ఆర్య(నటుడు)
ఆర్య(జననం:1980) ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన ఆయన మళయాళంలో చాలా సినిమాలు నిర్మించారు. ఆర్య అసలు పేరు జమ్షద్ చేతిరకత్. విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటించిన అరినుథమ్ అరియమలుమ్(2005), పట్టియల్(2006) సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్య. బాలా దర్శకత్వంలో వచ్చిన నాన్ కడవుల్(2009) సినిమాలోని నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత ఆయన నటించిన మదరసపట్టినమ్(2010), బాస్ ఎంగిర భాస్కరన్(2010(తెలుగు:నేనే అంబానీ)), వెట్టాయ్(2012) వంటి సినిమాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి.[1][2][3] ఆయన ఒక ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం, ఫిలింఫేర్, విజయ్ పురస్కారలకు నామినేషన్లు అందుకున్నారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం ఆర్యకు కళైమామణి పురస్కారం ఇచ్చి గౌరవించింది.[4]
ఆయన తన స్వంత నిర్మాణ సంస్థ ది షో పీపుల్ తో ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆగస్టు సినిమా నిర్మాణ సంస్థలో ఆర్య భాగస్వామిగా కూడా ఉన్నారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1980లో కేరళలోని త్రికరిపూర్ లో మళయాళ కుటుంబంలో జన్మించారు ఆర్య. చెన్నైలోని ఎస్.బి.ఒ.ఎ మెట్రిక్యులేషన్ అండ్ హైయర్ సెకెండరీ స్కూల్ లో చదువుకున్నారు. చెన్నైలో క్రెసెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివారు ఆర్య. ఆయన తండ్రి రెస్టారెంట్ యజమాని, ఫుట్ బాల్ క్రీడాకారుడు.[5] ఆర్య తమ్ముడు సత్య కూడా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
వాట్టెర్న్ ర్నున్దన్ మోటాలా సైకిల్ రేస్ లో పాల్గొని మెడల్ కూడా సంపాదించుకున్నారు ఆర్య.[6]
కెరీర్
[మార్చు]2005–2007
[మార్చు]అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నప్పుడు ఆర్య పక్క ఇంటిలోఉండే సినిమాటోగ్రఫర్ జీవా తను తీయబోయే సినిమా ఉల్లమ్ కెట్కుమాయే సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కు రమ్మని ఆర్యను అడిగారు. ఈ సినిమాకు ఒప్పుకున్న ఆయన పేరును ఆర్యగా మార్చారు జీవా.[7] ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అయింది.[8] దాంతో విష్ణువర్ధన్ దర్శకత్వంలో అరినుథమ్ అరియమలుమ్(2005) సినిమాతో తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.[9][10] ఈ సినిమాలో గాంగ్ స్టర్ కొడుకుగా ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అంతే కాక 2005లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన.[11] ఆర్య నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.[12] చాలా ఏళ్ళ తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకంటూ ఓ గుర్తింపు రావడానికి కారణం యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన తీ పిడికా పాట వల్లే అని గుర్తుచేసుకున్నారు.[7] 2003లో మొదలైన ఉల్లమ్ కెట్కుమయే సినిమా 2005లో విడుదలై మంచి విజయం సాధించింది. కాలేజీలో క్రికెటర్ పాత్రలో నటించిన ఆర్యకు ప్రశంసలు లభించాయి.[13] 2005లోనే తన మూడో సినిమా ఒరు కల్లురియిన్ కథై సినిమా హిట్ కాలేదు.[14] కానీ ఆయన నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. దాంతో ఆర్యను తమిళ సినీ రంగంలో యువ కెరటంగా భావించారు సినీజనాలు. ఆయనకు ఆ తరువాత అవకాశాలు కూడా చాలా ఎక్కువే వచ్చయి.[15]
ఇతర రంగాల్లో కృషి
[మార్చు]2010లో ది షో పీపుల్ పేరుతో స్వంత నిర్మాణ సంస్థను స్థాపించారు ఆర్య. ఈ బ్యానర్ ద్వారా చిన్న బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నారు. మొదటగా బాస్ ఎంగిర భాస్కరన్(తెలుగులో నేనే అంబానీ) సినిమాను నిర్మించారు ఆయన. ఆ తరువాత ఆయన నిర్మించిన పడితురై సినిమా ఇంకా విడుదల కాలేదు.[7] 2013లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు ఆర్య. తన సినిమా ఇరందాం ఉలగం సినిమా సింగపూర్, మలేషియా థియేటర్ హక్కులను కొన్నారు.[16]
