రఘునాథరావులకు బంధువు. ఈ ముగ్గురూ గుండోపంత్ మనుమలు. రామారావు తల్లి సోనమ్మ బాయి గుండోపంత్ కుమార్తె కాగా, దివాన్ బహదూర్ ఆర్.రఘునాథరావు తండ్రి ఆర్.వెంకటరావు, టి.మాధవరావు తండ్రి ఆర్.రంగారావు గుండోపంత్ కుమారులు.

ప్రారంభ జీవితం, వృత్తి

[మార్చు]

రామారావు 1831లో త్రివేండ్రంలోని తంజావూరు మరాఠీ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో మాజీ జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సఖారామ్ రావు, తంజావూరు రావు కుటుంబపు కుమార్తె సోనమ్మ బాయి దంపతులకు జన్మించాడు. ఈయన పూర్వీకులు 19వ శతాబ్దం ప్రారంభ దశాబ్దాలలో కుంభకోణం (తంజావూరు రాజ్యం) నుండి ట్రావెన్కోర్ రాజ్యానికి వలస వచ్చారు. రామారావు తన పాఠశాల విద్యను త్రివేండ్రంలోని రాజా ఫ్రీ స్కూల్ మరియు నాగర్‌కోయిల్ లోని ఎల్.ఎం.ఎస్. సెమినరీలో అభ్యసించాడు. రామారావు తన విద్యను పూర్తి చేసిన తరువాత ట్రావెన్కోర్ సివిల్ సర్వీస్లో ప్రవేశించి గుమస్తాగా పనిచేశాడు. పదోన్నతి రాకపోవడంతో రామారావు ఆ ఉద్యోగం వదిలి కాలికట్ జిల్లా, సెషన్స్ కోర్టులో అనువాదకుడిగా ఉద్యోగాన్ని అంగీకరించారు. 1857లో రామారావు కల్కుళం తహసీల్దారుగా నియమితుడయ్యాడు. ఆ తర్వాత వెనువెంటనే హుజూర్ కచ్చేరిలో డిప్యూటీ షేరిస్తేదారుగా, మొదటి షేరిస్తేదారుగా పదోన్నతి పొందాడు. ఆయన 1862లో క్విలాన్ డివిజన్‌కు డిప్యూటీ పేష్కర్ అయ్యాడు.

రామారావు, 1862 నుండి 1878 వరకు క్విలాన్ డివిజనుకు డిప్యూటీ పేష్కర్‌గా, 1878 నుండి 1887 వరకు కొట్టాయం డివిజనుకు డిప్యూటీ పేష్కర్‌గా పనిచేశాడు. అప్పుడే ఆయన ట్రావెన్కోర్ దివానుగా నియమితుడయ్యాడు. ఈయన సిఫారసుల ఆధారంగా, మహారాజా మూలమ్ తిరునాళ్ 1888 మార్చి 30న ఒక శాసన మండలిని ఏర్పాటు చేయడానికి నిబంధనను జారీ చేశాడు, "శాసన విషయాలలో దానికి సంబంధం ఉన్న బాధ్యతాయుతమైన అధికారుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి, చర్చించే ప్రయోజనం కలిగి ఉండటానికి, ఇది ప్రభుత్వం యొక్క అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటిగా, చట్టంగా ఆమోదించడానికి సార్వభౌమాధికారికి సమర్పించే ముందు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి".[1][2] అని శాసనమండలి యొక్క ఆవశ్యకతను అందులో సూచించాడు. కౌన్సిల్ మొదటిసారిగా 1888 ఆగస్టు 23న దివాన్ ఛాంబర్స్ లో సమావేశమైంది. ఈ విధంగా ట్రావెన్కోర్ రాజ్యం ఒక శాసన సంస్థను కలిగి ఉన్న భారతీయ సంస్థానాలలో మొదటిదే కాకుండా అటువంటి సంస్థ యొక్క విలువను ముందుగా గుర్తించింది.[1][2] తదనంతర సంవత్సరాలలో ఈ మండలి, భారత గణతంత్ర రాజ్యంలోని కేరళ రాష్ట్రంలో 140 మంది సభ్యుల శాసనసభగా అభివృద్ధి చెందింది. ఈ విధంగా రామారావుకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలోని సంస్థానాలలో మొదటిసారిగా శాసన పాలనకు విత్తనాలు నాటిన గౌరవం లభించింది.

