Jump to content

వడోదర

అక్షాంశ రేఖాంశాలు: 22°18′00″N 73°12′01″E / 22.30000°N 73.20028°E / 22.30000; 73.20028
వికీపీడియా నుండి
(Vadodara నుండి దారిమార్పు చెందింది)
  ?బరోడా
వడోదర
గుజరాత్ • భారతదేశం
మారుపేరు: సంస్కారీ నగరి / సయాజీ నగరి
వడోదరను చూపిస్తున్న పటం
గుజరాత్ రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పటం
గుజరాత్ పటములో వడోదర స్థలము
అక్షాంశరేఖాంశాలు: 22°18′00″N 73°12′01″E / 22.30000°N 73.20028°E / 22.30000; 73.20028
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
410km కి.మీ² (సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "km" చ.మై) (18)[1]
• 129 మీ (423 అడుగులు)
వాతావరణం
ఉష్ణోగ్రత
వేసవికాలం
శీతాకాలం
Semi-Arid (BSh) (Köppen)
43 - 12 °సె (97 °ఫా)
• 43 - 26 °సె (83 °ఫా)
• 33 - 12 °సె (79 °ఫా)
దూరాలు
ఢిల్లీ నుండి
ముంబై నుండి
అహ్మదాబాద్ నుండి

• 956 కి.మీలు ఈ. (రైలు & విమానము)
• 430 కి.మీలు ద. (రైలు & విమానము)
• 90 కి.మీలు వా. (రోడ్డు)
సమీప నగరం అహ్మదాబాద్
జిల్లా (లు) వడోదర
జనాభా
జనసాంద్రత
Metro
అక్షరాస్యత శాతం
18,22,221 (18) (2019 నాటికి)
• 952/కి.మీ² (2,466/చ.మై)
• 25,00,000
• 94.5%
అధికార భాష గుజరాతీ, హిందీ & ఆంగ్లము
జిగిషా సేథ్ సునీల్ సోలంకి
మునిసిపల్ కమీషనర్ ఎం.కె.దాస్[2]
వదోదర మహానగరపాలక సంస్థ 1950
Legislature (seats) మహానగరపాలక సంస్థ (84 [1])
లోక్‌సభ నియోజకవర్గం 1 [3]
శాసనసభ నియోజకవర్గం 5 [4]
ప్రణాళికా సంస్థ 1 (VUDA)
జోను 4 [1]
వార్డు 10 [1][5]
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 390 0XX
• +(91)265
• INBDQ
• GJ-06
వెబ్‌సైటు: వదోదర పురపాలక సంఘము
వదోదర పురపాలక సంఘము యొక్క ముద్ర
వదోదర పురపాలక సంఘము యొక్క ముద్ర
లక్ష్మీ విలాస్ ప్యాలెస్

గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర (Vadodara) (Gujarati: વડોદરા) ఒకటి. గుజరాత్ రాష్ట్రపు తూర్పు వైపున అహ్మదాబాదుకు ఆగ్నేయాన ఉంది. ఈ నగరానికి మరో పేరు బరోడా (Baroda). ఇది గుజరాత్ సాంస్కృతిక రాజధానిగా వర్థిల్లుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వం గైక్వాడ్ రాజ్యపు రాజధానిగా ఉండిన ఈ నగరం ప్రస్తుతం బరోడా జిల్లా రాజధానిగా కొనసాగుతోంది. విశ్వామిత్రి నది ఒడ్డున కల వదోదర నగర జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారం 13,06,035.

చరిత్ర

[మార్చు]
వడోదర నగరం
వడోదరలోని ఎం.ఎస్.మ్యూజియం
వడోదర మహారాజా ప్యాలెస్ మహాద్వారం
వడోదర మహారాజా ప్యాలెస్

వడోదర నగరానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది.1297 వరకు ఇది హిందూరాజుల పాలనలో ఉంది. గుప్తులు, చాళుక్యులు ఆ తర్వాత సోలంకీలు ఇక్కడ పాలించారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు, మొఘలులు పాలించారు. ఆ తర్వాత మరాఠా గైక్వాడ్‌లు వశపర్చుకున్నారు. గైక్వాడ్ రాజ్యానికి ఇది రాజధానిగా కొనసాగింది. మూడో శయాజీరావు గైక్వాడ్ దీన్ని పాలించిన రాజులలో అగ్రగణ్యుడు. స్వాతంత్ర్యం వరకు గైక్వాడ్ రాజ్యం సంస్థానంగానే కొనసాగింది. 1947లో భారత యూనియన్‌లో గైక్వాడ్ సంస్థానం విలీనమైంది.

భౌగోళికం

[మార్చు]

వడోదర నగరం భౌగోళికంగా గుజరాత్ రాష్ట్రంలో తూర్పు వైపున ఉంది. 22°18' ఉత్తర అక్షాంశం, 73°12' తూర్పు రేఖాంశంపై ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము గుజరాత్‌లో 10 లక్షల జనాభా మించిన 4 నగరాలలో ఇది ఒకటి. జనాభా పరంగా ఇది అహ్మదాబాదు, సూరత్ ల తరువాత మూడవ పెద్ద నగరం. వైశాల్యం ప్రకారం భారతదేశంలో 18 వ పెద్ద నగరం. ఋషి విశ్వామిత్రుడు పేరు మీదుగా వచ్చిన విశ్వామిత్రి నది ఈ నగరం గుండా వెళుతుంది.

