ఈశాన్య భారత రాష్ట్రాల సరిహద్దు వివాదాలు
ఈశాన్య భారతదేశంలోని సరిహద్దు వివాదాలలో ప్రధానంగా అస్సాం - మిజోరాం, అస్సాం- అరుణాచల్ ప్రదేశ్, అస్సాం- నాగాలాండ్, అస్సాం- మేఘాలయల మధ్య అంతర్- రాష్ట్ర వివాదాలు ఉన్నాయి. [1] [2] ఆయా రాష్ట్ర పోలీసు బలగాల మధ్య ఘర్షణలతో సహా వివాదాలు, ప్రాణ నష్టానికి, జీవనోపాధి, ఆస్తి నష్టాలకూ దారితీశాయి.[3] కొన్ని సందర్భాల్లో సరిహద్దు వివాదాలు పెద్ద జాతీయ (వేర్పాటువాద), ఉప-ప్రాంతీయ, జాతి వైరుధ్యాలకు, నేరపూరిత సంస్థలకూ ఆజ్యం పోసాయి.[4] భారతదేశంలోని మొత్తం జిల్లాల్లో, భూ వివాదాల వల్ల ప్రభావితమైన 322 జిల్లాల్లో ఈశాన్య భారత జిల్లాల్లోని ఈ అంతర్గత భూ వివాదాలు భాగం.[5]
అస్సాం-మిజోరం
[మార్చు]బ్రిటిషు వారికి లుషై హిల్స్ (మిజో) తెగలకూ మధ్య జరిగిన ఘర్షణల కారణంగా సరిహద్దు అవసరమని ఇరువైపులా భావించారు.[6] 1871 లో కాచర్ (అస్సాం) డిప్యూటీ కమిషనర్ జాన్ వేర్ ఎడ్గార్ లుషాయ్ (మిజో) నేత సుక్‌పుయిలాలాతో సరిహద్దు ఒప్పందంపై సంతకం చేశాడు.[6] ఆ తరువాత 46 స్తంభాలతో సరిహద్దును గుర్తించారు.[6] అస్సాం, లుషాయ్ హిల్స్ (ఇప్పుడు మిజోరం) మధ్య రాజకీయ సరిహద్దుల అమలుకు సంబంధించి కుదిరిన మొదటి అవగాహనల్లో ఇది ఒకటి. 1926 లో షిల్లాంగ్ (అప్పటి అస్సాం) నుండి తిరిగి వస్తున్న ఐదుగురు వ్యక్తులను అప్పటి లుషాయ్ హిల్స్ సూపరింటెండెంట్ NE ప్యారీ అరెస్టు చేశాడు. [7] 1933 లో, ఒక నోటిఫికేషన్ ద్వారా అప్పటి అస్సాంకు, లుషాయ్ హిల్స్ జిల్లాకూ (మిజోరం) మధ్య అంతర్గత రేఖ లేదా సరిహద్దు రేఖను నిర్వచించారు.[8][9]
అస్సాం నాగాలాండ్ సరిహద్దు వివాదం | |
---|---|
1826 | యాండబో సంధి (నాగాలకు స్ంబంధం లేకుండా నాగా భూమిని బర్మా భారత్‌ల మంధ్య పంపకం జరిగింది) [10] |
1866 | బ్రిటిషు భరతదేసంలో నాగా హిల్స్ జిల్లా ఏర్పాటు |
1880 | కొనోమా గ్రామాన్ని కోల్పోయే దాకా నాగాలు బ్రిటిషర్లను ఎదిరించారు[10] |
1925 | 3102R నోటిఫికేషను (నవంబరు 25), నాగా హిల్స్ జిల్లాకు గతంలో ఉన్న నిర్వచనాలన్నిటినీ అణచివేసి, యావత్తు సరిహద్దుకూ కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది[11] |
1947 | ఆగస్టు 14 న నాగాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు[12] |
1957 | నాగా హిల్స్ - ట్యుఎయెన్‌సాంగ్ ఏరియా చట్టం, 1957 |
1962 | నాగాలాండ్ రాష్ట్ర చట్టం, 1962 |
1972 | యథాతథ స్థితిని ఏర్పరుస్తూ కళ్యాణ సుందరం కమిషను, 4 మధ్యంతర ఒప్పందాలను కుదిర్చింది[13] |
1985 | సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం శాస్త్రి కమిషను ఏర్పాటు[13] |
1997 | సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం జె.కె.పిళ్ళై కమిషను [13] |
1998 | నాగాలాండ్ సరిహద్దు విబ్వాదంపై అస్సాం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది[13] |
2006 | సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం జస్టిస్ వరియావా కమిషను, ఆ తరువాత జస్టిస్ తరుణ్ ఛటర్జీ కమిషను [14][15] |