రామారావు తన పాలనా సేవలో తొలినాళ్ల నుండి కూడా నిజాయితీ, చిత్తశుద్ధికి ప్రసిద్ధి చెందాడు. అప్పటి మద్రాసు గవర్నర్ అయిన లార్డ్ కొన్నెమారా (రాబర్ట్ బుర్క్, మొదటి బారన్ కొన్నెమారా) ట్రావెన్కోర్ సందర్శించిన సమయంలో, తన వ్యక్తిగత నివాసమైన "హిల్ వ్యూ" లో ఆయనను సందర్శించడం, బ్రిటిష్ వారు ఈయన పట్ల చూపిన గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటువంటి గౌరవం ఇంతకు ముందు ఉన్న లేదా తరువాత వచ్చిన ఏ దివానుకు లభించలేదు.[1]

1891లో యునైటెడ్ కింగ్డమ్ రాణి, భారత సామ్రాజ్ఞి అయిన విక్టోరియా రామారావును కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియా పురస్కారంతో సన్మానిస్తూ ప్రశంసాపత్రంలో ఇలా పేర్కొంది: "విక్టోరియా, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ యొక్క యునైటెడ్ కింగ్డం యొక్క దేవుని దయ ద్వారా, రాణి, విశ్వాస రక్షకుడు, భారత సామ్రాజ్ఞీ మరియు భారత సామ్రాజ్యం లోని అత్యంత ప్రముఖమైన ఆర్డర్ యొక్క సార్వభౌమాధికారి, ట్రావెన్కోర్ స్టేట్ యొక్క దివాన్ టి. రామరావుకు, శుభాకాంక్షలు. అయితే మేము మిమ్మల్ని మా అత్యంత ప్రముఖమైన భారత సామ్రాజ్యం ఆదేశానికి సహచరులుగా నియమించడానికి మరియు నియమించడానికి తగినవారమని మేము భావించాము, ఈ పురస్కారం ద్వారా మా ఆదేశం యొక్క సహచారి యొక్క గౌరవాన్ని మీకు మంజూరు చేసున్నాము. దీని ద్వారా పైన పేర్కొన్న మా ఆదేశం మరియు ఆదేశం యొక్క భాగస్వామిగా చెప్పిన గౌరవం మరియు హోదాను కలిగి ఉండటానికి, ఆస్వాదించడానికి మీకు అధికారం ఇస్తాము, అక్కడ ఇచ్చిన లేదా పొందిన అన్ని ప్రత్యేక అధికారాలతో పాటు.... మా సార్వభౌమ ఆదేశం యొక్క యాభై నాలుగవ సంవత్సరంలో, 1891 జనవరి మొదటి తేదీన ఆస్‌బోర్న్ దర్బారు నుండి జారీ చేసిన ఈ ఉత్తర్వు మా సార్వభౌమ ఆజ్ఞ ప్రకారం, మా సార్వభౌమ ఆదేశము, మా సార్వభౌమ ముద్ర ద్వారా చెప్పబడింది.[3][4]

తరువాత జీవితం, మరణం

[మార్చు]

