నవనీతం రాగం
Jump to navigation
Jump to search
నవనీతం రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది కర్ణాటక సంగీతంలోణి 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 38వ మేళకర్త రాగము.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "నభోమణి" అని పిలుస్తారు.
రాగ లక్షణాలు
[మార్చు]ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G1 M2 P D2 N2 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N2 D2 P M2 G1 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 4వ మేళకర్త రాగమైన వనస్పతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- హేరంబ - త్రిపుట - వెంకటమఖి
- నభోమణిచంద్రాగ్ని నయనం - త్రిపుట - ముత్తుస్వామి దీక్షితులు
- సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
- ఉమాపతి పాహి - డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ (తెలుగు)
- లేమిదెల్ప పెద్దవారు - త్యాగరాజు (తెలుగు)
- సామి ఇదే నల్ల సమయం - కోటేశ్వర అయ్యర్
- హిమాత్మజే సంతతం పాహిమాం - డా. మంగళం పల్లి బాలమురళీకృష్ణ (సంస్కృతంలో)