భావ్‌నగర్
Bhavnagar | ||||||
---|---|---|---|---|---|---|
Metropolitan City/Urban agglomeration | ||||||
Nickname(s): Bhavena Nagari, Sanskruti Nagari | ||||||
Coordinates: 21°46′N 72°09′E / 21.76°N 72.15°E | ||||||
Country | India | |||||
రాష్ట్రం | గుజరాత్ | |||||
Region | Saurashtra | |||||
జిల్లా | Bhavnagar | |||||
Police zone | 4 | |||||
Ward | 19 (city) | |||||
Founded | 1723 | |||||
Founded by | Bhavsinhji Takhtasinhji Gohil | |||||
Government | ||||||
• Type | Municipal Corporation | |||||
• Body | Bhavnagar Municipal Corporation and BADA (Bhavnagar Area Development Authority) | |||||
• Municipal Commissioner | M. A. Gandhi | |||||
• Mayor | Kirti Danidhariya | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 108.27 కి.మీ2 (41.80 చ. మై) | |||||
• Rank | 5 | |||||
Elevation | 24 మీ (79 అ.) | |||||
జనాభా (2011) | ||||||
• Total | 6,43,365 (urban) | |||||
Demonym | Bhavnagari | |||||
భాషలు | ||||||
• అధికార | Gujarati, Hindi, English | |||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | |||||
పిన్ కోడ్ | 364 001, 364 002, 364 003, 364 004, 364 005, 364 006 | |||||
Telephone code | (+91)278 | |||||
Vehicle registration | GJ-04 |
భావ్‌నగర్ భారతదేశం,గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని భావ్‌నగర్ జిల్లాకు ఒక చెందిన నగరం.దీనిని 1723లో భావ్‌సిన్హ్జీ తఖ్తసిన్హ్జీ గోహిల్ (1703–1764) స్థాపించారు. ఇది భావ్‌నగర్ రాష్ట్రానికి రాజధాని,1948లో భారతదేశ ఆధిపత్యంలో విలీనం కావడానికి ముందురాచరికరాష్ట్రంగా ఉంది.ఇప్పుడుఇది భావ్‌నగర్ జిల్లా పరిపాలనాప్రధాన కార్యాలయం.
రాష్ట్ర రాజధాని గాంధీనగర్ నుండి భావ్‌నగర్ 190 కిలోమీటర్ల దూరంలో ఖంభాట్ గల్ఫ్‌కు పశ్చిమాన ఉంది.భావ్‌నగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల నిలుపుదల గిడ్డంగితో పాటు అనేక పెద్ద,చిన్న తరహా పరిశ్రమలతో వాణిజ్యానికి ఇది ఎల్లప్పుడూ ముఖ్యమైన నగరం.భావ్‌నగర్ ప్రసిద్ధ గుజరాతీ చిరుతిండి ' గాంథియా ', జలేబి' కి చాలా ప్రసిద్ధి చెందింది.
చరిత్ర
[మార్చు]సూర్యవంశీ వంశానికి చెందిన గోహిల్ రాజపుత్ మార్వార్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు.సుమారు సా.శ.1260లో,వారుగుజరాత్ తీర ప్రాంతానికి వెళ్లి సెజక్‌పూర్ (రాన్‌పూర్), ఉమ్రాలా,సిహోర్ అనేమూడురాజధానులు స్థాపించాడు.[2] సెజక్‌పూర్ 1194లో స్థాపించాడు.
