సువర్ణాంగి రాగం
Jump to navigation
Jump to search
సువర్ణాంగి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోణి 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 47వ మేళకర్త రాగము.[1][2] సంగీతకారుడు ముత్తుస్వామి దీక్షితుల సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "సౌవీరం' అని పిలుస్తారు.
రాగ లక్షణాలు
[మార్చు]ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G2 M2 P D2 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D2 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 11వ మేళకర్త రాగమైన కోకిలప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- ఇహపర సుఖ - కోటేశ్వర అయ్యరు
- శ్రీరఘుపతిం - బాలమురళికృష్ణ
- సరస సౌవీర - ముత్తుస్వామి దీక్షితులు
- జయ జగన్మైయి - తంపురట్టి రుక్ష్మిణీ బాయి