ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు

ఈ వ్యాసం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలకసంఘాలు, నగర పంచాయతీలతో సహా అన్ని పట్టణ స్థానిక సంస్థలను జాబితా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్ డేటా ఆధారం ప్రకారం, రాష్ట్రంలోని 2024 నాటికి 26 జిల్లాల్లో 123 పట్టణ స్థానిక సంస్థలను కలిగి ఉంది. వీటిలో 17 నగరపాలక సంస్థలుకాగా, 77 పురపాలక సంఘాలు, 30 నగర పంచాయతీలు ఉన్నాయి.[1][2][3]
అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా, భీమునిపట్నం (బీమిలీ) ఆంధ్రప్రదేశ్‌లోని పురాతన పురపాలకసంఘం చెన్నపట్నం (ఆధునిక చెన్నై) తర్వాత భారతదేశంలో రెండవ పురాతన మునిసిపాలిటీ. ప్రస్తుతం, భీమునిపట్నం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో భాగం. రాయలసీమ ప్రాంతంలో, కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోని పురాతన మునిసిపాలిటీగా గుర్తింపు పొందింది.తరువాత స్థానంలో కర్నూలు ఉంది.
చరిత్ర
[మార్చు]2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 నగర పాలకసంస్థలు కాక, నగరపంచాయితీలతో కలుపుకొని 94 పురపాలకసంఘాలు ఉన్నాయి. ఇందులో 4 ఎంపిక, 7 ప్రత్యేక, 12 మొదటి, 25 రెండవ, 23 మూడవ గ్రేడ్ మున్సిపాలిటీలు ఉన్నాయి.[4] ఉమ్మడి గుంటూరు జిల్లాలొ అత్యధికంగా 12 మున్సిపాలిటీలు వుండేవి.[4][5] ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలొ కేవలం రెండు మాత్రమే ఉండేయి. ఇవి అనకాపల్లి, భీమునిపట్టణం. ఇవి తరువాత విశాఖపట్నంలో విలీనమయ్యాయి.[6] మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 2015 డిసెంబరు 9న మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రకటించారు.[7] కానీ మచిలీపట్నం, విజయనగరం అప్పటి ఎన్నికయిన పాలకవర్గం గడువు వరకు మున్సిపాలిటీగా కొనసాగింది.[8][9]
పట్టణ స్థానిక సంస్థల సోపానక్రమం
[మార్చు]- పట్టణ అభివృద్ధి సంస్థ
- మునిసిపల్ కార్పొరేషన్
- మునిసిపాలిటీ
- ఎంపిక గ్రేడ్ మునిసిపాలిటీ
- గ్రేడ్ - 1 మునిసిపాలిటీ
- గ్రేడ్ - 2 మునిసిపాలిటీ
- గ్రేడ్ - 3 మునిసిపాలిటీ
4. నగర పంచాయతీ
నగరపాలక సంస్థలు
[మార్చు]
రాష్ట్రంలోని మొత్తం 18 నగరపాలక సంస్థలు ఉన్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ 540 చ.కి (208 చ.మైళ్లు) విస్తీర్ణం కలిగిన అతిపెద్ద నగరపాలక సంస్థగా ఉంది.[10][11] గుంటూరు జిల్లాలో రెండు నగరపాలకసంస్థలు ఉండగా, మిగతా అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి.[2] 18 కార్పొరేషన్లలో, 16 జిల్లా ప్రధాన కార్యాలయాలుగా పనిచేస్తున్నాయి. మినహాయింపు మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్.[12]
విజయనగరం, మచిలీపట్నం, శ్రీకాకుళం నగరాలను 2015 డిసెంబరు 9న నగరపాలక సంస్థలుగా అప్‌గ్రేడ్ చేశారు.[13] 2021 మార్చిలో గుంటూరు జిల్లాలోని పూర్వ మంగళగిరి పురపాలకసంఘం, తాడేపల్లి పురపాలకసంఘం, మంగళగిరి తాడేపల్లి నగరపాలకసంస్థలో విలీనం అయ్యాయి..