స్వతంత్ర భారతదేశంలో, ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1971 ద్వారా అస్సాం, మిజోరంల మధ్య సరిహద్దును నిర్వచించారు.[8] 1933 నాటి నోటిఫికేషన్ ఆధారంగా దీన్ని రూపొందించారు.[8] అయితే, ఆధునిక సందర్భంలో 1933 నోటిఫికేషన్ వినియోగం వివాదాస్పదమైంది.[6] 1972లో మిజోరం అస్సాం నుండి కేంద్రపాలిత ప్రాంతంగా విభజించబడింది. మిజోరాం శాంతి ఒప్పందాన్ని అనుసరించి 1987లో అది రాష్ట్రంగా మారింది.[16][17] ప్రారంభంలో మిజోరాం అస్సాంతో సరిహద్దును అంగీకరించింది. కానీ సరిహద్దు అతిక్రమణల తరువాత, మిజోరాం సరిహద్దును వివాదం చేయడం ప్రారంభించింది.[18]
1980 ల నుండి వివాదాలు జరిగాయి. చిన్న భవనాలకు నిప్పు పెట్టారు, ఆర్థిక దిగ్బంధనలకు ప్రయత్నించారు. 2021 లో మిజోరం పోలీసుల కాల్పుల ఘటనలో 6 గురు అస్సాం పోలీసు సిబ్బంది మరణించారు.[19][20] 80 మంది వ్యక్తులు గాయపడటానికి దారితీసిన ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరడానికి బాధ్యులుగా ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకున్నాయి.[21] కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి, ఇరు రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతను తగ్గించి, పరిష్కారానికి ప్రయత్నించింది.[8]
అస్సాం-నాగాలాండ్
[మార్చు]అస్సాం-మిజోరం విషయంలో మాదిరిగానే, అస్సాం-నాగాలాండ్ వివాదానికి దశాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఇది 1963లో నాగాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో మరింత దిగజారింది.[16] 1968 జూన్‌లో ప్రభుత్వ దళాలకు, తీవ్రవాదులకూ మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 150 మంది మరణించారు.[22][23] సరిహద్దు సమస్యను పరిశీలించాలనే నిర్దుష్ట ఆదేశంతో కళ్యాణ్ సుందరంను 1971 ఆగష్టు 7 న నియమించారు.[24] ఇది నాలుగు మధ్యంతర ఒప్పందాలకు దారితీసింది, అయితే దీర్ఘకాలంలో ఇవి వివాదంపై పెద్దగా ప్రభావం చూపలేదు.[25] ఆ తరువాత జరిగిన సంఘర్షణలో కొన్ని ప్రధాన సంఘటనలు ఉన్నాయి- 1979 లో రెంగ్మా, కర్బీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో 54 మంది మరణించారు, 23,500 మందిని సహాయక శిబిరాలకు బలవంతంగా తరలించారు. 1985లో మెరపానీ సంఘటనలో 28 మంది పోలీసు సిబ్బందితో సహా 41 మంది మరణించారు, 2014లో 17 మంది మరణించారు, 10,000 మందిని సహాయక శిబిరాలకు బలవంతంగా తరలించారు.[16][26]
నాగాలాండ్ తమవని వాదించిన అస్సాంలోని గోలాఘాట్ జిల్లా, జోర్హాట్ జిల్లా, సిబ్‌సాగర్ జిల్లాల్లోని వివాదాస్పద ప్రాంత బెల్ట్ (DAB) భాగాలు కొన్ని ఉన్నాయి.[27] 1972లో సంతకం చేసిన 4 మధ్యంతర-ఒప్పందాలు "గెలెకి, అభోయ్‌పూర్, తిరు హిల్స్, డెసోయ్ వ్యాలీ, దోయాంగ్ " రక్షిత అడవులలో రోడ్ల నిర్మాణం వంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసాయి.[28] మధ్యంతర ఒప్పందాలు అనుకున్నదానికంటే ఎక్కువ కాలం కొనసాగాయి.[29]
-
1826
-
1951
-
1970
-
ఈరోజు
వివాదాస్పద ప్రాంతం బెల్ట్
[మార్చు]వివాదాస్పద ప్రాంతం బెల్ట్ (డిస్ప్యూటెడ్ ఏరియా బెల్ట్ - DAB) అధికారికంగా అటవీ భూమితో (ఫారెస్ట్ రిజర్వ్‌లు లేదా రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లు), బ్రిటిషు కాలపు ఇన్నర్ లైన్‌తో అనుసంధానించబడి ఉంది. "అధికార నాగా ప్రాంతాల నుండి దాడులు, ఆక్రమణల నుండి మైదానాలలో నాగరిక రాజ్యాన్ని రక్షించడానికి ఏర్పాటు చేయబడింది". [32] 1911లో నియమించబడిన డోయాంగ్ RF ఇప్పుడు అడవిగా లేనప్పటికీ, దాని అధికారిక హోదా మాత్రం అలాగే ఉంది.