వినోద్ కుమార్
వినోద్ కుమార్ | |
---|---|
జననం | వినోద్ ఆళ్వా ఏప్రిల్ 1, 1963 మంగుళూరు, కర్ణాటక |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1985-ప్రస్తుతం |
వినోద్ కుమార్ ఒక ప్రముఖ సినీ నటుడు. 110 తెలుగు సినిమాలలో నటించాడు. ఇంకా తమిళంలో రెండు, కన్నడంలో 30, ఒక మలయాళ సినిమాలో నటించాడు. అతని మొదటి చిత్రం 1985లో విడుదలైన కన్నడ చిత్రం తవరు మనే. తెలుగులో మొట్టమొదటి చిత్రం రామోజీ రావు నిర్మించగా 1989 లో విడుదలైన మౌన పోరాటం. మామగారు, కర్తవ్యం, భారత్ బంద్ లాంటి సినిమాలు అతనికి కథానాయకుడిగా మంచి పేరు తెచ్చిన చిత్రాలు. 1991 లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు వచ్చింది.
జీవిత విశేషాలు
[మార్చు]వినోద్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. మొదట్లో ఉద్యోగం కోసం ముంబై వెళ్ళాడు. కొద్ది రోజులు మెడికల్ రెప్రెజెంటేటివ్ గా పనిచేశాడు. తర్వాత ఓ హోటల్ లో పని చేశాడు. అక్కడికి వచ్చిన కన్నడ సినీ నిర్మాత అబ్బాయి నాయుడు ఇతనిని సినిమాల్లో నటించమని బెంగుళూరు రమ్మన్నాడు. వినోద్ కుమార్ అసలు పేరు వినోద్ కుమార్ ఆల్వా. కన్నడంలో ఈయనను వినోద్ ఆల్వా అని పిలిచేవారు. మౌనపోరాటం చిత్ర నిర్మాత అట్లూరి రామారావు ఆయన పేరులోని ఆల్వా తీసేసి వినోద్ కుమార్ గా మార్చారు.[1]
వినోద్ కుమార్ కు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కుమారుడు అనోజ్ అల్వా. సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండో కుమారుడు న్యాయశాస్త్రం చదువుతున్నాడు.
సినిమాలు
[మార్చు]వినోద్ కుమార్ మొదటి సినిమా తవురు మనే అనే కన్నడ సినిమా. తెలుగులో అతని మొదటి చిత్రం మౌన పోరాటం (1989). ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
- మౌన పోరాటం (1989)
- అడవిలో అభిమన్యుడు (1989) లో సురేష్ గా
- నవయుగం (1990) లో సూర్యం గా
- జడ్జిమెంట్ (1990)
- రక్తజ్వాల (1990)
- మామగారు (1991) లో విజయ్ కుమార్ గా
- కర్తవ్యం (1991) లో సూరిబాబు గా
- భారత్ బంద్ (1991)
- మంచి రోజు (1991)
- పీపుల్స్ ఎన్కౌంటర్ (1991)
- అత్త సొమ్ము అల్లుడు దానం (1992)
- సమర్పణ (1992)
- గ్యాంగ్ వార్ (1992)
- సీతారత్నం గారి అబ్బాయి (1992)
- చాంపియన్ (1992)
- అత్తకు కొడుకు మామకు అల్లుడు (1993)
- రాజధాని (1993)
- శభాష్ రాము (1993)
- రథ సారథి (1993)
- అందరూ అందరే (1994)
- ఖైదీ నం.1 (1994)
- శపథం (1994)
- శ్రీవారి ప్రియురాలు (1994)
- ఓ తండ్రి ఓ కొడుకు (1994)
- పోలీస్ బ్రదర్స్ (1994)
- పోలీస్ లాకప్ (1994)
- మాయదారి కుటుంబం (1995)
- లేడీ బాస్ (1995)
- అమ్మ నా కోడలా (1995)
- హలో మొగుడు భలే పెళ్ళాం (1996)
- తాత మనవడు (1996)
- బొబ్బిలి బుల్లోడు (1996)
- ప్రేమ ప్రయాణం (1996)
- అమ్మా అమ్మని చూడాలని ఉంది (1996)
- వీరుడు (1996)
- వామ్మో వాత్తో వో పెళ్ళామో (1997)
- సీతక్క (1997)
- పంజరం (1997)
- మా బాలాజీ (1999) లో సికిందర్ గా
- నీలాంబరి (2001)
- ప్రేమసందడి (2001)
- అన్న సైన్యం (2002)
- భారత్ రత్న (2002)
- ప్రేమ దొంగ (2002)
- శాంతి సందేశం (2003)
- అసాధ్యుడు (2006) *gopi goda meda pilli (2006)
- సామాన్యుడు (2006) లో లింగం గౌడ్ గా
- మహారాజశ్రీ (2007)
- టాస్ (2007)
- దొంగ సచ్చినోళ్ళు (2008)
- దీపావళీ (2008)
- కాళిదాసు (2008)
- ఆ ఇంట్లో (2009)
- పున్నమి నాగు (2009)
- సమర్ధుడు (2009)
- భగీరథుడు (2010) లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి గా
- శక్తి (2011) లో ప్రచండ గా
- బబ్లూ (2011)
- క్రికెట్ గర్ల్స్ & బీర్ (2011)
- తూనీగ తూనీగ (2012)
- శ్రీమన్నారాయణ (2012) లో జ్ఞానేశ్వర్ గా
- మహంకాళి (2013)
- పోటుగాడు (2013)
- చండీ (2013)
- అడవి కాచిన వెన్నెల (2014)
- రుద్రమదేవి (2015)
- రెడ్ అలర్ట్ (2015)
- సతి తిమ్మమాంబ (2016)
- పిడుగు (2016)
- అక్కడొకడుంటాడు (2019)
- పండుగాడి ఫొటో స్టూడియో (2019)
- ధర్మస్థలి (2021)
- కథ కంచికి మనం ఇంటికి (2021)
- స్ట్రీట్ లైట్
వెబ్ సిరీస్
[మార్చు]- 9 అవర్స్ (2022)
మూలాలు
[మార్చు]- ↑ "vinod kumar: నన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని వదిలేసి వెళ్లిపోయారు". EENADU. Retrieved 2022-03-02.