Jump to content

లాస్ వేగస్

అక్షాంశ రేఖాంశాలు: 36°10′30″N 115°08′11″W / 36.17500°N 115.13639°W / 36.17500; -115.13639
వికీపీడియా నుండి
లాస్ వేగస్
లాస్ వెగాస్ పట్టణం
Downtown Las Vegas
Las Vegas Springs PreserveStratosphere Tower
[[File:|World Market Center|132px]]Lou Ruvo Center for Brain Health
Clark County Government Center
పైనుంచి సవ్యదిశలో: డౌన్‌టౌన్ లాస్ వెగాస్ పైనుండి, స్ట్రాటో ఆవరణ టవర్, లా రువో సెంటర్ ఫర్ బ్రైన్ హెల్త్, క్లార్క్ కంట్రీ గవర్నమెంటు సెంటర్, వరల్డ్ మార్కెట్ సెంటర్ లాస్ వెగాస్, లాస్ వెగాస్ స్ప్రింగ్ ప్రిజర్వ్
Flag of లాస్ వేగస్
Official seal of లాస్ వేగస్
Etymology: Spanish: Las vegas (The meadows)
Nickname(s): 
"Vegas",[1] "Sin City", "City of Lights", "The Gambling Capital of the World",[2] "The Entertainment Capital of the World", "Capital of Second Chances",[3] "The Marriage Capital of the World", "The Silver City", "America's Playground"
Location of the city of Las Vegas within Clark County, Nevada
Location of the city of Las Vegas within Clark County, Nevada
లాస్ వేగస్ is located in the United States
లాస్ వేగస్
లాస్ వేగస్
Location in the contiguous United States
Coordinates: 36°10′30″N 115°08′11″W / 36.17500°N 115.13639°W / 36.17500; -115.13639
CountryUnited States
StateNevada
CountyClark
FoundedMay 15, 1905
IncorporatedMarch 16, 1911
Government
 • TypeCouncil–manager
 • MayorCarolyn Goodman (I)
 • Mayor Pro TemSteve Ross (D)
 • City managerBetsy Fretwell
విస్తీర్ణం
 • పట్టణం135.8 చ. మై (352 కి.మీ2)
 • Land135.8 చ. మై (352 కి.మీ2)
 • Water0.05 చ. మై (0.1 కి.మీ2)
Elevation
2,001 అ. (610 మీ)
జనాభా
 • పట్టణం5,83,756
 • Estimate 
(2017)[5]
6,48,224
 • జనసాంద్రత4,300/చ. మై. (1,700/కి.మీ2)
 • Urban
22,11,315
 • Metro
22,48,390
 • CSA
23,62,015 (US: 26th)
DemonymLas Vegan
Time zoneUTC−8 (PST)
 • Summer (DST)UTC−7 (PDT)
ప్రాంతపు కోడ్702 & 725
FIPS code32-40000
GNIS feature ID0847388

లాస్ వేగస్ నగరం అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం. క్లార్క్ కౌంటీ ఆరంభంలో ఉన్న ఈ నగరంలోని అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వసతిగృహాలు ప్రంపంచ ప్రసిద్ధి కలిగి ఉన్నాయి. ఈ నగరం జూదగృహాలకు, అనేక ఇతర విలాసాలకు పేరొందిన ఆకర్షణీయ నగరం. వినోదాలకు, షాపింగ్, విలాసాలకు ఈ నగరం మిక్కిలి ప్రసిద్ధి. ఈ నరగరం వినోదాలకు అంతర్జాతీయ కేంద్రం. వసతిగృహాలు కలిగిన బృహత్తర జూదగృహాలు తదనుగుణ ఇతర వినోదాలు ఈ నగర ఆకర్షణీయ అంశాలు. ఇక్కడ ఉన్న అనేక రూపాలలో విలాస కార్యకలాపాలకు అనువైన వ్యాపారాల కారణంగా ఇది పాపాల నగరంగా పేరు పొందింది. ఇక్కడ ఆకర్షణీయమైన విద్యుదలంకరణ అనేక ఇతర ఆకర్షణలు జూదమాడే వారే కాక దేశవిదేశాల నుండి అనేకమంది దీనిని సందర్శిస్తుంటారు. ఇక్కడి ఆకర్షణలు చిత్ర రంగాన్ని, దూరదర్శన రంగాన్ని కూడా తనవైపు తిప్పుకున్నాయి. లాస్ వేగస్ స్ట్రిప్ వెలుపలి ప్రాంతంలో అంతటా అద్భుత విద్యుత్‌ దీపాలకరణలతో నిండి ఉంటుంది. నగరమంతా కూడా సాధారణంకంటే దీపాలంకరణ అధికమే. ఈ కారణంగా నగరం ప్రపంచంలో ప్రకాశవంతమైన నగరంగా పేరుపొందింది. అంతరిక్షంలో నుండి చూసినా ఈ నగరం ప్రకాశవంతంగా కనబడుతుందని ప్రతీతి.

