ఈశాన్య మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఐదు జోనల్ కౌన్సిల్‌లతో పాటు లోతైన నీలం రంగులో చూపబడింది

ఈశాన్య మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ NEC) నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 కు అనుగుణంగా ఏర్పాటైన చట్టబద్ధమైన సలహా సంస్థ. ఇది 1972 నవంబరు 7 న షిల్లాంగ్‌లో ఏర్పాటైంది.[1] ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలు - అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ , మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలు - ఈ కౌన్సిల్‌లో సభ్యులు. వాటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. సిక్కిం 2002 లో కౌన్సిల్‌లో చేరింది.[2] కౌన్సిల్, భారత ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DONER) క్రింద పనిచేస్తుంది.[3]

పాత్ర

[మార్చు]

కౌన్సిల్‌ను మొదట్లో సలహా సంఘంగా ఏర్పాటు చేసినప్పటికీ, 2002 నుంచి ప్రాంతీయ ప్రణాళికా సంఘంగా మంజూరు చేయబడింది. వారు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఉమ్మడి ఆసక్తి ఉన్న ఏ అంశాన్నైనా చర్చించి, దానిపై ఏ చర్య తీసుకోవాలో నిర్ణయిస్తారు. ఈ రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రణాళికలను చూసుకోవడానికి, అంతర్ రాష్ట్ర వివాదాల సందర్భంలో మధ్యవర్తిత్వం వహించడానికి ఈ ఏర్పాటు చేసారు.[4]

నిధులు

[మార్చు]

కౌన్సిల్ నిధులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. చారిత్రికంగా 56% రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చగా, మిగిలినది కేంద్ర ప్రభుత్వ విభాగాల ద్వారా అందిస్తారు.[5] 2017 లో జారీ అయిన 3 సంవత్సరాల ప్రణాళికలో, రూ 2500 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపదించారు. ఇందులో ప్రభుత్వం నుండి 40% రాగా, మిగిలిన 60% నాన్-లాస్పేబుల్ సెంట్రల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్ (NLCPR) నుండి అందుతుంది.[4]

ప్రభావం

[మార్చు]

2017 లో ఆర్థిక వనరులలో రవాణా, కమ్యూనికేషన్ కోసం 47%, వ్యవసాయానికి 14%, మానవ వనరుల అభివృద్ధి, విద్యకు 11%, శక్తికి 9%, ఆరోగ్య రంగానికి 4%, పర్యాటకానికి 3%, పరిశ్రమలకు 3% ఖర్చు చేసారు.[5] కౌన్సిల్ ఈశాన్య రాష్ట్రాలలో విద్యుత్, విద్య, రహదారులు, వంతెనల అభివృద్ధిలో గణనీయమైన విజయాలను సాధించింది. ప్రధాన రహదారి, వంతెన నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది. అనేక ఇంజనీరింగ్, వైద్య కళాశాలలకు నిధులు సమకూర్చింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై ఈ ప్రాంతం ఆధారపడటాన్ని తగ్గించేందుకు దాదాపు 250 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టులకు కౌన్సిల్ నిధులు సమకూర్చింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Establishment of North Eastern Council". Archived from the original on 22 March 2023. Retrieved 2 December 2023.
  2. "Sikkim becomes eighth state under NEC". The Times of India. 10 December 2002. Archived from the original on 21 January 2018. Retrieved 24 November 2017.
  3. Organisations Archived 2010-07-23 at the Wayback Machine DoNER.
  4. 4.0 4.1 "NEC Final plan 2017" (PDF). Archived from the original (PDF) on 24 October 2018. Retrieved 20 December 2017.
  5. 5.0 5.1 "NEC Final plan 2017" (PDF). Archived from the original (PDF) on 24 October 2018. Retrieved 20 December 2017.