పుదీనా నూనె
పుదీనా | |
---|---|
పుదీనా ఆకులు | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఎమ్. స్పైకాటా
|
Binomial name | |
మెంథా స్పైకాటా |
పుదీనా నూనె ఒక ఆవశ్యక నూనె.ఇది ఔషధతైలం.బ్రాండి పుదీనా ఆయిల్ , పుదీనా ఔషధతైలం 'అని కూడా పిలుస్తారు.ఆంగ్లంలో మింట్ ఆయిల్, పిప్పరుమింటు ఆయిల్ అని కూడా అంటారు. పుదీనా నూనె మనస్సును ఉత్తేజపరచుటకు, మానసిక ఉద్వేగాలను క్రమపరచుటకు, దృష్టిని పెంచడానికి, సువాసనను ఉపయోగిస్తారు. పుదీనా నూనె మానసిక చికాకు, దురదను తగ్గిస్తుంది.చర్మాన్ని చల్లబరచటానికి పుదీనా నూనె ఉపయోగపడును. పుదీనా ఆకులను వంటలలో కూరలలో ఉపయోగిస్తారు.పుదీనా ఆకులు కూరలకు మంచి ఘాటైన రూచి, సువాసన ఇస్తుంది.పుదీనా నూనె వలన పలు వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి.
పుదీనా మొక్క
[మార్చు]పుదీనా మొక్క లామియేసే కుటుంబానికి చెందిన మొక్క. వృక్షశాస్త్ర పేరు మెంథా పైపెరిటా.ఇది 1 మీటరు (3 అడుగుల) ఎత్తు వరకు పెరిగే శాశ్వత ఓషది మొక్క., దీర్ఘ పొడవైన శంఖు ఆకారంలో ఏర్పాటు చేయబడిన పింక్-మౌవ్ పువ్వులు కలిగివుండును. కొద్దిగా వెంట్రుకలవంటి నిర్మాణాలను ఆకుల ఉపరితలం వుండును.ఇది భూగర్భములో పాకే వేళ్ళనును కలిగి ఉన్నందున బాగా చుట్టుక్కలకు విస్తరిస్తుంది. సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఈ ఓషది మొక్క అనేక జాతులు కలిగి ఉంది, పెప్పర్ మెంటు పైపెరిటా అనేది వాటరుమింట్ (M. ఆక్వాటికా), స్పియరు మెంటు (ఎం. స్పికాటా) యొక్క హైబ్రీడ్/సంకర మొక్క.[1]
పుదీనా మూలం
[మార్చు]పుదీనా పుట్టు స్థానం మధ్యప్రాచ్య ప్రాంతం.ఇప్పుడు కూడా ఇటలీ, USA, జపాన్, గ్రేట్ బ్రిటన్లో సాగు చేయబడుతుంది.జపాన్, చైనాలలో పురాతన కాలం నుండి ఇది సాగు చేయబడింది. 1000 BC నాటి ఈజిప్టులోని సమాధిలో వున్న సాక్ష్యాలు కనుగొనబడ్డాయి.[2]
పురాణాల ప్రకారం
[మార్చు]పురాణాల ప్రకారం, మెంథా మోహిని (అధిక కామెచ్చ వున్నస్త్రీ) అనేఅందగత్తెను ప్లూటో మోహించాడు.అది చూసిన ప్లూటో భార్య పెర్సెఫోన్, అసూయతో మెంథాను భూ మైదానంలోకి కోపంగా త్రోసివేసింది.ప్లూటో మెంథాను ఒక మూలికగా/ఓషది మార్చి, రాబోయే సంవత్సరాలలో ప్రజలుఆమెను మొక్కగా అబిమానిస్తారని వరమిచ్చాడు.
నూనె సంగ్రహణ
[మార్చు]పుదీనానూనెను మొక్క పుష్పించే ముందు భూమి పైన ఉన్న మొత్తం మొక్క నుండి సేకరించబడుతుంది. నూనె. తాజా లేదా పాక్షికంగా ఎండబెట్టిన మొక్క నుండి ఆవిరి స్వేదన ద్వారా తీయబడుతుంది. మొక్క నుండి నూనె దిగుబడి 0.1 - 1.0% ఉంటుంది.నూనెను స్టీము డిస్టిలేసన్/ఆవిరి స్వేదన క్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు.[2]
నూనె లక్షణాలు
[మార్చు]పుదీనా నూనె తాజా, ఘాటైన, విలక్షణమైన మెంథాలు వాసన కలిగి ఉండి, లేత పసుపు రంగులో లేదా లేత గోధుమ రంగులో లేదా పాలిపోయిన పసుపు రంగులో ఉంటుంది.ఆల్కహాల్లో కరుగును.70% ఆల్కహాల్ లో,1:3 నిస్పత్తిలో కరుగును.అనగా మూడువంతుల ఆల్కహాల్ లో ఒకవంతు పుదీనా నూనె కరుగును.నీటిలో కరుగదు.పుదీనా నూనె అణు ఫార్ములా: C62H108O7 పుదీనా నూనె భౌతిక గుణాల పట్టిక[3]
వరుస సంఖ్య | గుణం | మితి |
1 | అణుభారం | 965.539 |
2 | సాంద్రత | 0.89600 to 0.90800 (25.00 °C.వద్ద) |
3 | వక్రీభవన సూచిక | 1.45900 - 1.46500 ( 20.00 °Cవద్ద) |
4 | దృశ్య భ్రమణం | -18.00 నుండి -32.00వరకు |
5 | బాష్పీభవన ఉష్ణోగ్రత | 209.00 °C ( సాధారణవాతావరణ పీడనంవద్ద) |
6 | ఫ్లాష్ పాయింట్ | 71.11 °C. |
నూనెలోని రసాయన సమ్మేళనాలు
[మార్చు]పుదినా నూనెలో మెంథాల్, మెంథోన్, 1,8-సినాల్, మిథైల్ అసిటేట్, మెథోఫురాన్, ఐసోమెంథోన్, లిమోనెన్, బి-పిన్నెనే, ఎ-పిన్నెనే, జెర్మాక్రీన్-డి, ట్రాన్స్-సాబినిన్ హైడ్రేట్, పులెగోన్ రసాయన సమ్మేళనాలు వున్నవి
