Jump to content

లావెండరు నూనె

వికీపీడియా నుండి

లావెండరు పూలగుత్తులు
Lavender flowers with bracts
Scientific classification
Type species
Lavandula spica
Synonyms[1]
  • Stoechas Mill.
  • Fabricia Adans.
  • Styphonia Medik.
  • Chaetostachys Benth.
  • Sabaudia Buscal. & Muschl.
  • Isinia Rech.f.

లావెండర్ నూనె ఒక ఆవశ్యక నూనె.ఒక సుగంధ తైలం.లావెండరు తైలాన్ని ఆరబెట్టిన పూలనుండి, పూలకంకి (spike) నుండి ఉత్పత్తి చేస్తారు.లావెండరు నూనెనుఔషధంగా కూడా ఉపయోగిస్తారు.లావెండర్ నూనెను పూలనుండి స్టీము డిస్టిలేసను విధానంలో సంగ్రహిస్తారు.లావెండర్ మొక్క లామియేసియే/ లాబీయేటే కుటుంబానికి చెందిన మొక్క. లావెండర్ మొక్కలో పలు రకాలు ఉన్నాయి. లావెండర్ నూనె సుగంధ తైలం మాత్రమే కాదు ఓషద గుణాలు కల్గి వున్నందున వైద్యంలో కూడా ఉపయోగిస్తారు.

లావెండరు మొక్క

[మార్చు]

లావెండర్ మొక్క లామియేసియే/ లాబీయేటే కుటుంబానికి చెందిన మొక్క. లావెండర్ మొక్కలో 30 రకాల మొక్కలు ఉన్నాయి. లావనుడులా అంగుస్టిఫోలియా/ఇంగ్లిసు లావెండరు (Lavandula angustifolia), ఫ్రెంచి లావెండరు (L. stoechas), వుల్లిలావెండరు రకం మొక్కలను ఎక్కువగా సాగుచేస్తారు.[2] లావెండర్ మొక్క ఒక సతత హరిత గుల్మము (చిన్న పొదవలే పెరిగే మొక్క). మొక్క ఒక మీటరు ఎత్తువరకు పెరుగును. బూడిద ఆకుపచ్చని సన్నని పొడవైన ఆకులను కల్గి వుండును.అందమైన పర్పుల్ బ్లూ పూలను పుష్పించును. పూలు పొడవైన కాండం/కాడ మీద పుష్పించును. లావెండర్ మొక్కలను ఫ్రాన్స్లో ఎక్కువ సాగుచేస్తారు.లావెండర్అనే పేరు లాటిన్ పదమైన లావేర అనే పదం నుండి ఏర్పడినది.లావేర అనగా శుభ్రపరచు అని అర్థం.రోమనులు స్నానపు సమయంలో ఉపయోగించేవారు.వారే ఈ లావెండర్ ను ఇంగ్లాండుకు పరిచయంచేశారు.[3]

పోనేసియన్స్ అరేబియన్స్,, ఈజిప్టులు లావెండర్ ను సుగంధ ద్రవ్యంగా వాడేవారు.అలాగే శవం పాడవ్వకుండా వాడే ద్రవ్యాలలో లావెండర్ ను వాడేవారు. లావెండర్ నూనెలో ముంచిన వస్త్రాలను మమ్మీలను చుట్టుటకు వాడేవారు.గ్రీసు,, రోములో లావెండరును సర్వరోగ నివారణిగా వాడేవారు.17 వశతాబ్దిలో ఇగ్లాండులో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు, ప్రేగునుండి రక్షిస్తుందని, అక్కడి జనాలు లావెండర్ పూలను తమనడుం కట్టుకునేవారట.[4]

నూనె సంగ్రహణ

[మార్చు]

లావెండర్ నూనెను మొక్కయొక్క పుష్పించే భాగాలనుండి (అనగా పూలు, మొగ్గలు, పూల తొడిమలు, కాడల నుండి) ఆవిరి స్వేదన క్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.పూల నుండి తీసిన నూనె కన్న పూలగుచ్చంతో తీసిన నూనె యొక్క సాంద్రత ఎక్కువ ఉండును.పూలనుండి నూనె దిగుబడి సాతం 1.4-1.6% వరకు ఉండును.[3]

పూలు బాగా పూచిన తరువాత సేకరించి నూనెను తీస్తారు. 150 పౌండ్ల పూల నుండి ఒక పౌండు నూనె ఉత్పత్తి అగును. నూనెను స్టీము డిస్టిలేసను పద్ధతిలో సంగ్రహించడం సాధారణం అయ్యినప్పటికి, మరోనూనెలో లవెండరు పూలను వేసి కొన్ని రోజులు అలాగే వుంచి, పూలలోని నూనె మరో నూనెలో కరిగేలా చేసి సంగ్రహిస్తారు కూడా.

