Jump to content

నాగర్‌కర్నూల్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
(నాగర్‌కర్నూల్ నగర పంచాయతి నుండి దారిమార్పు చెందింది)


నాగర్‌కర్నూల్ పురపాలకసంఘం, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన పాలక సంస్థ.2011లో ఇది కొత్తగా ఏర్పడింది.[1]

అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2014, మార్చి 30న తొలిసారిగా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం నగరపంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న నాగర్‌కర్నూల్ పట్టణం 1954-56 కాలంలో పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో నారాయణగౌడ్ చైర్మెన్‌గా పనిచేశారు. 1956 తర్వాత హోదా తగ్గించి మేజర్ గ్రామపంచాయతీగా మార్పు చేశారు. పంచాయతిగా ఉన్న కాలంలో నారాయణగౌడ్ కుమారుడు మోహన్ గౌడ్ సర్పంచిగా ఎన్నికయ్యాడు. గ్రామపంచాయతీ చివరి సర్పంచిగా సంధ్యారాణి 2011 వరకు పనిచేశారు. 56 సంవత్సరాల అనంతరం మళ్ళీ నాగర్‌కర్నూల్ పట్టణ హోదా పెంచబడింది.

2014 ఎన్నికలు

[మార్చు]

2011లో నగర పంచాయతీగా ఏర్పడిన పిదప 2014 మార్చి 30న తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నగర పంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. వార్డు సభ్యులు పరోక్ష పద్ధతిలో చైర్మెన్‌ను ఎన్నుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 12-03-2014

వెలుపలి లంకెలు

[మార్చు]