నగరపాలక సంస్థల జాబితా
[మార్చు]జిల్లా | నగరపాలకసంస్థ | అప్‌గ్రేడ్ అయిన సంవత్సరం | మొత్తం |
---|---|---|---|
అనంతపురం | అనంతపురం నగరపాలక సంస్థ | 2004 | 1 |
చిత్తూరు | చిత్తూరు నగరపాలక సంస్థ | 2012 | 1 |
తిరుపతి | 2007 | 1 | |
తూర్పు గోదావరి | రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ | 1994 | 1 |
కాకినాడ | కాకినాడ నగరపాలక సంస్థ | 2007 | 1 |
గుంటూరు | గుంటూరు నగరపాలక సంస్థ, | 1994
2021 |
2 |
వైఎస్ఆర్ | కడప నగరపాలక సంస్థ | 2004 | 1 |
ఎన్టీఆర్ | విజయవాడ నగరపాలక సంస్థ | 1981 | 1 |
కృష్ణా | మచిలీపట్నం నగరపాలక సంస్థ | 2015 | 1 |
కర్నూలు | కర్నూలు నగరపాలక సంస్థ | 1994 | 1 |
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | నెల్లూరు నగరపాలక సంస్థ | 2004 | 1 |
ప్రకాశం | ఒంగోలు నగరపాలక సంస్థ | 2012 | 1 |
శ్రీకాకుళం | శ్రీకాకుళం నగరపాలక సంస్థ | 2015 | 1 |
విశాఖపట్నం | మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ | 1979 | 1 |
విజయనగరం | విజయనగరం నగరపాలక సంస్థ | 2015 | 1 |
ఏలూరు జిల్లా | ఏలూరు నగరపాలక సంస్థ | 2005 | 1 |
మొత్తం | 17 |
పురపాలక సంఘాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లో పురపాలక సంఘాలు 5 రకాలు, వాటి స్థాయి, వాటి సంఖ్య వివరాలు,
- సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘం- 11
- స్పెషల్ గ్రేడు పురపాలక సంఘం- 7
- గ్రేడు - 1 పురపాలక సంఘం- 17
- గ్రేడు - 2 పురపాలక సంఘం- 30
- గ్రేడు - 3 పురపాలక సంఘం- 18
Source: Statistical Information of ULBs and UDAs
నగరపంచాయితీలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్లో 31 నగరపంచాయితీలున్నాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 5 నగరపంచాయితీలున్నాయి.
జిల్లా | నగరపంచాయితీలు | మొత్తం |
---|---|---|
అన్నమయ్య | బి. కొత్తకోట | 1 |
పార్వతీపురం మన్యం | పాలకొండ | 1 |
విజయనగరం | నెల్లిమర్ల, రాజాం | 2 |
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ | ముమ్మిడివరం | 1 |
కాకినాడ | గొల్లప్రోలు, ఏలేశ్వరం | 2 |
పశ్చిమ గోదావరి | ఆకివీడు | 1 |
ఏలూరు | చింతలపూడి | 1 |
కృష్ణా | ఉయ్యూరు | 1 |
ఎన్టీఆర్ | నందిగామ, తిరువూరు | 2 |
పల్నాడు | దాచేపల్లి, గురజాల | 2 |
బాపట్ల | అద్దంకి | 1 |
ప్రకాశం | చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కనిగిరి, పొదిలి | 5 |
నెల్లూరు | అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం | 2 |
కర్నూలు | గూడూరు | 1 |
నంద్యాల | బేతంచర్ల | 1 |
అనంతపురం | పామిడి | 1 |
శ్రీ సత్యసాయి | మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి | 3 |
కడప | జమ్మలమడుగు, యర్రగుంట్ల, కమలాపురం | 3 |
మొత్తం | 31 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
- ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల జాబితా
- ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (జనాభా ప్రకారం)
- తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
- జనావాస శీర్షికల నిర్వచనాలు
మూలాలు
[మార్చు]- ↑ Vadlapatla, Sribala (11 August 2015). "Amaravati among 32 AP cities selected for Amruth development". The Times of India. Hyderabad. Retrieved 18 December 2015.
- ↑ 2.0 2.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 17 July 2019. Retrieved 23 June 2016.
- ↑ "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-01-07.
- ↑ 4.0 4.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 1 April 2016.
- ↑ "Dachepalli, Gurazala in Guntur district get పురపాలక సంఘం status". The New Indian Express. Retrieved 27 January 2020.
- ↑ "Two municipalities merged in GVMC | Deccan Chronicle". web.archive.org. 2015-02-18. Archived from the original on 2015-02-18. Retrieved 2019-12-09.
- ↑ "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.
- ↑ "Masula to remain a municipality". Hyderabad. 30 March 2016. Retrieved 20 February 2016.
- ↑ "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Municipal Corporation Status for All District HQs in AP". The New Indian Express. Hyderabad. 17 February 2015. Archived from the original on 26 మార్చి 2016. Retrieved 7 February 2016.
- ↑ "AP government issues GO forming Mangalagiri Tadepalli Municipal Corporation". web.archive.org. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.
- ↑ "Municipal Corporation Status for All District HQs in AP". The New Indian Express. Hyderabad. 17 February 2015. Archived from the original on 16 June 2015. Retrieved 7 February 2016.
- ↑ "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.