[33] ఒకప్పుటి DAB, అధికారిక రక్షిత అటవీ ప్రాంతం నుండి ఇపుడు వ్యవసాయ జోన్‌గా మారిపోయింది. కాగితంపై మాత్రం అవశేషాలు అలాగే ఉన్నాయి.[29] ఈ ఆక్రమణలు అస్సాం, నాగాలాండ్‌లలోని ప్రభుత్వాలతో పాటు,[29] వేర్పాటువాద NSCN యొక్క వివిధ వర్గాలు, అధికారిక యథాతథ స్థితి అమలులో ఉన్నప్పటికీ, భూభాగంపై దావా వేయడానికి సహాయపడింది.[34] యథాతథ స్థితి అమలులో ఉండడంతో, "క్రమబద్ధీకరణ" జరగలేదు.[35] పట్టా హక్కులు లేదా భూమి హక్కులు లేనప్పటికీ, ఆక్రమణలు మాత్రం జరిగిపోయాయి.[36] ఒకప్పుడు ఈ ఆక్రమణలకు గురైన భూములు అంచుల్లో ఉండేవి, ఇప్పుడు సరిహద్దు వివాదానికి కేంద్రబిందువులయ్యాయి.[35]
అస్సాం, నాగాలాండ్‌లు రెండూ తమ దావాలను మరింత బలపరచడానికి DABలో అనధికారిక పద్ధతులకు పాల్పడ్డాయి. 1960 లలో ఆక్రమణలకు మద్దతు ఇవ్వడంతో, DAB ప్రాంతాలలో జనాభా పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా పాఠశాలలను నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. 1971 నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండూ స్థాపించబడ్డాయి.[37] నియులాండ్, కోహోబోటు వంటి అతివ్యాప్తి చెందుతున్న పాలక ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.[38] 1979లో CRPFని "తటస్థ" దళంగా DABలో మోహరించారు. 1985 మేరపానీ సంఘటన తర్వాత DABని CRPF అధీనంలో ఉంచారు.[38] DABలో రాష్ట్ర రవాణా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.[37] "తిరుగుబాటు పన్ను" అనేది DABలో ఉన్నమాట వాస్తవం.[39]
రంగం | పరిమాణం | స్థానం |
---|---|---|
ఎ | 131.12 చ. మై. (339.6 కి.మీ2) [40] | డిఫు RF [27] |
బి | 586 చ. మై. (1,520 కి.మీ2) [40] | సౌత్ నంబోర్ RF [27] |
సి | 2,825.76 చ. మై. (7,318.7 కి.మీ2) [40] | రెంగ్మా RF [27] |
డి | 285.76 చ. మై. (740.1 కి.మీ2) [40] | డోయాంగ్ RF [27] |
ఇ | జోర్హాట్ [41] | |
ఎఫ్ | శివసాగర్ [41] | |
మొత్తం | 12,882 కి.మీ2 (4,974 చ. మై.) [41] |
అస్సాం-మేఘాలయ
[మార్చు]అస్సాం మేఘాలయ వివాదం 1969 అస్సాం పునర్వ్యవస్థీకరణ (మేఘాలయ) చట్టానికి సంబంధించిన భిన్నాభిప్రాయాల వల్ల మరింత తీవ్రమైంది.[42]
వివాదాల నిర్వహణ, పరిష్కారం
[మార్చు]శాంతి ఒప్పందాలు, స్వయంప్రతిపత్త మండలి, రాష్ట్రాలు
[మార్చు]ఈశాన్య ప్రాంతంలో అంతర్గత సరిహద్దుల పరిస్థితిని నేరుగా ప్రభావితం చేసే పెద్ద సంఘర్షణలను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం 1949, 2005 మధ్య 13 పైచిలుకు శాంతి ఒప్పందాలపై సంతకం చేసింది.[43] స్వయంప్రతిపత్త మండళ్ళ ఏర్పాటు, రాష్ట్రాల ఏర్పాటు ఈ ప్రక్రియలో భాగం. అయితే, 1986 లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఏర్పడిన తర్వాత, స్వయంప్రతిపత్తమైన పరిపాలనా విభాగాలను తప్ప కొత్త రాష్ట్రాలను సృష్టించలేదు.[44]
సరిహద్దు రేఖల గుర్తింపు
[మార్చు]సరిహద్దులను గుర్తించే పనికి నార్త్-ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఈశాన్య మండలి, అంతరిక్ష విభాగాలు సంయుక్తంగా ఏర్పాటు చేసినది) సహాయం చేస్తుంది. తద్వారా మ్యాపింగ్ ప్రక్రియలో అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ చిత్రాలను ఏకీకృతం చేస్తుంది.[45][46]
అత్యున్నత న్యాయస్థానం
[మార్చు]1989 లో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లతో సరిహద్దు వివాదాలకు సంబంధించి అస్సాం భారత సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలు చేసింది.[47]