లావెండరు నూనె

[మార్చు]

లావెండర్ నూనె సువాసన కల్గిన సుగంధ తైలం.రంగు లేని నూనె.రంగులేని లేదా లేత పసుపురంగు నూనె.నూనెలో పలు రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. పూలనుండి తీసిన నూనె సాంద్రత 0.885 గ్రాములు/సెం.మీ3.వుండగా లావెండియా లాటిఫోలియా పూలకాడల/గుచ్చంనుండి తీసిన నూనె సాంద్రత 0.905 గ్రాములు/సెం.మీ3 వుండును.[4] లావెండరు నూనెలో దాదాపు 47 వరకు రసాయన సంయోగ పదార్థాలు ఉన్నాయి.నూనెలో వున్న పలురసాయన పదార్థాలలో ముఖ్యమైన కొన్ని రసాయన పదార్థాలశాతం: 1,5-డైమిథైల్-1-వినైల్-4-హెక్సెనైల్ బూటరేట్ 43-44% వరకు, ఉంది.1,3,7-ఆక్టాటైయేన్ 3,7 డై మిథైల్ 25-26% వరకు,, యూకలిప్టోల్ 7.32%, కాంపోర్ 3.79% వరకు ఉన్నాయి. మిగతా రసాయనాలు 1%కన్నా తక్కువ శాతంలో ఉన్నాయి.[5] మొక్క యొక్క రకాన్నిబట్తి, పెరిగిన నేల స్వాభావం, రుతువు, వాతావరణ పరిస్థితులను బట్టి నూనెలోని రసాయన పదార్థాల శాతం,, సంఖ్య మారును.

నూనె భౌతిక గుణాలు

[మార్చు]
  • నూనె యొక్క భౌతిక గుణాల పట్టిక[6]
వరుస సంఖ్య భౌతిక లక్షణం విలువల మితి
1 రంగు రంగులేదు లేదా లేత పసుపు రంగు
2 భౌతిక స్థితి ద్రవం.నీటి కన్న తక్కువ సాంద్రత
3 సాంద్రత 25o C 882 గ్రా/సెం.మీ3
4 వక్రీభవన సూచిక n20/D 1.461
5 బాష్పీభవన స్థానం 204 °C
6 ఫ్లాష్ పాయింట్ 180 °F

లావెండరు నూనెలోని రసాయన పదార్థాలు

[మార్చు]

లావెండర్ నూనెలో పలు రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆల్ఫా పైనేన్/పినేన్, లిమోనేన్, 1,8-సినేయోల్, సీస్-ఓసీమేన్, ట్రాన్స్-ఓసీమేన్, 3-ఆక్టానోన్, కాంపర్, లినలూల్, లినలైల్ అసిటేట్, కారియోపిల్లేన్, టెర్పినేన్-4-ఒల్,, లావెండులైల్ ఆసిటెట్.[3][7]

లావెండరు నూనెలోని కొన్ని ముఖ్య రసాయన పదార్థాల పట్టిక[8]

కుటుంబం రసాయన సమ్మేళనం లావండే ఆఫిసినల్
Lavandula angustifolia
లావండే ఆస్పిక్
Lavandula latifolia
టెర్పేనులు /
మోనోటెర్పేనొలు

లినలూల్
28.92 % 49.47 %
అల్ఫా- టెర్పినియోల్ 0.90% 1.08%
γ-టెర్పినియోల్ 0.09%
బోర్నియోల్ 1.43%
ఐసోబోర్నియోల్ 0.82%
టెర్పినేన్-4-ఓల్ 4.32%
నెరోల్ 0.20%
లావండులోల్ 0.78%
టెర్పేనులు /
టెర్పెన్ ఈస్టరులు
లినలైల్ అసిటేట్
32.98 %
జెరనైల్ అసిటేట్ 0.60%
నెరైల్ అసిటెట్ 0.32%
అక్టేన్-3-yl అసిటేట్ 0.65%
లావెండులైల్ అసిటేట్ 4.52%
టెర్పేనులు /
మోనోటెర్పేనులు
మైర్సెన్ 0.46% 0.41%
α-పైనెన్/పినేన్ 0.54%
β-పైనెన్/పినేన్ 0.33%
కాంపెన్ 0.30%
(E) -β- ఒసిమెన్ 3.09%
(Z) -β-ఒసిమెన్ 4.44%
β-పెలాండ్రేన్ 0.12%
టెర్పెనులు/
టెర్పేనాయిడ్ ఆక్సైడులు

