పుచ్చగింజల నూనె
పుచ్చ మొక్క కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈమొక్క వృక్షశాస్త్రనామం:సిట్రుల్లస్ వల్గారిస్ (citrullus vulgaris). పుచ్చగింజలలో పోషక విలువలున్న పదార్ధాలున్నాయి. పుచ్చ గింజలో 27% వరకు నూనె ఉంది.దోస, గుమ్మడి కాయ మొక్కలు కూడా ఈ వృక్ష కుటుంబానికి చెందిన మొక్కలే [1].ఈ మొక్క బలహీనమైన ప్రధానకాండం కల్గి వుండటంవలన మొక్క నిటారుగా పెరగ లేదు.ఇది ఒకరకమైన నేలమీద ప్రాకెడు మొక్క. నేలమీద 5-6 అడుగుల వ్యాసంలో విస్తరిస్తుంది.ఈ మొక్కయొక్క ఆది జన్మస్థానంఆఫ్రిక అని ఆధారాలు కన్పిస్తున్నాయి.ఇజిప్టు, భారతదేశాలలో క్రీ.పూ.2500 సంవత్సరాల క్రితమే ఈ పంటను సాగుచేసే వారని తెలుస్తున్నది.[2]
- అస్సామి, బెంగాలి:తర్ముజ్ (Tarmuj)
- ఒరియా:తర్భుజా (Tarbhuja)
- తమిళం:థర్భుజ (Tharbhuja, ఫాలం పన్న (phalam panna, కిజంగ్ (kizhangu)
- మలయాళం:తన్నీరు మథన్ (Tannir mathan)
- కన్నడ:కల్లగడి (kallagadi)
- మరాఠి:కలింగడ్ (kalingad)
- గుజరాతి:తర్బుజ్ (Tarbuz)
- హిందీ:తర్బోజ్ (Tarbooj)
- పంజాబి:తర్బుజ్ (Tarbuz)
- ఆంగ్లం:వాటరుమెలోన్ (watermelon)
నూనె లక్షణాలు
[మార్చు]నూనె తెలికపాటి రంగును కల్గివుండును .రెండు ద్విబంధాలున్న లినోలిక్ ఆమ్లం ఈనూనెలో 60% మించివున్నది.ఈనూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలశాతం 80% వరకున్నది.అందులో ఏకద్విబంధమున్న ఒలిక్ ఆమ్లం 12-15% వరకు, రెండు ద్విబంధాలున్న లినొలిక్ ఆమ్లం/ఒమేగా-6 కొవ్వు ఆమ్లం 60-65% వరకుండును. పామిటిక్, స్టియరిక్ సంతృప్త కొవ్వు ఆమ్లాలు 20% వరకున్నవి.నూనెలో 1.5% వరకు సపోనికేసను చెందనటువంటి పదార్థాలుండి, రంగు 20-25 యూనిట్ల వరకుండును. సపోనిఫికెసను సంఖ్య 190 నుండి198 మధ్య, అయాడిన్ విలువ 115-120వరకుండును.[4]
పుచ్చగింజల నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం
కొవ్వు ఆమ్లాలు | శాతం |
పామిటిక్ ఆమ్లం (C16:0) | 11 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 10 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 15 |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 63.0 |
పుచ్చగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక[5]
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 400Cవద్ద | 1.4630-1.4670 |
అయోడిన్ విలువ | 115-125 |
సపనిఫికెసను విలువ | 190-198 |
అన్‌సఫొనిపియబుల్ పదార్థం | 1.5% గరిష్ఠం |
తేమశాతం | 0.5% గరిష్ఠం |
రంగు 1/2"సెల్, (y+5R) | 20 |
నూనెయొక్క ఉపయోగాలు
[మార్చు]- రిపైండ్ చేసిన పుచ్చగింజల నూనెను వనస్పతి తయారిలో ఇతరనూనెలతో కలిపి వాడెదరు.
- చర్మం పైపూత లేపనాలు (skin ointments) తయారు చేయుదురు. ముఖ్యంగా శిశువుల దేహమర్దననూనెలు, పిల్లలసబ్బులు (baby soaps), లేపనాలు, సౌందర్యక్రీములు, వంటివి తయారుచెయ్యడంలో ఉపయోగిస్తున్నారు.[6]
- కేశ సంవర్ధన నూనె (Hair oil) గా కూడా ఉపయోగిసారు.[7]
- పుచ్చకాయ గింజల్లో విటమిన్-బి అధికంగా ఉంటుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చని, ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Watermelons". botanical-online.com. Retrieved 2015-03-09.
- ↑ "Watermelon History". homecooking.about.com. Archived from the original on 2013-05-12. Retrieved 2015-03-09.
- ↑ SEA Hand Book.2009by Solvent Extractors' Association Of India
- ↑ "Fatty acid Profile, Ash Composition and Oil Characteristics of Seeds of Watermelon Grown in Sudan" (PDF). ajournal.co.uk. Retrieved 2015-03-09.
- ↑ SEA HandBook.2009
- ↑ "The Benefits of Watermelon Seed Oil". massagemag.com. Retrieved 2015-03-09.
- ↑ "FEED YOUR HAIR: WATERMELON SEED OIL". rockitnapptural.com. Retrieved 2015-03-09.