1722-1723లో, ఖంతాజీ కదాని,మరాఠా పిలాజీ గైక్వాడ్ నేతృత్వంలోని దళాలు సిహోర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాయి.కానీ మహారాజా భావ్‌సిన్హ్‌జీ గోహిల్ తిప్పికొట్టాడు.యుద్ధం తర్వాత,సిహోర్ ప్రదేశం పదేపదే దాడికి కారణం అని భావ్‌సిన్హ్జీ గ్రహించాడు.1723లో,అతను సిహోర్ నుండి 20 కిమీ దూరంలోని వద్వాగ్రామం సమీపంలో కొత్తరాజధానిని స్థాపించాడు.దానికితనపేరుమీద భావ్‌నగర్ అనిపేరు పెట్టాడు.సముద్ర వాణిజ్యానికి దాని సామర్థ్యం కారణంగాఇదిజాగ్రత్తగాఎంచుకున్న వ్యూహాత్మక ప్రదేశం.సహజంగానేభావ్‌నగర్ రాష్ట్రరాజధానిగామారింది.1807లో భావ్‌నగర్ రాష్ట్రం బ్రిటిష్ రక్షితప్రాంతంగామారింది.[3][4]
కోటతో కూడిన పాత పట్టణం భావ్‌నగర్ ఇతరముఖ్యమైన ప్రాంతీయ పట్టణాలకు దారితీసే మార్గాలతో కూడిన పట్టణం.ఇదిదాదాపురెండుశతాబ్దాలపాటు ఒక ప్రధాన నౌకాశ్రయంగా కొనసాగింది.మొజాంబిక్,జాంజిబార్,సింగపూర్, పర్షియన్ గల్ఫ్‌లతో భావ్‌నగర్ ద్వారా వర్తకం జరిగింది.
సూరత్, కాంబే ద్వారా గుత్తాధిపత్యం పొందిన సముద్ర వాణిజ్యం నుండి వచ్చే ఆదాయంతో భావ్‌నగర్‌కు ప్రయోజనం చేకూరుతుందని,భావ్‌సిన్హ్జీ గ్రహించాడు.సూరత్ కోట జంజీరాలోని సిద్దిల ఆధీనంలో ఉన్నందున,భావ్‌నగర్ ఓడరేవు ద్వారా వచ్చే ఆదాయంలో 1.25% ఆదాయాన్నిఇచ్చేలాగున సిద్దిలతో భావ్‌సిన్హ్జీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.1856లో సూరత్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు బ్రిటీష్ వారితో భావసింహ్జీ ఇదేవిధమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.భావ్‌సింహ్‌జీ అధికారంలో ఉన్నప్పుడు, భావ్‌నగర్ చిన్ననాయకత్వస్థాయినుండిగణనీయమైన ముఖ్యమైన రాష్ట్రంగా ఎదిగింది.కొత్త భూభాగాల చేరికతో పాటుసముద్ర వాణిజ్యంద్వారాలభించే ఆదాయం దీనికి కారణం.భావ్‌సింహ్‌జీవారసులు భావ్‌నగర్ నౌకాశ్రయంద్వారాసముద్ర వాణిజ్యాన్నిప్రోత్సహించడంకొనసాగించారు.రాష్ట్రానికిదానిప్రాముఖ్యతనుగుర్తించారు. భూభాగాన్నిమరింతవిస్తరించాడు.
19వ శతాబ్దం చివరలో,భావ్‌నగర్ రాష్ట్ర రైల్వే నిర్మించబడింది.ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియాలో పేర్కొనబడిన కేంద్రప్రభుత్వం నుండిఎటువంటిసహాయంలేకుండానే రైల్వే వ్యవస్థను నిర్మించగలిగినమొదటిరాష్ట్రంగాభావ్‌నగర్ నిలిచింది.మిస్టర్ పీలే,ఒకరాజకీయ ఏజెంట్,రాష్ట్రాన్నిఈక్రిందివిధంగావివరించాడు: "అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, చాలామంచిపనిపురోగతిలోఉంది.ఆర్థికవిషయాల గురించి నేను కొంచెం చెప్పాలి; మీకుఅప్పులు లేవు.మీ ఖజానా నిండిపోయింది." [5] సా.శ.1870 - 1878 మధ్య, యువరాజు తఖ్త్‌సిన్హ్జీ మైనర్ అయినందున రాష్ట్రంఉమ్మడిపరిపాలనలో ఉంచబడింది.ఈ కాలంలో పరిపాలన,ఆదాయసేకరణ,న్యాయవ్యవస్థ,తపాలా,తంతి సేవలు లాంటి ఆర్థిక విధానంలో కొన్నిముఖ్యమైన సంస్కరణలు వచ్చాయి.ఓడరేవులను ఆధునీకరించారు.
1947లో భారత సమాఖ్యలో విలీనం
[మార్చు]1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు, భావ్‌నగర్ రాజ్‌పుత్ గోహిల్ కుటుంబానికి చెందిన స్వతంత్ర రాష్ట్రంగాఉంది.1947లో, కొత్తస్వతంత్ర భారతసమాఖ్య ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 562 సంస్థానాలనుభారతసమాఖ్యతో ఏకం చేసే ప్రతిష్ఠాత్మకమైన సంక్లిష్టమైనప్రక్రియనుచేపట్టాడు.
భావ్‌నగర్‌లోనిపూర్వపు రాజకుటుంబం ప్రజల దృష్టిలో అలాగే వ్యాపారంలో (హోటల్‌లు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం,ఓడలు మరమ్మత్తు) చురుకైన పాత్రను పూర్వపు రాచరిక రాష్ట్రమైన భావ్‌నగర్ ప్రాంతాలలోకొనసాగించారు.దానితోపాటునగరజనాభావీరిని అధికంగా గౌరవించారు.[6]
భౌగోళికం
[మార్చు]స్థలాకృతి
[మార్చు]భూగర్భ శాస్త్రం
[మార్చు]నగర ప్రణాళిక,
[మార్చు]భావ్‌నగర్‌లోని ప్రగతిశీలపాలకులమార్గదర్శకత్వంలోబహుళపట్టణ ప్రణాళికపథకాలు రూపొందించి,అమలు చేసారు.సర్ తఖ్త్సిన్హ్జీ పాలనలో,బ్రిటీష్ స్టేట్ ఇంజనీర్ ప్రొక్టర్ సిమ్స్ బార్టన్ లైబ్రరీ,సర్ తఖ్త్సిన్హ్జీ ఆసుపత్రినిర్మాణం పర్యవేక్షించారు.[2]
కొన్ని నిర్మాణ ఉదాహరణలు:
- తఖ్తేశ్వర్ ఆలయం (1893) ఒక కొండపై, ఎత్తైన స్తంభంపై ఉంది.స్తంభాల దీర్ఘచతురస్రాకార మండపంపైన ఉన్నఎత్తైన శిఖరం.దీనిని ఒకముఖ్యమైన మైలురాయిగా చేస్తుంది.
- గంగాజలియా (1893) అనేది గంగా-దేవికి అంకితం చేయబడిన ఆలయం.ఛత్రి, మంటపం,వంతెన మొత్తం తెల్లని పాలరాతితో ఉంటుంది.ఇదిపూర్వపు సరస్సు మధ్యలో ఉంది.దీనిని బొంబాయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ సర్ జాన్ గ్రిఫిత్ రూపొందించాడు.
- నీలాంబాగ్ ప్యాలెస్ (1894),ఇప్పుడువారసత్వ హోటల్‌గా ఉంది,ఇది 10 ఎకరాలు (4.0 హె.) విస్తీర్ణంలో ఉన్నభారీ ఎస్టేట్ మధ్యఉంది.దీనిని బ్రిటీష్ వాస్తుశిల్పి విలియం ఎమర్సన్ రాజనివాసంగారూపొందించారు.అతనుతరువాత కలకత్తాలో సర్ తఖ్త్‌సిన్హ్జీ అసుపత్రి,విక్టోరియాజ్ఞాపకార్థం రూపొందించాడు.[7] ఇది భారతీయ వాస్తుశిల్పంలోని అంశాలను ఆధునిక దృక్పథంతో మిళితం చేస్తుంది.
- బార్టన్ గ్రంథాలయం (1895) అనేది రెండుఅంతస్తుల భవనం.ఇది రోడ్డు కూడలి కోసం తగిన విధంగా రూపొందించారు.దీనికి రెండురెక్కల ఆకారంతో మధ్య గోపురం ఉంటుంది.ఇది గుజరాత్‌లోని పురాతనగ్రంధాలయాలలో ఒకటి.సంగ్రహశాల కూడా ఉంది.
- టౌన్ హాల్ (1932) గతంలో దర్బార్ హాల్,ఇక్కడ సర్ కృష్ణకుమార్‌సింహ్‌జీ పట్టాభిషేకం జరిగింది.ఇది కాలనీల శైలిలో ఒక గంభీరమైన నిర్మాణం,చక్కగా వేయబడిన తోటలో ఏర్పాటు చేయబడింది.
- ఆధునిక, సమకాలీన వాస్తుసంబంధ సేవలను ఎస్.ఎ.జి.ఎ. వంటి వివిధ ప్రముఖ వాస్తుసంబంధ సంస్థ అందించింది.దీని నిర్మాణంలో వైవిధ్యమైంది.అయినప్పటికీ ఏకీకృత స్వభావం మాత్రమే కాకుండా,క్రియాత్మక,సౌందర్య,సాంకేతిక-అవగాహన కలిగి ఉంటుంది.
ఆధునిక భావ్‌నగర్‌లో తఖ్తేశ్వర్ ప్లాట్లు, కృష్ణానగర్,సర్దార్‌నగర్,పరిసర ప్రాంతాలు ఉన్నాయి.1935-1937 సమయంలో,కృష్ణనగర్ ప్రాంతంభావ్‌నగర్ రాష్ట్ర అధికారిక పట్టణ ప్రణాళికను దివంగత వీరేంద్రభాయ్ సి. మెహతాచే రూపొందించి,దానిప్రకారం అభివృద్ధి చేయబడింది. 1961లో, అతను తన కృష్ణానగర్ ప్రణాళికను సర్దార్‌నగర్ వైపు విస్తరించాడు. 1975లో భావ్‌నగర్ కోసం బృహత్ప్రణాళిక రూపొందించారు.
పట్టణ ప్రణాళికలో ముఖ్య లక్షణం ప్రతి రోడ్డు కూడలిఉద్యానవనాలను కలిగి ఉండటం.అందులో భాగంగా ఘోఘా సర్కిల్, మహిళా కాలేజీ సర్కిల్, రూపానీ సర్కిల్, మేఘాని సర్కిల్, శివాజీ సర్కిల్, సర్దార్‌నగర్ సర్కిల్, జ్యువెల్స్ సర్కిల్, క్రెసెంట్ సర్కిల్‌లలో గార్డెన్‌లు ఉన్నాయి.
భావ్‌నగర్ పరిధిలో భూగర్భ మురికినీటిపారుదల కాలువులకలిగి ఉన్నతొలి పట్టణాలలో ఒకటి.[8]
చదువు
[మార్చు]భావ్‌నగర్‌లో వివిధ పాఠశాలలు, విద్యా సంస్థలు ఉన్నాయి.నానాభాయ్ భట్, గిజుభాయ్ బధేకా,మన్‌భాయ్ భట్ (శిశువిహార్ వ్యవస్థాపకుడు), హర్భాయ్ త్రివేది,తారాబెన్ మోదక్ గ్రామీణ,మహిళలవిద్యనుఅభివృద్ధిచేయడంలో సహాయపడ్డాడు.1888లో మహాత్మా గాంధీ చదివిన సమదాస్ ఆర్ట్స్ కళాశాల ఉన్నత విద్యను అందించే పురాతన సంస్థల్లో ఒకటి.భావ్‌నగర్ విశ్వవిద్యాలయం,శాంతిలాల్ షా ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, భావ్‌నగర్ ఉన్నత విద్యనుఅందించే కొన్నిఇతర సంస్థలు నగరంలో ఉన్నాయి.
పాఠశాలలు
[మార్చు]
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు
[మార్చు]
పరిశోధన, అభివృద్ధి
[మార్చు]పర్యాటక
[మార్చు]భావ్‌నగర్‌లో పర్యాటకులకు ఆసక్తి ఉన్న అనేక ప్రదేశాలు ఉన్నాయి :
- నీలాంబాగ్ రాజభవనం - భావ్‌నగర్ మహారాజు, హెచ్.హెచ్. మహారావోల్ విజయరాజ్‌సిన్హ్‌జీ వీరభద్రసింహ్‌జీ గోహిల్, అతని కుటుంబ సభ్యుల నివాసం. ఇది ఇప్పుడు హెరిటేజ్ ప్యాలెస్ హోటల్,రెస్టారెంట్ ఉపయోగిస్తున్నారు.
- ఘోఘా వద్ద సముద్ర తీరంలో భావన్‌గర్ నుండి 22 కిలోమీటర్లు (14 మై.) సముద్రతీర రాజగృహం ఉంది.ఇది ఒకప్పుడు భావ్‌నగర్ రాజకుటుంబం విశ్రాంతి మందిరంగా ఉపయోగించారు ఇప్పుడు ప్రయాణికుల కోసం హోటల్-అతిధి గృహంగా ఉపయోగస్తున్నారు.
- బార్టన్ గ్రంథాలయం అనేది రెండు అంతస్తుల భవనం,రెండు రెక్కలు ఆకారంతో ఒక సెంట్రల్ టవర్, గోతిక్ ఆర్చ్ విండోస్,మంగుళూరు టైల్స్‌తో వాలుగా ఉన్న పైకప్పుతో ఆష్లార్ రాతితో నిర్మించబడింది. 1882లో ప్రారంభించిన గుజరాత్‌లోని పురాతన గ్రంథాలయాలలో ఒకటి. సంగ్రహశాల ఉంది.[9]
- గాంధీ స్మృతి మహాత్మా గాంధీ స్మారక గ్రంథాలయం. ఇది సౌరాష్ట్ర ప్రాంత సంస్కృతిని సూచించే కళాత్మక వస్తువులను కలిగి ఉంది.
- నిష్కలంక్ మహాదేవ్ - భావ్‌నగర్ నగరానికి 20 కిమీ నుండి కొలియాక్ అనే గ్రామం సముద్రతీరానికి ప్రసిద్ధి చెందింది. మహాదేవుని ఆలయం ఉంది.పాండవులు తమ సొంత సోదరుడిని చంపిన పాపాలను తొలగించుకోవడానికి ఇక్కడికి వచ్చారని చెబుతారు.[10]
- ప్రాంతీయ విజ్ఞాన సంగ్రహశాల, భావ్‌నగర్ - ఇది కొత్త విజ్ఞాన సంగ్రహశాల.
మూలాలు
[మార్చు]- ↑ "BMC – Bhavnagar Municipal Corporation". Retrieved 25 November 2016.
- ↑ 2.0 2.1 "History of Bhavnagar city". Archived from the original on 17 August 2007. Retrieved 15 August 2007.
- ↑ Dosábhai, Edalji (1894). A History of Gujarat from the Earliest Period to the Present Time. United Print and General Agency. p. 177.
- ↑ Cahoon, Ben. "Indian Princely States A-J". Retrieved 25 November 2016.
- ↑ Naoroji, Dadabhai (1990). Poverty and un-British rule in Inda. Low Price Publications. p. 229.
- ↑ "Bhavnagar king's sacrifice to feature in school textbook – Times of India". The Times of India. Retrieved 25 November 2016.
- ↑ Philip Ward (1998). Gujarat–Daman–Diu: A Travel Guide. Orient Blackswan. p. 280. ISBN 8125013830.
- ↑ Gujarat State Gazetteers, 1969. Directorate of Govt. Print., Stationery and Publications, Gujarat State. p. 538.
- ↑ "~~ Barton Library – Bhavnagar ~~". Archived from the original on 21 October 2016. Retrieved 25 November 2016.
- ↑ "Nishkalank Mahadev Temple".