Jump to content

విశాల్ కృష్ణ

వికీపీడియా నుండి
విశాల్
విశాల్ రెడ్డి
జననం
విశాల్ కృష్ణారెడ్డి

(1975-08-29) 1975 ఆగస్టు 29 (వయసు 49)[1][2]
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థలయోలా కళాశాల, చెన్నై
వృత్తినటుడు, నిర్మాత, నడిగర్ సంఘం కార్యదర్శి
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
తల్లిదండ్రులుజి. కె. రెడ్డి
బంధువులువిక్రం కృష్ణ (అన్న)
ఐశ్వర్య (చెల్లెలు)
శ్రీయా రెడ్డి (వదిన)

విశాల్ కృష్ణ రెడ్డి (జననం 29 ఆగస్టు 1975)[1] ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు. సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. తన స్వంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించారు విశాల్.

తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విశాల్. ఆ తరువాత 2004లో చెల్లమే అనే సినిమాతో కథానాయుకునిగా తెరంగేట్రం చేసిన ఆయన సందకోళి(2005), తిమిరు(2006) సినిమాలతో విజయం అందుకున్నాడు.[3] తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తను స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండియ నాయుడు(2013), నాన్ సిగప్పు మనిథన్(2014) వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు విశాల్.

నడిగర్‌  సంఘం ఎన్నికలు

[మార్చు]

అక్టోబరు 2015లో అంతకుముందు ఉన్న కమిటీపై ఆరోపణలు వచ్చాకా జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారత నటీనటులు సంఘం (నడిగర్‌)కు విశాల్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.[4] తిరిగి మూడేళ్ల క్రితం 2019 జూలై 23న నడిగర్‌  సంఘం ఎన్నికలు జరిగాయి. అయితే ఓటింగ్‌లో విశాల్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో చెన్నై కోర్టు కౌంటింగ్‌ను నిలిపేసింది. తాజాగా విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్‌ జరిపి ఫలితాలను 2022 మార్చి 20న విడుదల చేశారు. నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా నాజర్‌ రెండోసారి గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించారు.[5]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

జి.కె.రెడ్డి, జానకీదేవిలకు 29 ఆగస్టు 1975న చెన్నైలో జన్మించారు  విశాల్. చెన్నైలో స్థిరపడిన తమిళ, తెలుగు సినీ నిర్మాత జి.కె.రెడ్డి. ఆయన అన్నయ్య విక్రమ్ కృష్ణ, అజయ్ అనే స్క్రీన్ పేరుతో  సినిమాల్లో  హీరోగా నటించారు. ఆ తరువాత విశాల్ చేసిన కొన్ని సినిమాలకు  నిర్మాతగా కూడా వ్యవహరించారు.[6] ఆయనకు ఒక  చెల్లెలు ఐశ్వర్య. చెన్నైలోని డాన్ బొస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్రాథమిక, మాధ్యమిక విద్య, లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు విశాల్.

కెరీర్

[మార్చు]

నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద వేదమ్(2001) సినిమాకు  సహాయ దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు ఒక నిర్మాత విశాల్ ను గాంధీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చెల్లమే(2004) సినిమాలో నటించేందుకు ఒప్పించారు.[7][8] ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న ఆయన  కోథు-పి-పట్టరై వద్ద నటన నేర్చుకునేందుకు చేరారు.[8] ఆయన నటన ఫర్వాలేదు అనిపించుకుంది అంటూ విమర్శకులు రాశారు.[9][10] ఆ తరువాత సందకోళి(2005) సినిమాలో తన తండ్రి నిర్మాణ సంస్థలో సహ దర్శకునిగా పనిచేసిన ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో నటించారు విశాల్.[11] చెల్లమే సినిమాలో కన్న ఆయన నటన మెరుగుపడిందనీ, మంచి యాక్షన్ హీరోగా రాణిస్తారని విమర్శకులు ప్రశంసలు లభించాయి ఆయనకు.[12] ఆ సమయానికి ఎదుగుతున్న యువ హీరోగా ఆయనను అభివర్ణించారు సినీ విలేకరులు.[13] డిష్యుం(2006) సినిమాలో అతిధిపాత్రలో నటించారు. 2006లో తిమిరు సినిమాలో చేశారు విశాల్. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా, విశాల్ నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.[14] వరసగా మూడో సినిమా మంచి విజయం సాధించడంతో విశాల్ తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు.[15]