లాస్ వేగస్ నగరం 1905లో స్థాపించబడింది. 1911లో ఇది అధికార పూర్వంగా గుర్తింప బడింది. తరువాతి కాలంలో క్రమంగా అభివృద్ధి చెంది శతాబ్దం చివరికంతా 20వ శతాబ్ధపు అత్యంత జనసాంద్రత కలిగిన అమెరికా నగరాలలో ఒకటిగా పేరుపొందింది. 19వ శతాబ్ధానికి చికాగో నగరానికి ఇలాటి గుర్తింపు వచ్చింది. 2000లో అమెరికాలోని అధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఈ నగరం 28వ స్థానంగా నమోదైంది. ఈ నగర జనసంఖ్య దాదాపు 5,58,880. నగరం పరిసర ప్రాంత ప్రజలను కలుపు కుంటే జనసంఖ్య 20,00,000 కంటే అధికం.

లాస్ వేగస్ స్ట్రిప్, పరిసర ప్రాంతాలలో ఉన్న విలాస వంతమైన వసతి గృహాలు కలిగిన 4.5 మైళ్ళ ప్రాంతం మాత్రమే లాస్ వేగస్ అని పిలువ బడుతుంది. పారడైస్, విన్‌చెస్టర్ నగరాల పరిమితిలో కలపబడని వెలుపలి ప్రాంతంలో లాస్ వేగస్‌కు చెందిన 4.5 మైళ్ళ ప్రాంతం ఉంటుంది.

చరిత్ర

[మార్చు]

లాస్ వేగస్ పేరు స్పెయిన్ వ్యాపార సమూహం అంటోనియో ఆర్మిజో పార్టీ నాయకునిచే రూపొందింది. 1800లో టెక్సాస్ నుండి ఉత్తర పడమటి ప్రాంతాల వైపు వెళుతూ ఇక్కడ నీటి కోసం బస చేసినప్పుడు ఆర్టేషియన్ వెల్స్ అనబడే ప్రకృతి సహజంగా ఏర్పడిన నీటీ బావుల కారణంగా ఈ ప్రాంతంలో పచ్చగా ఏపుగా పెరిగిన పచ్చిక బయళ్ళను చూసి ఈ ప్రాంతానికి లాస్ వేగస్‌గా నామకరణం చేసాడు. వెగాస్ అంటే స్పానిష్ భాషలో పచ్చిక బయలు (మెడోస్) అని అర్ధం. తరువాత ఇది లాస్ వేగస్, ఈ కొండ ప్రాంతం లాస్ వేగస్ వెల్లీగానూ పిలువబడుతుంది.

1844 మే 3వ తారీఖున ఈ ప్రాంతం గుండా ప్రయాణించాడు. అప్పటీకి ఇది మెక్సికో పాలన క్రింద ఉంది. ఈ ప్రాంతం అమెరికా పాలనలోకి వచ్చిన తరువాత 1855 మే 10వ తారీఖున పియుట్ ఇండియన్లను మార్మోనిజమ్కి మార్చే ప్రయత్నంలో ఉన్న విలియమ్ బ్రింగ్‌హర్‌స్ట్ నాయకత్వంలో పనిచేస్తున్న 30 మిషనరీలకు బ్రిగ్‌హామ్ యంగ్చే ఒప్పగించబడింది. ఆ తరువాత ప్రస్తుత డౌన్‌టౌన్ ప్రాంతంలో ఒక కోటను నిర్మించారు. ఆ కోట మార్మన్ కారిడార్ వెంట ప్రయాణించే ప్రయాణీకులకు మజిలీగా ఉపయోగ పడింది. ఎట్టకేలకు 1857 కంతా మార్మోన్స్ లాస్ ‌వెగాస్‌ను వదిలి వెళ్ళారు. 1905 మే 15 తారీఖు నాటికి లాస్ వేగస్ రైల్‌రోడ్ టౌన్‌గా అభివృద్ధి చెందింది. లాస్‌ వెగాస్ 1906 వరకు లింకన్ కౌన్‌టీలో భాగంగా ఉంది. తరువాతి కాలంలో నూతనంగా క్లార్క్ కౌన్‌టీ స్థాపించి అభివృద్ధి చెందిన తరువాత 1906 నుండి క్లార్క్ కౌన్‌టీలో ఒక భాగమైంది. 1910లో ప్రస్తుతం డౌన్‌టౌన్‌లోని బ్రిడ్జర్‌లో ది సెయింట్ జాన్ ఆఫ్ ఆర్క్ కాథలిక్ చర్చ్ స్థాపించబడింది. 1911 మార్చి‌16వ తారీఖున లాస్ వేగస్ కార్పొరేషన్‌గా మారింది.
1931 మార్చి 19వ తారీఖున ఇక్కడ జూదక్రీడకు న్యాయసమ్మతమైన అంగీకారాన్ని పొందింది. 1946 డిసెంబరు 16వ తారీఖున అపకీర్తికరమైన ఫ్లెమింగో హోటల్ బగ్సీ సైగల్‌చే లాస్ వేగస్‌లో స్థాపించబడింది. తరువాతి కాలంలో ఇది లాస్ వేగస్ స్ట్రిప్గా నామాంతరం చెందింది. 1936 అక్టోబరు 9వ తారీఖున లాస్ వేగస్‌లో హూవర్ డామ్ నిర్మాణం పూర్తి అయింది. 1951 నుండి 1962 వరకు లాస్ వేగస్ ఎత్తైన భూభాగంలో న్యూక్లియర్ ప్రయోగాలు జరిగాయి. 1989 నవంబరు 22వ తారీఖున ది మైరేజ్ పేరుతో కాసినోలనబడే జూదగృహాలతో చేరిన బృహత్తర వసతిగృహ నిర్మాణాలు ప్రారంభోత్సవం చేసుకున్నాయి.

ఆర్ధిక చరిత్ర

[మార్చు]

లాస్ వేగస్ పడమట తీరాలకు పయనించే వారి మజిలీ స్థానం నుండి 1900 నాటికి రైల్‌రోడ్ పట్టణంగా మారింది. ఈ ప్రాంతంలో ఉన్న గనులలో పనులు ప్రారంభం కావ్డానికి ఇది నాంది. ప్రత్యేకంగా బుల్‌ఫ్రాగ్ ప్రాంతం తయారైయ్యే సరుకు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరవేసే మార్గం సుగమమైంది. రైల్ ప్రయాణాల ద్వారా గమ్యం సులువుగా చేరడంతో లాస్ వేగస్ ప్రాముఖ్యం కొంత తగ్గింది. అయినా 1935లో హూవర్ డామ్ నిర్మాణం పూర్తి చేసుకోడంతో ఇక్కడకు వచ్చే పర్యాటలుల సంఖ్య పెరగింది. 1931 నుండి జూదం (గాంబ్లింగ్) చట్టబద్దం చేయడంతో పర్యాటక రంగం త్వరితగతిన అభివృద్ధి చెందటం ప్రారంభం అయింది. ఆ తరువాత కాసినోలనబడే వసతి గృహాలు, వినోదాల, విలాసాల కేంద్రాలైన జూదగృహాలకు ఇది అంతర్జాతీయ కేంద్రం కావడం ఈ నగరం పర్యాటక ఆకర్షణ ఇనుమడించింది.

లాస్ వేగస్ జూదగృహాలతో ఇక్కడ నేరాల, నేరస్థుల కేంద్రంగా మారింది. ఈ విషయంలో ఈ నగరానికి అపకీరి ఉంది. ఒకప్పటి ముఠా నాయకులచే ఇక్కడ ప్రముఖ జూదగృహాలు నడపబడటం ఇందుకు కారణం. ముఠా నాయకులైన బెన్‌జమిన్"బగ్‌సీ" సైగల్, మెయర్ లాన్‌స్కీ ఇక్కడి అనేక జూద గృహాలను నిర్వహించడం విశేషం.

లాస్ వేగస్ పర్యాటక అభివృద్ధి వలన నిరంతర ప్రవాహంలా వచ్చిపడే ధనం నగరంలో నెలిస్ ఎయిర్ ఫోర్స్ స్థాపనకు దారితీసింది. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు, కాసినోలలో ఉద్యోగాల కోసం వచ్చి చేరే జనవాహిని కారణంగా నగరంలో నివాస గృహాల ఆవశ్యకత పెరిగింది. ప్రస్తుత సమయం వరకూ ఈ వరవడి అలా సాగుతూనే ఉంది. నగర ఆదాయం కాసినోల వలన అభివృద్ధి చెందుతూనే ఉన్నా హాంగ్‌‌కాంగ్లోని కాసినోల ప్రభావం లాస్ వేగస్ మీద బాగా ఉంది. 2007లో 1000 కోట్ల అమెరికా డాలర్ల ఆదాయంతో హాంగ్‌కాంగ్ కాసినో వ్యాపారంలో మొదటి స్థానంలో ఉంది.

భౌగోళికం

[మార్చు]
లాస్ వేగస్‌లోని ఎడారిభూమి

లాస్ వేగస్ నగరం వైశాల్యం 131.3 చదరపు మైళ్ళు. ఇందులో 131.2 చదరపు మైళ్ళు భూభాగం 0.1 చదరపు మైలు జలభాగం. లాస్ వేగస్ కొండల మధ్య ఉన్న పొడి నేలలు కలిగిన ప్రదేశం. నగరం సముద్ర మట్టానికి 2030 అడుగులు ఎత్తులో ఉంది. భూమి లేత గులాబీ, లేత ఎరుపు, బూడిద రంగులలో ఉంటుంది. పడమటి భాగంలో స్ప్రింగ్ పర్వత శిఖరాలు ఉన్నాయి. ఎడారిని భూములకు తగినట్లుగా ధూళితో నిండిన రాతి భూమి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ నగరంలో పచ్చికతో నిండిన లాన్లు, వృక్షాలు, పచ్చదనంతో నిండి ఉన్నాయి. జలవనరులు తక్కువగా ఉన్న కారణంగా లాన్ల స్థానంలో జలాన్ని అతి తక్కువగా ఉపయోగించుకునే ఎడారి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

వాతావరణం

[మార్చు]

లాస్ వేగస్ వాతావరణంలో తేమ శాతం తక్కువ. ఈ కారణంగా ఇక్కడ ఎడారి వాతావరణం ఉంటుంది. లాస్ వేగస్ నగరంలోని వాతావరణం అతి ఉష్ణంతో కూడిన వేసవి, స్వల్ప చలితో కూడిన చలికాలం, సంవత్సరమంతా విస్తారమైన సూర్యకాంతి, స్వల్ప వర్షాలు కలిగి ఉంటుంది.

నగర పునరుద్దరణ

[మార్చు]
లాస్ వేగస్ దక్షిణం

లాస్ ‌వెగాస్‌‌లో 1989లో ది మైరేజ్ ప్రారంభించిన తరువాత ప్రజలలో కలిగిన సంచలనం ప్రజలను, నిర్మాణ రంగాన్ని లాస్ వేగస్ నుండి లాస్ వేగస్ స్ట్రిప్ వైపు తీసుకువచ్చింది. ఈ మార్పు పర్యాటకులను విరివిగా డౌన్‌టౌన్‌ వైపు ఆకర్షించింది. లాస్ వేగస్ ప్రభుత్వ అధికారులు నగర ఆదాయాన్ని పర్యాటక రంగం నుండి విద్యుత్ బల్బ్ తయారీ, బ్యాంకింగ్, ఇతర వాణిజ్య రంగం వైపు మళ్ళించే ప్రయత్నాలను ఆరంభించారు. మితమైన నగర అవసరాలు అధిక ఆదాయం ఈ ప్రయత్నాలను విజయవంతం చేసాయి.

లాస్ వేగస్‌లో ప్రస్తుతం పర్యాటకుల సంఖ్యలోనూ నగరంలో స్థిరపడుతున్న ప్రజల సంఖ్యలోనూ విప్లవాత్మక అభివృద్ధి జరుగుతూ ఉంది. నగరాభివృద్ధి క్రమంగా నగర అంచులను దాటి ప్రభుత్వ భూములవరకు సాగింది. స్థలాల రేటు పెరగడంతో జనసాంద్రత అభివృద్ధి చెందింది. స్ప్రింగ్ మౌంటెన్ రోడ్లో 1990 ఆరంభంలో చైనా టౌన్ నిర్మాణం జరిగింది. ఆరంభంలో చైనా టౌనన్‌లో పెద్దదైన దుకాణాల సమూహం ఉండేది ప్రస్తుతం అనేక వ్యాపారలతో ఆసియన్ కూడలిగా మారింది.

లాస్ వేగస్ స్ట్రిప్ అభివృద్ధితో డౌన్‌టౌన్ ప్రాంతంలో ఇబ్బందులు ఆరంభం అయ్యాయి. నగరం సంఘటితంగా డౌన్‌టౌన్ సమీపంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే దిశాగా అడుగులు వేసింది ది ఫ్రీమోట్ స్ట్రీట్ ఎక్స్‌పీరియన్స్ అత్యధిక పర్యాటకులను డౌన్‌టౌన్ వైపు తీసుకువచ్చింది. లాస్ వేగస్ ప్రభుత్వం 11 దియేటర్లతో అనేక అంతస్తుల భవనం నియోనోపోలిస్ పార్కింగ్ వసతుల కొరకు నిర్మించింది. అధిక కాండో (అపార్ట్‌మెంట్) ప్రాజక్టుల నిర్మాణం ప్రజలకు నివాస గృహాలను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. అభివృద్ధి చెందిన నగరాదాయం ఇంటర్నల్ రెవెన్యూ సరీస్ కార్యాలయాన్ని 2005 మార్చిలో డౌన్‌టౌన్‌కు మార్చేలా చేసింది. ఈ కారణంగా నగరంలో వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది.

సీసర్స్ ప్లేస్
ఫ్రీమోంట్ వీధి

లాస్ వేగస్ నగరం నగరవాసులను పర్యాటకులనూ డౌన్‌టౌన్ వైపు ఆకర్షించే లక్ష్యంతో యూనియన్ పసిఫిక్ రైల్‌రోడ్ నుండి 61 ఎకరాల భూమిని 1995లో కొనుగోలు చేసింది. 2004లో నగర మేయర్‌చే ఆస్కార్ గుడ్‌మాన్ నివాసగృహాలు కార్యాలయాలు కలిగిన యూనియన్ పార్క్ అభివృద్ధి పధకం ప్రకటించ బడింది. ఈ పధకంతో ఆక్శహర్మ్యాలు, నివాసగృహ, కార్యాలయ భవన సముదాయాల నిర్మాణంతో లాస్ వేగస్ ఆకాశహర్మ్యాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. డౌన్‌టౌన్ ప్రాంతంలో బృహత్తర ఆకాశహర్మ్యాల నిర్మారాలకు రూపకల్పన ప్రారంభం అయింది. లాస్ వేగస్ నగర కౌన్సిల్ ఫ్రీమోంట్ స్ట్రీట్ జోన్ (ప్రత్యేక ప్రాంతం)లో మార్పులకు అంగీకారం తెలిపింది అందువలన ఇక్కడ సరి క్రొత్తగా బార్లు తెరవడానికి అవకాశం లభించింది. ఈ అవకాశంతో డౌన్‌టౌన్ ప్రాంతంలో, పర్యాటక అభివృద్ధి జరుగుతుందని అంచనా. 2005లో వరల్డ్ మార్కెట్ సెంటర్ ప్రారంభించబడింది. ఇది దేశంలో గొప్ప గృహాలంకరణ వస్తు విక్రయశాలగా గుర్తించబడింది. 2006 అక్టోబరు 23 నాటికి వరల్డ్ మార్కెట్ సెంటర్ లాంటి బృహత్తర ఆభరణాల విక్రయశాల తెరిచే ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శన విక్రయాలకు అవకాశం కల్పించ బడుతుంది.

ఆర్ధిక రంగం

[మార్చు]

లాస్ వేగస్ నగరానికి పర్యాటక రంగం, క్రీడలు ముఖ్యమైన ఆర్థిక వనరులలో ఒకటి. వ్యాపార కూటములకు ఇది ముఖ్య కేంద్రం. ఈ కారణంగా పర్యాటకుల ఆహారావసరాలను తీర్చడానికి ఆహారరంగంలో జరిగిన అభివృద్ధి ఆదాయానికి మార్గం వేసింది. ఫార్‌చ్యూన్ 500 క్రీడా సంస్థలకు అంతర్జాతీయ కేంద్రంగా లాస్ వేగస్ ప్రాధాన్యత వహిస్తుంది. హర్రాహ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్ గి ఎమ్, మైరేజ్ లాంటి కొన్ని సంస్థలు స్లాట్ మిషిన్ లాంటి విద్యుత్ క్రీడా యంత్రాలను నగర పరిసరరాలలో తయారు చేస్తున్నాయి. పర్యాటకం, వ్యాపార అవకాశం లాంటి వ్యవహారాలను లాస్ వేగస్ కాన్‌వెన్షన్ అండ్ విజిటర్స్ అధారిటీ పరిశీలిస్తుంది. అది తన సంవత్సర నివేదికలో పర్యాటకుల సంఖ్య, ఖర్చు చేస్తున్న శైలి దాని వలన వచ్చే ఆదాయం లాంటి వివరాలను అందింస్తుంది. నగరంలో లభమౌతున్న ఆహారాలు అందిస్తున్న శైలి పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

లాస్ వేగస్ కౌంటీ సీట్‌లో ఉన్న లాయ్డ్ డి ఫెడరల్ డిస్ట్రిక్ కోర్ట్ హౌస్లో చట్ట సేవా సంస్థలకు బెయిల్, వివాహాలు, విడాకులు, పన్నులు, వ్యాపార సంబంధిత సమస్యలు, ఇతర చట్ట సేవలను అందిస్తుంది.

