Jump to content

వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు

వికీపీడియా నుండి
శిక్షణా కార్యక్రమాలు
2024 తరగతులు
01 · 02 · 03 · 04 · 05 · 06 · 07 · 08 · 09 · 10
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20
2025 తరగతులు
01 · 02 · 03 · 04 · 05 · 06
07 · 08
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు నిర్వహిస్తున్న తెవికీ బడి శిక్షణా కార్యక్రమాలకు స్వాగతం. తెలుగు వికీపీడియాలో రాస్తూ, తెవికీ రచనలోని వివిధ అంశాల గురించి నేర్చుకోవాలనుకుంటున్న వాడుకరులకు ఆన్లైన్ ద్వారా వికీపాఠాల శిక్షణ అందించడానికి, యూజర్ గ్రూపు ఈ తెవికీ బడి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు మొదటి కార్యక్రమం. యూజర్ గ్రూపు ఏర్పాటు గురించి చర్చిస్తున్న పలు సందర్భాలలో ఆయా చర్చలలో పాల్గొన్న సముదాయ సభ్యులు తమకు తెవికీ రచనలో మరింత శిక్షణ కావాలని, అందుకోసం ఆన్లైన్ ద్వారా వికీపాఠాలను నేర్పించాలని కోరడంతో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

జరిగిన తరగతులు

[మార్చు]

2024 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 20 ఆదివారాల పాటు శిక్షణ తరగతులను నిర్వహించింది.

వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు, అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం, వికీమీడియా అందించే గ్రాంట్లు, సహకారాలు, వికీసోర్సులో సురవరం ప్రతాపరెడ్డిగారి గ్రంధాల OCR, ప్రూఫ్ రీడింగ్ ప్రక్రియల గురించిన శిక్షణ, వికీపీడియాలో వివిధరకాల పేజీలు, పేరుబరులు, నిర్వహణ, ట్రాన్స్క్లూషన్, సబ్స్టిట్యూషన్ ప్రక్రియలు, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ (OSM) పరిచయం,మ్యాఔలు సృస్ఃఝ్టించడం, వికీ ప్రాజెక్టుల్లో వాడుకోవడం, యూజర్ స్క్రిప్ట్స్, గాడ్గేట్స్, సవరణ ఘర్షణ, ఇటీవలి మార్పులు, వీక్షణ జాబితా, హాట్ కేట్, క్లుప్త వివరణ, విజువల్ ఎడిటర్, ఫైండ్ ది లింక్, వికీడేటా, ప్రక్రియలు, వివిధ ఉపకరణాలు, పెట్ స్కాన్, వికీప్రాజెక్టులలో ఉపయోగించే ప్రక్రియలు వంటి పలు అంశాల గురించి ఈ తరగతుల్లో శిక్షణ నిచ్చారు.

  • మొదటి శిక్షణా కార్యక్రమం: 2025 జనవరి 27 నుండి ఫిబ్రవరి 1 వరకు రోజూ తరగతులు జరిగాయి. 2024-25 హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో కొత్తగా వికీపీడియా పరిచయమైన వారికి వికీపీడియా ప్రాథమిక అంశాల పరిచయ కార్యక్రమాలు జరిగాయి.
  • రెండవ విడత: