Jump to content

బి.ఎ.సుబ్బారావు

వికీపీడియా నుండి
(బి.ఏ. సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)
బి.ఎ.సుబ్బారావు
జననం
బుగట వెంకట సుబ్బారావు

1915
కాకినాడ
మరణంమార్చి 13, 1987
వృత్తిదర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1950 - 1987

బి.ఎ.సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. రఘుపతి వెంకయ్య నాయుడు పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన అవార్డును 1982లో గెలుచుకున్నాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

బి.ఎ.సుబ్బారావు 1915లో కాకినాడలో జన్మించాడు. ఇతడు చిన్నతనంలో సురభి నాటకాలు, గుబ్బి వీరణ్ణ నాటకాలు, సోహ్రబ్ మోడీ హిందీ నాటకాలు, మూకీ చిత్రాలు విరివిగా చూసి కళ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఇతని బావ కె.ఎ.నాయుడు స్థాపించిన "నాట్యకళా వినోదిని సభ" నాటక సంస్థ ద్వారా ఇతడు ఒన్లీ డాటర్, మళ్ళీపెళ్ళి మొదలైన సాంఘిక నాటకాలను ఆంధ్ర, నైజాం ప్రాంతాలలో విస్తృతంగా ప్రదర్శించాడు. ఈ నాటకాలలో ఇతనితో పాటు నటి సి.కృష్ణవేణి కూడా పాల్గొనేది. ఇతడు కళాభినివేశంతో స్కూలు ఫైనలు పరీక్ష తప్పి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సినిమాలలో ప్రయత్నించడానికి కలకత్తా నగరం చేరుకున్నాడు. అక్కడ రాధా ఫిలిం కంపెనీ మేనేజరు బెనర్జీని మెప్పించి ఆ సంస్థలో చేరి నాలుగేండ్లు బెంగాలీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసి నైపుణ్యం సంపాదించాడు.[1]

సినిమారంగం

[మార్చు]

1937 నుండి 1940 వరకూ కలకత్తాలో బెంగాలీ చిత్రాలలో పనిచేసి 1940లో చెన్నై వచ్చి మీర్జాపురం రాజా వారి శోభనాచల స్టూడియోలో ఛీఫ్ ఎక్జిక్యూటివ్‌గా చేరాడు. మీర్జాపురం రాజా వారి సహకారంతో ఇతడు బి.ఎ.ఎస్. చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి పల్లెటూరి పిల్ల సినిమాను స్వీయ దర్శకత్వంతో నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా ఎన్.టి.రామారావు హీరోగా పరిచయమయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు కలిసి నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. తరువాత ఇతడు అనేక విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎస్.వి.రంగారావు, వాణిశ్రీ, ధూళిపాళ సీతారామశాస్త్రి, ఆర్.నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ మొదలైన వారిని వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇతడు నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కాక భలే తమ్ముడు, శభాష్ పాపన్న, హరిశ్చంద్ర, కచ దేవయాని, పాండురంగ విఠల్, కథానాయకుని కథ మొదలైన సినిమాలలో నటించి తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.[1]

సినిమాల జాబితా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాష పాత్ర వివరాలు
దర్శకుడు నిర్మాత నటుడు కథ స్క్రీన్ ప్లే
1938 కచ దేవయాని తెలుగు Green tickY
1939 పాండురంగ విఠల్ తెలుగు Green tickY
1947 గొల్లభామ తెలుగు Green tickY
1950 పల్లెటూరి పిల్ల తెలుగు Green tickY Green tickY Green tickY Green tickY
1952 ఆడ బ్రతుకు తెలుగు Green tickY
1952 టింగ్ రంగా తెలుగు Green tickY
1954 రాజు-పేద తెలుగు Green tickY Green tickY
1958 చెంచులక్ష్మి తెలుగు Green tickY Green tickY
1960 రాణి రత్నప్రభ తెలుగు Green tickY Green tickY
1962 భీష్మ తెలుగు Green tickY Green tickY ధూళిపాళ తొలి సినిమా
1964 మర్మయోగి తెలుగు Green tickY
1964 మైరావణ తెలుగు Green tickY Green tickY
1966 మోహినీ భస్మాసుర తెలుగు Green tickY Green tickY
1967 పెద్దక్కయ్య తెలుగు Green tickY Green tickY
1967 పిన్ని తెలుగు Green tickY
1969 ధర్మపత్ని తెలుగు Green tickY
1969 భలే తమ్ముడు తెలుగు Green tickY
1971 రైతుబిడ్డ తెలుగు Green tickY
1971 సతీ అనసూయ తెలుగు Green tickY
1972 శభాష్ పాపన్న తెలుగు Green tickY
1974 సతీ అనసూయ తెలుగు Green tickY
1974 రామ్ రహీం తెలుగు Green tickY Green tickY
1975 మొగుడా- పెళ్ళామా తెలుగు Green tickY
1975 కథానాయకుని కథ తెలుగు Green tickY
1978 సతీ సావిత్రి తెలుగు Green tickY
1979 మా వారి మంచితనం తెలుగు Green tickY

పురస్కారాలు

[మార్చు]
  1. రఘుపతి వెంకయ్య అవార్డు (1982)
  2. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ డైరక్టరు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 కమీషనర్ (2008). నంది అవార్డు విజేతల పరంపర (1964-2008) (PDF) (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ. p. 71. Retrieved 2 October 2022.

బయటిలింకులు

[మార్చు]