అనేక కారణాల వలన లాస్ వేగస్‌లో సాంకేతిక వస్తు తయారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. విద్యుత్ క్రీడా యంత్రాలు, సమాచార పరికరాల తయారీ పరిశ్రమలు ఇది కేంద్రం.

నగర సంస్కృతి

[మార్చు]

నగరంలో ప్రధాన ఆకర్షణ కాసినో (జూదగృహం)లే. ఇక్కడ నిర్మించిన అనేక బృహత్ వసతి భవనం (హోటల్స్)లలో ఎక్కువగా తెలిసింది లాస్ వేగస్ స్ట్రిప్కి ప్రత్యేక స్థానం ఉంది. చాలా వసతిభవనం (హోటల్)లలో వేల గదులు ఉన్నాయి వాట్లో పెద్ద పెద్ద కాసినో (జూదగృహం)లు ఉన్నాయి. డౌన్‌టౌన్ ప్రాంతంలో అనేక కాసినో (జూదగృహం)లు కలిగిన వసతిభవనం (హోటల్) ఉన్నాయి. కొన్ని మాత్రం కొంచం దూరంలో ఉన్నాయి. ప్రధాన కాసినోలు;-

  • ఫ్రీ మోట్ స్ట్రీట్ ఎక్స్‌పీరియన్స్.
  • గోల్డెన్ నగ్గెట్.
  • బినియన్స్ గాంబ్లింగ్ హాల్ అండ్ హోటెల్.
  • ఫ్రీ మోట్ కాసినో.
  • ప్లాజా హోటెల్ కాసినో.
  • లాస్ వేగస్ క్లబ్.
  • ఫ్రిజ్‌‌రాడ్స్ లాస్ వేగస్.
  • గోల్డెన్ గేట్ హోటెల్ అండ్ కాసినో.
  • కలిఫోర్నియా హోటెల్, కాసినో.

ఉద్యానవనాలు

[మార్చు]
  • లాస్ వేగస్ స్ప్రింగ్ రిజర్వ్
  • లాస్ వేగస్ స్ప్రింగ్ రిజర్వ్
  • సిటీ లాస్ వేగస్
  • ఫ్లాయ్డ్ లాంబ్ స్టేట్ పార్క్

జనసంఖ్య

[మార్చు]

లాస్ వేగస్ వేగంగా అభివృద్ధి చెందుతున్న జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటని 2007యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో జనాభా లెక్కల అంచనా.లాస్ వేగస్ నగరపాలితంలోని జనసంఖ్య 18,36,333.ఈ నగరంలో జనసాంద్రత త్వరితంగా వృద్ధి చెందుతున్నట్లు గుర్తింపబడింది. 2000లో లాస్ వేగస్ జనసాంద్రత అమెరికాలో 32వ స్థానంలో ఉన్నట్లు అంచనా. 2008లో జనసాంద్రత అమెరికాలో 28 వస్థానంలో ఉన్నట్లు అంచనా.

