Jump to content

దుబ్బాక పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 18°09′46″N 78°40′47″E / 18.1627685°N 78.6795836°E / 18.1627685; 78.6795836
వికీపీడియా నుండి
దుబ్బాక పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
దుబ్బాక పురపాలకసంఘం is located in తెలంగాణ
దుబ్బాక పురపాలకసంఘం
దుబ్బాక పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°09′46″N 78°40′47″E / 18.1627685°N 78.6795836°E / 18.1627685; 78.6795836
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట
మండలం దుబ్బాక
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
జనాభా (2011)
 - మొత్తం 12,349
 - పురుషుల సంఖ్య 6,071
 - స్త్రీల సంఖ్య 6,278
 - గృహాల సంఖ్య 2,978
పిన్ కోడ్ - 502108
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08457
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

దుబ్బాక పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దుబ్బాక పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని దుబ్బాక శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

దుబ్బాక 26.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°10′34″N 78°39′54″E / 18.176°N 78.665°E / 18.176; 78.665 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 108 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సిద్ధిపేట నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 12349 మంది కాగా, అందులో 6071 మంది పురుషులు, 6278 మంది మహిళలు ఉన్నారు. 2978 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. నిమ్మ రజిత
  2. గోనేపల్లి దేవలక్ష్మి
  3. మాట్ట మల్లారెడ్డి
  4. ఇల్లెడుల శ్రీనివాస్
  5. అధికారం సుగుణ
  6. మూర్తి సంధ్యారాణి
  7. సుతారి కనకరాజ్
  8. దుబ్బాక బాలకృష్ణ
  9. బత్తుల స్వామి
  10. కురపాటి బంగారయ్య
  11. సందల శ్రీజ
  12. బట్టు యాదమ్మ
  13. ఆస సులోచన
  14. ఆస యాదయ్య
  15. పల్లె మీనా
  16. దేవుని లలిత
  17. పులిగారి కల్పన
  18. గన్నే వనిత
  19. ఎనగారి స్వప్న
  20. లొంక రాజవ్వ

మూలాలు

[మార్చు]
  1. "Dubbaka Municipality". dubbakamunicipality.telangana.gov.in. Archived from the original on 2020-08-03. Retrieved 2021-06-13.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 June 2021.
  3. admin (2020-05-21). "Dubbaka municipality Councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-13.

వెలుపలి లంకెలు

[మార్చు]