కుసుమ నూనె
కుసుమ నూనె (safflower oil)
కుసుమ మొక్క కంపొసిటే కుటుంబానికి చెందిన, నూనెగింజల మొక్క, గుల్మం. హిందిలో కుసుంబ లేదా కుసుమ ఆంటారు. మరాటిలో కర్డీ (kardi) ఆంటారు. కంపొసిటే కుటుంబాన్నీ ఆస్టరేసి అని కూడా అంటారు. మొక్కయొక్క వృక్షశాస్త్ర పేరు కార్థమసస్ ట్రీం కోరియస్ (Carthamus tinctorius).[1]
చరిత్ర
[మార్చు]దక్షిణ ఆసియా కుసుమ మూల జన్మస్ధానం. చరిత్రముందు కాలం (pre historic) లోనే చీనా, ఇండియా, పెర్షియా, ఇజిప్టులలో కుసుమ పంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి, ఆతరువాత మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది. 4 వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వ శాస్తవేత్తలు గుర్తించారు. కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ 18వ రాజ వంశస్తుని సమాధిలో, మమ్మితోపాటు, విల్లిఆకులతో (willow leaves) వున్న కుసుమపూలు ఉన్నాయి. 12వ రాజవంసస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరాన్ని కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గురించారు. ఇజిప్తియన్ చక్రవర్తి (pharaoh) తుతన్‌ఖామున్ (Tutankhamun) సమాధులో కుసుమపూల హారాలున్నాయి.[2][3]
కుసుమ మొక్క
[మార్చు]మెత్తటి కాండంతో, ఎక్కువ కొమ్మలు కలిగి గుబురువుండి, కాండం, పత్రాలమీద ముళ్లవంటివి వున్న ఏకవార్షికం. ఎత్తు35-150 సెంటి.మీ. గోళాకారపు పుష్పగుచ్చం కలిగివుండును. ఒకగుచ్చంలో 2-5 పూలు వుండి, 15-20 విత్తనాలు (గింజలు) వుండును. పూలు ఆరెంజి-అరుణవర్ణంలో వుండును.కుసుమ పువ్వులను, కుంకుమ పువ్వుకు (saffron) చౌకరకం ప్రత్యామ్నయంగా వాడెదరు. పూలను ఆహారపదార్థంలో రంగునిచ్చుటకై వాడెదరు,, వస్త్రాలకు అద్దకం చెయ్యురంగులను తయారు చెయ్యుదురు.[4] కుసుమమొక్క లేతఆకులు, కొమ్మల లేతచివరలలో విటమిన్ A, ఇరన్, ఫాస్పరన్,, కాల్సియాలు అధిశాతంలో ఉన్నాయి. ఆందుచే వీటిని ఓషదులు సాలిడ్ డ్రస్సింగ్స్్ తయారిలో వుపయోగిస్తారు<.గింజలలో 30% వరకు నూనె వుండును. మిగతా నూనెగింజలలోవున్న నూనెశాతంతో పొల్చిన యిదిబాగా తక్కువ. నూనెగింజలలో నూనె 40-60% వుండును.నూనెగింజల దిగుబడి 600-700 కే.జిలు/హెక్టారుకు/భారతదేశంలో.పూలు అయ్యినచో 100 కే.జీ.లు/హెక్టరుకు.[5]
కుసుమనూనె
[మార్చు]కుసుమనూనె రంగు, వాసన లేని పారదర్శకంగా వుండునూనె (కొన్ని సందర్భాలలోపాలిపోయిన పసుపు రంగులో వుండును) . కుసుమ నూనెలో ఎకబంధ, ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (poly unsaturated fatty acids OR PUFA) అధికమొత్తంలో ఉన్నాయి.కుసుమలో రెండురకాకున్నాయి. ఒకరకం కుసుమనూనెలో లినొలిక్‌ఆసిడ్ (ఒమేగా-6 ఫ్యాటిఆసిడు) 75-78%వరకు వుండును.మరోరకంలో ఒలిక్ ఆమ్లం (ఒమేగా-9 ఫ్యాటి ఆసిడ్) 40-50% వుండును.లినొలిక్ ఆమ్లం అధికశాతంలోవున్న కుసుమనూనె ప్రస్తుతం ఉత్పత్తిలో ఉంది.పంటను సాగుచేసిన కాలాన్ని (చలికాలం, చలికాలం) బట్టి నూనెలోని కొవ్వుఆమ్లాల శాతంలో 2-3% వరకు భిన్నత్వం కన్పిస్తుంది. అలాగే మొక్కవేరైటిని బట్టి కూడా తేడా వస్తుంది.[6]
ఒలిక్ ఆమ్లం అధికంగా ఉన్న కుసుమ నూనెలో వున్న ఇతర కొవ్వు ఆమ్లాలు, వాటిశాతం[7]
సంతృప్త కొవ్వు ఆమ్లాలు | మితి |
మిరిస్టిక్ ఆమ్లం | 1.0% |
పామిటిక్ ఆమ్లం | 4-9% |
స్టియరిక్ ఆమ్లం | 0--2.5% |
అసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు | |
---|---|
పామిటొలిక్ ఆసిడ్ | ఆనవాల్లు% |
ఒలిక్ ఆమ్లం | 72-80% |
లినొలిక్ ఆమ్లం | 12-16% |
లినొలెనిక్ ఆమ్లం | ఆనవాలు-0.5% |
అయితే మరికొన్ని రకాల మొక్కల విత్తనాలలోని ఒలిక్, లినోలిక్ కొవ్వు ఆమ్లాల శాతం పైన ఇచ్చిన పట్టికకు భిన్నంగా ఉండును. ఒలిక్ ఆమ్లం:13-21%, లినోలిక్ ఆమ్లం: 73-79% వరకు గుర్తించడం జరిగింది.[8] లినోలిక్ ఆమ్లాన్ని 60-70% వరకు కలిగిన కుసుమ రకాన్ని ఇండియాలో ఎక్కువ సాగుచేయుదురు.