లాస్ వేగస్ జనసంఖ్య 2000లో 478,434. గృహనిర్వహణ చేస్తున్న వారి సంఖ్య 176,750. నగరంలో కుటుంబాలుగా నివసిస్తున్న వారి సంఖ్య 117,538. చదరపు మైలు జనసాంద్రత 4,222.5.నగరంలో ఉన్న 190,724 గృహాలలో ఒక్ చదరపు మైలులో 1,683.3 ఇళ్ళు ఉన్నాయి. నగరంలో శ్వేతజాతీయులు 69.86%, అమెరికన్ ఆఫ్రికన్లు 10.36%, పురాతన అమెరికన్ జాతీయులు 0.75%,ఆసియన్లు 0.75%,0. పసిఫిక్ ఐలాడర్లు 45%, ఇతర జాతీయులు 9.75%, మిశ్రమ జాతీయులు 4.05%. జనసంఖ్యలో అన్ని జాతులకు చెందిన హిస్పానిక్ లేక లాటినోలు 23.61%.
నగరంలో ఉన్న 176,750 కుటుంబాలలో 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఉన్న వారి శాతం 31.9%. వివాహం చేసుకుని కలసి జీవిస్తున్న వారి శాతం 48.3%, భర్త లేకుండా స్త్రీలచే నిర్వహింపబడుతున్న కుటుంబాలు 12.2%, కుటుంబం లేకుండా విడిగా జీవిస్తున్న వారి శాతం 33.5%. విడివడి ఒంటరిగా జీవిస్తున్న వారి శాతం 25.0%. వీరిలో 65 సంవత్సరాలు పైబడి ఒంటరిగా జీవిస్తున్న వారి శాతం 25.0%. సరాసరి ఒక గృహం నివసిస్తున్న వారి సంఖ్య 2.66. సరాసరి ఒక కుటుంబంలో నివసిస్తున్న వారి సంఖ్య 3.20.
నగరంలో 18 సంవత్సరాల లోపు వయసున్న వారి శాతం 25.9%, 18 నుండి 24 సంవత్సరాల లోపు వయసున్న వారి శాతం 8.8%, 25 నుండి 44 సంవత్సరాల లోపు వయసున్న వారి శాతం 32.0%, 45 నుండి 64 సంవత్సరాల లోపు వయసున్న వారి శాతం 21.7%, 65 పైబడిన వారి శాతం 11.6%. సరాసరి వివాహ వయస్సు 34.100 మంది స్త్రీలకు 103.3 పురుషులు. 18 సంవత్సరాల లోవున్న స్త్రీలు 100 మందికి పురుషులు 102.5.

నగరంలో ఒక గృహనిర్వహణ ఆదాయం 53,000 అమెరికా డాలర్లు. ఒక కుటుంబ నిర్వహణ ఆదాయం 58,465 అమెరికా డాలర్లు. పురుషుల తలసరి ఆదాయం 35,511 అమెరికా డాలర్లు. స్త్రీ తలసరి ఆదాయం 27,554 అమెరికా డాలర్లు. సరాసరి తలసరి ఆదాయం 22,060 అమెరికా డాలర్లు. దారిద్య రేఖకు దిగువన ఉన్న వారి శాతం కుటుంబాలలో 6.6% జనసంఖ్యలో 8.9%. 18 వయసు లోపు వయసున్న వారిలో దారిద్య రేఖకు దిగువన ఉన్న వారి శాతం 5.4%, 65 పైబడిన వారిలో దారిద్య రేఖకు దిగువన ఉన్న వారి శాతం 6.3%.

ఆకర్షణలు

[మార్చు]

లాస్ వేగస్ ఇటీవల కొంతకాలం నుండి హవాయ్ వాసులను విపరీతంగా ఆకర్షించం మొదలైంది. హావాయ్ వాసులకు ఈ నగరం అభిమాన గమ్యంగా మారింది. 2002 నుండి 80,000 మంది హవాయ్ పౌరులు లాస్ వేగస్‌లో నివసిస్తున్నారు. దాదాపు వారానికి 3,000 మంది హవాయ్ పౌరులు లాస్ వేగస్ నగరం సందర్శిస్తున్నారు. ఈ కారణంగా ఒక్కోసారి లాస్ వేగస్ హవాయ్ 9వ ద్వీపంగా వ్యవహరిస్తుంటారు. హవాయ్ వెలుపల ఎ బి సి స్టోర్స్ లాస్ వేగస్‌లో మాత్రమే ఉన్నాయి.

లాస్ వేగస్ నగరం ఆత్మహత్యలకు, వివాహ రద్దులకు అమెరికాలోనే మొదటి స్థానంలో ఉంది. మొత్తం వివాహ రద్దులు ఈ నగరం ప్రజలకు మాత్రమే చెందినవి కావు. ఈ రాష్ట్రంలో విడాకులు పుచ్చుకోవడానికి చట్టం మరి కొంత అనుకూలంగా ఉంటుంది కనుక దేశం నలుమూలల నుండి విడాకుల కోసం ఇక్కడకు వస్తారు. అలాగే నగరంలో వివాహాల శాతం కూడా అధికమే.

