Jump to content

గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°00′17″N 81°08′20″E / 17.004611°N 81.138958°E / 17.004611; 81.138958
వికీపీడియా నుండి
గుంటుపల్లి
—  జనగణన పట్టణం  —
గుంటుపల్లి is located in Andhra Pradesh
గుంటుపల్లి
గుంటుపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°00′17″N 81°08′20″E / 17.004611°N 81.138958°E / 17.004611; 81.138958
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,187
 - పురుషుల సంఖ్య 5,573
 - స్త్రీల సంఖ్య 5,614
 - గృహాల సంఖ్య 3,121
పిన్ కోడ్ 521241
ఎస్.టి.డి కోడ్ 0866

గుంటుపల్లి, ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన, జనగణన పట్టణం. ఇది మండల కేంద్రం.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12011. ఇందులో పురుషుల సంఖ్య 6088, స్త్రీల సంఖ్య 5923, గ్రామంలో నివాసగృహాలు 2783 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1026 హెక్టారులు.

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ఎలప్రోలు, బత్తినపాడు, చిలుకూరు, ఇబ్రహింపట్నం, పైదురుపాడు గ్రామాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

గొల్లపూడి, ఇబ్రహీంపట్నం నుండి రోడ్దురవాఃణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 9 కి.మీ

విద్యాసౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:-ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చి-2వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)

[మార్చు]

విద్యుత్తు

[మార్చు]

ఈ గ్రామంలోని ఖాజీపేటలోని సామాజిక స్థలంలో, 1.25 కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం పూర్తి అయింది.

రాష్ట్ర ప్రభుత్వ కాల్ సెంటర్

[మార్చు]

గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన ఈ కాల్‌సెంటర్‌ను, 2017 ఏప్రిల్ 21న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించాడు. 46 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన ఈ కాల్‌సెంటర్‌లో, 500 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఇది ఒక మేజరు పంచాయతీ. ఖాజీపేట, సత్యనారాయణపురం, రామకృష్ణాపురం, తిరుమలశెట్టినగర్, జయప్రద నగర్ ఈ గ్రామ శివారులు.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, దొప్పల రమణ సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా చెరుకూరి చిన్నవెంకయ్య ఎన్నికైనాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం.వేణు గోపాల స్వామి టెంపుల్, రామాలయం, చర్చి, మసీద్.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]