పరిశ్రమలు

[మార్చు]

పారిశ్రామికంగా వదోదర మంచి అభివృద్ధిని సాధించింది. 1962లో గుజరాత్ రిఫైనరీ స్థాపించడం, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, అంకలేశ్వర్ చమురు నిల్వలు కనుగొనడంతో ఈ నగరం దశ మారిపోయింది. ప్రస్తుత ఇక్కడ అనేక పెట్రో కెమికల్ పరిశ్రమలు, ఫార్మాసూటికల్ పరిశ్రమలు, ప్లాస్టిక్ పరిశ్రమలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఎరువుల పరిశ్రమ కూడా ఇక్కడ ఉంది. దీనితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలైన ఓ.ఎన్.జి.సి, జి.ఏ.ఐ.ఎల్ యూనిట్లు ఈ నగరంలో ఉన్నాయి.

పరిపాలన

[మార్చు]

వడోదర నగరాన్ని మున్సిపల్ కార్పోరేషన్ పాలిస్తుంది. దీనిని 1950లో స్థాపించారు. నగరం 4 జోన్లుగా, 26 వార్డులుగా విభజించారు. వడోదరలో ఒక లోక్‌సభ నియోజక వర్గం, 5 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇక్కడ రాజకీయపరంగా భారతీయ జనతా పార్టీకి మంచి పట్టు ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

వడోదర ముంబాయి-ఢిల్లీ, ముంబాయి-అహ్మదాబాద్ రైలు మార్గంలో ఉంది. వడోదర జంక్షన్, మకార్‌పుర, విశ్వామిత్రి ఇక్కడై ముఖ్య రైల్వే స్టేషన్లు. ఇవి పశ్చిమ రైల్వేలో భాగం. వడోదరలో విమానాశ్రయం కూడా ఉంది. 8 వ నెంబరు జాతీయ రహదారి ఈ నగరం గుండా వెళ్తుంది.

క్రీడలు

[మార్చు]

క్రికెట్ క్రీడ ఇక్కడ బాగా ప్రజాదరణ పొందింది. ఫుట్‌బాల్, మైదాన హాకీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ ఇతర క్రీడలు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రీడాకారులు అతుల్ బెదాడే, విజయ్ హజారే, చందూబోర్డే, కిరణ్ మోరే, నయన్ మోంగియా, అంశుమన్ గైక్వాడ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పటేల్ ఇక్కడివారే. ఆసియాలోని పురాతన క్రికెట్ గ్రౌండ్‌లలో ఒకటైన మోతీబాగ్ ఇక్కడే ఉంది. అజహరుద్దీన్ 62 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు సృష్టించినది ఈ గ్రౌండ్‌లోనే (తర్వాత ఈ రికార్డు ఛేదించబడింది). బరోడా క్రికెట్ టీం ఇప్పటి వరకు 6 సార్లు రంజీ ట్రోఫీ గెలుపొందినది.

చూడదగిన ప్రదేశాలు

[మార్చు]
  • ప్యాలెస్‌లు: లక్ష్మీ విలాస్ ప్యాలెస్, ప్రతాప్ విలాస్ ప్యాలెస్, మకార్‌పురా ప్యాలెస్, నజార్ బాగ్ ప్యాలెస్
  • భవంతులు, చారిత్రక కట్టడాలు: మహారాజా సయాజీ రావ్ విశ్వవిద్యాలయం, కీర్తి మందిర్, కీర్తి స్తంభ్, న్యాయ్ మందిర్, ఖండేరావ్ మార్కెట్, అరవిందొ ఆశ్రమ్, దక్షిణమూర్తి దేవాలయం, హాజిరా మక్బరా
  • మ్యూజియంలు, ఉద్యానవనాలు: మహారాజా ఫతేసింగ్ మ్యూజియం, బరోడా మ్యూజియం & పిక్చర్ గ్యాలరీ, సయాజీ బాగ్, లాల్ బాగ్, సర్దార్ బాగ్, రిలయెన్స్ గార్డెన్, నవ్‌జోత్ గార్డెన్

నగరానికి చెందిన వ్యక్తులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Institutional Setup In Vadodara" (PDF). Vadodara Municipal Corporation. Archived from the original (PDF) on 2007-09-29. Retrieved 2007-07-29.
  2. "VMC Conatact Numbers". Vadodara Municipal Corporation. Archived from the original on 2007-09-29. Retrieved 2007-06-22.
  3. "List of Lok Sabha Members from Gujarat". Lok Sabha. Archived from the original on 2007-10-14. Retrieved 2007-06-30.
  4. "List of MLAs from Vadodara District". Gujarat Vidhan Sabha. Archived from the original on 2015-09-24. Retrieved 2007-06-30.
  5. "Ward Office Conatact Numbers". Vadodara Municipal Corporation. Archived from the original on 2007-09-29. Retrieved 2007-06-22.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వడోదర&oldid=4361366" నుండి వెలికితీశారు