పోతీస్ వస్త్ర సంస్థ ఓట్టో బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు ఆర్య.[17]
సినిమాలు
[మార్చు]నటునిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ | |
---|---|---|---|---|---|
2005 | అరింతం అరియాములుమ్ | కుట్టి | తమిళం | ఉత్తమ తొలి నటునికి ఫిలింఫేర్ అవార్డ్-సౌత్[18] | |
2005 | ఉల్లమ్ కెట్కుమే | ఎమాన్ | తమిళ్ | ||
2005 | ఒరు కల్లురియిన్ కథై | సత్య | తమిళ్ | ||
2006 | కలభ కథలన్ | అఖిలన్ | తమిళ్ | ||
2006 | పట్టియల్ | కొసి | తమిళ్ | ||
2006 | వట్టరమ్ | బర్మ | తమిళ్ | ||
2007 | మాయ కన్నడి | స్వంతపాత్ర | తమిళ్ | అతిథి పాత్ర | |
2007 | ఒరమ్ పో | చంద్రు | తమిళ్ | ||
2009 | నాన్ కదువల్ | రుద్రన్ | తమిళ్ | ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్[19] విజయ్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్[20] | |
2009 | శివ మనసుల శక్తి | అరుణ్ | తమిళ్ | అతిథి పాత్ర[21] | |
2009 | శరవమ్ | కార్తిక్ | తమిళ్ | ||
2010 | వరుడు | దివాకర్ | తెలుగు | ||
2010 | మద్రసపట్టినమ్ | ఇలమ్ పరిథి | తమిళ్ | ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్[22] విజయ్ ఉత్తమ నటుడు అవార్డుకు నామినేషన్[23] | |
2010 | కాదల్ సొల్ల వందెన్ | డాక్టర్ | తమిళ్ | అతిథి పాత్ర[24] | |
2010 | బాస్ ఎంగిర భాస్కరన్ | భాస్కరన్ | తమిళ్ | ||
2010 | వా | చంద్రు | తమిళ్ | అతిథి పాత్ర[25] | |
2010 | చికు బుకు | అర్జున్ శేఖర్/శేఖర్ | తమిళ్ | ||
2011 | ఉర్మి | చిరక్కల్ కొతువల్/తంగచన్ | మళయాళం | ||
2011 | అవన్ ఇవన్ | కుంబుదురెన్ సామి | తమిళ్ | ||
2012 | వెట్టాయ్ | గురుమూర్తి | తమిళ్ | ||
2012 | ఒరు కాల్ ఒరు కన్నడై | రజిని మురుగన్ | తమిళ్ | అతిథి పాత్ర[26] | |
2013 | సెట్టై | జయకాంతన్(జెకె) | తమిళ్ | ||
2013 | రాజా రాణి | జాన్ | తమిళ్ | ||
2013 | అర్రంబమ్ | అర్జున్ | తమిళ్ | ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ | |
2013 | ఇరందామ్ ఉలంగమ్ | మధు బాలకృష్ణన్/మరువన్ | తమిళ్ | ||
2014 | కథై తిరైకథై వసనమ్ ఇయక్కమ్ | స్వంతపాత్ర | తమిళ్ | అతిథిపాత్ర | |
2014 | జీవా | కెమెరామేన్ | తమిళ్ | అతిథి పాత్ర | |
2014 | మేఘమ్మన్ | శివ | తమిళ్ | ||
2015 | పురంపొక్కు ఎంగిర పొదువుదమై | బాలు | తమిళ్ | ||
2015 | రోమియో జూలియట్ | స్వంత పాత్ర | తమిళ్ | అతిథి పాత్ర | |
2015 | ఇంద్రు నేత్రు నాలై | టైం మెషిన్ కనుగొన్న శాస్త్రవేత్త | తమిళ్ | అతిథి పాత్ర | |
2015 | వసువం సరవననుం ఒన్న పడిచవంగా | శరవణన్ | తమిళ్ | ||
2015 | డబుల్ బారెల్ | మజ్ను | మళయాళం | ||
2015 | యట్చన్ | చిన్నా | తమిళ్ | ||
2015 | త్రిష ఇల్లన నయనతార | హరిష్ | తమిళ్ | అతిథి పాత్ర | |
2015 | సైజ్ జీరో | అభిషేక్ | తెలుగు | ||
2015 | ఇంజు ఇడుప్పళగై(సైజ్ జీరో) | తమిళ్ | |||
2016 | బెంగళూర్ నాట్కల్ | అర్జున్(అజు) | తమిళ్ | ||
2016 | నంబియార్ | భాస్కర్ | తమిళ్ | అతిథి పాత్ర | |
2017 | కదంబన్ \ గజేంద్రుడు (2019 తెలుగు) | తమిళ్ | |||
2018 | రాజరాథ \ రాజరథం | కన్నడ \ తెలుగు | |||
2021 | సార్పట్ట పరంబర్తె \ సార్పట్ట పరంపర | తమిళ్ \ తెలుగు | |||
2021 | ఎనిమి \ ఎనిమి | తమిళ్ \ తెలుగు | |||
2021 | టెడ్డీ | తమిళ్ \ తెలుగు | |||
2021 | అరణ్మనై-3 (తమిళం) \ అంతఃపురం | తమిళ్ \ తెలుగు | |||
2022 | పడి నెట్టం పడి (మలయాళం) \ గ్యాంగ్స్ ఆఫ్ 18 | మలయాళం \ తెలుగు |
నిర్మాతగా
[మార్చు]ది షో పీపుల్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి ఆర్య తమిళ, మళయాళ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మించారు.