కమీషన్లు, మధ్యవర్తులు
[మార్చు]అస్సాం-నాగాలాండ్
- సుందరం కమిషన్ (1971) [48]
- శాస్త్రి కమిషన్ (1985) [48]
- వరియావా/తరుణ్ ఛటర్జీ కమిషన్ (2006) [49] [50]
- మధ్యవర్తులు శ్రీరామ్ పంచూ, నిరంజన్ భట్ (2010) [50]
సరిహద్దు శాంతి సమన్వయ కమిటీ
[మార్చు]అస్సాం, నాగాలాండ్ మధ్య సరిహద్దు భూములపై స్థానికంగా భూ వివాదాలు తలెత్తినప్పుడు బోర్డర్ పీస్ కోఆర్డినేషన్ కమిటీ చర్చలు ఏర్పాటు చేస్తుంది.[51][52] యాజమాన్యం రాష్ట్రాలది కానందున, అనధికారిక ప్రత్యక్ష చర్చలు సాధారణంగా CRPF శిబిరంలో జరుగుతాయి.[52]
రాష్ట్రాలు, సరిహద్దుల పరిణామం
[మార్చు]- ↑ Parashar, Utpal (2020-10-20). "North-east border disputes: All you need to know". Hindustan Times. Archived from the original on 2020-11-24. Retrieved 2021-07-28.
- ↑ "12 Areas of Dispute on Meghalaya-Assam Border". Outlook India. 12 March 2012. Archived from the original on 2021-07-29. Retrieved 2021-07-29.
- ↑ Kalita, Prabin (23 August 2014). "Unhappy with boundaries, NE sisters nibbling away at our land, Gogoi says". The Times of India. Archived from the original on 2021-07-28. Retrieved 2021-07-28.
- ↑ Second Administrative Reforms Commission Seventh Report (2008).
- ↑ Worsdell, T; Shrivastava, K (2020). "Locating the Breach: Mapping the nature of land conflicts in India" (PDF). Land Conflict Watch. New Delhi: Nut Graph LLP, Rights and Resources Initiative, and Oxfam India. Archived (PDF) from the original on 15 February 2021. Retrieved 29 July 2021.
- ↑ 6.0 6.1 6.2 6.3 Hnamte, Thanchungnunga (2020-12-19). "Historical and political perspectives". Sentinel Assam. Archived from the original on 2021-07-31. Retrieved 2021-08-01.
- ↑ Hluna & Tochhawng 2013, p. 1.
- ↑ 8.0 8.1 8.2 8.3 Das 2021, p. 1-2.
- ↑ Hluna & Tochhawng 2013, p. 335-337.
- ↑ 10.0 10.1 Chasie 2005, p. 253.
- ↑ Sharma 2006, p. 107.
- ↑ Chasie 2005, p. 262.
- ↑ 13.0 13.1 13.2 13.3 Das 2021, p. 4-5.
- ↑ "Commission appointed to identify boundaries of Assam, Nagaland". Outlook India. 25 September 2006. Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.
- ↑ "Disputed land should be returned to Arunachal, says panel report". The Indian Express. 1 February 2014. Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.
- ↑ 16.0 16.1 16.2 Wahlang 2021, p. 4-5.
- ↑ Pachuau 2009, p. 17-18.
- ↑ Das, Pushpita (12 June 2008). "Interstate Border Disputes in the Northeast". Manohar Parrikar Institute for Defence Studies and Analyses. Archived from the original on 2021-08-01. Retrieved 2021-08-01.
- ↑ Deb, Debraj (2021-07-28). "Explained: How did the 150-year-old Assam-Mizoram dispute get so violent now?". The Indian Express. Archived from the original on 2022-04-03. Retrieved 2021-07-28.
