రాజయోగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజయోగం
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్
భాష తెలుగు

రాజయోగం 1968, ఆగష్టు 1వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు వీర్రాజు నిర్మాత.[1]

నటీనటులు

[మార్చు]
రాజయోగం సినిమాలోని పతాక సన్నివేశం

సాంకేతికవర్గం

[మార్చు]

సంక్షిప్తకథ

[మార్చు]

ప్రచండసేన మహారాజుకు రత్నాంగి అనే భార్య, విజయుడు,సుగుణ అనే పిల్లలు ఉంటారు. ప్రజలకు మహారాజే దైవమని తనను మించిన శక్తి మరేదీలేదని ప్రచండుడు నూరిపోశాడు. దైవమే సర్వానికీ కారణమని నమ్ముకున్న రత్నాంగికీ, మహారాజు ప్రచండసేనునికీ విధి మీద వాదం నడుస్తుంది. విధి గొప్పో, తాను గొప్పో నిరూపించడానికి మహారాజు రాణినీ, పిల్లలనూ వేరుచేస్తాడు. విడిపోయిన భార్యాబిడ్డలు తలో దారి పడతారు. తన మేనల్లుడు విక్రముడిని గొప్పవీరునిగా తయారుచేసి తన రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తానని రాజు తన చెల్లెలికి వాగ్దానం చేస్తాడు. రాకుమారుడు విజయుడు సాగరయ్య పేరుతో ఒక బెస్తవాని ఇంటిలో పెరిగి పెద్దవాడౌతాడు. రాకుమార్తె సుగుణ ఒక నర్తకి ఇంటిలో రంజని పేరుతో పెరి పెద్దదై నర్తకిగా పేరు గడించుకుంటుంది. భర్తకు దూరమైన రత్నాంగి పిల్లలను పోగొట్టుకుని వరహాలసెట్టి ఇంట్లో దాసిగా పనిచేస్తూ ఉంటుంది. మేనల్లుడైన విక్రముడు విద్యాబుద్ధులు నేర్చుకుని తగిన సమర్థుడైనాడని రాజు మురిసిపోతాడు. ఐతే వాడొక ధూర్తుడిగా మారతాడు. మహారాజు కొలువులో జరిగిన పోటీలలో సాగరయ్య గెలిచి మహారాజు మెప్పుపొందుతాడు. అదే కొలువులో అవకాశం లభించగా రంజని నాట్యప్రదర్శన గావించి మహారాజు మన్ననలను పొందుతుంది. విక్రముడు తన మేనమామ మహారాజును బంధిస్తాడు. మంత్రి మణిమంతుడు మహారాజును విడుదల చేస్తాడు. అక్కడి నుండి తప్పించుకున్న మహారాజు అరణ్యంలో ఒక ముని శాపం వల్ల మతిపోగొట్టుకుంటాడు. విక్రముడు తన తల్లిని తీర్థయాత్రలకు పంపిస్తాడు. విక్రముని బారిన పడిన రంజనిని సాగరయ్య రక్షిస్తాడు. తల్లీ తండ్రీ పిల్లలు అందరూ ఒకేచోట కలుసుకుంటారు. కానీ ఒకరికొకరు గుర్తుపట్టలేక పోతారు. చివరకు సాగరయ్య విధర్భ దేశానికి చక్రవర్తి ఔతాడు. ఆ దేశపు రాకుమారిని వరిస్తాడు. వరహాలసెట్టిని చంపిందనే నేరానికి రత్నాంగికి మరణశిక్ష విధిస్తాడు సాగరయ్య. ఐతే దానయ్య పేరుతో మతిస్థిమితుడై చెప్పులు కుట్టుకుంటున్న మహారాజు ఆ దాసి నిర్దోషి అని సాక్ష్యమిస్తాడు. మహారాజు ప్రచండసేనుని రత్నాంగి గుర్తుపడుతుంది. కానీ దానయ్య గుర్తించక తన దారిలో పోతాడు. సాగరయ్య మహారాజుకు మతి కలిగిస్తానని రాణికి మాట యిస్తాడు. చిట్టచివరకు పూర్వస్మృతి కలిగిన మహారాజు మహారాణిని గుర్తించగలుగుతాడు. కానీ తమ కుమార్తె, కుమారుడు ఎదురుగా ఉండి కూడా గుర్తించలేక పోతారు. కంటికీ మింటికీ ఏకధారగా విలపిస్తున్న ఆ రాజదంపతులకు తమ పిల్లలు ఎవరని ఎలా తెలుస్తుంది అనేది మిగిలిన కథ.[2]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను వీటూరి, రాజశ్రీలు రచించగా చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[2]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచన గాయకులు
1 ఈ సమయం ఏమిటో ఈ మైకం వానకీ చిలిపితనం చినుకులే చిలికెను చల్లదనం రాజశ్రీ పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
2 రావోయీ నిన్నే పిలిచాను నీకై వేచాను యుగయుగాల నీ దాన నేను వీటూరి లత
3 ఏ లోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన ఏమి జరుగునో తెలియజాలము విధివిలాసము వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 సురుచిర సుందరహాసా సుమధుర గానవిలాసా రారా రసికావతంసా వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
5 కాదులే కలకాదులే ఔనులే నిజమౌనులే నీవు నారాజువే నేను నీదాననే వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
6 తాళం వేయాలి లోకం ఊగాలి కవ్వించే నా ఆటలో నారూపులో నా చూపులో అమ్మమ్మ అసలైన కైపుంది వీటూరి ఎల్.ఆర్.ఈశ్వరి
7 నచ్చినవాడూ మనసిచ్చిన వాడూ నీ చెంత చేరి లాలిస్తే ఏమౌతుందే పిల్లా? వీటూరి లత, ఎస్.జానకి
8 లక్ష్మీమహీతదనురూప, నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానామ్(శ్లోకం) వీటూరి పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Raja Yogam". indiancine.ma. Retrieved 20 January 2022.
  2. 2.0 2.1 రామలింగం. "రాజయోగం పాటల పుస్తకం". indiancine.ma. Retrieved 20 January 2022.

బయటిలింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజయోగం&oldid=4208319" నుండి వెలికితీశారు