రాధాకుమారి
రాధాకుమారి | |
---|---|
![]() | |
జననం | రాధాకుమారి |
మరణం | మార్చి 8, 2012 |
జీవిత భాగస్వామి | రావి కొండలరావు |
రాధాకుమారి తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ రచయిత, సినీ నటుడు రావి కొండలరావు సతీమణి. గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 400కి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది. కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోను నటించారు. అనువాద కళాకారిణిగానూ ఆమె వంద సినిమాలకు పనిచేసారు.
ఈమె మొదటిసారిగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో కృష్ణ కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.
కొంతకాలం విరామం తర్వాత మరల 2002 నుండి తిరిగి డి. రామానాయుడు పిలుపు మేరకు నువ్వు లేక నేను లేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు.
నటించిన సినిమాలు
[మార్చు]2011 : వాంటెడ్
2007 : మీ శ్రేయోభిలాషి
2005 : ధన 51
2003 : ఒకరికి ఒకరు
2002 : నువ్వు లేక నేను లేను, హోలీ
1996 : శ్రీకృష్ణ విజయం
1994 : భైరవ ద్వీపం
1993 : [[
1991 : లేడీస్ స్పెషల్
1990 : మాస్టారి కాపురం
1988 : చూపులు కలిసిన శుభవేళ
1983; చండీరాణి
1979 : సొమ్మొకడిది సోకొకడిది
1978: కలియుగ స్త్రీ
1977 : ఈనాటి బంధం ఏనాటిదో[1], కథానాయిక మొల్ల
1976 : ఆడవాళ్లు అపనిందలు, వధూవరులు
1973 : దీర్ఘ సుమంగళి, విశాలి
1972 : బడిపంతులు, విచిత్రబంధం
1971 : అదృష్ట జాతకుడు, నమ్మకద్రోహులు
1968 : నేనంటే నేనే, రాజయోగం, వింత కాపురం
1966 : కన్నె మనసులు రంగుల రాట్నం
1965 : తేనె మనసులు
1962 : మహామంత్రి తిమ్మరుసు
టీ వి ధారావాహికలు (సీరియల్)
[మార్చు]2006-2008 : రాధ మధు
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.