- ↑ Hasnat, Karishma (2020-10-21). "All about Assam-Mizoram border dispute, which dates back 50 yrs & still remains unresolved". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-28. Retrieved 2021-07-28.
- ↑ "Assam-Mizoram clash: Why peace is fragile between two India states". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-07-30. Archived from the original on 2021-08-01. Retrieved 2021-08-01.
- ↑ "17. India/Nagas (1947-present)". University of Central Arkansas (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-07. Retrieved 2021-08-07.
- ↑ Shimray, A. S. Atai (2005). Let Freedom Ring?: Story of Naga Nationalism (in ఇంగ్లీష్). Bibliophile South Asia. p. 313. ISBN 978-81-85002-61-3. Archived from the original on 2023-11-24. Retrieved 2023-12-02.
- ↑ Title: Inter State Border dispute between Assam and Nagaland. Archived 2021-08-07 at the Wayback Machine Sarbananda Sonowal. Digital Library. Lok Sabha. Parliament of India. Retrieved 7 August 2021.
- ↑ Das 2021, p. 3-4.
- ↑ Bhattacharya, Ashmita (31 March 2021). "Nagas Target Assamese People as Assam-Nagaland Border Dispute Continues since 1960s". Land Conflict Watch. Archived from the original on 2021-08-06. Retrieved 2021-08-06.
- ↑ 27.0 27.1 27.2 27.3 27.4 Das 2021, p. 4.
- ↑ Shastri 1987, p. 13.
- ↑ 29.0 29.1 29.2 Suykens 2013, p. 3.
- ↑ Shastri 1987, p. 28.
- ↑ Kashyap, Samudra Gupta (2014-08-22). "Assam vs Nagaland, a border dispute of five decades". The Financial Express. Archived from the original on 2021-08-08. Retrieved 2021-08-08.
The NSCN(IM), incidentally, wants the entire Assam tract south of the Guwahati-Dibrugarh railway track in these four districts in Greater Nagalim.
- ↑ Suykens 2013, p. 3, 17.
- ↑ Suykens 2013, p. 10.
- ↑ Suykens 2013, p. 16-18.
- ↑ 35.0 35.1 Suykens 2013, p. 11.
- ↑ Suykens 2013, p. 13-14.
- ↑ 37.0 37.1 Suykens 2013, p. 12.
- ↑ 38.0 38.1 Suykens 2013, p. 5.
- ↑ Suykens 2013, p. 16.
- ↑ 40.0 40.1 40.2 40.3 Das, Tanmoy; Sarma, Angshuman (9 September 2014). "Nagaland-Assam Border Dispute: Past Perspective". Newslaundry. Archived from the original on 2021-08-06. Retrieved 2021-08-08.
- ↑ 41.0 41.1 41.2 Mazumdar, Prasanta (2014-08-21). "Assam burns over border row". DNA India (in ఇంగ్లీష్). Archived from the original on 2021-08-08. Retrieved 2021-08-08.
- ↑ Das 2021, p. 7.
- ↑ Raja 2008, p. ix.
- ↑ Raja 2008, p. 43.
- ↑ "Centre to rely on satellite imaging to resolve border disputes between northeastern states; here's how". India Today. 1 August 2021. Archived from the original on 2021-08-01. Retrieved 2021-08-01.
- ↑ Jain, Bharti (1 August 2021). "Assam-Mizoram row: Northeast borders to be demarcated through satellite imaging". The Times of India. Archived from the original on 2021-08-01. Retrieved 2021-08-01.
- ↑ "Border Dispute, Border Protection and Development, Government Of Assam, India". bpdd.assam.gov.in. Archived from the original on 26 February 2021. Retrieved 2021-07-29.
- ↑ 48.0 48.1 "Explainer: How Assam's border disputes with north-eastern states bedevils relations". The New Indian Express. 29 July 2021. Archived from the original on 2021-08-08. Retrieved 2021-08-08.
- ↑ "Assam sees no end to border disputes with neighbouring states". archive.indianexpress.com. The Indian Express. 13 August 2007. Retrieved 2021-08-08.
- ↑ 50.0 50.1 "SC-appointed panel submits report". The Assam Tribune. 2010-09-15. Archived from the original on 2021-08-08. Retrieved 2021-08-08.
- ↑ "Peace committee tours Assam-Nagaland border". Eastern Mirror Nagaland. 12 December 2014. Archived from the original on 2021-08-08. Retrieved 2021-08-08.
- ↑ 52.0 52.1 Suykens 2013, p. 14.