ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1971

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1971
మణిపూర్, త్రిపుర రాష్ట్రాల స్థాపనకు, ప్రస్తుత అస్సాం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ద్వారా మేఘాలయ రాష్ట్రం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు, దానితో అనుసంధానించబడిన విషయాల కోసం చేసిన చట్టం.
Citation[1]
Enacted byParliament of India
Date enacted1971 డిసెంబరు 30
స్థితి: అమలైంది

ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971, భారతదేశపు ఈశాన్య ప్రాంతం లోని భూభాగాల సరిహద్దులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంలో ప్రధానమైన సంస్కరణ. దీనితో కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

మార్పుల ప్రభావం

[మార్చు]
చట్టాన్ని ఆమోదించిన తర్వాత, ఈశాన్య భారతదేశం మ్యాప్

మూలం: [2]

  • మణిపూర్, త్రిపుర రాష్ట్రాల స్థాపన. అవి అంతకు ముందు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి.
  • మేఘాలయ రాష్ట్ర స్థాపన. ఇది అంతకు ముందు అస్సాంలో స్వయంప్రతిపత్తి కలిగిన భాగంగా ఉండేది.
  • మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు.
  • పై మార్పుల కారణంగా అస్సాం రాష్ట్ర విస్తీర్ణం తగ్గింది.
  • కొత్తగా ఏర్పడిన భూభాగాలకు లోక్‌సభ, రాజ్యసభ స్థానాల కేటాయింపు.
  • కొత్తగా ఏర్పడిన భూభాగాల శాసన సభలకు సీట్ల కేటాయింపు.
  • 1971 చట్టం ప్రకారం, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపురలకు ఉమ్మడిగా హైకోర్టు ఏర్పడగా, 2012 లో చేసిన సవరణ ప్రకారం 2013 మార్చిలో మేఘాలయ, మణిపూర్, త్రిపురలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటయ్యాయి.
  • మిగతా సవరించిన భూభాగాల కోసం కొత్తగా ఉమ్మడి హైకోర్టు ఏర్పాటైంది.

తదనంతర ప్రాదేశిక మార్పులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "North-Eastern Areas (Reorganisation) Act, 1971". www.liiofindia.org. 30 December 1971. Retrieved 24 December 2020.
  2. "The North-Eastern Areas (Reorganisation) Act, 1971" (PDF). www.indiacode.nic.in. 30 December 1971. Archived (PDF) from the original on 13 July 2021. Retrieved 24 December 2020.
  3. Hazarika, S. (30 September 2016). "'There is Peace in Mizoram Because of Its Brutal Past'". The Wire. Archived from the original on 29 July 2021. Retrieved 24 December 2020.
  4. "State of Arunachal Pradesh Act, 1986". liiofindia.org. 24 December 1986. Archived from the original on 29 July 2021. Retrieved 24 December 2020.