వాచస్పతి రాగము
స్వరూపం
(వాచస్పతి రాగం నుండి దారిమార్పు చెందింది)
వాచస్పతి రాగము కర్ణాటక సంగీతంలో 64వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు పద్ధతి ప్రకారం దీనిని భూషవతి అని పిలుస్తారు.[1][2][3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రిగా మ ప ధని స
S R2 G3 M2 P D2 N2 S
- అవరోహణ: సని ధ ప మగా రి స
S N2 D2 P M2 G3 R2 S
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్త్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి ధైవతం , కైశికి నిషాధం. ఇదొక సంపూర్ణ రాగం. ఇది 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
ఉదాహరణలు
[మార్చు]- కంటజూడుమీ - త్యాగరాజు కీర్తన
- పరాత్పర - పాపనాశనం శివన్
- సహస్రాకార మండితే - ముత్తుస్వామి దీక్షితులు
- ఎన్నడు నీ కృప - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
జన్య రాగాలు
[మార్చు]దీనికి చాలా జన్య రాగాలు ఉన్నాయి. వానిలో భూషావళి, సరస్వతి ముఖ్యమైనవి.
సరస్వతి రాగము
[మార్చు]- ఉదాహరణ
- అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు - త్యాగరాజు కీర్తన.
మూలాలు
[మార్చు]- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Carnatic music – a complete system Archived 2011-08-26 at the Wayback Machine from "The Hindu" newspaper.