రాజు-పేద
రాజు-పేద (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఏ. సుబ్బారావు |
---|---|
నిర్మాణం | బి.ఏ.సుబ్బారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, యస్.వి.రంగారావు , లక్ష్మీరాజ్యం, ఆర్. నాగేశ్వరరావు, మాస్టర్ సుధాకర్, రేలంగి, అమ్మాజీ |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | బి.ఏ.యస్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
బి.ఏ. సుబ్బారావు తన స్వంత నిర్మాణ సంస్థ బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రాజూ-పేద 1954, జూన్ 25న విడుదలయ్యింది. మార్క్ ట్వేయిన్ నవలాధారిత హాలీవుడ్ చిత్రం ది ప్రిన్స్ అండ్ పాపర్ (1937)ను అనుసరించి ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రాన్ని 1957లో తమిళంలో ఆందీ పిట్రాసెల్వమ్ పేరుతో డబ్బింగ్ చేశారు. ఇదే చిత్రాన్ని హిందీలో రాజా అవుర్ రంక్‌గా కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఎల్.వి.ప్రసాద్ 1968లో పునర్నిర్మించాడు.
నటీనటులు
[మార్చు]- నందమూరి తారకరామారావు - పోలిగాడు
- ఎస్.వి.రంగారావు - మహారాజు సురేంద్రదేవ్
- మాస్టర్ సుధాకర్ - యువరాజు నరేంద్రదేవ్, నారిగాడు (ద్విపాత్రాభినయం)
- లక్ష్మీరాజ్యం - అచ్చమ్మ
- అమ్మాజీ - మల్లి
- రేలంగి - సుధీర్
- ఆర్.నాగేశ్వరరావు - సేనాధిపతి విక్రమవర్మ
- వక్కలంక కామరాజు - మహామంత్రి విజయ్
సాంకేతిక వర్గం
[మార్చు]- ఎడిటింగ్- కె.ఏ.మార్తాండ్,
- కెమెరా- ఆది ఇరాని,
- మాటలు- పినిశెట్టి శ్రీరామమూర్తి,
- కళ-వాలి,
- స్టంట్స్-పెద్ద రాఘవయ్య,
- సంగీతం- ఎస్.రాజేశ్వరరావు,
- గీత రచయితలు: తాపీ ధర్మారావు, ఆచార్య ఆత్రేయ,కొసరాజు రాఘవయ్య చౌదరి
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, మాధవపెద్ది సత్యం, జిక్కి, కె.రాణి, సత్యవతి
- నృత్యం- పసుమర్తి, వి.జె.శర్మ,
- నిర్మాణ సంస్థ: బి ఎస్ ప్రొడక్షన్స్
- విడుదల:25:06:1954.
- దర్శకత్వం, నిర్మాత-బి.ఏ.సుబ్బారావు.
కథ
[మార్చు]మహారాజు సురేంద్రదేవ్ (యస్.వి.రంగారావు) దొంగ పోలిగాడు (ఎన్.టి.రామారావు)లకు ఒకే రోజున మగ పిల్లలు జన్మిస్తారు. ఆ తరువాత 12 సం.లకు యువరాజుకు పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయి. అదే రోజున, గూడెంలో పోలిగాడి కొడుకు నారిగాడు (మాస్టర్ సుధాకర్) ఆరోజు తండ్రి అడుక్కు రమ్మంటే, ఎదిరించి, తల్లి అచ్చమ్మ (లక్ష్మీరాజ్యం) అక్క మల్లి (అమ్మాజి)లకు తెలియకుండా పారిపోతాడు. కోటవైపు వెళ్ళిన నారిగాడిని, యువరాజు నరేంద్రదేవ్ (మాస్టర్ సుధాకర్) తనతో, తన రాజమందిరంలోకి తీసుకువెళతాడు. అంతకుముందు మహారాజు తనకిచ్చిన రాజముద్రికను ఒక కోతి బొమ్మలో దాస్తాడు. ఆటల్లో అలసి నిద్రపోతున్న నారిగాడి బదులు సేనాపతి బిచ్చగాడి దుస్తుల్లో వున్న యువరాజును మందిరంనుంచి బయటకు పంపించి వస్తాడు. నారిగాడు తాను యువరాజును కాదని చెప్పినా మహారాజు, మిగిలిన మంత్రులు నమ్మకపోవటం, అతనికి చికిత్సలు చేయించటం, గూడెం వెళ్ళిన నరేంద్రదేవ్ తాను పోలిగాడి కొడుకు కానని ఎదురుతిరిగి, తండ్రిచే దెబ్బలుతినటం, ఆ ఊరిలో మాజీ సైనికుడు, వీరుడు అయిన సుధీర్ (రేలంగి) అతని మాటలు నమ్మటం జరుగుతుంది. సేనాధిపతి విక్రమవర్మ (ఆర్.నాగేశ్వరరావు), యువరాజు, నరేంద్రదేవ్, బదులు నారిగాడు రాజమందిరంలో వున్నాడని గ్రహించి, మహారాజు తదనంతరం, తానే సింహాసనం అధిష్టించాలని, ఆశతో, యువరాజును అంతమొందించమని, సైనికులను పురిగొల్పుతాడు. సుధీర్‌వల్ల విషయం గ్రహించిన పోలిగాడు, తన బృందంతో కోటలోకి ప్రవేశించి, నారిగాడికి జరుగుతున్న పట్టాభిషేకం ఆపించి యువరాజు నరేంద్రదేవ్‌కి పట్టాభిషేకం జరిగేలా చేస్తాడు. విక్రమవర్మ, తదితరులు మరణించటంతో పోలిగాడు కుటుంబం, రాజ్యంలో యువరాజుకు తోడుగా నిలవటంతో కథ సుఖాంతమౌతుంది[1].
పాటలు
[మార్చు]- అమ్మా అమ్మా అమ్మా ఎంత హాయిగా పిలిచాడే నన్నెంత హాయిగా - జిక్కి - రచన తాపీ ధర్మారావు
- కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా - జిక్కి - రచన కొసరాజు
- జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - ఘంటసాల - రచన: కొసరాజు
- నారిగా నాయనా నారిగ.. ఎంత వెదికిన కానరావిద ఏమి మాయము - సుశీల, సత్యవతి - రచన: తాపీ ధర్మారావు
- మారింది మారింది మన భాగ్య... మన బీదల కష్టం మారింది - కె. రాణి _రచన:కొసరాజు రాఘవయ్య
- యువరాజువులే మహారాజువులె నవభారతభువినేలే - జిక్కి, కె.రాణి బృందం - రచన: ఆత్రేయ
- వేడుక కోసం వేసిన వేషం ఏడుపు తోడుగ చేయాలా - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
- శ్రీమంతులు ధీమంతులు ఇందరున్నారే బిచ్చగాళ్ళు లేకుండా - జిక్కి - రచన: తాపీ ధర్మారావు
- జింబాది ప్రతిమాన వైభవ కళావిజ్ఞాన సంభావన(పద్యం)_మాధవపెద్ది సత్యం_రచన: తాపీ ధర్మారావు
మూలాలు
[మార్చు]- ↑ "రాజూ-పేద -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 23-06-2018". Archived from the original on 2018-08-14. Retrieved 2018-10-28.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)