Jump to content

వడ్డేశ్వరం

అక్షాంశ రేఖాంశాలు: 16°26′42.000″N 80°36′28.800″E / 16.44500000°N 80.60800000°E / 16.44500000; 80.60800000
వికీపీడియా నుండి
వడ్డేశ్వరం
పటం
వడ్డేశ్వరం is located in ఆంధ్రప్రదేశ్
వడ్డేశ్వరం
వడ్డేశ్వరం
అక్షాంశ రేఖాంశాలు: 16°26′42.000″N 80°36′28.800″E / 16.44500000°N 80.60800000°E / 16.44500000; 80.60800000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంతాడేపల్లి
విస్తీర్ణం3.3 కి.మీ2 (1.3 చ. మై)
జనాభా
 (2011)[1]
6,275
 • జనసాంద్రత1,900/కి.మీ2 (4,900/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,087
 • స్త్రీలు3,188
 • లింగ నిష్పత్తి1,033
 • నివాసాలు1,534
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522502
2011 జనగణన కోడ్589981

వడ్డేశ్వరం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన జనగణన పట్టణం.[2]

గణాంకాలు

[మార్చు]
  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం వడ్డేశ్వరం సెన్సస్ పట్టణంలో 6,275 మంది జనాభా ఉన్నారు, అందులో 3,087 మంది పురుషులు కాగా, 3,188 మంది మహిళలు ఉన్నారు. [3]వడ్డేశ్వరం సెన్సస్ టౌన్ పరిధిలో 1,534 గృహాలకు మొత్తం పరిపాలనను కలిగి ఉంది, 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 598, ఇది వడ్డేశ్వరం (CT) మొత్తం జనాభాలో 9.53%. వడ్డేశ్వరం సెన్సస్ టౌన్‌లో, స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1033గా ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే వడ్డేశ్వరంలో బాలల లింగ నిష్పత్తి 1084గా ఉంది. పట్టణ అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 670 కంటే 70.32% ఎక్కువ. వడ్డేశ్వరంలో పురుషుల అక్షరాస్యత దాదాపు 73.46% కాగా స్త్రీల అక్షరాస్యత 67.26%.[3]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,668. ఇందులో పురుషుల సంఖ్య 2,487, స్త్రీల సంఖ్య 2,181, గ్రామంలో నివాస గృహాలు 1,162 ఉన్నాయి.

సమీప గ్రామాలు

[మార్చు]

కుంచనపల్లి 2 కి.మీ, ఇప్పటం 1 కి.మీ, గుండిమెడ 3 కి.మీ, పెదవడ్లపూడి 4 కి.మీ, చినవడ్లపూడి 4 కి.మీ.

విద్యాసౌకర్యాలు

[మార్చు]

కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్

[మార్చు]

ఇది వడ్డేశ్వరంలో ఉన్న ఒక విద్యా సంస్థ. ఇది విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది.ఇందులో 11 విద్యా విభాగాలు, ఆరు పాఠశాలలు ఉన్నాయి. 1985 లో స్థాపించబడిన ఈ కళాశాల 100 ఎకరాల విస్థీర్ణంలో (40 హెక్టార్లు) బకింగ్‌హామ్ కాలువకు ఆనుకొని ఉన్న స్తలంలో నిర్మించబడింది.ఇది కృష్ణ జిల్లాలోని విజయవాడ నగరం నుండి నుండి 8 కి.మీ. దూరంలో, గుంటూరు నగరం నుండి 20 కి.మీ. దూరంలో ఉంది.

ఈ కళాశాల 1980 లో వడ్డేశ్వరంలో దివంగత కోనేరు లక్ష్మయ్య, కె. సత్యనారాయణల చేత స్థాపించబడింది. బెంగళూరులోని బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి పట్టభద్రుడైన కె.లక్ష్మయ్య, ఇంజనీర్ల స్థానిక కొరతను తీర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించాలనే ఆలోచనతో స్థాపించారు.

ఇతర విద్యాసంస్థలు

[మార్చు]
  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల - బచ్చు లక్ష్మీనారాయణ అనే దాత 28 సెంట్ల స్థలాన్ని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఆటస్థలానికి 3.3 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించి ఇచ్చారు. ఇంకా కొందరు దాతలు, ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, క్రీడాభివృద్ధికీ విరాళాలు అందజేశారు.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
  • ఉర్దూ ప్రాథమిక పాఠశాల

ఇతర మౌలిక సదుపాయాలు

[మార్చు]
  • అంగన్ వాడి కేంద్రం.
  • ఈ గ్రామంలో, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమిలేకపోవడం ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తుంది.
  • కొందరు దాతల సహకారంతో, గ్రామంలో త్రాగునీరు, విద్యావసతులు బాగుపడినవి. మల్లిఖార్జునరావు అనే దాత, శుధ్దజల కేంద్రాన్నీ, నీటిపథకాలకు అవసరమైన జనరేటర్లనూ ఇచ్చారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కత్తిక మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైంది

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ రుద్రేశ్వరస్వామివారి ఆలయం - కత్తిక పూర్ణచంద్రరావు, పార్వతి దంపతులతోపాటు కత్తిక రాఘవరావు, రాజ్యలక్ష్మి దంపతులు, 2017, ఫిబ్రవరి-22న, ఈ ఆలయానికి రథం, రెండు గొడుగులను అందించారు. వడ్లమూడి వెంకయ్య, శివనాగేంద్రమ్మ దంపతులు ఒక ఇత్తడి నందివాహనాన్ని స్వామివారికి సమర్పించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం, 2017, మార్చి-23 న గురువారంనాడు వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం కూలి పనులు, వ్యవసాయం పనులు. యూనివర్సిటీ విద్యార్థులు ఈ గ్రామంలో అద్దెకి ఉంటారు.

ఇతర విశేషాలు

[మార్చు]
  • ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) పథకం క్రింద, వడ్డేశ్వరం గ్రామాన్ని అభివృద్ధి చేయటానికై, ఆ గ్రామాన్ని దత్తత తీసికొనడానికి, ఆ గ్రామ సర్పంచి భర్త కత్తిక మల్లేశ్వరరావు, కొలనుకొండకు చెందిన గొట్టిపాటి వెంకటేశ్వరరావు, ముందుకు వచ్చారు.
  • ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వారి సుందరయ్య స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Villages and Towns in Tadepalle Mandal of Guntur, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  3. 3.0 3.1 "Vaddeswaram Population, Caste Data Guntur Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.

వెలుపలి లంకెలు

[మార్చు]