నూనె వైద్యపరమైన గుణాలు
[మార్చు]పుదీనా నూనె చికిత్సా పరంగా అనాల్జేసిక్, అనస్థీటిక్, యాంటిసెప్టిక్, యాంటీగాలాక్టాగోగ్, యాంటిప్లాగ్స్టిక్, యాంటిస్ప్మోడోజిక్, క్యాంబినేటివ్, సెఫాలిక్, గుణాలను కల్గివున్నది.[4]
ఉపయోగాలు
[మార్చు]పుదీనా నూనె నాడీ సంబంధిత రుగ్మతలలో సహాయపడుతుంది, శ్వాసకోశ చికిత్స, కండరాల నొప్పులు, నొప్పులు, కొన్ని చర్మ సమస్యలకు చికిత్స కోసం, మనస్సుని ఉత్తేజపరిచే, ఏకాగ్రత మెరుగుపరుస్తుంది.ఆవిరి చికిత్సలో, పిప్పరమింట్ నూనె ఏకాగ్రత పెంచడానికి, మనస్సును ప్రేరేపించడానికి పనిచేస్తుంది., అలాగే దగ్గులను, తలనొప్పి, వికారం, తగ్గిస్తుంది, పురుగుల వికర్షక గుణాలను కలిగి ఉంది.క్రీమ్ లేదా ఔషదంలో చేర్చినప్పుడు, అది ఎండకు కమిలిన చర్మం యొక్క యొక్క మచ్చలను తగ్గిస్తుంది.తగ్గించడానికి సహాయం చేస్తుంది, ఎర్రబడిన చర్మం యొక్క ఎరుపును తగ్గిస్తుంది, దురదను తగ్గిస్తుంది, దాని వాసోకోన్టిక్టర్ లక్షణాలతో చర్మం చల్లబడుతుంది.[2]
- ఇది స్పాటికల్ కోలన్, పార్శ్వపు నొప్పి, తలనొప్పి, సైనస్, ఛాతీ రద్దీని తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచుతుంది.
- పుదీనా చమురు మానసిక ఫెటీగ్ తగ్గించుటకు, నిరాశనియంత్రణకు మంచిది, రిఫ్రెష్ చేస్తుంది, మానసిక చురుకుదనాన్ని ప్రేరేపిస్తుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
- ఇది ఉదాసీనత, షాక్, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, నాడీ ఒత్తిడి, వెర్టిగో, మూర్ఛ, సాధారణ శ్వాసకోశ లోపాలు, అలాగే పొడి దగ్గుల, సైనస్ రద్దీ, ఉబ్బసం, బ్రోన్కైటిస్, న్యుమోనియా, క్షయ, కలరా వంటీ వాటి నియంత్రణకు సహాయపడుతుంది.
- పిప్పరమింట్/పుదీనా నూనె పిత్తాశయ వ్యవస్థ నియంత్రణ, వంటి అనేక రకాల రుగ్మతల నివారణకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
- ఇది పిత్తాశయం, పిత్తాశయ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది నొప్పి, తిమ్మిరి, డీప్పీప్సియస్, స్పస్టిస్ కోలన్, అపానవాయువు, వికారం వంటి వాటి చికిత్సకు ఉపయోగపడుతుంది, నొప్పి, కీళ్ళవాతం, నరాల, కండర నొప్పులు, బాధాకరమైన కాలాల్లో నొప్పిని ఉపశమనం కల్గిస్తుంది
- పుదీనా నూనె చర్మం చికాకు/స్కిన్ ఇరిటేసనును, దురదనుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు, చర్మపు కమిలిన ఎరుపును తగ్గించడానికి సహాయ పడుతుంది,
- ఇది చర్మశోభి, మోటిమలు, రింగ్వార్మ్, గజ్జల్లో దురద వంటి వాటి నివారణకు ఉపయోగించబడుతుంది, సన్ బర్న్/ఎండ వలన కమిలిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది,, వాపును తగ్గిస్తుంది, చర్మానికి పూసినపుడు శీతలీకరణ చర్యవలన చల్లగావుంచును.
- మౌత్ వాష్ తో చేర్చబడిన పిప్పరమింట్ నూనె చెడ్డ శ్వాసను నియంత్రించును.
- సిగరెట్ల తయారిలో ఉపయోగిస్తారు.
జాగ్రత్తలు
[మార్చు]పుదీనా నూనె వాడకం వలన అలెర్జీతో కూడీన గుండెమంట రావొచ్చును.[1]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Peppermint Oil". nccih.nih.gov. Archived from the original on 2018-07-28. Retrieved 2018-08-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 2.2 "Peppermint essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-01-26. Retrieved 2018-08-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "peppermint oil". thegoodscentscompany.com. Archived from the original on 2018-01-14. Retrieved 2018-08-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Peppermint & Peppermint Oil Profile" (PDF). ecommons.cornell.edu. Archived from the original on 2018-08-12. Retrieved 2018-08-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)