సంవత్సరం | చిత్రం | దర్శకుడు | భాష |
---|---|---|---|
2014 | అమర కావియం | జీవ శంకర్ | తమిళ్ |
2014 | జీవా | సుసీంతిరన్ | తమిళ్ |
2015 | వసువం సరవనునం ఒన్న పడిచవంగ | ఎం.రాజేశ్ | తమిళ్ |
2015 | డబుల్ బారెల్ | లిజో జోస్ పెళ్ళిస్సెరి | మళయాళం |
2016 | దరవింటె పరినమమ్ | జిజో ఆంతోని | మళయాళం |
2016 | అనురాగ కరిక్కిన్ వెల్లమ్ | ఖలిద్ రెహమాన్ | మళయాళం |
2017 | ది గ్రేట్ ఫాదర్ | హనీఫ్ | మళయాళం |
2021 | ఎనిమి | తెలుగు \ తమిళ్ |
పంపణీ రంగంలో
[మార్చు]సంవత్సరం | చిత్రం | దర్శకుడు |
---|---|---|
2010 | బాస్ ఎంగిర భాస్కరన్ | ఎం.రాజేశ్ |
మూలాలు
[మార్చు]- ↑ Arya: All play and all work Archived 2006-04-14 at the Wayback Machine.
- ↑ SSN students at their shouting best in ‘Instincts 2K9’.
- ↑ "What's next, Mr. John Vijay?". Archived from the original on 2008-01-17. Retrieved 2016-09-10.
- ↑ Tamil Nadu Govt announces Kalaimamani awards.
- ↑ Birthday Exclusive: Arya.
- ↑ Arya wins medal at Vatternrundan motala cycle race Archived 2015-06-20 at the Wayback Machine.
- ↑ 7.0 7.1 7.2 ""I compete with my self" [An exclusive with Arya]".
- ↑ Reddy, Krithika (21 July 2005).
- ↑ "Entertainment Chennai : Tamil cinema's new high" Archived 2005-12-31 at the Wayback Machine.
- ↑ http://www.sify.com/movies/tamil-box-office-2005-news-boxoffice-kkfvwTchhge.html Archived 2015-09-24 at the Wayback Machine.
- ↑ Moviebuzz (2005).
- ↑ "Arindhum Ariyamalum – Entertaining and enlivening" Archived 2010-10-26 at the Wayback Machine.
- ↑ "Ullam Ketkume` – A sleeper hit!"
- ↑ Chennai Box-Office (Sep 02-04) Archived 2014-01-23 at the Wayback Machine.
- ↑ "Oru Kalluriyin Kadhai – Campus complex" Archived 2010-10-06 at the Wayback Machine.
- ↑ Arya turns distributor with 'Irandam Ulagam'.
- ↑ Otto Shirts – Arya.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-10. Retrieved 2016-09-10.
- ↑ Nominations for 57th South Filmfare Awards – Filmibeat Archived 2014-04-07 at the Wayback Machine. Entertainment.oneindia.in (10 July 2010). Retrieved on 2016-01-12.
- ↑ Vijay Awards : 06/21/10 యూట్యూబ్లో
- ↑ "Arya to do a cameo — Tamil Movie News". Indiaglitz.com. 8 August 2011. Retrieved 24 February 2014.
- ↑ Published, Ramchander. (2 June 2011) 58th Idea Filmfare Awards South nominees – Filmibeat Archived 2013-12-30 at the Wayback Machine. Entertainment.oneindia.in. Retrieved on 2016-01-12.
- ↑ Vijay Awards : 5th Annual Vijay Awards — Best Actor Male Award యూట్యూబ్లో
- ↑ "Kaadhal Solla Vandhen". Top10 Cinema. 14 August 2010. Archived from the original on 27 ఫిబ్రవరి 2014. Retrieved 24 February 2014.
- ↑ "Va Quarter Cutting could have been funnier — Rediff.com Movies". Rediff.com. 5 November 2010. Retrieved 24 February 2014.
- ↑ "Arya does a cameo in OKOK". Sify.com. 9 August 2011. Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 24 February 2014.