కోకిలప్రియ రాగము
ఆరోహణ | S R₁ G₂ M₁ P D₂ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₂ P M₁ G₂ R₁ S |
కోకిలప్రియ రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 11వ మేళకర్త రాగము.[1] ఇది ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో 11వ రాగం. దీణిని "కోకిలరవం" అని పిలుస్తారు[2][3].
రాగ లక్షణాలు
[మార్చు]ఇది రెండవ చక్ర నేత్రలో ఐదవ రాగం. దీని ధారణానుకూలమైన పేరు "నేత్ర-మ". దీణి ధారణానుకూలమైన స్వర వాక్యం స రి గ మ ప ధ న. [4]
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G2 M1 P D2 N3 S)
అవరోహణ :స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M1 G2 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం,చతుశ్రుతి దైవతం,కాకలి నిషాదం . ఇది 47 మేళకర్త సువర్ణాంగి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
[మార్చు]చాలామంది వాగ్గేయకారులు కోకిలప్రియ రాగంలో కీర్తనల్ని రచించారు.
- దాశరధే దయాసారధే - త్యాగరాజ స్వామి
- వాదమేల రాధామనోహర - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- నీకే అభిమానము - మైసూరు వాసుదేవాచారి
- కోదండరామమం అనిషం - ముత్తుస్వామి దీక్షితులు.
ముత్తుస్వామి దీక్షితులు కోకిలరవం రాగంలో "కోదండరామ" అనే స్వరాన్ని కూర్చాడు.
జన్య రాగాలు
[మార్చు]కోకిలప్రియ రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
బాహ్య లంకెలు
[మార్చు]- "కోకిలప్రియ రాగము | PODAMALA RAJENDRA | - YouTube". www.youtube.com. Retrieved 2020-07-27.