ప్రభుత్వము

[మార్చు]

లాస్ వేగస్ నగరం పాలన కౌన్సిల్-మేనేజర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. లాస్ వేగస్ నగరంలో నివసిస్తున్న వారికంటే అధికంగా వెలుపలి ప్రాంతంలో నివసిస్తున్నారు. మొత్తం నగర జనాభా 1.8 కోటి అందులో 60,000 మంది నగర సరిహద్దులలోనూ 70,000 మంది నగర వెలుపలి ప్రాంతం క్లార్క్ కౌంటీలోనూ నివసిస్తున్నట్లు అంచనా. 4,65,000 మంది నార్త్ లాస్ వేగస్, హండర్సన్, బౌల్డ్ సిటీలలో నివసిస్తున్నారు. 1975 లాస్ వేగస్ పోలీస్ డిపార్ట్‌మెంట్, క్లార్క్ కౌంటీ షెర్రిఫ్ డిపార్ట్‌మెంట్ మిళితం తరువాత లాస్ వేగస్ మెట్రో పోలిస్ డిపార్ట్‌మెంట్ నగర, పరిసర ప్రాంతాలకు సేవలందిస్తుంది. కళాశాలలు, ఉద్యానవనాలు వారి స్వంత పోలిస్ దళాళను ఏర్పాటు చేసుకున్నాయి.

అమెరికా ఆదివాసులైన ప్యూట్ ఇండియన్ రిజర్వేషన్ నిర్వహణలో లాస్ వేగస్ డౌన్ టౌన్ సమీపంలో 1 ఎకరా భూమి ఉంది.

విద్య

[మార్చు]

లాస్ వేగస్ నగర వాసులకు క్లార్క్ కౌంటీ స్కూల్ డిస్ట్రిక్ ప్రాథమిక, మాధ్యమిక ప్రభుత్వ పాఠశాల ద్వారా విద్యను అందిస్తుంది. ఇది విద్యార్థుల సంఖ్యలో దేశంలో 5వ స్థానంలో ఉంది. 2007, 2008లో కె-12 గ్రేడ్స్ విద్యార్థుల సంఖ్య 3,14,000.

లాస్ వేగస్ దక్షిణంలో 3 మైళ్ళ దూరంలో పారడైజ్‌లో ది యూనివర్శిటీ ఆఫ్ నెవాడా మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయం ఉంది. అలాగే ది యనివర్శిటీ ఆఫ్ ఫోనిక్స్ లాస్ వేగస్ ప్రాంతంలో ఉంది. నెవాడా స్టేట్ యూనివర్శిటీ, ట్యూరో యూనివర్శిటీ నెవాడాలు హెండర్సన్‌లో ఉన్నాయి. అలాగే డెర్వీ యూనివర్శిటీ, కెల్లర్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ హెండర్సన్‌లో ఉన్నాయి. ది కాలేజ్ ఆఫ్ సౌత్ నెవాడా శాఖలు లాస్ వేగస్ సమీపం, ఉత్తర లాస్ వేగస్, హెండర్సన్‌లో ఉన్నాయి. అలాగే అపోలో కాలేజ్, నేషనల్ యూనివర్శిటీ, ఐ ఐ టి టెక్నికల్ యూనివర్శిటీ, నోవా సదరన్ యూనివర్శిటీలు లాస్ వేగస్ నగరంలో ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

సిటీ రైడ్ బస్ సర్వీసు 0.5 డాలర్ల రుసుముతో రెండు మార్గాలలో డౌన్‌టౌన్ ప్రాంతాలలో సేవలందిస్తుంది. వయసు, అశక్తత దృష్టిలోకి తీసుకుని ఉచితంగా కూడా సేవలందిస్తుంది.

సి ఏ టి బస్ నగరవాసులలో అధికంగా ప్రాబల్యమున్న ప్రభుత్వ సేవాసంస్థ. ఈ సర్వీసులు లాస్ వేగస్, నార్త్ లాశ్ వెగాస్, హెండర్సన్, పసరిసర ప్రాంతాలను కలుపుతూ సేవలందిస్తుంది. సౌత్ స్ట్రిప్‌లోఉన్న ఎమ్ జి ఎమ్ గ్రాండ్‌ హోటల్ నుండి స్ట్రిప్ నార్త్ చివరిలో ఉన్న షహారా, కాసినోల వరకు లాస్ వేగస్ మోనోరైల్ ప్రయాణీకులకు సేవలందిస్తుంది. లాస్ వేగస్ వీధుల విభజన

రోడ్లు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. Merriam Webster's Geographical Dictionary (3rd ed.). Merriam-Webster. 1997. p. 633. ISBN 9780877795469.
  2. "Words and Their Stories: Nicknames for New Orleans and Las Vegas". VOA News. March 13, 2010. Retrieved January 29, 2012.
  3. Lovitt, Rob (December 15, 2009). "Will the real Las Vegas please stand up?". MSNBC. Archived from the original on 2012-11-20. Retrieved February 4, 2012.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Census 2010 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; USCensusEst2016 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లింకులు

[మార్చు]