పరమార్థ నికేతన్

పరమార్థ నికేతన్ (హిందీ: परमार्थ निकेतन) భారతదేశంలోని ఉత్తరాఖండ్ రిషికేశ్ లో ఉన్న ఒక ఆశ్రమం.
అవలోకనం
[మార్చు]పరమార్థ నికేతన్ గంగా నది ఒడ్డున, హిమాలయాల ఒడిలో ఉంది. ఈ ఆశ్రమాన్ని 1942లో పూజ్య స్వామి సుక్దేవానందజీ మహారాజ్ (1901-1965) స్థాపించారు. 1986 నుండి, పూజ్య స్వామి చిదానంద సరస్వతిజీ మహారాజ్ పరమార్థ నికేతన్ అధ్యక్షులుగా ఉన్నారు.[1] సాధ్వి భగవతి సరస్వతి పరమార్థ నికేతన్ ఆశ్రమంలో బోధకురాలిగా ఉన్నారు.[2] పరమార్థ నికేతన్ స్వామి సుక్దేవానంద్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం కూడా, ఇది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అంకితమైన లాభాపేక్షలేని, ఆధ్యాత్మిక సంస్థ, దీనిని 1942లో పూజ్య స్వామి సుక్దేవానంద్ జీ మహారాజ్ స్థాపించారు. ఇది 1962లో సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నమోదు చేయబడింది.[3] సాధువులు, ప్రసిద్ధ సంగీతకారులు, సామాజిక నాయకులు.. ఇతరులు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తరచుగా హాజరవుతారు.
యోగా, ధ్యానం పై ఇంటెన్సివ్ కోర్సులలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు వస్తూంటారు. అంతే కాకుండా, ప్రాణాయామము, మానసిక ఒత్తిడి నిర్వహణ, ఆక్యుప్రెషర్, రేకి, ఆయుర్వేదం.. ఇతర పురాతన భారతీయ శాస్త్రాల పై కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూంటారు.[4] కులం, మతం అనే వివక్ష లేకుండా, పరమార్థ నికేతన్ సందర్శకులందరికి ఆహ్హానం పలుకుతుంది,
గ్యాలరీ
[మార్చు]-
గంగానది నుండి పరమార్థ నికేతన్ దృశ్యం
-
పరమార్థ నికేతన్‌లో శివుడు
-
రుషికేశ్‌లో శివుడు
మూలాలు
[మార్చు]- ↑ H.H.Pujya Swami Chidanand Saraswatiji Archived 15 జూలై 2011 at Archive.today
- ↑ "Sadhvi Bhagawati Saraswatiji". Retrieved April 4, 2021.
- ↑ Swami Shukdevanand Trust Archived 27 మే 2010 at Archive.today
- ↑ "Parmarth Niketan in Rishikesh". Archived from the original on 2 ఏప్రిల్ 2014. Retrieved 29 March 2014.