రామారావు అనేక విధమైన వ్యక్తిగతమైన దాతృత్వ పనులు చేశాడు. ప్రస్తుత కొల్లం సమీపంలోని నెడుంగోలం వద్ద గ్రామీణ జనాభాలోని పేద మరియు అత్యంత అణగారిన వర్గానికి సేవ చేయడానికి ఆయన తన సొంత వనరులతో 1894 డిసెంబర్ 4న ఒక ఆసుపత్రిని నిర్మించి, దానిని నిర్వహించడానికి లండన్ మిషన్ సొసైటీని (ఎల్.ఎం.ఎస్.) అభ్యర్థించారు. ప్రసిద్ధిగాంచిన ఎవరెస్ట్ పర్వతారోహకుడు, సర్జన్, చిత్రకారుడు, మెడికల్ మిషనరీ ఐన డాక్టర్ హోవార్డ్ సోమెర్వెల్ OBE, FRCS అప్పుడు లండన్ మిషన్ సొసైటీ కోసం పనిచేస్తున్న ఈ ఆసుపత్రి సందర్శన గురించి ఇలా చెప్పాడు "మేము సందర్శించే మొదటి ఆసుపత్రి నెడుంగోలం, ఇది పూర్తిగా రామరావు బ్రాహ్మణ కుటుంబంచే నిర్మించబడిన ఆసుపత్రి. ప్రస్తుత అధిపతి రావు సాహిబ్ పద్మనాభరావు. నేను ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు నాకు నెడుంగోలంలో ఒక చిన్న ఇంటిని కూడా ఇచ్చాడు. ఈయన కుటుంబం ఈ ఆసుపత్రిని నిర్మించి, దానిపై ఆసక్తి చూపిన విధానం చాలా అసాధారణము, అమూల్యమైన విషయం. ఇలాంటి దాతృత్వం మరింత సాధారణం కావాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నెడుంగోలంలో ఒక మంచి చిన్న ఆపరేటింగ్ రూమ్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ చాలా ప్రత్యేకమైన లేదా సుదీర్ఘ చికిత్స అవసరం లేని చికిత్సలను చేయగలము".[5] గత 123 సంవత్సరాలలో ఈ ఆసుపత్రి ఒక పెద్ద సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం దీనిని కేరళ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రికి "రామరావు స్మారక తాలూకా ఆసుపత్రి" గా పేరు మార్చారు.[6]

రామారావు కుమార్తె, సౌందర బాయి, 1909 నుండి 1912 వరకు మైసూరు రాజ్యానికి దివానుగా ఉన్న రాజా సర్ టి.మాధవరావు కుమారుడు, సర్ టి.ఆనందరావును వివాహం చేసుకున్నది.[7]

రామారావు, 8 జూన్ 1895న తిరువనంతపురంలో మరణించాడు. ఈయన పార్ధివదేహం తన సొంత నివాసమైన "హిల్-వ్యూ" యొక్క విశాలమైన మైదానంలో దహనం చేయబడింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "History of legislative bodies in Kerala".
  2. 2.0 2.1 from Rama Rao's recommendation to the Maharaja, as quoted by S. Ramanath Aiyar F.S.Sc (Lond.) in his book "Diwan T. Rama Row" (page 46), The Sree Moolam Ministers Series, printed at Anantha Rama Varma Press Trivandrum, 1926
  3. S. Ramanath Aiyar F.S.Sc (Lond.) in his book "Diwan T. Rama Row" (page 130), The Sree Moolam Ministers Series, printed at Anantha Rama Varma Press Trivandrum, 1926
  4. page 445 of The Golden Book of India; a genealogical and biographical dictionary of the ruling princes, chiefs, nobles, and other personages, titled or decorated, of the Indian Empire, by Sir Roper Lethbridge, K.C.I.E. published by Macmillan and Co, 1893
  5. Pages 182, 185 and 187 of Dr. Theodore Howard Somervell's book "After Everest" published by Alan Jones, 1936
  6. Govt of Kerala Health and Family Welfare Dept Notification No. 597/2012 of 24-02-2012
  7. S. Ramanath Aiyar F.S.Sc (Lond.) in his book Diwan T. Rama Row (page 148), The Sree Moolam Ministers Series, printed at Anantha Rama Varma Press Trivandrum, 1926