యూకలిప్టోల్
(1,8-cineol)
25.91 %
టెర్పెనులు /
Sesquiterpenes సెసిక్వు టెర్పెనులు
β- కారియో పిల్లెన్ 4.62% 2.10%
β- ఫార్నేసేన్ 2.73%
జెర్మాక్రేన్ 0.27%
α-హుములేన్ 0.28%
కీటోనులు
కాంపర్కర్పూరం
0.85% 13.00 %
3- అక్టానోన్ 0.72%

క్రిప్టోన్
0.35%

నూనె ఔషధ గుణాలు

[మార్చు]

నూనె యాంటి సెప్టిక్ (కుళ్లిపోకుందా కాపాడు), బాధానాశక ఔషధము.మూర్చ నివారణ ఔషధము, మానసిక క్రుంగుబాటు తగ్గించే ఔషధం, కీళ్లవాత నివారక ఔషధం, శూలహర, శ్వాసహరము (anti-spasmodic), తాపనివారక మందు, వైరస్‌ నిరోధి, బాక్టిరియా నాశని, వాయుహరమైన ఔషధము, మృదువిరేచనకారి, ఉత్సాహమును పుట్టింౘు మందు, రక్తాధిక్యం తగ్గించు మందు, మూత్రవర్ధకము, రుతుస్రావం అవకతవకలను నియంత్రించును.నాడీవర్ధకములకావించు మందు.శమనకారి మందు.[3]

నూనె ఉపయోగాలు

[మార్చు]
  • సుగంధ ద్రవ్యంగా కాస్మోటిక్సులో ఉపయోగిస్తారు.[9]
  • పూలగుత్తి నుండి తీసిన నూనెను ఆయిల్ పెయింటింగు లో, టెర్పెన్టైన్ వాడటానికి ముందు, ద్రావణిగా వాడేవారు. లావెండర్ నూనెను సబ్బుల తయారీ, శాంపో,, చర్మానికి రాసే ఓషద మందుల్లో వాడుతారు.[4][10]

నూనె వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]
  • కొందరివ్యక్తుల్లో అలెర్జీ కల్గించవచ్చు.కొందరిలో తలనొప్పి, వాంతులు రావడం, చల్లిగా అవ్వడం వంటి దుష్ఫలితాలు లావెండరు నూనెను పీల్చడం వలన కానీ లేదా వొంటి మీద రాయడం వలన కల్గవచ్చును.[4]
  • గర్భవతులు, బాలింతలు ఈ నూనెను వాడకపోవడమ్మంచిది.[4]

బయటి వీడియోల లింకులు

[మార్చు]

ఇవికుడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "World Checklist of Selected Plant Families: Royal Botanic Gardens, Kew". kew.org.
  2. "lavender". britannica.com. Archived from the original on 2018-03-10. Retrieved 2018-08-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 3.2 3.3 "Lavender essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-03-07. Retrieved 2018-09-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "love lavender". articles.mercola.com. Archived from the original on 2018-08-25. Retrieved 2018-09-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Chemical composition of lavender essential oil" (PDF). academicjournals.org. Archived from the original on 2017-11-14. Retrieved 2018-09-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "LAVENDER OIL". chemicalbook.com. Archived from the original on 2017-08-03. Retrieved 2018-09-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Shellie, Robert; Mondello, Luigi; Marriott, Philip; Dugo, Giovanni (2002). "Characterisation of lavender essential oils by using gas chromatography–mass spectrometry with correlation of linear retention indices and comparison with comprehensive two-dimensional gas chromatography". Journal of Chromatography A. 970 (1–2): 225–234. doi:10.1016/S0021-9673(02)00653-2. ISSN 0021-9673.
  8. "Essential oil composition of Lavandula angustifolia Mill" (PDF). doiserbia.nb.rs. Archived from the original on 2017-08-08. Retrieved 2018-09-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. N. Groom. New Perfume Handbook. Springer Science & Business Media, 1997 ISBN 9780751404036
  10. "Solvent", pp 605-606 in The Grove Encyclopedia of Materials and Techniques in Art, edited by Gerald W. R. Ward. Oxford University Press, 2008 ISBN 9780195313918