లయోలా కళాశాల, చెన్నై
స్వరూపం
![]() లయోలా కళాశాల | |
నినాదం | Luceat Lux Vestra |
---|---|
ఆంగ్లంలో నినాదం | Let your Light Shine |
రకం | స్వయం ప్రతిపత్తి |
స్థాపితం | 1925 |
వ్యవస్థాపకుడు | Fr. Francis Bertram |
అనుబంధ సంస్థ | మద్రాసు విశ్వవిద్యాలయం |
మతపరమైన అనుబంధం | Jesuit (Roman Catholic) |
స్థానం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
అథ్లెటిక్ మారుపేరు | Loyolite |
జాలగూడు | loyolacollege.edu |
లయోలా కళాశాల (Loyola College - లయోలా కాలేజీ) అనేది చెన్నై నగరంలో మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి గల జెస్యూట్ విద్యాసంస్థ. ఇది వాణిజ్యం, కళలు, ప్రకృతి శాస్త్రాలు, సామాజిక శాస్త్రాల డిగ్రీ కోర్సుల కోసం భారతదేశంలోని విద్యాసంస్థలలో ఉన్నత ఐదు ర్యాంకుల మధ్య స్థిరంగా ఉంది.[1] ఇది విస్తారమైన కళల, శాస్త్రాల, వాణిజ్యములందు అండర్‌గ్రాడ్యుయేట్స్, పోస్ట్-గ్రాడ్యుయేట్స్, గౌరవ డిగ్రీల కొరకు ప్రవేశమిస్తుంది. ఈ కాలేజీ 99 ఎకరాలలో చెన్నై నడిబొడ్డైన నుంగంబక్కమ్‌లో క్యాంపస్ను కలిగివుంది. దీని యొక్క ఇరువైపుల చెట్లు గల దారులు, అకాడమిక్ భవనాలు, 1930 నాటి నిటారు గోతిక్ చర్చి, ప్రతి క్రీడ కోసం ప్రత్యేక ఫీల్డ్స్ దీనిని దక్షిణ మెట్రోపోలిస్ ప్రాంతంలో ఒక ముఖ్యమైన ప్రదేశం చేశాయి.
పూర్వవిద్యార్థులు
[మార్చు]ఈ కళాశాలలో చదువుకున్న కొంత మంతి ప్రముఖులు:
- రామస్వామి వెంకట్రామన్ - భారత మాజీ రాష్ట్రపతి
- జాస్తి చలమేశ్వర్ - సుప్రీం కోర్టు న్యాయమూర్తి.
- పూసపాటి ఆనంద గజపతి రాజు - విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు.
- పి. చిదంబరం - కేంద్ర మాజీ హోం మంత్రి.
- దయానిధి మారన్ - లోక్‌సభ సభ్యుడు. మాజీ కేంద్ర మంత్రి.
- పర్వతనేని బ్రహ్మయ్య - పేరొందిన ఛార్టర్డ్ అకౌంటెంట్.
- వర్ఘీస్ కురియన్ - సామాజిక వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు.
- మహేంద్రసింగ్ ధోని - భారతీయ క్రికెటర్.
- రమేశ్ కృష్ణన్ - టెన్నీస్ క్రీడాకారుడు.
- రామనాథన్ కృష్ణన్ - టెన్నీస్ క్రీడాకారుడు.
- పాలగుమ్మి సాయినాథ్ - పాత్రికేయుడు.
- ఘట్టమనేని మహేశ్ బాబు - సినిమానటుడు.
- దగ్గుబాటి వెంకటేష్ - సినిమానటుడు.
- ప్రశాంత్ - సినిమానటుడు.
- యువన్ శంకర్ రాజా - సంగీత దర్శకుడు.
- అరవింద్ స్వామి - సినిమానటుడు.
- విశాల్ కృష్ణ - సినిమానటుడు.
- విశ్వనాథన్ ఆనంద్ - చదరంగ క్రీడాకారుడు.
చిత్రమాలిక
[మార్చు]-
ప్రవేశద్వారం
-
తమిళంలో ప్రవేశద్వారం వద్ద నేమ్ బోర్డ్
-
లయోలా చర్చి
మూలాలు
[మార్చు]- ↑ "Top 5". Archived from the original on 2016-06-18. Retrieved 2016-07-14.

వికీమీడియా కామన్స్‌లో Loyola College, Chennaiకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.