Jump to content

వస వేరు నూనె

వికీపీడియా నుండి

వస
Sweet flag
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
అ. కెలామస్
Binomial name
అకోరస్ కెలామస్

వస వేరు నూనె లేదావస కొమ్ము నూనెఒకఆవశ్యక నూనె., ఒక సుగంధ తైలం.అంతే కాదు ఔషధ గుణాలున్ననూనె.వస మొక్క ఒషషి మొక్క.వస వేరును, ఆకులను అనాదిగా భారత దేశంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.వస ఆరాసియా కుటుంబానికి చెందిన మొక్క వృక్షశాస్త్రపేరు ఆకోరస్ కాలమస్ వర్ అంగుస్టలస్.వసను ఆంగ్లంలో కలమస్ (Calamus), స్వీట్అం ఫ్లాగ్ అంటారు.[1]

వస మొక్క

[మార్చు]

వస మొక్క బహువార్షిక మొక్క.అర్థ్ర, చిత్తడి, నేలల్లో పెరుగును. జన్మస్థానం ఇత్తర ఐరోపా, ఆసియా.ఈ మొక్క వేరును ములికా వైద్యంలో నరాల వ్యాధులకు, తలనొప్పులకు, మూర్ఛ, అతి విరేచనాలకు ఆఘాతం వంటి వాటికి వేరు, ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. వస వేరులో పలు రసాయన పదార్థాలు ఉన్నాయి. అందులో అశోరోన్ ఒకటి. అశోరోన్ క్యాన్సరు నిరోధకంగా భావించి, దానిని నోటి ద్వారా తీసుకున్న కాన్సర్ను తగ్గించునని భావించారు.1922, 1922 రిపోర్టు ప్రకారం (luo, 1992 and Hasheminejad & Caldwell, 1999) అశోరోన్ అనుకున్నంత ప్రాభావవంతంగా పనిచెయ్యడాని తెలిసింది.[1]

నూనె సంగ్రహణ

[మార్చు]

వసవేరు, ఆకులనుండి ఆవశ్యక నూనెను ఉత్పత్తి చేస్తారు.నూనెను సాధారణంగా నీటిఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ద్వారా ఉత్పత్తి చేస్తారు.ప్రయోగాత్మకంగా వేరు, ఆకులలోని రసాయనాలను లెక్కించుటకు నూనెను స్లావెంట్ ఎక్సుట్రాక్షన్ పద్ధతిలో సంగ్రహిస్తారు.[1]

నూనె

[మార్చు]

వస వేరు నుండే కాకుండా ఆకుల నుండి కూడా నూనెను ఉత్పత్తి చేస్తారు.వేరు నుండి తీసిన నూనెలో β‐అసరోన్ 83.2% వరకు, ఆల్ఫా అసరోన్ 9.7% వరకు వుండగా, ఆకులనుండి తీసిన నూనెలో β‐అసరోన్ 85.6%,, లినలూల్ 4.75% ప్రధానంగా వున్నట్లు తెలిసింది.[2] వస కొమ్ము/వేరులో నూనె 1.3% వరకు వుండగా, ఆకుల్లో 0.5-1,0% వరకువుండును.దాదాపు 91 రకాల రసాయనాలను వసమొక్కలో గుర్తించారు.ఆకుల్లో 66 రసాయనాలను, వేరులో 55 రసాయాన్లు ఉన్నాయి.[3] వస నూనెలో దాదాపు 21 రకాల రసాయనాలు ఉన్నాయి. కొన్ని రకాల ఆకు, వేరు నుండి తోసిన నూనెలను విశ్లేషించగా అందులో దాదాపు 76%రసాయనాలను గుర్తించారు.అందులో β-గుర్జునేన్ 28% వరకు, (Z) -అసరోన్ 13.7% వరకు, అరిస్టోలెన్ 13.4% వరకు,, (E) -అసరోన్ 7.9% వరకు ఉన్నాయి.[4]

నూనెలోని ప్రధాన రసాయనాలు

[మార్చు]

నూనెలోని ప్రధాన రసాయన పదార్థాలు ఆకోరేనోన్, బీటా-గురుజునేన్, ఐసోసైయోబునైన్, బీటా-అసరోన్, కాలమెండియోల్, ఆల్ఫా-సెలీనేన్, ఆల్ఫా -కాలకోరేన్, కాలముసేనోన్, కాంఫోన్,, షైబునోన్ లు.[1]

నూనె భౌతిక గుణాలు

[మార్చు]

ఆకుల నుండి తీసిన నూనెయొక్క భౌతిక గుణాలపట్టిక[5]

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 విశిష్ట గురుత్వం 0.9924 @ 72 °F
2 వక్రీభవన సూచిక 1.549 @ 72 °F
3 ద్రావణీయత నీటిలో కరుగాడు.ఆల్కహాలు, నూనెల్లో కరుగును.
4 దృశ్య భ్రమణం 3

వైద్యపరమైన గుణాలు

[మార్చు]

వస నూనె యాంటి భయాటిక్, ముకుళన/దుస్సంకోచ నిరోధకగుణం, తలనొప్పి మందు, నాడీవర్ధకముగా, ప్రసరణీయ గుణాలు కల్గి ఉంది.

నూనె వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]

గర్భవతులు ఉపయోగించరాదు.నూనెలో వున్న అశోరోన్ వున్నందున, నూనెను నోటిద్వారా సేవించిన అపస్మారము/కొంకరలు పోవుట (convulsions), మానసికభ్రాంతి (hallucinations) కలగవచ్చును.[1]

బయటి లింకుల వీడియోలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Calamus essential oil information". essentialoils.co.za. Archived from the original on 2017-11-24. Retrieved 2018-09-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Essential oil composition of Acorus calamus L. from the lower region of the Himalayas". onlinelibrary.wiley.com. Retrieved 2018-09-30.
  3. "Composition of Essential Oil of Sweet Flag (Acorus calamus L.) Leaves at Different Growing Phases". tandfonline.com. Retrieved 2018-09-30.
  4. "Chemical Composition of Root Essential Oil of Acorus calamus L." Archived from the original on 2018-06-09. Retrieved 2018-09-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Calamus (Acorus Calamus)". indiamart.com. Archived from the original on 2018-09-30. Retrieved 2018-09-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)