నూనెయొక్క భౌతిక గుణాలు
[మార్చు]కుసుమనూనె భౌతిక ధర్మాల పట్టిక[9]
సాంద్రత | 0.915.0920 కే.జి/లీటరు |
సపొనిఫికెసను విలువ | 186-196 |
అయోడిన్ విలువ | 135-148 |
అన్‌సపొనిఫియబుల్‌పదార్థం | 1.0% |
వక్రీభవన సూచికn20/D | 1.476 |
సాంద్రత 250Cవద్ద | 0.921 |
ఉపయోగాలు
[మార్చు]కుసుమ నూనెను వంట నూనెగా ఎక్కువగా వినియోగిస్తారు. ఆ తరువాత సాలడులు, మార్గరినుల తయారిలో వాడెదరు. ఆలాగే సౌందర్య కారకాలలో వినియోగిస్తారు. కుసుమ పూలను చైనాలో వనమూలిక ఒషదుల తయారిలో వాడుచున్నారు. కుసుమ పూలను హెర్బల్ టీ పౌడరులో వాడెదరు. హెర్బల్ టీ పేరుతో ఎండబెట్ట్టిన కుసుమపూల పొడిని, NARI (Nimbkar Agricultural Research institute, phalton, Maharastra) కొన్ని సంవత్సరాలుగా ట్రైల్-మార్కెటింగా విడుదల చేస్తున్నారు.
మార్గరిన్ (margarine) : మార్గరిను అనేది వెన్న (Butter) కు ప్రత్యామ్నాయంగా తయారుచేసింది. దీనినే టేబుల్ బట్టరు అని కూడా అంటారు. మార్గరినులో 80% వరకు వనస్పతి (hydrogenated fat), 12-15% నీరు (తేమగా), మిగిలినది రిపైండ్‌నూనె. రిపైండ్‌నూనె ఒకటి, లేదా అంతకు ఎక్కువగాని వుండును. మార్గరిన్‌ను బేకరి ఉత్పత్తులలో, కేకులో తయారిలో వుపయోగిస్తారు.ఇందులో సింథటికి విటమినులు A, D లను కలుపుతారు.[10]
మార్గరినుకుండవలసిన భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక
లక్షణం | మితి |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 37-410C |
వక్రిభవన విలువ (బుట్రొమీటరురిడింగ్) | 40.0కు తగ్గకుండ |
అన్‌సపొనిఫియబుల్‌పదార్థం | 1.5%మించకుండ |
ఫ్రీఫ్యాటీఆమ్లం% (ఒలిక్‌అసిడ్‌గా) | 1.5% మించరాదు |
బౌడిన్‌టెస్ట్ | 2.5 రెడ్‌యూనిట్లకు తగ్గరాదు |
సింథటిక్‌విటమిన్'A' | 30.0 I.U.తగ్గరాదు |
- కుసుమ నూనెలో ఉంటే లినోలిక్ ఆమ్లలకు జుట్టుకు చాలా మంచిది. ఇది తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.
మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ "Health Cooking: Safflower Oil". healthline.com. Archived from the original on 2014-11-05. Retrieved 2015-03-15.
- ↑ Sun Flower By Joseph.R.smith,page no.2
- ↑ "Safflower". books.google.co.in. Retrieved 2015-03-15.
- ↑ "Safflower". britannica.com. Retrieved 2015-03-15.
- ↑ SEAHandBook-2009BySolvenyExtractorsAssociation ofIndia
- ↑ "Oil Content and Fatty Acid Composition of Some Safflower (Carthamus tinctorius L.) Varieties Sown in Spring and Winter" (PDF). nobel.gen.tr. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-03-15.
- ↑ "Fatty acids found in safflower oil". essentialoils.co.za. Archived from the original on 2015-03-26. Retrieved 2015-03-15.
- ↑ "FATTY ACID COMPOSITION (PERCENTAGE)". chempro.in. Retrieved 2015-03-15.
- ↑ "Safflower oil". chemicalbook.com. Retrieved 2015-03-15.
- ↑ "margarine". yourdictionary.com. Retrieved 2015-03-15.