ఆ తరువాత 2006లో ఆయన నటించిన సివప్పదిగారం సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా, సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి.[16] జనవరి 2008లో విడుదలైన తామిరభరణి మాత్రం మంచి హిట్ అయింది. విమర్శకుల ప్రసంశలు కూడా లభించాయి.[17][18] ఆ తరువాత ఏడాది భూపతి పాండియన్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత సినిమా మలాయ్ కొట్టాయ్ లో పూర్తిగా హాస్యంగా ఉండే పాత్ర విశాల్ ది. ఈ సినిమా కమర్షియల్ గా ఫరవాలేదనిపించినా, విశాల్ నటనకు విమర్శలు వచ్చాయి.[19] ఈ సినిమాకు ఒపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి.[20][21]

తన స్నేహితుడు, నటుడు ఆర్య సిఫారసు మేరకు దర్శకుడు బాలా తన  సినిమా అవన్ ఇవన్(2011)లో విశాల్ కు అవకాశమిచ్చారు.  ఈ సినిమా   షూటింగ్ సమయంలో విశాల్ ఆరోగ్యం చాలా విషయాల్లో దెబ్బతింది. మొదట తీవ్రమైన కంటి,  తలనొప్పితో బాధపడిన  విశాల్, సెట్లలో పెద్ద కండరాల గాయం అయింది.[22] ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు లభించినా, విశాల్ నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.[23][24] ఆ తరువాత ప్రభుదేవా దర్శకత్వంలో వేది(2011)  సినిమాలో  పోలీసు అధికారిగా నటించారు విశాల్. ఈ సినిమా  బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.[25]

2013లో సమర్ సినిమాలో నటించారు విశాల్.[26][27] అదే ఏడాది మరో మూడు సినిమాల్లో కనిపించారాయన. థీయ వెలై సేయ్యనుమ్ కుమారు సినిమాలో అతిథిపాత్రలోనూ, పట్టథు యానై, పాండియ నాయుడు సినిమాల్లో హీరోగానూ నటించారు విశాల్. ఆ తరువాత ఆయన మొదటి సారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు[28][29] నాన్ సిగప్పు  మనిథన్(2014) అనే  సినిమాతో నిర్మాతగా మారారు విశాల్. ఈ  సినిమాలో నర్కొలెప్సీ అనే మానసిక సమస్యతో బాధపడే పాత్రలో నటించారు ఆయన. ఈ సినిమా కోసం ఈ సమస్య ఉన్న కొంతమంది  నిజజీవిత రోగులను దగ్గర నుంచి గమనించారు.[30]

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Vishal celebrates his birthday". Sify.com. Archived from the original on 18 నవంబరు 2015. Retrieved 19 October 2015.
  2. "A meaningful birthday celebration for Vishal". Sify.com. Retrieved 19 October 2015.
  3. "Actor Vishal riding on success" Archived 2007-02-08 at the Wayback Machine.
  4. "Nadigar Sangam election dates announced – The Times of India".
  5. "ఎట్టకేలకు నడిగర్‌ సంఘం ఎన్నికల ఫలితాలు!". andhrajyothy. Archived from the original on 2022-05-05. Retrieved 2022-03-21.
  6. "Vikram Krishna weds Shriya reddy" Archived 2015-10-02 at the Wayback Machine.
  7. "Star Interviews : Hero Vishal: Interview and profile" Archived 2014-03-28 at the Wayback Machine.
  8. 8.0 8.1 "Interview with Chellamae Vishal" Archived 2004-10-13 at the Wayback Machine.
  9. Rangarajan, Malathi (17 September 2004).
  10. "Chellamey" Archived 2015-09-24 at the Wayback Machine.
  11. Prasad, G. (11 March 2006).
  12. "Sandakozhi" Archived 2015-09-24 at the Wayback Machine.
  13. "Vishal-The dark horse!" Archived 2016-06-24 at the Wayback Machine
  14. Sudha, S (4 August 2006).
  15. "Vishal alters the list of top heroes in Kollywood!
  16. Rajaraman, R (25 November 2006).
  17. Iyer, Sriram (14 January 2007).
  18. "Box-office analysis" Archived 2007-01-27 at the Wayback Machine.
  19. Srinivasan, Pavithra (28 September 2007).
  20. "Malaikottai – Masala comedy, no strings attached".
  21. S, Aishwarya (4 November 2007).
  22. Manigandan, KRI (22 January 2011).
  23. Vaadu Veedu Telugu Movie Review Archived 2011-05-26 at the Wayback Machine.
  24. Janani Karthik (9 July 2012).
  25. "Vishal's third project in a row".
  26. "Samar Movie Review".
  27. "Samar Tamil Movie Review" Archived 2012-07-22 at the Wayback Machine.
  28. Top 10 Tamil grossers of 2013 – The Times of India.
  29. 2013 – The top 10 Tamil grossers Archived 2014-08-20 at the Wayback Machine.
  30. Neelima Menon (7 April 2014).

బయటి లింకులు

[మార్చు]